For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తులసి గురించి నిజం తెలుసుకున్న సామ్రాట్.. అంతలోనే ఊహించని షాక్

  |

  చాలా భాషలతో పోల్చుకుని చూస్తే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి మరి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. హోటల్‌కు వచ్చిన తర్వాత నందూ, సామ్రాట్ తాగిన మైకంలో చాలా ఓవర్ యాక్షన్ చేస్తారు. దీంతో తులసి పెరుగు కోసం, లాస్య రూమ్ తాళం కోసం కిందకు వెళ్తారు. ఆ సమయంలో అన్నా తమ్ముడు అంటూ నందూ సామ్రాట్ మాట్లాడుకుంటారు. అప్పుడు సామ్రాట్‌ తనకు తులసి అంటే ఇష్టమని చెప్తాడు. దీంతో నందూ తనను పెళ్లి చేసుకోవద్దని, ఆమె తన మాజీ భార్య అని చెప్తాడు. కానీ, సామ్రాట్ మాత్రం తెగిన గాలిపటం అంటూ ఏదేదో మాట్లాడతాడు. క్లయింట్లతో మీటింగ్‌కు తులసి వెళ్లి రావడంతో నందూ, లాస్య ఆమెపై ఫైర్ అవుతారు.

  Amit Shah With NTR: ఎన్టీఆర్, అమిత్ షా భేటీ సీక్రెట్ ఇదే.. ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారంటే!

  గుడ్ న్యూస్‌ను చెప్పిన క్లయింట్

  గుడ్ న్యూస్‌ను చెప్పిన క్లయింట్


  తులసి మీటింగ్‌కు వెళ్లొచ్చిన తర్వాత క్లయింట్ సామ్రాట్‌కు ఫోన్ చేస్తాడు. అప్పుడు ఆ కాల్‌ను నందూ రిసీవ్ చేసుకుంటా అంటాడు. కానీ, సామ్రాట్ నేనే తీస్తా అని లిప్ట్ చేస్తాడు. అప్పుడు సారీ నేను మీటింగ్ కు రాలేకపోయాను అంటాడు. దీంతో క్లయింట్ 'నో ప్రాబ్లమ్.. తులసి గారు ప్రజంటేషన్ అద్భుతంగా ఇచ్చారు. మనం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం. కంగ్రాచ్యులేషన్స్'. దీనికి సామ్రాట్‌కు ఏం మాట్లాడాలో అర్థం కాదు. కాల్ కట్ చేసిన తర్వాత క్లయింట్ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పాడు అని సామ్రాట్.. నందూ, లాస్యతో అంటాడు. దీంతో వాళ్లిద్దరూ ఒక్కసారిగా షాక్‌కు గురవుతారు.

  తులసికి సారీ చెప్పిన సామ్రాట్

  తులసికి సారీ చెప్పిన సామ్రాట్

  ప్రాజెక్టు ఓకే అవగానే సామ్రాట్ 'మనం తులసితో కొంచెం ర్యాష్‌గా మాట్లాడాం. పదండి.. తనకు సారీ చెబుదాం' అని నందూ, లాస్యను ఆమె రూమ్‌కు తీసుకెళ్తాడు. కాలింగ్ బెల్ కొట్టగానే డోర్ తీసి తులసి లోపలికి వెళ్లిపోతుంది. అప్పుడు సామ్రాట్ 'సారీ తులసి గారు. మీ గురించి తెలిసి కూడా నేను తొందరపడ్డాను. నీ నిజాయితీ, వ్యక్తిత్వాన్ని తెలిసి కూడా వీళ్లతో మాట కలిపాను. నిజానికి మీ ప్రజెంటేషన్‌తో మన కంపెనీకి మంచి ప్రాజెక్ట్ వచ్చేలా చేశారు. కంగ్రాచ్యులేషన్స్. అదేంటండీ నేను సారీ చెప్పినా ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోయారు' అంటాడు.

  బికినీ సైజ్ తగ్గించిన పూనమ్ బజ్వా: వామ్మో ఇదేం దారుణం సామీ!

  అందరికీ కలిపి క్లాస్ పీకేసిందిగా

  అందరికీ కలిపి క్లాస్ పీకేసిందిగా


  సామ్రాట్ మాటలకు తులిస 'నాకు అనుభవం లేదు. అర్హత లేని బాధ్యత తీసుకున్నాను. సిన్సియర్‌గా నేను మీ అందరినీ నిద్రలేపడానికి నా శాయశక్తులా ప్రయత్నించాను. మా ఇంట్లో ఎవరైనా ఏ పని అయినా చేయకపోతే నా బాధ్యతగా నేను చేస్తాను. మీటింగ్ విషయంలోనూ అలాగే చేశాను' అంటుంది. అప్పుడు సామ్రాట్ మీరు చేసింది మంచి పనే తులసి గారు. మన ప్రాజెక్టు ఓకే అయింది అంటాడు. అప్పుడామె 'ప్రాజెక్ట్ ఓకే అయింది కాబట్టి నా డోర్ కొట్టారు. కంగ్రాట్స్ చెబుతున్నారు. మరి ప్రాజెక్ట్ ఓకే కాకపోతే ఏంటి పరిస్థితి' అంటూ వాళ్లందరికీ క్లాస్ పీకుతుంది.

  నందూ, లాస్య సారీ.. ఛాన్స్ ఇచ్చి

  నందూ, లాస్య సారీ.. ఛాన్స్ ఇచ్చి

  తులసి మాట్లాడిన మాటలకు సామ్రాట్ 'బాస్ అనే వాడు కూడా మనిషే. మేము తప్పులు చేస్తాం. ఇంకోసారి మిమ్మల్ని ఏ విషయంలోనూ వేలెత్తి చూపించం' అని అంటాడు. అలాగే.. నందూ, లాస్యను తులసికి సారీ చెప్పమని ఆర్డర్ వేస్తాడు. ఆ సమయంలో తులసి 'నాకు ఎవ్వరి నుంచి సారీ అవసరం లేదు. కొంచెం ఆచీతూచీ మాట్లాడితే చాలు' అంటుంది. ఆ తర్వాత సామ్రాట్ 'మీకు ఇక నుంచి ఫ్రీ హాండ్ ఇస్తున్నా. మీరు ఏది చేయాలనుకుంటే అది చేయొచ్చు. మన ప్రాజెక్ట్ ఓకే అయిన సందర్భంగా నేను మీకు అందరికీ గ్రాండ్‌గా పార్టీ ఇస్తున్నా' అంటాడు.

  ఊహించని విధంగా అనన్య నాగళ్ల హాట్ షో: ఈ వీడియోలో ఆమెను చూశారంటే!

   పరందామయ్యకు గుండె నొప్పి

  పరందామయ్యకు గుండె నొప్పి


  మరోవైపు, అనసూయ చేసిన కాఫీ పరందామయ్యకు నచ్చుతుంది. దీంతో కాఫీ నువ్వే చేశావా అని అడుగుతాడు. అప్పుడు ప్రేమ్ ఎందుకు తాతయ్య అంటాడు. దీంతో పరందామయ్య 'మీ నానమ్మతో ఇదే సమస్య. ఒళ్లు వంగదు కానీ.. వంట మాత్రం అద్భుతంగా చేస్తుంది' అంటాడు. తర్వాత తులసి మీద బెంగ పెట్టుకున్నానని అనసూయ అంటుంది. ఇంతలో పరందామయ్యకు మళ్లీ గుండెలో నొప్పి మొదలవుతుంది. ఇంతలో అందరూ ఆయన దగ్గరికి వెళ్తారు. ఏమైంది అనగానే అనసూయ గుండెనొప్పి అంటుంది. రాత్రి కూడా ఇలాగే ఇబ్బంది పడ్డాడు అంటుంది.

   నందూ, సామ్రాట్ మళ్లీ కలిసి

  నందూ, సామ్రాట్ మళ్లీ కలిసి


  తులసి గురించి సామ్రాట్ ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో నందూ అక్కడకు వస్తాడు. అప్పుడు సామ్రాట్ అతడితో మాట్లాడతాడు. 'మనిద్దరం రాత్రి తాగిన తర్వాత ఏం మాట్లాడుకున్నామో నీకు గుర్తుందా' అని అడుగుతాడు. అప్పుడు నందూ 'నాకేమీ గుర్తు లేదు. కానీ, రాత్రి మనిద్దరం ఇక్కడే కూర్చొని ఏదో మాట్లాడుకున్నాం' అంటాడు. అప్పుడు సామ్రాట్ 'నువ్వు ఏదో విషయంలో నాకు మాటిచ్చినట్టుగా గుర్తు' అంటాడు. అలా ఇద్దరూ మాట్లాడుతుండగా లాస్య వస్తుంది. దీంతో ఆమెను అడుగుతారు. కానీ, లాస్య మాత్రం ఆ రచ్చ గురించి ఎందుకని వదిలేయమంటుంది.

  తల్లైన వెంటనే సోనమ్ కపూర్ షాకింగ్ పోస్ట్: అసలు ఇష్టం లేకుండానే అంటూ!

  తులసికి చెప్పగానే వచ్చేసింది

  తులసికి చెప్పగానే వచ్చేసింది


  పరందామయ్యకు గుండె నొప్పి వచ్చిన విషయాన్ని ఫోన్ చేసి ప్రేమ్.. తులసికి చెప్తాడు. దీంతో ఆమె సామ్రాట్ దగ్గరికి వచ్చి 'మా మామయ్య గారికి ఒంట్లో బాగోలేదంట. గుండెల్లో నొప్పి ఉందంట. నేను వెంటనే బయలుదేరాలి' అని అంటుంది. దీంతో నందూ, లాస్య షాక్ అవుతారు. అప్పుడు నందూ మేము కూడా వస్తాం అంటాడు. దీంతో సామ్రాట్ 'వచ్చిన పని అయిపోయింది కదా. అందరం బయలుదేరుదాం' అంటాడు. ఆ వెంటనే విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు. తులసి పరిగెత్తుకుంటూ వస్తుంది. తనతో పాటు నందు, లాస్య కూడా వస్తారు. తర్వాత పరందామయ్యకు గ్యాస్ పెయిన్ వచ్చిందని చెప్తారు. దీంతో తులసి ఊపిరి పీల్చుకుంటుంది. అక్కడే ఉన్న నందూ, లాస్య కామ్ అవుతారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 717: Samrat, Nandhu and Lasya Apology to Tulasi for Misunderstanding her. After That Tulasi Went Back to her Home.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X