For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi August 21st Episode: అభికి యాక్సిడెంట్.. ఫ్యాక్టరీలో తులసికి ఘోర అవమానం

  |

  మిగిలిన భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూ.. దివ్యను మర్చిపోడానికి లాస్యనే కారణం అయి ఉండొచ్చని శృతి ప్రేమ్‌తో చెబుతుంది. అప్పుడు అది విన్న అంకిత ఆమెను నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది. అప్పుడు ప్రేమ్ వదినపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతాడు.

  ఇంట్లో జరిగిన పెద్ద గొడవ తర్వాత నందూ.. దివ్య గురించి ఆలోచించి తన తప్పును తెలుసుకుంటాడు. ఆమె దగ్గరకు వెళ్లి సారీ చెబుతాడు. అప్పుడు తల్లికి సపోర్టుగా మాట్లాడి.. తండ్రిని ఆలోచించమని చెబుతుంది దివ్య. ఆ తర్వాత లాస్య గురించి నిజం తెలుసుకున్న తులసి.. ఆమె పీక పట్టుకుని నొక్కేస్తుంది.

  ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న రాశీ ఖన్నా హాట్ సెల్ఫీ: గతంలో చూడని విధంగా అందాల ఆరబోత

  నా వాళ్ల జోలికి రావొద్దని చెప్పా కదా

  నా వాళ్ల జోలికి రావొద్దని చెప్పా కదా

  లాస్యను పీక నొక్కిన తర్వాత తులసి ఆమెకు అదిరిపోయే వార్నింగ్ ఇవ్వడంతో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. ‘నా మీద కోపం ఉంటే.. అది నా మీదే చూపించు. మా ఇంట్లో వాళ్లు ఏం చేశారు? మరోసారి వాళ్ల జోలికి వెళ్తే బాగోదు. అది తెలియడం కోసమే ఇప్పుడు నీకీ గతి పట్టించాను. ఇంకోసారి నా పిల్లల జోలికి కానీ, నా అత్తమామల జోలికి కానీ వచ్చావంటే.. ఇది ట్రయల్ మాత్రమే.. అసలైంది అప్పుడు చూపిస్తాను' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి. దీంతో లాస్య భయాందోళనలకు గురై బిక్కు బిక్కుమంటూ అక్కడే కూర్చుండిపోతుంది.

  ఆడవాళ్లపై అభి స్టేట్‌మెంట్స్... ముద్దు

  ఆడవాళ్లపై అభి స్టేట్‌మెంట్స్... ముద్దు

  ఆస్పత్రికి వెళ్లడానికి రెడీ అవుతోన్న అభి దగ్గరకు వచ్చిన అంకిత.. అతడికి నిరాశగా సెండాఫ్ ఇస్తుంది. దీంతో ఏమైందని భార్యను ప్రశ్నించగా.. తనతో టైమ్ స్పెండ్ చేయడం లేదని అంటుంది. అప్పుడు అభి ‘మీ ఆడవాళ్లు ఇంతే అంకిత. జాబ్ లేకపోతే లేదు అంటారు.

  జాబ్ చేస్తే టైమ్ స్పెండ్ చేయట్లేదు అంటారు. డబ్బు సంపాదించకపోతే చేతకాదు అంటారు. సంపాదిస్తుంటే డబ్బు మనిషి అయ్యాడు అంటారు. అవును నీక్కూడ డిగ్రీ ఉందిగా ఏదైనా ఆస్పత్రిలో జాబ్ చేయొచ్చుగా' అని అంటాడు. అంతేకాదు, ఓ మాట చెబుతానని పిలిచి ఆమెకు ముద్దు కూడా పెడతాడు.

  టాప్‌ను కిందకు జరిపి షాకిచ్చిన భూమిక: మరీ ఇంత ఘాటుగానా.. ఆమెనిలా చేస్తే తట్టుకోలేరు!

  తులసి మాటకు ఎదురుచెప్పిన అంకిత

  తులసి మాటకు ఎదురుచెప్పిన అంకిత

  అభి ముద్దు పెట్టి వస్తుండడంతో అంకిత అతడిని వెంబడిస్తూ వస్తుంది. అంతలో తులసి అక్కడకు వస్తుంది. వచ్చి రాగానే ‘నాన్న అభి రేపు ఎలాంటి పనులు పెట్టుకోకు. రేపు వరలక్ష్మీ వ్రతం ఉంది. అంకిత అది చేయాలి. అప్పుడు నువ్వు పక్కనే ఉండాలి. ఇది భర్త బాగు కోసం చేస్తారు' అని అంటుంది. అప్పుడు అంకిత ‘వ్రతం చేయకపోతే అభికి ఏమైనా అవుతుందా? పూజలకు జీవితాలకు ముడిపెట్టకండి ఆంటీ. మా ఇంట్లో ఇలాంటివి చేయరు. మేము ప్రాక్టికల్‌గా ఆలోచిస్తాము. నాకు ఇష్టం లేని పనిని నాతో చేయించాలని చూడకండి' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

  ఫ్యాక్టరీలో తులసికి అవమానం జరిగేలా

  ఫ్యాక్టరీలో తులసికి అవమానం జరిగేలా

  తులసి తన పీక పట్టుకుని నొక్కిన విషయాన్ని లాస్య, భాగ్యకు చెబుతుంది. అప్పుడామె ‘ఏంటి తులసక్క నీ పీక పట్టుకుందా? అప్పుడు మెడ పట్టుకుని గెంటేసింది. ఇప్పుడు అదే పట్టుకుని నిన్ను చంపాలని చూసింది. తులసక్క మునపటిలా లేదు లాస్య.. అన్నింటికీ కస్సుమని లేస్తుంది' అని అంటుంది.

  దీనికి లాస్య ‘అవును భాగ్య. నా పీకే పట్టుకుంటుందా? తన ఫ్యాక్టరీలోనే తన పరువు పోయేలా చేస్తాను. ఏది చూసుకునైతే తను ఇంతలా రెచ్చిపోతుందో.. అవన్నీ ఆమెకు దూరం చేస్తాను. ఒంటరిగా ఏడుస్తూ కూర్చునేలా చేస్తాను' అంటూ ప్లాన్ చేస్తుంది.

  హాట్ ఫొటోతో హీటు పెంచిన లెజెండ్ హీరోయిన్: అరాచకమైన ఫోజుతో రెచ్చిపోయిన భామ

  బాధపడిన తులసి.. అభికి యాక్సిడెంట్

  బాధపడిన తులసి.. అభికి యాక్సిడెంట్

  పూజ చేయడానికి అంకిత ఒప్పుకోని విషయాన్ని గుర్తు చేసుకుంటూ తులసి తనలో తానే బాధ పడుతూ ఉంటుంది. అప్పుడు పరందామయ్య ‘ఏంటమ్మా తులసి.. అంకిత అన్న మాటల గురించి ఆలోచిస్తూ బాధ పడుతున్నావా? మన మాట వినేవాళ్లు, బాధ్యతగా ఉండేవాళ్లు ఏమైనా అంటే బాధ పడాలి. అంకిత మాటలకు ఎందుకమ్మా ఫీల్ అవడం. వాళ్లకు సంప్రదాయాలు తెలీదు.. అందుకే ఇలా మాట్లాడుతున్నారు' అని అంటాడు. అది జరిగిన కొద్ది సేపటికి అభికి యాక్సిడెంట్ అవుతుంది. చేతికి కట్టుతో అతడు ఇంటికి చేరుకుంటాడు. దీంతో అంకిత చాలా బాధ పడుతుంది.

  పెళ్లాన్నే వదిలేశావ్.. లాస్యను వదలవా?

  పెళ్లాన్నే వదిలేశావ్.. లాస్యను వదలవా?

  అభికి యాక్సిడెంట్ అయిన తర్వాత అంకితను పూజ చేయమని తులసి అడుగుతుంది. అప్పుడు అనసూయ వచ్చి తులసికి పూజా చేసే అర్హత లేదని దెప్పిపొడుస్తుంది. అంతలో ప్రేమ్ ‘లాస్యకు కూడా పూజా చేసే అర్హత లేదు' అంటూ ఆమెను ఇందులోకి లాగులాడు. అప్పుడు నందూ ఎంట్రీ ఇవ్వడంతో పెద్ద గొడవ జరుగుతుంది. దీంతో ప్రేమ్ ‘లాస్య మీతో ఎప్పటికీ ఉంటుందని గ్యారెంటీ ఏంటి' అంటాడు. ఆ సమయంలోనే పరందామయ్య ‘పాతికేళ్లు కాపురం చేసిన భార్యనే వదిలేశావ్. మధ్యలో వచ్చిన లాస్యను వదిలేయవని గ్యారెంటీ' అంటూ నందూను ప్రశ్నిస్తాడు.

  సెక్స్ లేకుండా ఉండలేవా: శృతి హాసన్‌కు నెటిజన్ సూటి ప్రశ్న.. చీకట్లో ఉంటే అంటూ షాకింగ్ ఆన్సర్!

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  నా వల్లే అభికి యాక్సిడెంట్ అయిందా?

  నా వల్లే అభికి యాక్సిడెంట్ అయిందా?

  పరందామయ్య మాటలకు నందూ సమాధానాలు చెప్పలేకపోతాడు. ఆ తర్వాత ‘ఏరా అభి.. ఆ పూజా ఏదో చేసేయండి. ఇలాంటివి ఇంకెప్పుడూ జరగవు' అంటాడాయన. దీంతో అంకిత ‘అంటే ఏంటి తాతయ్య? పూజ చేయనన్నానని యాక్సిడెంట్ అయిందా? ఇదంతా ఫూలిష్' అంటూ సమాధానం చెబుతుంది. దీనికి తులసి ‘అలా ఏం కాదమ్మా.. పూజలు చేసుకుంటే అంతా మంచే జరుగుతుందని నమ్మకం. అందుకే ప్రతి ఒక్కరూ ఈ పూజ చేస్తారు. అందుకే నిన్ను కూడా చేయమంటున్నా' అని వివరిస్తుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 404: Ankitha Denied Tulasi Varalakshmi Pooja Request. Then Abhi Met An Accident. After That Big Fight Between Nandhu and Prem
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X