Intinti Gruhalakshmi Today Episode: తులసిపై పెరిగిన అనుమానం.. అలా మాట్లాడడంతో అందరూ షాక్

సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పరందామయ్యను చూడ్డానికి వచ్చిన నందూ, లాస్యలు అనసూయను పక్కకు పిలిచి కొన్ని ఫొటోలను చూపిస్తారు. అందులో సామ్రాట్, తులసి సన్నిహితంగా ఉన్నది కనిపిస్తుంది. అప్పుడు అనసూయను నందూ భయపెట్టేలా మాట్లాడతాడు.

దీంతో అనసూయ ఆలోచనలో పడుతుంది. మరోవైపు, హనీ పని వాళ్ల మీద నీళ్లు చల్లుతూ ఉంటుంది. అది చూసిన సామ్రాట్ హనీ మీద కోప్పడకుండా పాపతో కలిసి ఆడుకుంటాడు. ఇక, శృతి తిరిగి రావడంతో అందరూ సంతోషంగా ఉంటారు. కానీ వాళ్లు ఎవరికి వారులా ఉంటారు.

ప్రేమ్, అభి మధ్య మొదలైన గొడవ

ప్రేమ్, అభి మధ్య మొదలైన గొడవ

పేపర్‌లో వచ్చిన ఆర్టికల్ చూసిన తర్వాత ప్రేమ్, అభి ఇద్దరూ గొడవ పెట్టుకుంటారు. అప్పుడు అభి 'మామ్ నాకు కూడా అమ్మే. నేను ఇప్పుడు ఆలోచించేది సొసైటీ గురించి. జనం అనుకునే నిందల గురించి. మాట్లాడవేంటి నానమ్మ. నువ్వు కూడా మామ్‌ను సపోర్ట్ చేస్తున్నావా? మామ్ చేసింది తప్పుగా అనిపించడం లేదా' అని అడుగుతాడు. అప్పుడు అనసూయకు అనసూయకు నందూ చూపించిన ఫోటోలే గుర్తొస్తాయి. అప్పుడు అభి 'మామ్ మీద, మన మీద జనం రాళ్లు వేస్తారా? వేయరా' అని అడుగుతాడ. దీంతో ప్రేమ్.. అభి మాటలను ఖండిస్తూ మాట్లాడతాడు.

తులసికి మద్దతులగా మాట్టాడుతూ

తులసికి మద్దతులగా మాట్టాడుతూ

అభి మాటలకు స్పందించిన శృతి 'ఎవరో ఫోటో తీసి ఆర్టికల్ రాశారని దాంట్లో ఆంటిని తప్పుపట్టడం ఎందుకు. అసలు నీ ఉద్దేశం ఏంటి.. ఆంటిని గడప దాటనీయొద్దా' అని సూటిగా ప్రశ్నిస్తుంది. అప్పుడు దివ్య కూడా కలగజేసుకుని 'రోడ్డు మీదకు వెళ్లే ఏ ఆడది అయినా ఇలాంటి సమస్యలు ఫేస్ చేయాల్సిందే అన్నయ్య.

ఆడవాళ్లు తమ కాళ్ల మీద నిలబడుతున్న ఈ రోజుల్లో ఇలాంటివి వస్తూనే ఉంటాయి' అంటుంది. అప్పుడు పరందామయ్య 'ఇన్నాళ్లకు మీ అమ్మకు స్వేచ్ఛ దొరికింది. మీ అమ్మను సంతోషంగా ఉండనీయండి' అని అంటాడు.

అభికి సపోర్ట్ చేసి షాకిచ్చి నానమ్మ

అభికి సపోర్ట్ చేసి షాకిచ్చి నానమ్మ

ఇంట్లో వాళ్లంతా మాట్లాడింది విన్నది అనసూయ 'వాడి ఉద్దేశం ఏంటో కూడా అర్థం చేసుకోవాలి కదా. ఎవరి మీద అయినా విషం కక్కాలి అనుకుంటే సమాజం ముందు ఉంటుంది. కాలికి బురద అంటుకున్న తర్వాత చెప్పులు వేసుకుంటే ఏంటి ఉపయోగం. ముందే అన్నీ చూసుకోవాలి కదా అని అభి అంటున్నాడు. నేను తులసిని నిందించడం లేదు.. కాళ్లకు సంకెళ్లు వేయాలని కాదు' అంటుంది. దీంతో అభి నేను అంటున్నది కూడా అదే నానమ్మ. నువ్వు ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావు అంటాడు. అప్పుడు దివ్య నీ మాటల్లో క్లారిటీ లేదు నానమ్మ అంటుంది.

తులసి ఎంటర్.. అబద్ధం చెప్పారు

తులసి ఎంటర్.. అబద్ధం చెప్పారు

అందరూ మాట్లాడుకున్న తర్వాత పరందామయ్య సీరియస్ అవుతాడు. ఇకపై గొడవ పడకండి అని చెప్పడంతో పాటు తులసి మీద వచ్చిన ఆర్టికల్ ఆమెకు చూపించకండి అంటాడు. దీంతో అభి 'అలా ఎందుకు తాతయ్య. మమ్మీకి తెలియాలి కదా' అంటాడు. అప్పుడు పరందామయ్య 'కానీ, వద్దు తనకు చూపించవద్దు. ఇది నా ఆర్డర్' అంటూ సీరియస్‌గా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంతలో తులసి వస్తుంది. అందరూ అలా సీరియస్‌గా ఉన్నారేంటి అని అడుగుతుంది. దీంతో వైకుంఠపాళి ఆడుదాం అంటున్నాడు అభి.. మేము వద్దన్నాం అని అబద్దం చెప్తాడు.

ఇంటికొచ్చి నిజం చెప్పిన సామ్రాట్

ఇంటికొచ్చి నిజం చెప్పిన సామ్రాట్

ఇంట్లో చర్చలు జరుగుతుండగానే సామ్రాట్‌.. తులసి ఇంటికి వస్తాడు. అప్పుడంతా షాక్ అవుతారు. అంతలో తులసి లోపలికి రమ్మని పిలుస్తుంది. దీంతో సామ్రాట్ మీతో కొంచెం పర్సనల్‌గా మాట్లాడాలి అంటాడు. అప్పుడు అభి 'మా ఇంట్లో ఏ విషయంలోనూ మా మధ్య దాపరికాలు, సీక్రెట్స్ ఉండవు సార్. ఏం మాట్లాడాలనుకున్నా మా ముందే మాట్లాడొచ్చు. మా మామ్ కూడా ఏం అనుకోదు' అంటాడు. దీంతో సరే అని ఫోన్ తీసి ఒక్కసారి ఇది చదవండి అంటాడు. అందులో తన ప్రేయసితో వైజాగ్ బీచ్‌లో సామ్రాట్ సరసాలు అంటూ వచ్చిన ఆర్టికల్ అది. అది చూపెట్టిన తర్వాత 'నా వల్లే ఇదంతా జరిగింది. నా వల్లే మీకు బ్యాడ్ నేమ్ . మీ మనసు ఎంతగా బాధపడి ఉంటుందో నేను తెలుసుకోగలను. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటా' అంటాడు.

ఆర్టికల్‌ను లైట్ తీసుకున్న తులసి

ఆర్టికల్‌ను లైట్ తీసుకున్న తులసి

సామ్రాట్ ఆ ఆర్టికల్‌ను చూపించగానే 'నిజంగా మీరు దీన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారా? నేనైతే అస్సలు పట్టించుకోను' అంటుంది. అప్పుడు ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. తర్వాత తులసి 'మంచి మనసుతో చూసేవాళ్లకు ఆకాశంలో చంద్రుడు అందంగా కనిపిస్తాడు. ఏదో ఒకటి అని విమర్శించేవాళ్లకు చంద్రుడిలో మచ్చలు మాత్రమే కనిపిస్తాయి. ఏదైనా చూసే చూపులో ఉంటుంది. ఒకప్పుడు నేను ఇలాంటి వాటికి భయపడేదాన్ని. ఇప్పుడు కాదు.

నా వరకు నా జీవితం.. నా కుటుంబమే నాకు ముఖ్యం. నా వాళ్లకు నా మీద నమ్మకం ఉన్నంత వరకు నేను ఇలాంటి వాటిని అస్సలు పట్టించుకోను. మీరు కూడా పట్టించుకోవద్దు' అంటుంది. దీంతో సామ్రాట్ 'నా దృష్టిలో మీరు మరో నాలుగు మెట్లు ఎక్కారు తులసి గారు' అని పొగుడుతాడు.

తులసిపై సామ్రాట్ అభిమానంతో

తులసిపై సామ్రాట్ అభిమానంతో

ఇంటికెళ్లిన తర్వాత సామ్రాట్ తులసి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అతడిని చూసిన బాబాయి షాక్ అవుతాడు. దీంతో అతడి దగ్గరకు వెళ్లి 'వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత నీలో చాలా తేడా వచ్చింది. నువ్వు చాలా మారిపోయావు' అంటాడు. దీంతో సామ్రాట్ 'అవును బాబాయి. నువ్వు అనుకుంటున్నది నిజమే' అంటాడు. అప్పుడు నీలో ఈ మార్పుకు కారణం ఏంటి అని అడుగుతాడు. దీనికి సామ్రాట్ 'తులసి గారు.

స్త్రీని శక్తి స్వరూపిణి అంటారు. అలా ఎందుకు అంటారో నాకు ఇన్ని రోజులు తెలియలేదు. తులసి గారితో ప్రయాణం చేశాక ఆ మాటకు అర్థం తెలిసింది. అందుకు కారణం.. జీవితంలో తనకు తగిలిన ఎదురు దెబ్బలు.. జీవితంలో తనకు వచ్చిన కష్టాలు. మ్యూజిక్ స్కూల్ కోసం తను పడే తపన, హనీని లిఫ్ట్ లో కాపాడటం, ఇలా అన్ని విషయాల్లో తులసి గారు ఎంతో గొప్పగా కనిపించారు. తన పర్సనల్ లైఫ్ పోగొట్టుకొని కూడా తను జీవితంలో పోరాడటం చూస్తుంటే తనలో ఒక ఫైటర్ కనిపించింది' అంటాడు.

తులసి గురించి చెప్పిన అనసూయ

తులసి గురించి చెప్పిన అనసూయ

మరోవైపు, అనసూయ.. పరందామయ్యతో తులసి, సామ్రాట్ గురించి మాట్లాడుతుంది. దీనికాయన తనేమీ చిన్నపిల్ల కాదు కదా అంటాడు. దీంతో అనసూయ 'చిన్నపిల్ల కాదు అదే నా భయం. మన తులసి బంగారమే కానీ.. పంజరంలో ఉన్నంత వరకే పక్షి మనది. పంజరం తలుపులు తెరిస్తే ఆ పక్షి మీద ఆశ వదులుకోవాల్సిందే. ఒక బలహీనమైన క్షణం చాలు మనసు దారి తప్పడానికి' అంటుంది. దీంతో పరందామయ్య 'వాడికి పాతికేళ్లు సేవ చేసి మోసపోయింది. చివరకు తనకు భర్త ఆదరణ కూడా లభించలేదు. ఎవడి వల్ల తులసి జీవితానికి నష్టం జరిగిందో మళ్లీ వాడి మాటే విని తులసికి అన్యాయం చేయాలనుకుంటున్నావా' అని ప్రశ్నిస్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X