Intinti Gruhalakshmi: పోలీసుల ముందు ట్విస్ట్ ఇచ్చిన లక్కీ.. రాజ్యలక్ష్మిని మరో దెబ్బ కొట్టిన ప్రకాశం

చాలా భాషల్లో ప్రసారం అవుతూ ఉన్నా.. తెలుగు బుల్లితెరపై వస్తున్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:
గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ప్లాన్ ప్రకారం లక్కీని తీసుకొచ్చి తులసి వాళ్ల ఇంట్లో వదిలిన లాస్య.. ఆ తర్వాత తులసికి ఫోన్ చేసి నాటకం ఆడుతుంది. అది నిజమే అని నమ్మిన తులసి చాలా బాధ పడిపోతుంది. ఇక, అత్తకు ఎలాగైనా బుద్ది చెప్పాలని భావించిన దివ్య.. ప్రియ సహాయంతో ఆమె కింద పడిపోయేలా చేస్తుంది. తర్వాత వారం రోజుల పాటు రెస్ట్ తీసుకునేలా చేసి.. ఆస్పత్రి బాధ్యతలను విక్రమ్‌కు అప్పగించేలా చేస్తుంది. ఇక, తులసి ఇంట్లోనే ఉన్న లక్కీ దొంగతనంగా చిలిపి పనులు చేస్తుంటాడు. అది తెలియని నందూ వాళ్లు అయోమయంగా ఉంటారు.

 Intinti Gruhalakshmi:

పోలీసులతో వచ్చేసిన లాస్య: ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం.. లాస్య పోలీసులను తీసుకుని నేరుగా తులసి ఇంటికి వస్తుంది. అప్పుడు 'నా కొడుకుని కిడ్నాప్ చేసింది ఈ ఇంటి వాళ్లే' అంటూ గట్టిగా కేకలు వేస్తుంది. అప్పుడు వాళ్లు రావడంతో వీళ్లే కిడ్నాప్ చేశారని అంటుంది. దీంతో తులసి 'కిడ్నాప్ ఏంటి లాస్యా? లక్కీ కనిపించడం లేదని నువ్వే కదా చెప్పావు. మేం ఎందుకు కిడ్నాప్ చేస్తాం? మేం కూడా లక్కీ గురించే టెన్షన్ పడుతున్నాం. కిడ్నాప్ అంటున్నావేంటీ' అని అడుగుతుంది. దీంతో లాస్య 'ఆపు నీ నాటకాలు. చేసిన తప్పుని ఒప్పుకుని నా లక్కీని నాకు ఇచ్చేయండి' అంటుంది.

సూటిగానే ప్రశ్నించిన ఎస్సై:
లాస్య మాటలను తులసి వాళ్లు ఖండిస్తారు. దీంతో ఎస్సై అంటే మీరు లాస్య కొడుకుని కిడ్నాప్ చేయలేదా అని సూటిగా ప్రశ్నిస్తాడు. దీనికి తులసి 'లక్కీ మాకు కూడా కొడుకు లాంటి వాడు. వాడంటే మాకెంతో ఇష్టం. అలాంటిది మేం ఎందుకు చేస్తాం' అని అంటుంది. అప్పుడు పరందామయ్య 'మాది పరువు గల ఫ్యామిలీ అండీ.. ఇలాంటి చిల్లర యవ్వారాలు చేయం' అని అంటాడే. అనసూయ కూడా 'ఇదే దాని కొడుకుని ఎక్కడో దాచేసి నాటకాలు ఆడుతుంది' అంటుంది. దాంతో లాస్య 'ఎస్సై గారూ.. వీళ్లని వదిలిపెడితే రాత్రి వరకూ నాన్ స్టాప్‌గా ఇలా మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ల మాటల్ని నమ్మకండి.. నా మాటల్నీ నమ్మకండి. మీరే ఇల్లు మొత్తం వెతకండి. లక్కీ దొరక్కపోతే కాళ్లపై పడి సారీ చెప్తాను' అని అంటుంది.

 Intinti Gruhalakshmi:

పెద్ద ట్విస్టే ఇచ్చేసిన లక్కీ: లాస్య మాటకు తులసి 'సరే.. దానికి మేం కూడా సిద్దం. ఎస్సై గారూ మీ పని మీరు చేయండి' అని అంటుంది. అప్పుడు కానిస్టేబుల్స్ వెతకడానికి రెడీ అవుతుండగా లక్కీ నిద్ర నుంచి మేల్కొని కిందకు దిగుతూ ఉంటాడు. అప్పుడు ఎస్సై ఆ అబ్బాయి మీ కొడుకేనా అని అడగ్గా.. లాస్య 'అవును ఎస్సై గారూ.. వీడే నా కొడుకు. చూశారు కదా.. వీళ్లంతా ఎలా అబద్దాలు చెప్పారో' అంటుంది. తర్వాత తులసి వాడు లోపలికి ఎలా వచ్చాడో తెలియదు అంటుంది. అప్పుడు ఎస్సై లక్కీని అడగ్గా నందూనే ఇంటికి తీసుకు వచ్చాడు అని అబద్దం చెప్తాడు. దీంతో అంతా షాక్ అవుతారు.

కేసు పెట్టకుండా వదిలేసి: నందూనే తీసుకు వచ్చాడని లక్కీ చెప్పడంతో లాస్య 'నందూ నీతో అబద్దం చెప్పించాడు.. ఇద్దరూ తోడు దొంగలే. వాడు డాడీ డాడీ అని కలవరిస్తున్న మాట నిజం. అయినా నేను లాక్కుని వెళ్లిపోయాను. నీకంత ప్రేమ ఉంటే.. డాడీగా పక్కనుండి చూసుకోవాలి' అని అంటుంది. దీంతో నందూ 'ఇది మళ్లీ కొత్త డ్రామా మొదలెట్టింది. తులసీ నువ్వు నమ్మొద్దు' అని అంటాడు. దీంతో లాస్య 'ఎస్సై గారూ.. నన్ను క్షమించండి.. ఇది మేం పరిష్కరించుకుంటాం.. మీరు వెళ్లండి' అని అంటుంది. దీంతో ఎస్సై స్టేషన్‌కు వచ్చి కేసు వాపసు తీసుకోండి అని వెళ్లిపోతాడు.

 Intinti Gruhalakshmi:

లక్కీని వదిలేసి వెళ్లింది: ఆ తర్వాత లాస్య 'చూశారా.. మీరు నన్ను ఎంత శత్రువులా చూసినా మీపై నాకు ఎంత ప్రేమ ఉందో.. నా బిడ్డని కిడ్నాప్ చేసినా పోలీస్ కేసుని వెనక్కి తీసుకున్నాను.. ఇంకా నీకు నా మనసు అర్ధం కావడం లేదేంటి' అంటుంది. తర్వాత కొన్ని మాటలు అనేసి లక్కీని తీసుకుని వెళ్తున్నట్లు యాక్టింగ్ చేస్తుంది. కానీ, లక్కీ మాత్రం నందూనే కావాలని పట్టుకుని ఉంటాడు. అయినా లాస్య బలవంతంగా తీసుకు వెళ్తుండగా.. తులసి ఆపుతుంది. దీంతో లాస్య వెళ్లిపోతుంది. తర్వాత నందూ నిజంగానే లక్కీని తీసుకొచ్చాడని అందరూ నమ్మి అతడిని అసహ్యించుకుంటారు.

దివ్య పరువు తీస్తుందని:రాజ్యలక్ష్మికి ప్రియ టాబ్లెట్లు తీసుకు వచ్చి ఇస్తుంది. అప్పుడామెను విసుకుంటూ ఉండగా బసవయ్య వచ్చి అక్కను ఇరిటేట్ చేస్తుంటాడు. అంతలోనే అక్కడకు వచ్చిన సంజయ్ కోపంగా కనిపిస్తాడు. అప్పుడు ఏమైందని అడగ్గా దివ్య ఆస్పత్రిలో తన పరువును తీస్తుందని వాపోతాడు. దీంతో బసవయ్య 'నీ పరువు తీయడం వరకూ ఓకే. కానీ విక్రమ్ గాడిని పదును చేసి ఆస్పత్రి మొత్తం లాక్కునేలా చేస్తుంది. అది జరిగితే మీ పని అయిపోతుంది' అంటాడు. దీంతో రాజ్యలక్ష్మి అతడిపైన కూడా కోప్పడుతుంది.

 Intinti Gruhalakshmi:

ఆ తాళాలు నీకు ఎందుకు:ఆస్పత్రి నుంచి వచ్చిన విక్రమ్ తన తల్లిని ఎలా ఉందని అఅడుగుతాడు. దీంతో 'నేను బాగానే ఉన్నాను. రేపటి నుంచి ఆస్పత్రికి వెళ్తాను' అంటుంది. దీంతో విక్రమ్ 'అమ్మ నా గురించే ఆలోచిస్తుంది. నాకు వర్క్ ఎక్కువ అవుతుందని అనుకుంటుంది' అంటాడు. దీంతో వాళ్ల నాన్న ప్రకాశం వచ్చి 'అమ్మ కోసం ఆమాత్రం చేయలేవా? నువ్వు ఆస్పత్రికి వెళ్లినప్పటి నుంచి కొత్త ఉత్సాహం కనిపిస్తుంది' అంటూ విక్రమ్‌ను రెచ్చగొడతాడు. తర్వాత రాజ్యలక్ష్మి దగ్గర ఉన్న ఇంటి తాళాలను తనకు ఇచ్చేయమని ప్రకాశం తీసుకుంటాడు. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X