For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi August 18th Episode: లాస్య ప్లాన్‌తో ప్రమాదంలో దివ్య.. అబ్బాయిలు చుట్టుముట్టి!

  |

  ఎన్నో ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. శృతికి తన ప్రేమ గురించి తెలపాలనుకున్న ప్రేమ్.. డైరీని చూసే విధంగా ప్లాన్ చేస్తాడు. కానీ అతడి లవ్ ప్రపోజల్ ప్లాన్‌ గురించి తెలుసుకున్న అంకిత దాన్ని చెడగొట్టింది. అప్పుడు అతను శృతిని తప్పుగా అర్థం చేసుకున్నాడు.

  అంతేకాదు, శృతిని దూరం పెట్టడానికి ప్రయత్నాలు చేస్తాడు. దీంతో ఆమె ఎంతగానో బాధ పడుతుంది. ఆ తర్వాత తులసి లాస్య చేసుకున్న ఫిక్స్‌డ్ డిపాజిట్ గురించి నందూకు చెప్పి పెద్ద షాక్ ఇచ్చింది. దీంతో ఆ డబ్బులను తీసుకొద్దామని నందూ దివాకర్‌ను తీసుకుని బయలు దేరుతాడు.

  టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ గ్లామర్ ట్రీట్: ఈ తెలుగు బ్యూటీని ఇలా ఎప్పుడూ చూసుండరు!

  నిజం తెలుసుకున్న ప్రేమ్.. డైరీ కాల్చేసి

  నిజం తెలుసుకున్న ప్రేమ్.. డైరీ కాల్చేసి

  తనను దూరం పెట్టడంపై ప్రేమ్‌ను ప్రశ్నిస్తుంది శృతి. దీంతో అతడు డైరీ చూసి కూడా ఏమీ చెప్పలేదని అంటాడు. అప్పుడామె ‘అసలు ఏ డైరీ ప్రేమ్? నేను ఏ డైరీ చదవలేదే' అంటూ చెబుతుంది. దీంతో ఆమె డైరీ చదవలేదన్న విషయాన్ని ప్రేమ్ గ్రహిస్తాడు. అప్పుడు నిజం తెలుసుకుని సంతోషించడంతో శృతి కూడా ఊపిరి పీల్చుకుంటుంది. అనంతరం ప్రేమ్.. ‘శృతి డైరీ చదవకపోతే మరి అది ఏమైనట్లు' అని అనుకుంటాడు. అంతలో అంకిత ఆ డైరీని చింపేసి వాటి మొత్తాన్ని కాల్చేస్తుంది. ‘పని మనిషి లాంటి దానివి నా తోడికోడలు అవుతావా శృతి' అని అనుకుంటుంది.

  నువ్వు 3 లక్షలు... నేను 20 లక్షల గిఫ్ట్

  నువ్వు 3 లక్షలు... నేను 20 లక్షల గిఫ్ట్

  తన ఫిక్స్‌డ్ డిపాజిట్ డబ్బులు పోయినందుకు లాస్య బాధ పడుతుంటుంది. అంతలో అక్కడకు తులసి వచ్చి ‘ఏంటి లాస్య బాధ పడుతున్నావా? నువ్వు నాకు మూడు లక్షలు నష్టం చేశావ్. ఇప్పుడు నీకు రూ. 20 లక్షలు గిఫ్ట్ ఇచ్చాను. ఎలా ఉంది నా గిఫ్ట్?' అని అడుగుతుంది.

  అప్పుడు లాస్య ‘నా డబ్బంతా పోయేలా చేశావ్. అయినా దీనికే గెలిచినట్లు కప్పలా కుప్పిగంతులు వేస్తున్నావేంటి' అని ప్రశ్నిస్తుంది. ‘నేను కప్పనో.. కోడి పిల్లలను ఎత్తుకుపోయే గద్దనో ముందు ముందు ఇంకా చూద్దువుగానీ' అంటూ తనదైన శైలిలో ఆన్సర్ ఇస్తుంది తులసి.

  సుడిగాలి సుధీర్‌ పెళ్లి సీక్రెట్ లీక్: ఏకంగా మూడు సార్లు అలా.. ఆమె ఎదుటే రివీల్ చేస్తానంటూ!

  జీవితాలే లాక్కున్నావ్.. డబ్బు లాక్కోవా

  జీవితాలే లాక్కున్నావ్.. డబ్బు లాక్కోవా


  తులసితో పెద్ద డిస్కర్షన్ అవుతోన్న సమయంలో ఆ ఇరవై లక్షలు నా కష్టార్జితం అంటుంది లాస్య. అప్పుడు ‘నీ కష్టార్జితమా? ఏ మూటలు మోసి సంపాదించావా? రాళ్లు కొట్టి కూడబెట్టావా? అవి ఆయన డబ్బులే కదా. ఆయనను మోసం చేసి దాచుకున్న సొమ్ములే కదా' అని అంటుంది తులసి. దీనికి లాస్య ‘మాటలు మర్యాదగా రానివ్వు. డబ్బులు లాక్కోవాల్సిన అవసరం నాకు లేదు' అని చెబుతుంది. దీనికి తులసి ‘ఏ జీవితాలే లాక్కున్న దానివి నువ్వు. డబ్బులు లాక్కోలేవా? అది నీకో లెక్క' అంటూ అదిరిపోయే డైలాగ్‌తో ఆమెకు సమాధానం చెబుతుంది.

  ఫ్యాక్టరీ జోలికొస్తే అదిరిపోయే గిఫ్ట్‌లు ఇస్తా

  ఫ్యాక్టరీ జోలికొస్తే అదిరిపోయే గిఫ్ట్‌లు ఇస్తా

  లాస్య తన డబ్బులు అని అనడంతో.. ఆమె చేయి పట్టుకుని నందూ దగ్గరకు వెళ్దాం అని అంటుంది తులసి. అంతేకాదు, ‘నువ్వు ఎంత నీతిగా ఉన్నావో.. ఇప్పుడు నీ పరిస్థితి చూస్తేనే తెలుస్తుంది. భయపడకు నీ జుట్టు నా చేతిలో ఉన్నా.. దాన్ని నిన్ను కంట్రోల్‌లో పెట్టుకునేందుకే వాడతాను. అంతేకానీ, అది అడ్డం పెట్టుకుని నిన్ను గెలవాలని అనుకోను. ఇప్పుడు చెబుతున్నా విను. మళ్లీ నా జోలికి కానీ, నా ఫ్యాక్టరీ జోలికి కానీ వచ్చావంటే దీని కంటే అదిరిపోయే గిఫ్ట్ ఇస్తా జాగ్రత్త. వెల్లు.. ఇంక వెళ్లి హాయిగా పడుకో పో' అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.

  షూటింగ్‌‌కు వెళ్తే అలా చేయించారు.. ఇండస్ట్రీకి ఎందుకొచ్చానా అని ఏడ్చా: శ్రీముఖి సంచలన వ్యాఖ్యలు

  నీ పేరును సార్థకం చేసుకున్నావు నాన్న

  నీ పేరును సార్థకం చేసుకున్నావు నాన్న

  గదిలో ఒంటరిగా ఉండి ఏదో ఆలోచిస్తున్న తులసి దగ్గరకు ప్రేమ్ వస్తాడు. రావడం రావడం అతడు తన తల్లి కాళ్లు పట్టుకుని నొక్కుతుంటాడు. దీంతో తులసి కళ్లు తెరిచి చూసి ఎందుకు అలా చేస్తున్నావ్ నాన్న అని అడుగుతుంది. దీనికి ప్రేమ్ ‘చిన్నప్పుడు నువ్వు కూడా కాళ్లు పట్టేదానివి కదా. ఇప్పుడు నేను పడితే ఏమైంది. అయినా నన్ను కన్నప్పుడు నువ్వు బాధ పడ్డావా' అని అడుగుతాడు. దీనికామె ‘నువ్వు కన్నప్పుడు బాధ పడ్డా. కానీ, ఆ తర్వాత సంతోషంగానే ఉన్నా. ప్రేమ్ అనే నీ పేరును సార్థకం చేస్తున్నావ్ నాన్న' అంటూ కొడుకును పొగుడుతుంది.

  నిన్ను ప్రేమించే విషయం తెలుస్తుందిలే

  నిన్ను ప్రేమించే విషయం తెలుస్తుందిలే

  తల్లితో ప్రేమ్ ప్రేమగా మాట్లాడిన దానిని శృతి పక్కనే ఉండి చూస్తుంది. అతడు అక్కడి నుంచి బయటకు రాగానే.. ‘ప్రేమ్ అబ్బాయిలకు ఎలాంటి అమ్మాయిలు నచ్చుతారు' అని అడుగుతుంది. దీనికి అతడు తనకేమీ తెలీదని చెబుతాడు. అప్పుడామె ‘పోనీ అమ్మాయిలకు ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారో తెలుసా? తల్లిని ప్రేమగా చూసేవాళ్లు' అంటుంది. దీంతో ప్రేమ్ ‘అంటే నన్ను కూడా చాలా మంది ఇష్టపడుతుంటారనుకుంటా అంటాడు. దీనికి శృతి ‘ఎందుకు ఇష్టపడరు. వాళ్లెవరో త్వరలోనే నీక్కూడా తెలుస్తుందిలే ప్రేమ్' అని చెప్పి సిగ్గుపడుతూ వెళ్లిపోతుంది.

  బాత్రూంలో బోల్డుగా దిశా పటానీ సెల్ఫీ: వామ్మో అందాలు మొత్తం చూపిస్తూ ఘాటుగా!

  భాగ్యకు తన బాధను చెప్పుకున్న లాస్య

  భాగ్యకు తన బాధను చెప్పుకున్న లాస్య

  తులసి తన డిపాజిట్ డబ్బులు పోయేలా చేసిన విషయాన్ని లాస్య.. భాగ్యకు చెబుతుంది. అప్పుడామె ‘వామ్మో తులసక్క రోజు రోజుకూ తెలివి మీరుతుంది. ఇక్కడ నిన్ను ఇబ్బంది పెడుతుంది. అక్కడ ఫ్యాక్టరీని చక్కగా నడుపుతుంది. ఆమెను అలానే వదిలేస్తే నీకు కష్టాలు తప్పవు. మనం లేట్ చేస్తే నీ డబ్బులను నీకే టిప్పుగా ఇస్తుందేమో' అని భయపెడుతుంది. దీనికి లాస్య ‘తులసి కష్టాలన్నీ ముందు ఉన్నాయి. అవి క్రియేట్ చేయడానికి నేనున్నాగా. నందూ పాజిటివ్‌గా మాట్లాడే సరికి ఇలా బలమొచ్చింది. ఆ రెక్కలు కట్ చేసేస్తా' అంటూ మరో ప్లాన్ చేస్తుందామె.

  లాస్య కొత్త ప్లాన్.. దివ్యకు కొండంత కష్టం

  లాస్య కొత్త ప్లాన్.. దివ్యకు కొండంత కష్టం

  ఫ్యాక్టరీకి వెళ్తున్న తులసికి మిశ్రా కంపెనీ మేనేజర్ సతీష్ ఫోన్ చేసి మెటీరియల్ తీసుకోడానికి రమ్మంటాడు. అప్పుడు దివ్య తనను కూడా కాలేజ్‌ దగ్గర డ్రాప్ చేయమంటుంది. దీంతో ‘తులసి వచ్చేటప్పుడు ఎలా వస్తావమ్మా? నాకు ఫ్యాక్టరీలో చాలా పని ఉంది' అని చెబుతుంది. అప్పుడు దివ్య సాయంత్రం కాలేజ్‌కు నందూను రమ్మని చెప్పి ఒప్పిస్తుంది. ఇదంతా చూసిన లాస్య.. అతడి ఫోన్‌ను సైలెంట్‌లో పెడుతుంది. సరిగ్గా అప్పుడే దివ్యను కొందరు అబ్బాయిలు ఏడిపిస్తుంటారు. అప్పుడు ఫోన్ చేసినా అతడికి వినిపించదు. దీంతో ఈ ఎపిసోడ్ సస్పెన్స్‌తో ముగిసింది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 401: Prem know the Truth about Shruthi. Then Ankitha Cuts His Dairy. After That Tulasi Gave Big Warning to Lasya Once Again.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X