For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi August 25th Episode: శృతికి తులసి ఊహించని గిఫ్ట్.. లాస్య మరో కన్నింగ్ ప్లాన్

  |

  ఎన్నో ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. వరలక్ష్మి పూజ చేయడానికి రావాల్సిన పూజారికి యాక్సిడెంట్ అవుతుంది. దీన్ని లాస్యనే ప్లాన్ చేస్తుంది. దీంతో పూజారుల కోసం ఎంతగా ప్రయత్నించినా వరలక్ష్మీ వ్రతం పర్వదినం కావడంతో ఎవరూ దొరకరు.

  ఇలాంటి పరిస్థితుల్లో పూజ చేయడం తనకు వచ్చంటూ శృతి ముందుకు వస్తుంది. దీంతో ఆడవాళ్లు వేదాలు చదువుతారా అంటూ లాస్య, అనసూయ, అంకితలు ఆమెకు అడ్డు చెబుతారు. అప్పుడు తులసి ఆడవాళ్ల గొప్పదనం వివరించి శృతితో పూజ చేయిస్తానని చెబుతుంది. ఆ వెంటనే పూజ మొదలు పెడుతుంది.

  ఏకాంతంగా ఒకే ఇంట్లో సినీ జంట ఎంజాయ్: అతడు బట్టల్లేకుండా.. ఆమె ప్రైవేట్ ఫొటోలు బయటకు!

  కుల్లకున్న అనసూయ.. మామ బాధతో

  కుల్లకున్న అనసూయ.. మామ బాధతో

  ఇంట్లో శృతి పూజను జరిపించడంతో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. వరలక్ష్మీ వ్రతం జరుగుతోన్న సమయంలో లాస్య తన ప్లాన్ బెడిసి కొట్టిందని మనసులో తెగ ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత అనసూయ కూడా ‘ఈ శృతి వేద మంత్రాలు చదడం ఏంటో.. వీళ్లు తల ఊపుకుంటూ పూజలు చేయడం ఏంటో.. ఆచారాలను పక్కన పెట్టేసి కొత్త కొత్త పనులు చేస్తూ ఇంటిని భ్రష్టు పట్టిస్తున్నారు' అని మనసులో అనుకుంటుంది. మరోవైపు, పరందామయ్య ‘ఎప్పుడూ తులసి పూజ చేసేది.. ఇప్పుడు పక్కన కూర్చోవాల్సి వచ్చింది' అని అనుకుంటూ ఏడుస్తాడు.

  అమ్మవారిలా శృతి... ఆమెపై ప్రశంసలు

  అమ్మవారిలా శృతి... ఆమెపై ప్రశంసలు

  శృతి పూజ చేస్తుండగా.. తులసికి ఆమె అమ్మవారిలా కనిపిస్తుంది. ఆ సమయంలో ఆమె ఆశ్చర్యంతో మురిసిపోతూ ఉంటుంది. ఆ తర్వాత కొద్ది సేపటికి తేరుకున్న తులసి శృతిని చూసి మురిసిపోతుంది. ఆ తర్వాత కొద్ది సేపటికి పూజా పూర్తవుతుంది.

  దీంతో మాధవి, మోహన్ వరలక్ష్మీ వ్రతం చక్కగా జరిపించావని శృతిని ప్రశంసిస్తారు. అంతేకాదు, అక్కడికి వచ్చిన వాళ్లందరూ ఆమెను పొగుడుతూ మాట్లాడుతుంటారు. పూజారి లేకపోయినా వ్రతాన్ని చక్కగా జరిపించావంటూ కొనియాడుతుంటారు. దీంతో శృతి తనలో తానే సంతోష పడుతుంటుంది.

  ఒకేసారి అంత మంది అమ్మాయిలతో ఎఫైర్స్: యాంకర్ ప్రదీప్ పరువు తీసేసిన సీరియల్ నటి

  అంకిత అసూయ.. పరందామయ్య అలా

  అంకిత అసూయ.. పరందామయ్య అలా

  ఇంట్లో వాళ్లతో పాటు బయట నుంచి వచ్చిన వాళ్లందరూ శృతిని పొగుడుతుండగా.. ‘ఇంటి పెద్ద కోడలు అన్న మర్యాద దక్కిందని సంతోషించాను. కానీ, నేను పూజ చేసినా క్రెడిట్ మాత్రం తనకే దక్కింది. అందరూ ఆమెనే ప్రశంసిస్తున్నారు. ఛా.. నేను అనుకున్నది ఒకటి.. అయింది మరొకటి' అని మనసులో అనుకుంటుంది అంకిత. ఆ తర్వాత పరందామయ్య తులసి ముందు బాధ పడతాడు. ఆ సమయంలో తనను ఆశీర్వదించమనగా.. ‘దీర్ఘ సుమంగళీ అని దీవించలేనమ్మా.. నా ఆయుష్షు కూడా పోసుకుని జీవించు' అంటూ ఏడుస్తూ కోడలిని దీవిస్తాడాయన.

  శృతి తీరుకు లాస్య, భాగ్య నిరుత్సాహం

  శృతి తీరుకు లాస్య, భాగ్య నిరుత్సాహం

  ఎన్ని ఆటంకాలు కలిగించినా పూజ సక్సెస్‌ఫుల్‌గా పూర్తవడంతో లాస్య, భాగ్య తెగ బాధ పడుతుంటారు. ‘మనం పూజారి రాకుండా ప్లాన్ చేసినా ఆ శృతి వల్ల అది చెడిపోయింది. ఎంతైనా పూజారి కూతురు కదా. అయినా ఆమెకు వేద మంత్రాలు కూడా వస్తాయని మనం అనుకోలేదు.

  ఒకవేళ వచ్చినా ఇక్కడ పూజ చేస్తుందని ఎవరూ అనుకోలేదు. అయినా తులసక్క గెలిచినట్లు అనిపిస్తుంది' అంటూ భాగ్య బాధ పడుతుంది. అప్పుడు లాస్య ‘దీనికే ఏమైంది భాగ్య? ఇంకా చాలా ప్లాన్లు ఉన్నాయి. మనం ఆ ఫ్యాక్టరీ మీద ఫోకస్ చేసి తులసికి షాక్ ఇవ్వాలి' అని అనుకుంటుంది.

  టూపీస్ బికినీలో రామ్ చరణ్ భామ ఘాటు ఫోజులు: బట్టలు ఉన్నా లేనట్లే మరీ దారుణంగా!

  శృతికి తులసి స్పెషల్ గిప్ట్.. అంకిత షాక్

  శృతికి తులసి స్పెషల్ గిప్ట్.. అంకిత షాక్

  శృతి పూజ చేసిన దానికి ప్రేమ్ ఆమెను ఎంతగానో పొడుగుతాడు. అంతేకాదు, ఆమె థ్యాంక్స్ కూడా చెబుతాడు. అంతలో అక్కడకు తులసి వస్తుంది. వచ్చీ రావడమే ఆమెను ప్రశంసించడం ప్రారంభిస్తుంది. అలా కాసేపు ఆమెను తన మాటలతో పైకి లేపిన తర్వాత బంగారు గొలుసును గిఫ్ట్‌గా ఇస్తుంది. కానీ, దీన్ని తీసుకోడానికి శృతి అంగీకరించదు. అప్పుడు ప్రేమ్, తులసి బలవంతం చేసి ఆమెకు ఇస్తారు. అప్పుడది చూసిన అంకిత షాక్ అవుతుంది. అంతేకాదు, తనకెప్పుడూ ఇలాంటి గిఫ్టులు ఇవ్వలేదని మనసులో అనుకుని కుల్లుకుంటూ ఉంటుంది.

  తండ్రితో నందూ మాటలు.. తులసి వల్లే

  తండ్రితో నందూ మాటలు.. తులసి వల్లే

  ఒంటరిగా కూర్చుని ఏదో ఆలోచించుకుంటూ ఉన్న పరందామయ్య దగ్గరకు నందూ వస్తాడు. రావడం రావడమే ఎందుకు దిగాలుగా కూర్చున్నారని అడుగుతాడు. అప్పుడు ‘ఈ ఇంట్లో అందరికీ అందరూ ఉన్నారు. కానీ, తులసి మాత్రమే ఒంటరిగా ఉంది' అంటాడు. అప్పుడు నందూ ‘ఏ తులసి మనమంతా లేమా' అని ప్రశ్నిస్తాడు. అప్పుడు తండ్రి ‘మనం అని నిన్ను కూడా కలుపుకుంటావెందుకు? అసలు నీ వల్లే కదా ఈ దుస్తితి వచ్చింది. నువ్వే మంచిగా ఉంటే నాకు ఈ బాధలు ఎందుకు?' అని అంటాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తయిపోయింది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 407: Lasya and Bhagya are Disappointed about Pooja. Tulasi Gave Special Gift to Shruthi. Then Ankita Not Happy for her Behaviour.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X