Intinti Gruhalakshmi: అత్త తిక్క కుదిర్చిన దివ్య.. ప్రాణ గండం అంటూ పంతులు షాక్.. కథలో మలుపులు
జనరేషన్లు చేంజ్ అవుతున్నా.. కొత్త కొత్త వెబ్ సిరీస్‌లు వస్తున్నా తెలుగు బుల్లితెరపై వస్తున్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే:మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూ నెట్టేయడంతో కింద పడి గాయపడిన లక్కీకి తులసి గోరుముద్దలు పెడుతూ.. అసలేమైందో అడుగుతుంది. ఆ చిన్నారి నందూ తప్పు లేదని చెప్తాడు. అయినా తులసి మాత్రం నందూనే తిడుతుంది. ఇదంతా చూస్తున్న నందూను పరందామయ్య వాళ్లు పిలిచి క్లాస్ పీకడంతో పాటు తులసిని లైన్‌లో పెట్టమని చెప్తారు. ఇక, క్యాంటీన్‌లో ఉన్న తులసిని కలిసి ఓ నర్స్ తన కొడుకు ఆపరేషన్ గురించి చెప్తుంది. అప్పుడామె ఈ విషయాన్ని దివ్యకు చెప్పి ఓ ప్లాన్ కూడా వివరిస్తుంది. దీంతో దివ్య ఇంట్లో దాన్ని అమలు చేయబోతుంది.

మామను నడిపించాలని ప్లాన్:మామ ప్రకాశం దగ్గరకు వెళ్లిన దివ్య 'మీకు మందులు బాగా పని చేశాయి మామయ్యా. మీ మాట కూడా స్పష్టంగా వస్తుంది' అని అంటుంది. దీంతో ప్రకాశం 'పని చేసింది మందులు కాదమ్మా. నువ్విచ్చిన ధైర్యం' అంటాడు. దీనికామె 'అబ్బా ఊరుకోండి మామయ్యా.. ఇప్పుడు మనం నెక్స్ట్ లెవల్ ప్రాక్టీస్ చేయాలి. లేచి నడవాలి' అంటుంది. దీంతో ప్రకాశం 'అమ్మో నడవడమా? నా వల్ల కాదమ్మా.. కొద్ది రోజులు ఆగమ్మా'.. అనగా.. 'అయ్యో మామయ్యా నేను ఉన్నా కదా.. మీకెందుకు భయం' అని భరోసా కల్పించేలా మాట్లాడుతుంది.
దివ్యకు సపోర్టు చేసిన విక్రమ్:తండ్రి మాటలకు విక్రమ్ 'మీ పెద్ద కోడలు అంతలా ధైర్యం చెప్తుంటే.. ఎందుకు నాన్నా భయపడతావు. మీకు నడవాలని ఆశ లేదా' అని అడుగుతాడు. దీనికి ప్రకాశం నడవాలని లేకపోవడం ఏంట్రా.. నాకైతే ఏకంగా పరుగుపెట్టాలని ఉంది అంటాడు. దీనికి విక్రమ్ 'మరే నాన్నా.. దివ్య డాక్టర్ అది మర్చిపోకండి' అని అంటాడు. దీంతో దివ్య 'చూశారా.. మీ అబ్బాయి కూడా చెప్పాడు.. మీరిక లేవాల్సిందే' అంటూ మామను బలవంతంగా వీల్ చైర్ నుంచి లేపి నిలబెడుతుంది. కోడలు ఇచ్చిన ధైర్యంతో ప్రకాశం లేచి అడుగు వేస్తుంటాడు. అది చూసి విక్రమ్ సంతోషిస్తాడు.

అత్తకు చావును చూపించేలా:ప్రకాశం నడుస్తుండగా.. రాజ్యలక్ష్మి అక్కడకు వస్తుంది. అప్పుడు దివ్య చెప్పినట్లుగా ప్రియ బాల్కనీలో నుంచి పూలకుండీని అత్త పక్కన పడేలా విసిరేస్తుంది. దీంతో విక్రమ్ పరుగు పరుగున తల్లి దగ్గరకు వస్తాడు. అప్పుడే దివ్య తన ప్లాన్‌ను అమలు చేస్తుంది. 'ఇంటికి ఏదో శని పట్టింది. జాతకంలో ఏదో దోషం ఉంటేనే ఇలాంటివి జరుగుతాయి. మనం పంతులు గారిని పిలిపించి. శాంతి జరిపిద్దాం' అంటుంది. అప్పుడు రాజ్యలక్ష్మి వద్దని చెప్తున్నా విక్రమ్ 'అమ్మ అలాగే అంటుంది కానీ.. నువ్వు వెంటనే పంతుల్ని పిలిపించి.. దోషానికి పరిష్కారం ఆలోచించు దివ్యా' అంటాడు.

పంతులు వచ్చి షాకిచ్చాడు:అనుకున్నట్లుగానే పంతులును దివ్య పిలిపిస్తుంది. దీంతో అందరూ కూర్చుని ఉంటారు. అప్పుడు రాజ్యలక్ష్మి వైపు చూసిన దివ్య ఇదంతా తన ప్లానే అన్నట్లుగా సైగలు చేస్తుంది. అనంతరం దివ్య సైగ చేయగానే పంతులు ప్లాన్ షురూ చేస్తాడు. అప్పుడు రాజ్యలక్ష్మి 'ఇదేదో ప్లాన్ వేసి పంతుల్ని పిలిపించింది. గట్టిగా మాట్లాడితే.. ఈ పంతులు నా చరిత్ర మొత్తం బయటపెడతాడు' అని ఆగిపోతుంది. అప్పుడు పంతులు 'గ్రహాలు కుదురుగా లేవు.. రాజ్యలక్ష్మికి దోషం ఉంది' అంటాడు. దీంతో విక్రమ్ 'అవునా.. అయితే దీక్షలు చేయడానికి నేను సిద్దంగా ఉన్నా' అంటాడు.

పరిహారం చేయాల్సింది తనే:విక్రమ్ మాటలకు పంతులు 'అమ్మగారికి మంగళదోషం మొదలైంది. వెంటనే దోష నివారణ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం. ప్రాణ గండాలు వెంట వెంటనే తరుముకుంటూ వస్తాయి' అని చెప్తాడు. దీంతో దివ్య 'అయితే పరిహారం ఎవరు చేయాలి? అత్తయ్య చేయాలా' అని అడగ్గా.. పంతులు 'పరిహారం చేయాల్సింది రాజ్యలక్ష్మి కాదు.. ఆమె కొడుకు. అది కూడా సంజయ్' అని అంటాడు. దీంతో సంజయ్ షాక్ అవగా.. విక్రమ్ 'అదేంటి పంతులు గారూ.. పెద్ద కొడుకును నేను ఉండగా సంజయ్ చేయడం ఏంటి' అని ప్రశ్నిస్తాడు.

దెబ్బకు కింద పడిపోయాడు:విక్రమ్ ప్రశ్నించగానే పంతులు 'మీరు పెద్ద కొడుకే కావచ్చు.. కానీ శాస్త్రం ప్రకారం పరిహారం చేయాల్సింది రక్తం పంచుకుని పుట్టిన కొడుకు' అని అంటాడు. ఆ తర్వాత దివ్య ఏం చేయాలని అడగ్గా.. '101 రోజుల పాటు శివారాధన చేయాలి. ఆ 101 రోజులూ 101 శివుడి గుడిలు తిరిగి రావాలి' అని అంటాడు. దీంతో ప్రియ 'అప్పుడు నాతో చేయించారు కదా.. ఇప్పుడు మీ రోగం కుదురుతుంది' అని సంతోషిస్తుంది. అప్పుడే సంజయ్ అయితే చచ్చాన్రా దేవుడా అని కళ్లు తిరిగిపడతాడు. అయినా ఆ పంతులు మాత్రం పరిహాయం చేయాల్సినవి చాలా ఉన్నాయంటాడు.

అమ్మ కోసం ఏదైనా చేస్తాం:పంతులుతో దివ్య 'ఏం చేయాలన్నా చెప్పండి. సంజయ్ వాళ్ల అమ్మ కోసం అన్నీ చేస్తాడు' అంటుంది. దీనికాయన 'ప్రతిరోజూ ఉదయం సాయత్రం చన్నీళ్ల స్నానం చేయాలి. 101 బిందెలతో శివుడుకి అభిషేకం చేయాలి. రెండూ పూటలా కూడా.. పళ్లు పచ్చి కూరలే తినాలి. నేలపై కూర్చునే తినాలి. నేలపైనే పడుకోవాలి. ఎలాంటి భోగాలు అనుభవించకూడదు' అని చెప్తాడు. దీంతో విక్రమ్ 'మా అమ్మ కోసం మా తమ్ముడు అన్నీ మీరు చెప్పినట్టే చేస్తాడు.. అమ్మకంటే మాకు ఏదీ ఎక్కువ కాదు.. పంతులు గారూ మీరు ఏర్పాట్లు చేసుకోండి' అని వెళ్లిపోతాడు. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











