For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi August 20th Episode: తప్పు తెలుసుకున్న నందూ.. లాస్య పీకను నొక్కడంతో ఊపిరాకడ!

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ లుక్కేయండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. దివ్యను పిక్ చేసుకోడానికి వస్తానని చెప్పిన నందూ.. సరైన టైమ్‌కు అక్కడికి రాడు. దీంతో పోకిరీలు ఆమెను ఇబ్బంది పెడుతుంటారు. అప్పుడు తులసి పోలీసులకు సమాచారం అదించి.. తన కుమార్తె దివ్యను పెద్ద భయంకరమైన సంఘటన నుంచి కాపాడుతుంది.

  ఆ తర్వాత ఆమె నందుతో గొడవకు దిగుతుంది. అప్పుడు అతను కూడా తులసిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతాడు. అంతేకాదు, తులసిని శాడిస్ట్ అంటూ ఓ రేంజ్‌లో గొడవ పెట్టుకుంటాడు. ఆ తర్వాత పిల్లల బాధ్యత తల్లికే ఉంటుందని చెబుతూ ఎన్నో మాటలు అంటాడు.

  అషు రెడ్డి క్యారెక్టర్‌పై కమెడియన్ సంచలన వ్యాఖ్యలు.. అందుకే అలా చూపిస్తూ తిరుగుతుందంటూ!

  నువ్వు నా ముందు తల దించుకోవాలి

  నువ్వు నా ముందు తల దించుకోవాలి

  దివ్య విషయంలో నందూతో తులసి, ప్రేమ్ గొడవ పడుతుండగా ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. నందూను అడుగుతుండగా అనసూయ తులసి, ప్రేమ్‌ను తిడుతుంది. ఇక, తులసిపై ఇప్పటికే ఎన్నో నిందలు వేసిన నందూ.. ‘ఫ్యాక్టరీకి ఓనర్ అయ్యావు కదా. అందుకే ఈ మధ్య బాగా హెచ్చులు పోతున్నావ్. నీకు బాగా గర్వం పెరిగిపోయింది. నువ్వు ఏ ఫ్యాక్టరీకి ఓనర్ అయినా.. నా ముందు ఎప్పుడూ తల దించుకునే ఉండాలి. నన్ను ప్రశ్నించడానికి నువ్వు అస్సలు సరిపోవు. కాబట్టి నీ హద్దులు తెలుసుకుని ఉండు' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

  నందూ మనసులో విషాన్ని కక్కేశాడు

  నందూ మనసులో విషాన్ని కక్కేశాడు

  తులసి ఎన్నో మాటలు అన్న తర్వాత నందూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు పరందామయ్య.. ‘నువ్వేమీ బాధ పడకమ్మా. వాడి తప్పును కప్పి పుచ్చుకునేందుకు నోటికొచ్చినట్లు మాట్లాడాడు. మనసులో ఉన్న విషయాన్ని అంతా కక్కేశాడు' అని చెబుతాడు. అప్పుడు తులసి కాసేపు ఒంటరిగా వదిలేయమని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ప్రేమ్ కూడా కోపంగా బయటకు వస్తాడు. అతడి వెనకాలే శృతి కూడా వస్తుంది. అప్పుడు కోపంగా ఉన్న అతడిని.. ఆమె సైలెంట్‌గా చేసే ప్రయత్నాలు చేస్తుంది. ఇందుకోసం కూల్ చేసేలా మాట్లాడుతుంది.

  హాట్ ఫొటోతో హీటు పెంచిన లెజెండ్ హీరోయిన్: అరాచకమైన ఫోజుతో రెచ్చిపోయిన భామ

  లాస్యపై శృతి అనుమానం.. అంకిత ఫైర్

  లాస్యపై శృతి అనుమానం.. అంకిత ఫైర్

  ప్రేమ్‌తో మాట్లాడుతున్న సమయంలో శృతి.. ‘అయినా అంకుల్‌కు దివ్య గురించి లాస్య ఆంటీ గుర్తు చేయొచ్చు కదా. ఉన్నట్లుండి ఆయన ఫోన్ సైలెంట్‌లోకి ఎందుకు వెళ్లింది. ఇదంతా చూస్తుంటే నాకు లాస్య మీద డౌట్ వస్తుంది' అని అంటుంది. అంతలో అక్కడకు అంకిత ఎంట్రీ ఇచ్చి ‘ఇప్పుడిప్పుడే ఇంట్లో వాళ్లు అర్థం చేసుకుంటున్నారు. ఇలాంటి టైమ్‌లో లేనిపోని నిందలు వేసి గొడవలు పెట్టాలనుకుంటున్నావా? లాస్య ఆంటీ ఇలా చేశారని నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా' అంటూ శృతిని ప్రశ్నిస్తుంది అంకిత. ఆ సమయంలో ప్రేమ్.. అంకితపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతాడు.

  తప్పు తెలుసుకున్న నందూ.. సారీ చెప్పి

  తప్పు తెలుసుకున్న నందూ.. సారీ చెప్పి

  ఇంట్లో జరిగిన పెద్ద గొడవ తర్వాత నందూ దివ్య విషయంలో జరిగిన దాని గురించి ఆలోచిస్తుంటాడు. ‘దివ్యను పిక్ చేసుకోవాలన్న విషయాన్ని ఎందుకు మర్చిపోయాను. నేను తప్పు చేశాను కదా. తనుకు ఏదైనా జరిగితే నా వల్లే జరిగిందని కుమిలిపోవాల్సి వచ్చేది' అని తనలో తానే అనుకుంటాడు. ఆ సమయంలోనే రూమ్‌లో ఒంటరిగా ఏడుస్తూ ఉన్న దివ్య దగ్గరకు వెళ్లి ‘ఏంటి దివ్య నా మీద కోపంగా ఉందా? వర్క్ టెన్షన్‌లో పడి నిన్ను పిక్ చేసుకోవాలని మర్చిపోయాను. నా వల్లే నీకు ఆ పరిస్థితి వచ్చింది. పొరపాటు జరిగిపోయింది' అంటూ సారీ చెబుతాడు.

  Bazar Rowdy Twitter Review: భారీ హిట్ తర్వాత బజార్‌ రౌడీగా సంపూ.. ప్లస్ మైనస్ ఇవే.. ఎలా ఉందంటే!

  మరి మామ్‌ను ఎందుకు తప్పుబట్టారు?

  మరి మామ్‌ను ఎందుకు తప్పుబట్టారు?

  తనకు సారీ చెప్పిన తండ్రిని దివ్య ఆవేదనతో ప్రశ్నిస్తుంది. ‘నాకు సారీ అని చెబుతున్నారే.. మరి మామ్ ముందు తప్పు చేయనట్లు ఎందుకు మాట్లాడారు? మామ్‌ను అనరాని మాటలన్నీ ఎందుకు అన్నారు? ఇప్పుడు మీరు చెప్పిందే కదా.. మామ్ కూడా చెప్పింది. నేను కూడా అప్పట్లో మామ్‌ను అపార్థం చేసుకున్నాను. మీరు ఇప్పటికీ అదే చేస్తున్నారు. మీరు ఎప్పుడైతే అమ్మను అర్థం చేసుకుంటారో.. అప్పుడే మన ఇల్లు సంతోషంగా ఉంటుంది. నాకు తప్పు ఒప్పులు తెలుసుకునే ఏజ్ వచ్చింది కాబట్టే ఇది అర్థం చేసుకున్నాను' అంటూ బాధ పడుతుంది దివ్య.

  దేవుడు కాదు... నువ్వే కాపాడావమ్మా

  దేవుడు కాదు... నువ్వే కాపాడావమ్మా

  పరందామయ్య ఇంట్లో ఒంటరిగా కూర్చుని బాధ పడుతుంటాడు. అప్పుడు తులసి వచ్చి అడగ్గానే ‘దివ్య గురించి తలచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుందమ్మా. నువ్వు సరైన సమయానికి పోలీసులకు ఫోన్ చేసి నీ కూతురిని నువ్వు కాపాడుకున్నావు. నందూ చేసిన పని తలచుకుంటేనే కోపం వస్తుంది. బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి మర్చిపోయాను అంటూ మామూలుగా సమాధానం చెబుతున్నాడు. వాడి వల్లే ఈ పరిస్థితి వచ్చింది' అంటూ చెబుతాడు. దీనికి తులసి ‘ఇప్పుడు అవన్నీ ఎందుకు మామయ్య' అంటూ ఆయనను సముదాయిస్తుంది.

  సుడిగాలి సుధీర్‌పై దీపిక సంచలన వ్యాఖ్యలు: వద్దన్నా ఇంటికి వస్తాడంటూ మరీ దారుణంగా!

  నిజం చెప్పిన లాస్య.. పీక పట్టుకోవడంతో

  నిజం చెప్పిన లాస్య.. పీక పట్టుకోవడంతో

  పరందామయ్య మాటలను విన్న లాస్య.. తులసితో ‘ఏ పాపం తెలియని నందూ మీద ఎందుకు నిందలు వేస్తున్నారు తులసి. ఫోన్ సైలెంట్‌లో పెట్టింది నేనే. నువ్వు నా బద్ధ శత్రువువు అందుకే అలా చేశాను. నిన్ను ఇబ్బంది పెట్టడానికే ఇలా చేశాను' అని చెబుతుంది. దీంతో తులసి ఒక్కసారిగా లాస్య పీక పట్టుకుని నొక్కుతుంది. కొద్దిసేపటి తర్వాత వదలగా.. లాస్య కింద కూర్చుండిపోతుంది. అప్పుడు ‘నీకు ఇప్పుడు ఊపిరాడలేదా? నాక్కూడా దివ్య గురించి తెలియగానే ఇలాగే అనిపించింది' అంటూ గంభీర స్వరంతో చెబుతుంది తులసి. దీంతో ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 403: Ankitha Blamed Shruthi in Front of Prem. Then He Fired on her. After Big Fight.. Nandhu Thinking about Divya Incident.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X