For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: ప్రేమ్ ప్రవర్తనతో అంకిత షాక్.. తులసి మిస్ అవడంతో కథలో ట్విస్ట్

  |

  ఏళ్లకు ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి మరి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. శృతి కోసం కౌశల్య ఇంటి దగ్గర ప్రేమ్ వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్లిద్దరూ అక్కడు వస్తారు. అప్పుడు కౌశల్య.. ప్రేమ్‌ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. దీంతో ప్రేమ్‌కు కోపం వచ్చి ఆమె మీద అరిచేస్తాడు. అప్పుడు శృతి.. ప్రేమ్‌ను తిడుతుంది. దీంతో అతడికి కోపం వచ్చి ఇకపై ఎప్పుడూ కలవను అనుకుంటూ వెళ్లిపోతాడు. మరోవైపు, హోటల్ రూమ్‌లో సామ్రాట్, తులసి ఏం చేస్తున్నారో చూడ్డానికి నందూ వస్తాడు. అప్పుడు తాను వేరే రూమ్‌లో ఉంటున్నట్లు సామ్రాట్ చెప్పడంతో అతడు ఊపిరి పీల్చుకుంటాడు.

  శృతి మించిన తెలుగు పిల్ల హాట్ ట్రీట్: ఖిలాడి మూవీలో కంటే దారుణంగా!

  తులసిని తీసుకు వెళ్లిన సామ్రాట్

  తులసిని తీసుకు వెళ్లిన సామ్రాట్

  ఉదయాన్నే రెడీ అయిన సామ్రాట్ తులసి రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ కొడతాడు. అప్పుడు పక్క రూమ్‌లో ఉన్న లాస్య, నందూ ఆయన తులసి డోర్ ఎందుకు కొట్టాడు అని అనుకుంటారు. ఇంతలో తులసి డోర్ ఓపెన్ చేస్తుంది. అప్పుడు సామ్రాట్ 'ఇవాళ ఎలాగూ మీటింగ్ లేదు కదా.. అలా బయటికి వెళ్దామని అనుకుంటున్నా. మీరు కూడా వస్తారా' అని అడుగుతాడు. దీంతో సరే వస్తాను అంటుంది. తర్వాత సామ్రాట్ ఆటో బుక్ చేసుకొని వస్తాడు. దీంతో తులసి 'మీరేంటి ఆటో బుక్ చేసుకొని వచ్చారు' అంటుంది. దీనికి అతడు 'ఇది పర్సనల్ టైమ్ కదా.. మన ఇష్టం ఉన్నట్టు ఉండొచ్చు' అంటాడు. తర్వాత ఆటో ఎక్కి తులసి, సామ్రాట్ అలా వైజాగ్ మొత్తం తిరగడానికి వెళ్తారు.

  ప్రేమ్‌ను అలా చూసి అంకిత షాక్

  ప్రేమ్‌ను అలా చూసి అంకిత షాక్


  శృతిని తీసుకొస్తానని వెళ్లిన ప్రేమ్ ఇంకా రాకపోవడంతో అంకిత.. అతడి కోసం వేచి చూస్తూ ఉంటుంది. ప్రేమ్ ఇంకా రాలేదేంటి? ఏమైంది అని తనలో తాను అనుకుంటూ తెగ టెన్షన్ పడుతుంటుంది. అంతలో ప్రేమ్ ఒక్కడే రావడాన్ని చూస్తుంది. శృతి లేకుండా అతడు రావడంతో షాక్ అవుతుంది అప్పుడు అంకిత 'ఇదేంటి ప్రేమ్ ఒక్కడే వస్తున్నాడు' అని అనుకుంటూ అతడికి ఎదురు వెళ్తుంది. ఆమెను చూసినా ప్రేమ్ ఆగకుండా వెళ్లిపోతాడు. దీంతో అంకిత ప్రేమ్ ఆగు అని ఆపుతుంది. తర్వాత 'శృతిని కలిశావా? తను ఏం చెప్పింది' అని అడుగుతుంది.

  స్లీవ్‌లెస్ టాప్‌లో రాశీ ఖన్నా హాట్ షో: ఆమెనిలా చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం

  ఎవరి బతుకు వాళ్లదే అనడంతో

  ఎవరి బతుకు వాళ్లదే అనడంతో

  అంకిత అడిగిన ప్రశ్నలకు ప్రేమ్ సీరియస్‌గా సమాధానం చెబుతాడు. 'ఈరోజుతో నాకు, శృతికి మధ్య ఉన్న బంధం శాశ్వతంగా తెగిపోయింది' అంటాడు. దీంతో అంకిత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. తర్వాత ప్రేమ్ 'నా అవసరం లేదని మొహం మీదే చెప్పేసింది' అంటాడు. దీంతో అంకిత 'శృతి ఆవేశంలో అలా మాట్లాడి ఉంటుంది. తనను తప్పుగా అర్థం చేసుకోకు' అని సర్ధి చెప్పే ప్రయత్నం చేస్తుంది. దీంతో ప్రేమ్ 'నువ్వు తనను బలవంతంగా లాక్కొచ్చినా తన మనసు అలా ఉండదు. అంతకంటే.. ఎవరి బతుకు వాళ్లు బతకడం మేలు' అంటాడు.

  విడాకుల వల్ల బాధ పడడమేనని

  విడాకుల వల్ల బాధ పడడమేనని

  విడిపోయి బతుకుతాం అని ప్రేమ్ అన్న మాటలతో అంకితకు కోపం వస్తుంది. ఆ వెంటనే ఆమె 'షట్ అప్ ప్రేమ్. అంకుల్‌కు విడాకులు ఇచ్చి ఆంటి ప్రస్తుతం ఎంత బాధపడుతోందో తెలుసు కదా. నువ్వు ఇన్ని రోజులు తనను పట్టించుకోకపోయేసరికి శృతి బాధపడి ఉంటుంది. తనకు కొద్దిగా సమయం ఇవ్వు. తను కుదుటపడ్డాక మాట్లాడుదాం' అని ప్రేమ్‌కు సలహాలు ఇస్తుంది. కానీ, అతడు మాత్రం 'ఎవరు ఎన్ని చెప్పినా నేను వినే స్థితిలో లేను. శృతితో ఇంక కలిసే పరిస్థితే ఉండదు' అని బదులిస్తాడు. దీంతో అంకితకు ఏం చేయాలో అస్సలు అర్థం కాదు.

  నిధి అగర్వాల్ అందాల ఆరబోత: అబ్బో ఇది మామూలు షో కాదుగా!

  తులసిని సామ్రాట్ బిగ్ సర్‌ప్రైజ్

  తులసిని సామ్రాట్ బిగ్ సర్‌ప్రైజ్


  సామ్రాట్, తులసి ఆటోలో వైజాగ్ అంతా తిరుగుతుంటారు. ఒక చోట దిగుతారు. అప్పుడు తులసి ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతుంది. దీంతో సామ్రాట్ సర్‌ప్రైజ్ అంటాడు. అంతేకాదు, మీరు కళ్లు మూసుకోండి అంటాడు. అప్పుడామె కళ్లు మూసుకుంటుంది. దీంతో సామ్రాట్ తులసి చేయి పట్టుకుని తీసుకు వెళ్తాడు. అలా తీసుకెళ్లి సముద్రం దగ్గరకు తీసుకెళ్తాడు. అప్పుడు కళ్లు తెరవగానే బీచ్ చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. మరోవైపు, సామ్రాట్, తులసి ఎక్కడికి వెళ్లారో తెలుసుకోవడం కోసం లాస్య, నందూ కూడా వాళ్ల వెనకాలే ప్రయాణం చేస్తారు.

  తులసిని వదిలి వెళ్లిన సామ్రాట్

  తులసిని వదిలి వెళ్లిన సామ్రాట్

  సముద్రాన్ని దగ్గర నుంచి చూడగానే తులసి తెగ సంతోషిస్తుంది. ఆ వెంటనే పరందామయ్యకు ఫోన్ చేస్తుంది. 'మామయ్య నేను సముద్రం దగ్గర ఉన్నాను. ఎంత సంతోషంగా ఉందో మామయ్యా' అంటుంది. అనంతరం సామ్రాట్ మీ ఆనందాన్ని చూడటం కోసమే సముద్రం దగ్గరికి తీసుకొచ్చా అంటాడు. అప్పుడు తులసి బ్యాగ్ తీసుకొని వెళ్లబోతుంటే.. సామ్రాట్ 'అది ఇటు ఇవ్వండి.. మీరు వెళ్లండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. కానీ, దూరంగా ఉన్న బండ దగ్గరికి మాత్రం వెళ్లొద్దు. అక్కడ అలల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రమాదం అంట' అంటాడు.

  ఏమీ లేకుండా కనిపించిన అఖండ హీరోయిన్: చివర్లో మాత్రం హాట్ ట్విస్ట్

  బీచ్ దగ్గర తులసి కనపడకుండా

  బీచ్ దగ్గర తులసి కనపడకుండా


  అనంతరం తులసి సముద్రం దగ్గరకు వెళ్లి చిన్న పిల్లలా ఎంజాయ్ చేస్తుంది. ఇంతలో సామ్రాట్‌కు ఫోన్ రావడంతో పక్కకు వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. తులసి తన ఎంజాయ్‌మెంట్ మూడ్‌లో ఉంటుంది. ఇంతలో అందరూ పరిగెడుతుండటం చూసిన సామ్రాట్.. ఏమైంది అని అడుగుతాడు. దీంతో ఒక వ్యక్తి ఒకావిడ అలలలో కొట్టుకుపోయిందట అని చెబుతాడు. దీంతో తులసి అనుకొని ఆమెను వెతకడం కోసం పరిగెడతాడు. కానీ, అతడిని లోపలికి వెళ్లనీయరు. తులసి గారు అంటూ అరుస్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 713: Prem Returns to Home Without Shruthi. After That Samrat Brings Tulasi to the Beach. Then She Gets Excited About This.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X