Intinti Gruhalakshmi Today Episode: తులసి అంటే ఇష్టమన్న సామ్రాట్.. మత్తులో నిజం చెప్పేసిన నందూ
భారతదేశంలో ఉన్న చాలా భాషలతో పోల్చుకుని చూస్తే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. రెస్టారెంట్‌లో సామ్రాట్, తులసిని చూసిన నందూ రగిలిపోతూ ఉంటాడు. ఆ తర్వాత సామ్రాట్ పక్కకు వెళ్లగానే తులసి దగ్గరకు వెళ్లిన అతడు.. ఎన్నో రకాలుగా మాట్లాడి ఇబ్బంది పెడతాడు. ఆ తర్వాత తన గురించి సామ్రాట్‌కు చెప్పొద్దని తులసికి రిక్వెస్ట్ చేస్తాడు. అనంతరం సామ్రాట్, నందూ కొట్టుకున్నట్లు లాస్య ఊహించుకుని షాక్ అవుతుంది. ఇక, చివర్లో సామ్రాట్, నందూ ఫుల్లుగా మందు తాగి స్టేజ్ మీదకు వెళ్లి డ్యాన్స్ చేసి నవ్వులపాలు అవుతారు. అనంతరం వాళ్లను లాస్య, తులసి హోటల్‌కు తీసుకుని వస్తారు.

వాళ్ల ఓవర్ యాక్షన్.. వీళ్ల కంగారు
ఫుల్లుగా మందు తాగిన నందూ, సామ్రాట్‌ను.. తులసి, లాస్య హోటల్‌కు తీసుకు వస్తారు. అప్పుడు సామ్రాట్ లిఫ్ట్ ఎక్కను అని మారాం చేస్తాడు. అతడిని ఎలాగోలా ఎక్కించి వాళ్ల ఫ్లోర్ దగ్గరకు తీసుకుని వస్తారు. అప్పుడు సామ్రాట్.. నందూతో అన్నయ్య నేను మారలేదు అంటాడు. దీంతో నందూ నేనూ మారలేదు తమ్ముడు పదా స్టెప్పేద్దాం అంటాడు. తర్వాత ఇద్దరూ నాటు నాటు పాటకు పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ వేస్తారు. ఆ తర్వాత ఇద్దరూ లిఫ్ట్ దగ్గరే కూర్చొంటారు. అప్పుడు లాస్య 'తులసి నేను రిసెప్షన్ దగ్గరికి వెళ్లి కీ తీసుకొస్తా. నువ్వు పెరుగు తీసుకురా' అంటుంది.

మత్తులో తులసి గురించి మాట్లాడి
లాస్య, తులసి పక్కకు వెళ్లిపోగానే సామ్రాట్‌తో నందూ ఏరా తులసి నచ్చిందా అని అడుగుతాడు. దీంతో అతడు తప్పు అంటాడు. అప్పుడు నందూ 'నచ్చిందా చెప్పరా.. నేను దగ్గరుండి మీ ఇద్దరి పెళ్లి చేస్తాను' అంటాడు. దీనికి సామ్రాట్ నిజమా అంటూ నాకు తులసి అంటే చచ్చేంత ఇష్టం అంటాడు. దీంతో నందూ 'వద్దు తమ్ముడు. తులసిని మరిచిపో. దూరంగా ఉండు' అంటాడు. అప్పుడు సామ్రాట్ 'ఎందుకు అన్నయ్య.. ఇప్పటి దాకా నాకు పెళ్లి చేస్తా అన్నావు. ఇప్పుడేమో దూరంగా ఉండమంటున్నావు. ఎందుకు అన్నయ్యా' అని అడుగుతాడు.

తులసి గారు కూడా నాదే అంటూ
సామ్రాట్ అడిగిన దానికి నందూ 'అది కాదురా తమ్ముడు.. ఆ తులసి నా భార్య. పెళ్లయ్యాక అభి పుట్టాడు, ప్రేమ్ పుట్టాడు, దివ్య పుట్టింది. కానీ, తులసి మీద నాకు ప్రేమ పుట్టలేదు తమ్ముడు' అంటాడు. దీంతో సామ్రాట్ నవ్వుతాడు. తర్వాత 'నేను నీ తమ్ముడినే కదా. నీకు నేనంటే ప్రాణం కదా. అయితే నేను అడిగిన దాని గురించి చెప్పు. గాలిపటం ఎగురు వేస్తున్నాం. అది తెగిపోయింది. ఇప్పుడు అది ఎవరిది అవుతుంది' అని అడుగుతాడు. దీంతో నందూ ఎవరికి దొరికితే వారికే అంటాడు. అప్పుడు సామ్రాట్ 'తులసి గారు కూడా నాదే' అంటాడు.

ఎలాగోలా తీసుకు వెళ్లిన భామలు
గాలిపటం గురించి మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి తులసి పెరుగు తీసుకొని వస్తుంది. అప్పుడు సామ్రాట్ తెగిన గాలిపటం నాదేనా అంటాడు. దీంతో నందూ నీదే అంటాడు. ఇంతలో లాస్య కూడా వచ్చి.. 'తులసి నువ్వు సామ్రాట్ గారిని గదిలోకి తీసుకెళ్లు. నేను నందును తీసుకెళ్తాను' అంటూ అతడిని తీసుకెళ్తుంది. అప్పుడు తులసి సామ్రాట్‌తో వెళ్దాం పదండి అని అంటుంది. కానీ.. సామ్రాట్ రాడు. అంతేకాదు, 'నేను ఇక్కడే కూర్చొంటాను. నాకు ఇక్కడే బాగుంది. కావాలంటే రూమ్‌నే ఇక్కడికి తీసుకురండి' అని మారం చేసినా తర్వాత తీసుకెళ్తుంది.

పరందామయ్యకు ఛాతిలో నొప్పి
మరోవైపు.. పరందామయ్యకు చాతిలో నొప్పి వస్తూ ఉంటుంది. నిద్ర పోకుండా లేచి కూర్చొంటాడు. ఇంతలో అనసూయ లేస్తుంది. ఏమైంది అని అడుగుతూనే భయపడుతుంది. అప్పుడాయన 'చాతిలో నొప్పిగా ఉంది. అన్ ఈజీగా ఉంది. గుండెల్లో మంట, నిద్ర పట్టడం లేదు. ఎడమ చేయి కూడా బాగా నొప్పిగా ఉంది' అంటాడు. దీనికామె అభిని పిలవమంటారా అంటుంది. కానీ, పరందామయ్య 'వద్దులే.. వాడు అలసిపోయి నిద్రపోయి ఉంటాడు. టెన్షన్ పడకు. నాకేం కాదు. ఉదయం చూసుకుందాం' అంటాడు. కానీ.. ఆయనకు చెమటలు పడుతూ ఉంటాయి. దీంతో అనసూయ అయ్యో.. చెమటలు ఏంటి ఇలా పడుతున్నాయి అంటుంది. దీనికాయన పక్కన టాబ్లెట్ ఉంది. తీసి ఇవ్వు అంటాడు. అది ఇవ్వగానే వేసుకుంటాడు.

క్లయింట్‌ను కలిసే టైం లేకుండా
ఇక, తర్వాత రోజు ఉదయం 11:30 గంటలు అవుతుంది. అప్పుడు సామ్రాట్ నిద్ర లేస్తాడు. అప్పుడు '10 గంటలకే మీటింగ్ కదా. తులసి గారు నన్ను ఎందుకు లేపలేదు' అని ఆమె రూమ్ తలుపు తడుతాడు. కానీ, తులసి రూమ్‌కు డోర్ లాక్ వేసి ఉంటుంది. ఆమె ఎక్కడికి వెళ్లింది అని అనుకుంటాడు. తర్వాత 'అవును.. నందు ఏం చేస్తున్నాడు' అని వెళ్లి వాళ్ల డోర్ కొడతాడు. లాస్య డోర్ తీస్తుంది. ఏదైనా ప్రాబ్లమా సార్ అంటుంది. అప్పుడు సామ్రాట్ 'టైమ్ ఎంతైందో తెలుసా? 11.30 గంటలు. క్లయింట్‌తో మన మీటింగ్ 10 గంటలకే' అంటాడు. అప్పుడు లాస్య 'మీరు మీటింగ్ కు వెళ్లి వచ్చారా' అని అడుగుతుంది. దీనికి సామ్రాట్ ఏంటి వెళ్లేది.. నేను ఇప్పుడే లేచాను అంటాడు.

తులసిపై నందూ, లాస్య కోపం
సామ్రాట్ ఆ మాట చెప్పగానే లాస్య 'మరి తులసి అయినా నిద్రలేపాలి కదా' అంటుంది. ఇంతలో తులసి అక్కడికి వస్తుంది. అప్పుడు సామ్రాట్ ఏమైపోయారు తులసి గారు అని అడుగుతాడు. దీంతో 'మీటింగ్‌కు వెళ్లి వచ్చాను. మిమ్మల్ని నిద్రలేపడానికి చాలా ప్రయత్నించాను. కానీ, మీరు ఎవ్వరూ నిద్రలేవలేదు. అందుకే నేను వెళ్లి మన ప్రపోజల్‌ను చెప్పి వచ్చాను' అంటుంది. దీంతో నందూ, లాస్య ఆమెకు చదువు రాదని అంటూ నానా మాటలు తిడతారు. దీంతో సామ్రాట్ 'మీరు చేసిన ప్రయత్నం గొప్పదే కానీ' అని ఏదో అంటుంటాడు. అప్పుడు తులసి 'తప్పు నాదే క్షమించండి. చదువు రాని దాన్ని వెళ్లకుండా ఉండాల్సి' అని వెళ్లిపోతుంది. తర్వాత క్లయింట్ నుంచి ఫోన్ వస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











