Intinti Gruhalakshmi: సంజయ్‌కు పని ఖతం.. దివ్యకు సపోర్టుగా విక్రమ్.. నందూ నిర్ణయంపై తులసి సీరియస్
ఈ మధ్య కాలంలో కొత్త కొత్త కాన్సెప్టులతో షోలు వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
బుధవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే:బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. మామ ప్రకాశాన్ని నడిపించడానికి దివ్య ప్రయత్నాలు చేస్తుంటుంది. తర్వాత రాజ్యలక్ష్మితో పాటు సంజయ్‌ను కూడా ఆస్పత్రికి రాకుండా చేయాలని ప్లాన్ చేసిన దివ్య.. అత్త పక్కన పూల కుండీ పడేలా చేస్తుంది. ఆ తర్వాత పంతులును పిలిపించి.. రాజ్యలక్ష్మికి ప్రాణగండం ఉందని ఆయనతో చెప్పిస్తుంది. అదే సమయంలో తల్లి ఆరోగ్యంగా ఉండడం కోసం సంజయ్ 101 రోజుల పాటు పూజలు చేయాలని కూడా పూజారి చెప్పేలా చేస్తుంది. దీంతో విక్రమ్ కూడా ఆయన మాటలు నమ్మి తమ్ముడితో పూజలు చేయాలని ఒప్పిస్తాడు.

మమ్మీ చేసింది తప్పా కాదా?:తులసి దగ్గర లక్కీ ఏడుస్తూ.. నాకు మమ్మీ వద్దు డాడీనే కావాలి అంటాడు. దీంతో తులసి 'నీకు డాడీ కావాలి సరే.. నువ్వు మమ్మీకి కావాలి కదా.. కన్న కొడుకును ఎలా వదులుకుంటుంది చెప్పు. అలా ఏడ్వ కూడదు నాన్నా' అని సర్ధి చెప్తుంది. దీనికి లక్కీ 'మమ్మీ వల్లే కదా.. డాడీ దూరం అయింది. తప్పు మమ్మీదే కదా ఆంటీ' అని అంటాడు. దీనికి తులసి 'నువ్వు చిన్న పిల్లాడివి.. అమ్మను తప్పు పట్టకూడదు' అనగా.. 'పోని మీరే చెప్పండి ఆంటీ మమ్మీ చేసింది తప్పా కాదా' అని లక్కీ ప్రశ్నిస్తాడు. దీంతో తులసి.. నందూ వైపు చూస్తూ.. 'ఏది తప్పో ఏది ఒప్పో మనం నిర్ణయించలేం. ఒకసారి తప్పు అనిపించింది ఇంకోసారి ఒప్పు అనిపిస్తుంది. మన నిర్ణయాలపై మనం నిలబడలేకపోయినప్పుడు. ఎదుటి వాళ్లను జడ్జ్ చేయకూడదు' అని అంటుంది.
డాడీ ఈజ్ గుడ్ బాయ్ అని:తులసి మాటలకు లక్కీ సరిగానే సమాధానాలు చెప్తాడు. అయినా ఆమె బుజ్జగిస్తూనే ఉంటుంది. అప్పుడు 'ఎప్పుడైనా డాడీకి నీపై కోపం వచ్చి వదిలేస్తే ఏం చేస్తావు' అని ప్రశ్నిస్తుంది. దీనికి లక్కీ 'డాడీ అలా చేయరు.. డాడీ ఈజ్ గుడ్ బాయ్' అని అంటాడు. దీంతో తులసి 'ఎవరినీ అంత గుడ్డిగా నమ్మకూడదు నాన్నా.. ఎవరి మనసు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు.. ఎప్పుడు ఎవర్ని కోరుకుంటుందో, ఎందుకు కోరుకుంటుందో ఎవరికీ తెలియదు. మీ డాడీ కూడా అందుకు మినహాయింపు కాదు' అని చెబుతుంది.

నా గురించి ఆలోచించొద్దని:తులసి వెళ్లిపోతుండగా నందూ కూడా వెళ్లి 'ఎందుకంత కోపం? నువ్వు అన్నవన్నీ నన్ను ఉద్దేశించే అని నాకు తెలుసు' అంటాడు. దీనికి తులసి 'అబ్బే నీనెవర్ని మీపై కోపం తెచ్చుకోవడానికి? ఒకవేళ నేను కోపం తెచ్చుకున్నా మీరెవరు పట్టించుకోవడానికి' అంటుంది. దీంతో నందూ 'ఎందుకు తులసీ.. నన్ను అలా దూరం చేసి మాట్లాడతావు' అనగా.. 'ఇప్పుడు దూరం చేయడం కాదు.. మనం దూరమై ఐదేళ్లు పైనే అయింది' అంటుంది. దీంతో నందూ 'లక్కీ వల్లే దూరం పెరుగుతోంది. వాడిని వాళ్ల అమ్మ దగ్గరకు పంపించేస్తాను' అంటాడు.

వాడిని ఏకాకిని చేసేస్తారా?:నందూ మాటలకు తులసి 'అందరూ కలిసి వాడిని ఏకాకిని చేస్తారా? వాడిని ఎవరికీ కాకుండా చేస్తారా? లక్కీ మీపైనే ఆశల పెట్టుకున్నాడు. జీవితాంతం మీ తోడు కావాలని అంటున్నాడు. మీకు అర్ధం అవుతుందా' అని అడుగుతుంది. దీంతో నందూ 'బాధలో ఉన్నాడని ఎప్పుడూ అండగా ఉండలేను కదా.. జీవితాంతం తోడుగా ఉండమంటే ఎలా' అంటాడు. అప్పుడు తులసి 'మీరు జీవితాంతం ఎవరికీ అండగా ఉండలేరు. ఆ అలవాటు లేదు. ఒక్కోసారి పరిస్థితుల్ని బట్టి అలవాట్లను మార్చుకోవాలి. అప్పుడప్పుడు ఎదుటి వాళ్ల గురించి కూడా ఆలోచించండి' అని వెళ్తుంది.

సంజయ్ తిక్క కుదిరింది:తల్లి దోషం పోవడానికి సంజయ్‌కు విక్రమ్ దగ్గరుండి మరీ చల్ల నీళ్లతో మంగళస్నానం చేయిస్తాడు. దీంతో అతడు విలవిలలాడిపోతాడు. ఆ తర్వాత సంజయ్‌తో అభిషేకం చేయిస్తుంటాడు. అప్పుడు పంతులు అభిషేకం పూర్తైంది అనడంతో ప్రకాశం అప్పుడే అయిపోయిందా అనగా రాజ్యలక్ష్మి 'వాడికి ఇక ఓపిక లేదు. కనిపించడం లేదా' అంటుంది. అప్పుడు దివ్య 'మీకోసం ప్రియ, విక్రమ్ కోసం నేను ఇలాగే చేశాం కదా. అప్పుడు రాని కోపం ఇప్పుడెందుకు వస్తుంది? తప్పు చేస్తున్నారు' అంటుంది. దీంతో విక్రమ్ కూడా దివ్య వైపు మాట్లాడడంతో తల్లి షాకవుతుంది.

సంజయ్ ప్లేట్ లాగేసింది:అభిషేకం అయిపోయిన తర్వాత అందరూ డైనింగ్ టేబుల్ ముందు వాలిపోతారు. అంతలో దివ్య వచ్చి సంజయ్ ముందు ఉన్న ప్లేట్‌ను లాగేస్తుంది. దీంతో అందరూ షాక్ అయిపోతారు. దీంతో రాజ్యలక్ష్మి 'ఏం చేస్తున్నావు? తినే ప్లేట్ తీసేస్తున్నావ్ ఏంటి' అని సీరియస్ అవుతుందిజ దీంతో దివ్య 'దీక్షలో ఉన్న 101 రోజులు సంజయ్ నేలపై కూర్చునే తినాలి. నేలపైనే పడుకోవాలని చెప్పారు కదా. పళ్లు పచ్చి కూరలు మాత్రమే తినాలని చెప్పారు కదా' అని అంటుంది. దీంతో విక్రమ్ 'అవును కదమ్మా.. దీక్షగానే చేయాలి' అని అంటాడు.

లోకం తెలియని పిల్లాడు:సంజయ్‌తో కఠినంగా పూజలు చేయిస్తుండడంతో రాజ్యలక్ష్మి బాధ పడుతూ.. 'సంజయ్‌కు లోకం తెలియదురా. చిన్న పిల్లాడి మనస్తత్వం. వందరోజుల శివ దీక్ష అంటే చిన్న విషయం కాదు.. వయసుకు మించిన బాధ్యత. వాడి వల్ల కాదు. నా బాధ అర్ధం కావాల్సిన వాళ్ల కోసం చెప్తున్నా' అని దివ్య వైపు చూస్తూ విక్రమ్‌తో చెప్తుంది. దీంతో విక్రమ్ 'సంజయ్ చేస్తున్నది దైవ దీక్ష. భారం దేవుడిపై వేద్దాం అమ్మా. అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు. ఇది నీ ఆరోగ్యానికి సంబంధించిన విషయం. లేకపోతే తమ్ముడ్ని ఇంత ఇబ్బంది పెట్టేవాడ్ని కాదు. నువ్వు నా పట్ల చూపించిన ప్రేమను తిరిగి తమ్ముడికి ఇవ్వడం నా బాధ్యత. ఈ 101 రోజులు వాడ్ని కష్టపడనివ్వు. దయచేసి అర్ధం చేసుకో' అని వెళ్లిపోతాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











