Intinti Gruhalakshmi Today Episode: తులసితో సామ్రాట్ గొడవ.. మల్లెపూలు తెచ్చి రెచ్చగొట్టడంతో!
ఇండియా మొత్తంలోనే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. రూమ్‌లో ఒంటరిగా ఉన్న తులసిని సామ్రాట్ బయటకు తీసుకెళ్తానని అంటాడు. ఆ వెంటనే ఆటో బుక్ చేసి మరీ ఆమెను వైజాగ్ అంతా తిప్పుతాడు. చివరకు బీచ్ దగ్గరకు తీసుకు వచ్చి ఆమెను సర్‌ప్రైజ్ చేస్తాడు. దీంతో తులసి ఎంతగానో సంతోషిస్తుంది. ఇక, శృతి కోసం వెళ్లిన ప్రేమ్ ఒంటరిగా రావడంతో అంకిత షాక్ అవుతుంది. అప్పుడు ఏమైందని అడగ్గా.. తాను శృతితో కలిసి బతికేది లేదని చెబుతాడు. ఇక, సముద్రం దగ్గర తులసి కనిపించకుండా పోతుంది. దీంతో సామ్రాట్ ఏడుస్తూ ఆమెను వెతుకుతూ ఉంటాడు.

కంగారుగా తిరిగి వచ్చేసిన తులసి
బీచ్‌లో ఎవరో కొట్టుకుపోయారని తెలుసుకున్న తర్వాత సామ్రాట్.. తులసిని పిలుస్తాడు. కానీ, ఆమె కనిపించకపోవడంతో కొట్టుకుపోయిందేమో అని కంగారు పడతాడు. ఆ సమయంలో నీళ్లలోకి దిగేందుకు ప్రయత్నిస్తాడు. అప్పుడు అక్కడున్న వాళ్లంతా అతడిని పట్టుకుని ఆపుతారు. ఆ తర్వాత పర్యాటకుల్లో కొందరు 'సార్.. ఇది చాలా డేంజర్ ప్లేస్. ఇక్కడ అలలకు కొట్టుకుపోయిన వాళ్లలో బతికింది ఒక్కళ్లు కూడా లేరు. మీరు ఎంత వెతికినా ఉపయోగం లేదు సార్' అని చెప్తారు. దీంతో సామ్రాట్‌లో భయం పెరుగుతుంది. అంతలో తులసి కంగారుగా అక్కడకు వస్తుంది.

తులసిపై సామ్రాట్ తీవ్ర ఆగ్రహం
తులసి అలల ధాటికి కొట్టుకుపోయిందేమో అని సామ్రాట్ భయపడుతుండగా.. ఆమె స్వయంగా కంగారు పడుతూ వస్తుంది. ఆమె చేతిలో రెండు మొక్కజొన్న కంకులు కూడా ఉంటాయి. తులసిని చూసి సామ్రాట్‌కు కోపం వస్తుంది. అప్పుడామె 'నన్ను బండ రాళ్ల వైపు వెళ్లొద్దని మీరు వెళ్తున్నారేంటి' అని ప్రశ్నిస్తుంది. దీంతో సామ్రాట్ 'షట్ అప్.. మీకోసం నేను ఎంతగా వెయిట్ చేశానో తెలుసా? మీ బాధ్యత నాది. మిమ్మల్ని తీసుకొచ్చినందుకు మీకు ఏదైనా అయితే మీ ఫ్యామిలీకి నేను ఏం సమాధానం చెప్పాలి. మీరేమీ చిన్నపిల్ల కాదు కదా' అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.

వీళ్లిద్దరినీ చూసి షాకైన ఆ జంట
దీంతో తులసి 'మొక్కజొన్న కంకులు తీసుకు రావడానికి వెళ్లాను. మీరు కంగారు పడడంతో అర్థం ఉంది. కానీ, బీచ్‌లో చిన్న పిల్లలా ఆడుకున్నంత మాత్రాన నేనేమీ చిన్నపిల్లను కాదు కదా' అంటూ అతడిని కూల్ చేస్తుంది. దీంతో సామ్రాట్ సారీ.. తప్పు నాదే అంటాడు. తర్వాత ఇద్దరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ మొక్క జొన్న కంకులు తింటుంటారు. అంతలోనే అక్కడకు నందూ, లాస్యలు వస్తారు. అలా వచ్చీ రావడమే మొక్కజొన్న కంకులు తింటూ కబుర్లు చెప్పుకుంటోన్న తులసి, సామ్రాట్‌ను చూస్తారు. ఆ వెంటనే నందూకు వాళ్లపై ఓ రేంజ్‌లో కోపం వస్తుంది.

వాళ్లను కలిపే శక్తి ఆంటీకే ఉంది
ప్రేమ్.. శృతిని జీవితంలో కలిసేది లేదని చెప్పినప్పటి నుంచి అంకిత వాళ్ల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే అసలు వాళ్ల మధ్య ఏం జరుగుతోందో అని తనలో తాను తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడామె 'ప్రేమ్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో తనకు అర్థం కాదు. ఇక ఎవరు ఏం చెప్పినా నేను వినను అని ప్రేమ్ అనే సరికి.. చూడబోతే పరిస్థితి చేయి దాటినట్టే అనిపిస్తోంది. నేను శృతితో మాట్లాడినా ఏం ఉపయోగం ఉండదు. ఈ సమస్యను సాల్వ్ చేసే కెపాసిటీ ఒక ఆంటీకే ఉంది. తను వస్తేనే వీళ్లు దారిలోకి వస్తారు' అని అనుకుంటుంది.

ఆదిలాబాద్ వెళ్లనున్న అంకిత
ప్రేమ్, శృతి గురించి ఆలోచిస్తోన్న అంకితకు ఆమె పని చేసే ఆస్పత్రిలోని సూపర్ వైజర్ నుంచి ఫోన్ వస్తుంది. అప్పుడాయన అంకిత నువ్వు వెంటనే అదిలాబాద్ రావాలి అంటాడు. దీంతో ఇప్పటికిప్పుడు అదిలాబాద్ రావాలంటే కష్టం సార్ అంటుంది. దీంతో సూపర్ వైజర్ అక్కడ సీజనల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి. నువ్వు రావాల్సిందే అంటాడు. దీంతో సరే సార్.. ఇప్పుడే బయలుదేరుతాను అంటుంది. ఇంతలో అభి వచ్చి ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతుంది. దీంతో సీజనల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి. అందుకే నన్ను ఆదిలాబాద్ పంపుతున్నారు అంటుంది.

తులసిని రెచ్చగొట్టేసిన లాస్య
ఇక, బీచ్‌లో తులసి, సామ్రాట్‌ను లాస్య, నందూ కలుస్తారు. ఆ సమయంలో లాస్య తులసిని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. 'జనరల్‌గా వైజాగ్ వచ్చిన ఏ కపుల్ అయినా బీచ్‌కు వచ్చి ఎంజాయ్ చేసి గాని వెళ్లరు. మేడమ్ మీరు ఎప్పుడు వచ్చారు. ఇదిగో.. మనిద్దరి కోసం పూలు తీసుకున్నాను. మీరు పెట్టుకుంటారా లేక.. నేను పెట్టనా' అని అంటుంది. దీంతో తులసి నాకు మల్లెపూలు ఇష్టం లేదు అంటుంది. దీనికా లాస్య 'నాకు ఇష్టం లేదు కానీ.. ఆడవాళ్లు మల్లెపూలు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అని నందు చెప్పారు' అంటుంది. దీంతో నాకు వద్దు అంటుంది తులసి. అప్పుడు సామ్రాట్ ప్రేమతో ఇస్తుంది కదా.. కాదనడం ఎందుకు తులసి గారు అంటాడు. దీంతో లాస్య చూశారా.. సామ్రాట్ గారు కూడా మల్లెపూలకే ఓటేశారు అని ఆమెకు పెడుతుంది.

శృతికి సలహా ఇచ్చిన కౌశల్య
గొడవ పెట్టుకుని వెళ్లిపోయిన ప్రేమ్ గురించి శృతి ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు కౌశల్య వచ్చి ఆమెను చూసి 'నువ్వు తప్పు చేశావేమో శృతి.. ప్రేమ్ విషయంలో ఒకసారి ఆలోచించాల్సింది. పంతాలకు పోవడం వల్ల ఒరిగేదేమీ లేదు. మళ్లీ ఒకసారి అతడి గురించి ఆలోచించు' అని సలహాలు ఇస్తుంది. ఆ తర్వాత తులసి, సామ్రాట్ ఇద్దరూ రెస్టారెంట్‌కు వెళ్తారు. అక్కడికే నందూ, లాస్య ఇద్దరూ వస్తారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











