Intinti Gruhalakshmi: లాస్యకు బిగ్ షాకిచ్చిన లక్కీ.. నందూకు తెలిసిన నిజం.. తులసికి దొరికిపోవడంతో!

దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై వస్తున్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

Intinti Gruhalakshmi Serial Today Episode August 19th 2023

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ప్లాన్ ప్రకారం లక్కీని తులసి వాళ్ల ఇంటికి పంపిన లాస్య.. ఆ తర్వాత పోలీసులను తీసుకు వచ్చి నందూ వాళ్లే కిడ్నాప్ చేశారని అంటుంది. అప్పుడే లక్కీ ఇంట్లో కనిపిస్తాడు. దీంతో నందూనే తన కొడుకును తీసుకు వచ్చాడని అంటుంది. తర్వాత అందరూ ఇదే నమ్ముతారు.

ఇక, ఆస్పత్రితో విక్రమ్, దివ్య కలిసి తన పరువు తీస్తున్నారని సంజయ్ తన తల్లికి చెప్తాడు. ఆ తర్వాత ప్రకాశం వచ్చి విక్రమ్ ఆస్పత్రికి వెళ్లినప్పటి నుంచి ఉత్సాహంగా కనిపిస్తున్నాడని అంటాడు. తర్వాత రాజ్యలక్ష్మి దగ్గర ఉన్న తాళాలను ఇవ్వమని అంటాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode August 19th 2023

తాళాలను కోడలికి ఇచ్చేశాడు: రాజ్యలక్ష్మికి కాలు బాగోలేదని బాధ పడినట్లుగా నటించిన ప్రకాశం.. ఇంట్లో బీరువాలకు సంబంధించిన తాళాలను తనకు ఇవ్వమని అడుగుతాడు. దీంతో బసవయ్య వాటిని ఇవ్వగా.. ఇంటి పెద్ద కోడలైన దివ్య దగ్గరే ఇవి ఉండాలని ప్రకాశం అంటాడు.దీంతో విడాకుల కేసు ఉంది కదా అని అడ్డుపుల్ల వేయగా.. 'ఆస్పత్రి బాధ్యతలు అప్పగించినప్పుడు తాళాలు ఇవ్వడానికి ఏంటి' అంటాడు. తర్వాత విక్రమ్‌ను అవి దివ్యకు ఇవ్వమనగా.. అతడు రాజ్యలక్ష్మి చేత్తో ఇప్పిస్తాడు. దీంతో దివ్య అత్త కాళ్లకు నమస్కరించి.. గర్వంగా చూసి రెచ్చగొడుతుంది.

లక్కీకి మళ్లీ ఫోన్ చేసిన లాస్య: నందూ ఇంట్లో ఉన్న లక్కీకి లాస్య ఫోన్ చేస్తుంది. అప్పుడా బుడ్డోడు 'అబ్బా.. ఈమెకి వేరే పనేం ఉండదు. పని అయిపోయింది కదా.. ఫోన్ చేసి ఎందుకు విసిగిస్తుంది' అనుకుంటూ లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు తల్లితో 'నా గురించి మర్చిపో మమ్మీ.. నేను డాడీ దగ్గర హ్యాపీగా ఉన్నాను' అని అంటాడు. దీంతో లాస్య.. 'మరి నా సంగతి ఏంట్రా? నువ్వు లేకుండా నేను ఒక్కదాన్ని ఎలా ఉంటానని అనుకున్నావు' అని అంటుంది. దీనికి లక్కీ 'కొత్తగా మాట్లాడతావేంటి మమ్మీ.. మొన్నటి వరకూ నేను లేకుండానే ఉన్నావు కదా.. హ్యాపీగానే ఉన్నావ్ కదా' అని అంటాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode August 19th 2023

లాస్యకు షాక్ ఇచ్చేసిన లక్కీ: లక్కీ మాటలకు లాస్య 'రేయ్ ఎక్కువ మాట్లాడితే చెంప పగులుతుంది. ముందు నేను చెప్పింది చెయ్' అంటుంది. దీంతో లక్కీ 'సరే మమ్మీ ఏం చేయాలో చెప్పు' అనగా 'హాల్‌లో అందరి మందు కింద పడి గట్టిగా ఏడు. నాకు మమ్మీ కావాలి. నేను ఎక్కడ ఉంటే మమ్మీ కూడా అక్కడే ఉండాలి. మమ్మీ లేకపోతే ఉండలేను అని ఏడ్వరా.. గోల భరించలేక వాళ్లే ఒప్పేసుకుంటారు' అని అంటుంది. దీంతో లక్కీ 'నేను దానికి ఒప్పుకోను.. నువ్వ అక్కడే ఉండు.. నేను ఇక్కడే ఉంటా. నువ్వు ఇక్కడికి వస్తే నేనెక్కడ హ్యాపీగా ఉంటా మమ్మీ.. డాడీ దగ్గరే నాకు బాగుంది' అని షాకిస్తాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode August 19th 2023

దివ్య డబ్బులు ఇవ్వడంతో: ఇంట్లో పనిమనిషి వచ్చి రూ. 25 వేలు అప్పుగా కావాలని అడగడంతో దివ్య డబ్బులు ఇస్తుంది. అంతేకాదు, 'వీటిని మళ్లీ ఇవ్వొద్దు. పిల్లల చదువుకు అంటున్నావు కదా. వాళ్లను మంచిగా చదివించు' అని చెప్తుంది. దీంతో ఆ పనిమనిషి 'మీరు పిల్లాపాపలతో చల్లగా ఉండాలమ్మా' అని దీవించి వెళ్లిపోతుంది. తర్వాత అక్కడే ఉన్న రాజ్యలక్ష్మి.. దివ్యతో వాదనకు దిగుతుంది. అలా ఇద్దరూ వాదించుకుంటూ ఉండగా ప్రకాశం వచ్చి 'నీకు మంచి చెప్తే అర్ధం కాదులే' అంటాడు. తర్వాత రాజ్యలక్ష్మి మాట్లాడుతుండగా.. ఇద్దరూ కలిసి ఆమెకు సరైన జవాబులిస్తారు.

Intinti Gruhalakshmi Serial Today Episode August 19th 2023

నందూ తల నొక్కిన లక్కీ: లక్కీ వల్ల టెన్షన్ ఎక్కువ కావడంతో తలనొప్పి వచ్చి నందూ బెడ్‌పై వాలిపోతాడు. అప్పుడు లక్కీ అక్కడకు వెళ్లి తల నొక్కుతూ ఉంటాడు. కాసేపు మైమరచిపోయిన నందూ ఆ తర్వాత తేరుకుని లక్కీపై సీరియస్ అవుతూ ఉంటాడు. దీంతో ఆ బుడ్డోడు 'కావాలంటే కాళ్లు కూడా నొక్కుతాను డాడీ. నన్ను కోప్పడకండి' అంటాడు. అయినా నందూ మాత్రం సీరియస్ అవుతూనే ఉంటాడు. ఆ తర్వాత 'వీడ్ని ఇక భయపడితే లాభం లేదు.. ముద్దు చేసి నా దారిలోకి తెచ్చుకోవాలి. అప్పుడు నిజాలు మొత్తం బయటకు వస్తాయి' అని అనుకుంటాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode August 19th 2023

వాళ్లు చెప్పమంటేనే చెప్పా: మంచిగా ఉంటూ నిజాలు రాబట్టాలని అనుకున్న నందూ.. లక్కీని దగ్గరకు తీసుకుని ముద్దు చేస్తాడు. అది నిజమే అని నమ్మిన ఆ చిన్నారి మరింత ప్రేమను చూపిస్తాడు. అప్పుడు నందూ 'ఏరా నిన్ను నేను కిడ్నాప్ చేసి తీసుకుని వచ్చానా' అని అడుగుతాడు. కానీ, లక్కీ మాత్రం సమాధానం దాటవేస్తాడు. తర్వాత మళ్లీ మళ్లీ అడగ్గా.. 'అలా చెప్తే.. నువ్వు నన్ను దగ్గరకు తీసుకుంటావు అని చెప్పారు.. అందుకే ఆశపడ్డాను' అని నిజం చెప్తాడు. దీంతో ఎవరు చెప్పారు అని ప్రశ్నించగా.. లక్కీ చెప్పడు. అంతలోనే తులసి వచ్చి వాళ్లను చూసేస్తుంది.

ఇష్టం ఉంటే కలవండంటూ: లక్కీని నందూ ప్రేమగా చూసుకుంటూ ఉండగా చూసిన తులసి నిజమే అని నమ్ముతుంది. అప్పుడు లక్కీ కూడా అబద్ధం చెప్పడంతో తులసికి కోపం వస్తుంది. దీంతో నందూ ఏదో చెప్పబోతాడు. అప్పుడామె 'ఇక ఆపండి.. ఇప్పటి వరకూ ఏం జరిగిందో అని నాకూ అనుమానంగానే ఉండేది.. కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. తప్పు చేసిందే కాకుండా.. ఆ తప్పుని పిల్లాడిపైకి నెట్టేస్తున్నారా? అందరి ముందు నాకు వాడికి సంబంధం లేదంటారు. ఎందుకీ నాటకం? ఎవర్ని మోసం చేయడానికి? వాడి మీద వాడి అమ్మపైన ప్రేమ ఉంటే.. ఉందని పైకి చెప్పిండి. ఎవరు కాదంటారు.. మీ జీవితం మీది' అంటూ క్లాస్ పీకుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X