For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi August 19th Episode: నువ్వు పెద్ద శాడిస్టు.. ఫోన్‌ చూసి నిజం తెలుసుకున్న నందూ

  |

  దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. శృతి తన డైరీని చదవలేదన్న విషయాన్ని ప్రేమ్ ఆమెతో మాట్లాడిన తర్వాత తెలుసుకుంటాడు. కానీ, తన డైరీ ఏమైందని ఆలోచిస్తుంటాడు. సరిగ్గా అప్పుడే అంకిత దాన్ని చించేసి కాల్చేస్తుంది. ఆ తర్వాత లాస్యకు తులసికి మధ్య పెద్ద డిస్కర్షన్ జరుగుతుంది. ఆ సమయంలో తన జోలికి కానీ, ఫ్యాక్టరీ జోలికి కానీ రావొద్దని ఆమెకు పెద్ద వార్నింగ్ కూడా ఇస్తుంది. ఈ విషయాన్ని ఆ తర్వాత లాస్య, భాగ్యకు చెబుతుంది. ఇక, చివర్లో దివ్యను కాలేజ్ నుంచి తీసుకొస్తానని మర్చిపోతాడు నందూ. దీంతో ఆమెకు ఆపద వస్తుంది.

  తులసి మాటలకు ఫీలైపోయిన నందూ

  తులసి మాటలకు ఫీలైపోయిన నందూ

  దివ్యకు త్వరగా వస్తానని చెప్పిన నందూ.. ఆఫీస్‌లో పీఏను పిలిచి వర్క్ అంతా పూర్తైపోయిందా అని అడుగుతాడు. ఆ తర్వాత తాను ఇంటికి వెళ్లిపోవచ్చని అనుకుంటాడు. దీంతో లాస్య ‘ఎందుకు నందూ.. ఇంత త్వరగా ఇంటికి వెళ్లాలనుకుంటున్నావ్' అని అడుగుతుంది. దీనికి నందూ.. ‘దివ్యను పిక్ చేసుకోవాలని అడిగింది. అసలు తులసి ఏమనుకుంటుంది? నాకేదో బాధ్యత లేనట్లు దివ్యతో మళ్లీ మళ్లీ అడిగిచింది' అని అంటాడు. దీనికామె ‘ఈ మధ్య తులసి బయట తిరుగుతుంది. ప్రపంచం తెలుస్తుంది కదా. అందుకే అలా మాట్లాడుతుంది' అని సమాధానం చెబుతుంది.


  Raja Raja Chora Twitter Review: శ్రీవిష్ణు కెరీర్‌లో తొలిసారి.. ప్లస్ మైనస్ ఇవే.. మూవీ ఎలా ఉందంటే!

   నందూకు దివ్య ఫోన్.. లాస్య అలా చేసి

  నందూకు దివ్య ఫోన్.. లాస్య అలా చేసి

  కాలేజ్‌లో సెమినార్ పూర్తైన తర్వాత దివ్య బయటకు వస్తుంది. అప్పుడు ఆమె స్నేహితురాలు క్యాబ్‌లో వెళ్లిపోదాం అంటుంది. కానీ, తను మాత్రం ‘నన్ను పిక్ చేసుకోడానికి డాడీ వస్తానన్నారు.. నేను ఇక్కడ లేకపోతే ఆయన కంగారు పడతారు. నువ్వు వెళ్లిపో' అని అనడంతో ఆమె వెళ్లిపోతుంది. మరోవైపు, ‘దివ్య ఫోన్ చేస్తే నందూ వెళ్తాడు. అదే అతడు వెళ్లకపోతే తులసితో పెద్ద గొడవ అవుతుంది' అనుకున్న లాస్య.. నందూ ఫోన్‌ను తీసుకుని సైలెంట్‌లో పెడుతుంది. ఆమె అనుకున్నట్లుగానే దివ్య అప్పుడు ఫోన్ చేస్తుంది. కానీ, లాస్య ఆ విషయం మాత్రం చెప్పదు.

  సుడిగాలి సుధీర్‌పై దీపిక సంచలన వ్యాఖ్యలు: వద్దన్నా ఇంటికి వస్తాడంటూ మరీ దారుణంగా!

  పోకిరీలా ప్రమాదంలో దివ్య.. తులసి ఫోన్

  పోకిరీలా ప్రమాదంలో దివ్య.. తులసి ఫోన్

  నందూ ఫోన్ లిఫ్ట్ చేయకపోయే సరికి దివ్య.. తులసికి కాల్ చేసి విషయం చెబుతుంది. అప్పుడామె కూడా నందూకు కాల్ చేయగా.. లాస్య అతడికి చెప్పదు. అంతలోనే ఇద్దరు పోకిరీలు దివ్యను ఏడిపిస్తుంటారు. దీంతో భయంతో వెంటనే తండ్రికి ఫోన్ చేయగా సైలెంట్‌లో ఉండడంతో అతడికి కాల్ వచ్చేది తెలియదు. అప్పుడు తన తల్లికి ఫోన్ చేసి విషయం చెబుతుంది. దీంతో కంగారు పడిపోయిన తులసి వెంటనే షీ టీమ్స్‌కు కాల్ చేస్తుంది. దీంతో వాళ్లు రంగప్రవేశం చేసి ఆ పోకిరీలకు దేహశుద్ది చేస్తారు. ఆ తర్వాత తులసి కూడా అక్కడకు చేరుకుంటుంది.

   డాడ్ వస్తే నాకీ పరిస్థితి వచ్చేది కాదంటూ

  డాడ్ వస్తే నాకీ పరిస్థితి వచ్చేది కాదంటూ

  తల్లి రావడంతో దివ్య వెంటనే కంగారుగా తులసిని హగ్ చేసుకుని ఏడుస్తుంది. అప్పుడామె కూతురికి ధైర్యం చెబుతుంది. ఆ సమయంలో దివ్య ఏడుస్తూ ‘మామ్ నాకెంతో భయం వేసింది. డాడ్‌ను పదే పదే అడిగాను. వస్తానని నాకు ప్రామిస్ కూడా చేశారు. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేశారు. నాకు డాడ్ మీద చాలా కోపంగా ఉంది మామ్' అంటూ చెబుతుంది. ఆ తర్వాత పోలీసులకు తులసి, దివ్య థ్యాంక్స్ చెబుతారు. అప్పుడు ఆ పోలీస్ ‘నేను మీకు థ్యాంక్స్ చెప్పాలమ్మా. మీలా ధైర్యంగా ఎవరూ ఫోన్, కంప్లైంట్ చేయడం లేదు' అంటూ తులసికి థ్యాంక్స్ చెబుతుంది.

  బాత్రూంలో బోల్డుగా దిశా పటానీ సెల్ఫీ: వామ్మో అందాలు మొత్తం చూపిస్తూ ఘాటుగా!

  నందూపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తులసి

  నందూపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తులసి

  ఇంటికి చేరుకున్న తర్వాత కూడా దివ్య ఏడుస్తూనే ఉంటుంది. అంతలో అక్కడకు లాస్యతో కలిసి వస్తాడు నందూ. రావడం రావడమే ఏమైందని అడుగుతూ.. దివ్యను పిక్ చేసుకోకపోవడంపై సారీ చెబుతాడు. దీంతో ఒక్కసారిగా నందూపై తులసి ఫైర్ అవుతుంది. ‘సారీనా.. మీ నిర్లక్ష్యం ఖరీదు దివ్య జీవితం. మీరు బాధ్యతను మరవడం వల్ల తన జీవితం బలయ్యేది' అంటుంది. ఆ తర్వాత ప్రేమ్ కూడా తండ్రితో గొడవకు దిగుతాడు. ఆ సమయంలో నందూ వాళ్లిద్దరినీ తీవ్ర స్థాయిలో తిడతాడు. ఆ తర్వాత తులసి అడగడంతో ఫోన్ చూసుకుని సైలెంట్‌లో ఉందని గ్రహిస్తాడు.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  నువ్వే శాడిస్ట్.. తులసిపై నందూ నిందలు

  నువ్వే శాడిస్ట్.. తులసిపై నందూ నిందలు

  తన ఫోన్‌కు దివ్య కాల్ చేసిన విషయాన్ని చూసుకున్న నందూ.. గొడవ సమయంలో సారీ అని ఒక్క మాట అంటాడు. దీనికి తులసి కోప్పడుతుంది. అప్పుడు ‘తులసి నువ్వో పెద్ద శాడిస్ట్‌వి. పైకి కనిపించవు కానీ.. తప్పు దొరికితే దాన్నే పట్టుకుని వేలాడతావు. ఏ మీకు బాధ్యత లేదా? మగాళ్లు బయట వ్యవహారాలు చేస్తారు. ఆడవాళ్లు పిల్లలను చూసుకోవాలి. పిల్లల బాధ్యత నీదే' అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడతాడు. దీంతో పరందామయ్య కూడా అతడిని తప్పుబడతాడు. కానీ, నందూ మాత్రం ఫైర్ అవుతూనే ఉంటాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 402: Tulasi Saves her Daughter Divya From Big Fearful Incident. After That She Fight with Nandhu. Then He Also Fired on Tulasi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X