For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తాగిన మైకంలో తప్పు చేసిన సామ్రాట్.. నవ్వుల పాలైన హీరోలు

  |

  చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి మరి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. సముద్రం దగ్గర తులసి కనిపించకుండా పోతుంది. దీంతో సామ్రాట్ ఏడుస్తూ ఆమెను వెతుకుతూ ఉంటాడు. అంతలో ఆమె చేతిలో రెండు మొక్కజొన్న కంకులు తీసుకుని వస్తుంది. దీంతో ఆమెపై సామ్రాట్ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతాడు. ఆ తర్వాత కూల్ అయిన అతడు సారీ అంటాడు. మరోవైపు, అంకిత.. ప్రేమ్, శృతి గురించి ఆలోచిస్తుంటుంది. అంతలో ఆమెకు ఆదిలాబాద్‌లో డ్యూటీ వేస్తారు. ఇక, తులసి, సామ్రాట్‌ను బీచ్‌లో చూసిన లాస్య వెటకారంగా మాట్లాడుతుంది. చివర్లో శృతికి కౌశల్య కొన్ని విలువైన సలహాలను ఇస్తుంది.

  హాట్ షోలో గీత దాటిన మెహ్రీన్: బికినీలో బీభత్సమైన ఫోజులు

  తులసిని అలా చూసిన నందూ

  తులసిని అలా చూసిన నందూ

  సామ్రాట్, తులసి కలిసి డిన్నర్ చేయడం కోసం ఓ రెస్టారెంట్‌కు వస్తారు. అక్కడికే ఆ తర్వాత లాస్య, నందూ కూడా వస్తారు. రావడమే వాళ్లను చూసి వాళ్లిద్దరూ రగిలిపోతూ ఉంటారు. అప్పుడు లాస్య నువ్వు వెళ్లి ఆర్డర్ ఇవ్వు. నేను వాష్ రూమ్‌కు వెళ్లొస్తాను అని వెళ్తుంది. అప్పుడు నందూ అక్కడ కూర్చుని సామ్రాట్, తులసినే చూస్తూ ఉంటాడు. అప్పుడే సామ్రాట్ ఫుడ్ తింటూ ఉండగా అతడికి పొర పోతుంది. అప్పుడు తులసి అతడికి మంచి నీళ్లు అందించడంతో పాటు తల మీద నిమురుతుంది. దీంతో సామ్రాట్‌కు సెట్ అవుతుంది. ఇది చూసి నందూ కోపం పెరుగుతుంది.

  తులసి దగ్గరకెళ్లి మరీ మాట్లాడి

  తులసి దగ్గరకెళ్లి మరీ మాట్లాడి

  సామ్రాట్ తినడం అయిపోయిన తర్వాత అతడి ఫ్రెండ్ వస్తాడు. అంతేకాదు, తన ఫ్యామిలీని పరిచయం చేస్తానని రమ్మంటాడు. కానీ అతడు మాత్రం తులసి ఆర్డర్ కోసం చూస్తుంటాడు. ఆమె వెళ్లమని సైగలు చేయగానే అతడు వెళ్లిపోతాడు. తులసి ఒంటరిగా కూర్చోవడం చూసిన నందూ ఆమె దగ్గరకు వెళ్లి కూర్చుంటాడు. అంతేకాదు, అప్పుడతను 'నీ అదృష్టం బాగుంది. పెద్ద బిజినెస్‌మ్యాన్‌కు పార్టనర్ అవ్వడం, క్యాండిల్ లైట్ డిన్నర్, విమానం ఎక్కడం ఇవన్నీ చూస్తుంటే నీకు అదృష్టం పట్టినట్టుంది' అంటూ ఆమెను ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడతాడు.

  యాంకర్ శ్రీముఖి అందాల జాతర: ఆమెనిలా చూశారంటే చెమటలే

  తులసికి నందూ థ్యాంక్స్ చెప్పి

  తులసికి నందూ థ్యాంక్స్ చెప్పి

  నందూ మాటలకు నొచ్చుకున్నా తులసి మాత్రం ఏమీ అనకుండా సైలెంట్ గానే ఉంటుంది. ఆఖరికి నాతో ఇంకా ఏమైనా మాట్లాడాలని వచ్చారా అని అతడిని సూటిగానే ప్రశ్నిస్తుంది. దీంతో నందూ 'నేను నీ మాజీ భర్తను అని సామ్రాట్ గారికి చెప్పవా' అని అడుగుతాడు. దీనికి తులసి 'నేను చెప్పను అని చెప్పాను కదా. మీ ఆవిడ నన్ను రెచ్చగొడుతుంటే ఆ కోపంలో నేను చెబుతానేమో అని అనుకుంటున్నారా? మాటిచ్చాక తప్పను. తులసి అందరి లాంటిది కాదు' అని బదులిస్తుంది. దీంతో నందూ థాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

  చిలక ఉంది.. గోరింక ఎక్కడని

  చిలక ఉంది.. గోరింక ఎక్కడని

  వాష్‌ రూమ్‌కు వెళ్లిన లాస్య అప్పుడే తన టేబుల్ దగ్గరికి వచ్చి నందూ ఎక్కడికి వెళ్లాడు అని చూస్తుంది. ఇంతలో తులసిని చూస్తుంది. అప్పుడామె 'చిలక ఒక్కతే ఉంది. గోరింక ఎక్కడ. నందూ అసలే ఇరిటేటింగ్ మూడ్‌లో ఉన్నాడు. సామ్రాట్ కనిపిస్తే రెచ్చిపోతాడు' అని అనుకుంటుంది. తర్వాత నందు వాష్ రూమ్‌కు వెళ్తాడు. ఇంతలో అక్కడికి సామ్రాట్ వస్తాడు. అప్పుడు నందూ 'వాట్ సర్ ఏంటి అద్దంలో తెగ చూసుకుంటున్నారు. తెల్ల వెంట్రుకలు లేకుండా చేసుకుంటున్నారా. తులసి విషయంలో మీ లిమిట్స్ లో మీరు ఉండండి' అని సామ్రాట్‌తో అంటాడు.

  విడాకుల తర్వాత సమంత రిస్క్: ఆ ప్రాపర్టీపై కన్ను.. ఎన్ని కోట్లు ఖర్చు చేస్తుందో తెలిస్తే!

  కొట్టుకున్న నందూ.. సామ్రాట్

  కొట్టుకున్న నందూ.. సామ్రాట్


  నందూ మాటలకు సామ్రాట్‌కు కోపం వచ్చి 'నా విషయంలో కూడా నోరు జారకు. అయినా తులసి గురించి మాట్లాడటానికి నువ్వు ఎవరు. ఏ హక్కుతో నాకు వార్నింగ్ ఇస్తున్నావు. నేను నీ బాస్‌ను ఆ విషయం మరిచిపోకు' అంటాడు. దీంతో నందూ నేను తులసి మాజీ భర్తను.. ఆ విషయం నువ్వు తెలుసుకో అంటాడు. ఆ తర్వాత సామ్రాట్ ఆ ఇడియట్ నువ్వేనా అంటూ నందూ కాలర్ పట్టుకుంటాడు. అలా ఇద్దరూ కొట్టుకుంటారు. తర్వాత నందు.. సామ్రాట్‌ను బయటికి లాగుతాడు. అప్పుడు నందూ తులసికి దూరంగా ఉండు అంటే అర్థం కాదా నీకు అంటాడు. దీనికి సామ్రాట్ తులసి మాజీ భర్తవు.. నీకు అర్థం కాదా అంటాడు. అప్పుడు తులసి, లాస్య ఇద్దరూ వచ్చి వాళ్లను ఆపే ప్రయత్నం చేస్తారు. ఇంతలో లాస్య స్పృహలోకి వచ్చి ఇలా జరగకూడదు అనుకుంటుంది.

  నందూ, సామ్రాట్ మందు తాగి

  నందూ, సామ్రాట్ మందు తాగి

  ఇక, పక్కకు వెళ్లిన నందూ, సామ్రాట్ ఇద్దరూ మందు కొడుతూ ఉంటారు. ఇద్దరూ ఫుల్ అయిపోయి ఉంటారు. దీంతో లాస్య, తులసి ఇద్దరూ వాళ్ల దగ్గరికి వెళ్తారు. అప్పుడు సామ్రాట్ 'మేమిద్దరం ఫుల్లుగా తాగాం సారీ. నందూ ఒక్కడే ఇక్కడ కూర్చొని మందు తాగుతున్నారు. పాపం కంపెనీ లేదని నేను ఫీల్ అయ్యాను' అంటాడు. అప్పుడు నందూ అందుకే కంపెనీ ఇస్తూ నా దగ్గర సెటిల్ అయిపోయాడు అంటాడు. ఆ తర్వాత తాగిన మైకంలో ఇద్దరూ స్టేజీ మీదికి వెళ్లి డ్యాన్స్ చేస్తారు. అక్కడ వాళ్లు ఇద్దరూ వేసే కుప్పిగంతులు చూసి రెస్టారెంట్‌లో ఉన్న అందరూ నవ్వుకుంటారు.

  హాట్ షోతో షాకిచ్చిన కీర్తి సురేష్: ఆమెనిలా ఎప్పుడూ చూసుండరు!

  హోటల్‌కు తీసుకు వెళ్లడంతో

  హోటల్‌కు తీసుకు వెళ్లడంతో


  ఒళ్లు తెలియనంతగా తాగి ఊగుతోన్న సామ్రాట్, నందూను చూసి అక్కడి వాళ్లంతా హేళన చేసేలా కామెంట్లు చేస్తుంటారు. ఆ తర్వాత కొందరు లేడీస్ కూడా వచ్చి వాళ్లతో కలిసి డ్యాన్స్ చేస్తారు. అనంతరం లాస్య, తులసి కలిసి వాళ్లిద్దరినీ హోటల్ రూమ్‌కు తీసుకెళ్తారు. ఆ సమయంలో సామ్రాట్, నందూ బెస్ట్ ఫ్రెండ్స్‌లా మాట్లాడుకుంటారు. ఇక, సామ్రాట్‌ను లిఫ్ట్ ఎక్కండి అంటే అమ్మో నేను రాను. ఎందుకంటే ఇందులో మగవాళ్లు వెళ్తే ఆడవాళ్లుగా బయటికి వస్తున్నారు అంటాడు. దీంతో లాస్య, తులసి షాక్ అవుతారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 715: Samrat and Nandhu Get Intoxicated and Dance At The Party. After That Tulasi and Lasya Help Them to Reach Their Rooms.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X