For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi August 24th Episode: ఇంట్లో అంకితకు అవమానం.. లాస్య ప్లాన్‌కు చెక్ పెట్టిన శృతి

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పూజ గురించి మాట్లాడినందుకు శృతిని అనసూయ తీవ్ర స్థాయిలో అవమానిస్తుంది. దీంతో ఆమె ఎంతగానో బాధ పడగా.. తులసి, ప్రేమ్ ధైర్యం చెబుతూ ఓదార్చుతారు. ఆ తర్వాత లాస్య.. ఇంట్లో పూజను ఎలాగైనా ఆపాలని ప్లాన్ చేస్తున్నట్లు భాగ్యకు చెబుతుంది. అయితే, తులసి మాత్రం పంతులుకు ఫోన్ చేసి సమయానికి రమ్మని అడగగా.. ఆయన సరే అంటాడు. ఇక, అంకిత పూజ కోసం చీర కట్టుకుని కనిపిస్తుంది. దీంతో అభి ఆమెను చూసి ఎంతగానో మురిసిపోతాడు. ఇక, పూజకు అన్నీ సిద్ధం చేస్తుంటారు.

  బిగ్ బేబీ బ్రదర్‌తో నిహారిక సందడి: సర్‌ప్రైజ్‌ చేసి సస్పెన్స్‌గా ఉంచి.. మెగా కిడ్‌ను గుర్తుపట్టారా!

  రెచ్చగొట్టిన భాగ్య... శృతికి అవమానం

  రెచ్చగొట్టిన భాగ్య... శృతికి అవమానం

  శృతి చీర కట్టుకుని రావడంతో అందరూ ఆమెను పొగుడుతుంటారు. మాధవి కూడా చక్కగా ఉన్నావని అంటుంది. అంతలో అక్కడకు వచ్చిన భాగ్య.. ‘అదేంటి మాధవి.. శృతిని అంతలా పొగిడేస్తున్నావ్? అంకిత కూడా చక్కగా చీర కట్టుకునే ఉంది కదా' అని అంటుంది. దీంతో అంకితకు కోపం వస్తుంది. అప్పుడు మాధవి, తులసి అంకితను కూడా పొగుడుతారు. దీంతో ‘అడిగించుకుని మరీ పొగిడించుకున్నట్లు ఉంది' అని అనుకుంటుందామె. ఇక, చివర్లో శృతిని భాగ్య, అంకిత అవమానించేలా మాట్లాడతారు. దీంతో ఆమె బాధ పడుతూ వెళ్లిపోతుంది.

  పూజారికి యాక్సిడెంట్.. తులసి ఢీలా

  పూజారికి యాక్సిడెంట్.. తులసి ఢీలా

  పూజకు సమయం దగ్గర పడడంతో పూజారి కోసం అందరూ వేచి చూస్తుంటారు. అంతలో ఆయనకు యాక్సిడెంట్ అయినట్లు సమాచారం తెలుస్తుంది. దీంతో తులసి ఎంతో కంగారు పడిపోతుంది. అప్పుడు ప్రేమ్, మాధవి ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారు. అందుకోసం వేరే పంతులును మాట్లాడదామని అంటారు. కానీ, తులసి మాత్రం ‘ఇంట్లో పూజ చేయిద్దామని అనుకుంటే ఇలా జరిగేందేంటి' అని ఢీలా పడిపోతుంది. ఆ తర్వాత అమ్మవారి ముందుకు వెళ్లి తన పరిస్థితిని వివరించి బాధ పడుతుంది. అంతా సవ్యంగా జరిగేలా చూడమని దేవతను కోరకుంటుంది.

  ఏకాంతంగా ఒకే ఇంట్లో సినీ జంట ఎంజాయ్: అతడు బట్టల్లేకుండా.. ఆమె ప్రైవేట్ ఫొటోలు బయటకు!

  పూజారికి యాక్సిడెంట్.. లాస్య పనితో

  పూజారికి యాక్సిడెంట్.. లాస్య పనితో

  పూజారికి యాక్సిండెంట్ అయిన తర్వాత తులసి అమ్మవారిని ప్రార్ధించి వస్తుండగా.. లాస్య అక్కడే కనిపిస్తుంది. అప్పుడు ‘ఏంటి తులసి? నువ్వు ఏది అనుకున్నా సవ్యంగా జరగడం లేదు.. పాపం పూజారికి యాక్సిడెంట్ అయిందంటగా' అని అడుగుతుంది. దీనికి తులసి ‘అవును.. నీకెలా తెలుసు' అని ప్రశ్నిస్తుంది. అప్పుడు లాస్య ‘ఆ యాక్సిడెంట్ మామూలుగా జరిగిందో.. ఎవరి వల్లైనా జరిగిందో.. ఏంటో తులసి నువ్వు ఒక్కోసారి ఏమీ చెప్పకపోయినా తెలుసుకుంటావు' అని అంటుంది. దీనికి ‘ఇంత దానికే నువ్వే గెలిచినట్లు కాదు. దేవుడు నా వైపు ఉన్నాడు' అంటుంది తులసి.

  లాస్య ప్లాన్‌తో కష్టాలు.. తలో మాటతో

  లాస్య ప్లాన్‌తో కష్టాలు.. తలో మాటతో

  వరలక్ష్మీ వ్రతం కావడంతో ఎంతో మందిని పూజారులను సంప్రదించినా.. ఉపయోగం ఉండదు. దీంతో తులసి ఎంతగానో కంగారు పడుతుంది. మరోపక్క ప్రేమ్ వచ్చి ఇవాళ అందరూ బిజీగా ఉన్నారంట అని తల్లికి చెబుతాడు. అప్పుడు నందూ ‘పూజ ఈ కారణంతో కూడా ఆగిపోతుందని ఇప్పుడే చూస్తున్నా' అని అంటాడు. ఆ తర్వాత లాస్య, అనసూయ తులసిని నిందిస్తూ పూజా ఆమె వల్లే ఆగిపోయిందని అంటారు. ఆమెను తప్పుబడుతూ మాట్లాడుతుండగా.. పరందామయ్య కలుగజేసుకుని వాళ్లను వారిస్తాడు. దీంతో అందరూ సైలెంట్ అయిపోతారు.

  టాప్‌ను కిందకు జరిపి షాకిచ్చిన భూమిక: మరీ ఇంత ఘాటుగానా.. ఆమెనిలా చేస్తే తట్టుకోలేరు!

  శృతి భరోసా.. పెద్ద రచ్చ.. తేల్చేసింది

  శృతి భరోసా.. పెద్ద రచ్చ.. తేల్చేసింది

  పూజారి గురించి అందరూ కంగారు పడుతుండగా.. ‘మీరు ఏమీ అనుకోను అంటే ఓ మాట చెబుతాను. వరలక్ష్మీ వ్రతం నేను చేస్తాను' అని అంటుంది. దీనికి అంకిత, లాస్య, అనసూయలు అడ్డు పడతారు. ఆడవాళ్లు వేదాలు చదవడం ఎక్కడైనా చూశారా అంటూ నిట్టూర్చుతారు. అప్పుడు తులసి మాట్లాడుతూ.. ‘మీరంతా ఆడవాళ్లు అయుండి.. ఆడవాళ్ల గురించే తప్పుగా మాట్లాడతారా? మనం పూజించే దేవుల్లంతా ఆడవాళ్లు కాదా? ఎందుకు చులకనగా మాట్లాడతారు' అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతుంది. దీంతో అందరూ తెల్లముఖం వేస్తారు. తర్వాత పూజా మొదలవుతుంది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  శృతి పని వల్ల చెడిపోయిన లాస్య ప్లాన్

  శృతి పని వల్ల చెడిపోయిన లాస్య ప్లాన్

  పూజారి లేకపోయినా వేద మంత్రాలు చదువుతూ పూజను ప్రారంభిస్తుంది శృతి. అన్నీ తానై చూసుకుంటూ అంకితతో వరలక్ష్మీ వ్రతాన్ని చేయిస్తుంటుంది. ఆ సమయంలో ఆడవాళ్లందరూ అక్కడ కూర్చుని ఆమె చెప్పినట్లు చేస్తుంటారు. ఇది చూసిన అభి, ప్రేమ్, నందూ, పరందామయ్యలు తెగ మురిసిపోతుంటారు. సరిగ్గా అప్పుడే లాస్య ‘పూజారి లేకుండా చేస్తే శృతి తగులుకుంది.. వేద మంత్రాలు చదవుతాను, పూజ చేయిస్తాను అని వచ్చింది. నా ప్లాన్ అంతా చెడగొట్టేసింది' తన మనసులో తానే అనుకుంటూ ఉంటుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 406: Shruthi Ready to Do Varalakshmi Pooja At Tulasi Home. That Time Anasuya, Lasya, Ankitha Denied This. But Tulasi Not Agree Their Statements
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X