Intinti Gruhalakshmi: లాస్యకు మరో షాకిచ్చిన లక్కీ.. దివ్యతో విక్రమ్ సరసం.. రాజ్యలక్ష్మి మైండ్ బ్లాక్
ఎన్నో భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
గురువారం ఎపిసోడ్‌లో జరిగిందిదే: గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసితో లక్కీ ఏడుస్తూ తనకు డాడీ కావాలి అంటూ ఏడుస్తాడు. అప్పుడు నందూ గురించి చెడుగా చెప్పినా లక్కీ మాత్రం వినిపించుకోడు. ఆ తర్వాత నందూ వచ్చి లక్కీ వల్ల మన మధ్య దూరం పెరుగుతుందని తులసితో అంటాడు. దీంతో ఆమె అతడికి ఓ రేంజ్‌లో క్లాస్ పీకుతుంది. తర్వాత సంజయ్‌తో విక్రమ్ వాళ్లు దోష నివారణ చేయిస్తారు. అనంతరం అతడు అన్నం తింటుండుగా దివ్య వచ్చి ప్లేట్ లాక్కుంటుంది. అంతేకాదు, అతడిని కింద కూర్చుని తినాలని చెప్తుంది. దీంతో సంజయ్ తప్పనిసరి పరిస్థితుల్లో అదే చేస్తాడు.

ఎవరికీ కాకుండా పోతావు అత్తా: వరుస ప్లాన్లతో అత్తను ముప్పతిప్పలు పెడుతున్న దివ్య.. రాజ్యలక్ష్మి దగ్గరకు వచ్చి 'నిన్ను నీ కొడుకును హాస్పిటల్‌కు దూరం చేసేసరికి నిద్రపట్టడం లేదా అత్తా? ఇంక ఎక్కువ చేయకు.. తొక్కిపడేస్తా. అసలే కుంటికాలు.. గట్టిగా తొక్కితే రెండు నెలలు లేవవు. బెదిరించడం నీకే కాదు.. నాకూ వచ్చు. 101 రోజులు పూర్తయ్యే సరికి ఈ ఇంటికి పట్టిన శని వదిలిపోతుంది. విక్రమ్ నా వాడు అవుతాడు. నువ్వు ఎవరికీ కాకుండా పోతావు. నీ రోజులు లెక్కపెట్టుకో అత్తయ్యా' అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. దీంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్న రాజ్యలక్ష్మి రగిలిపోతుంది.
తులసి ఇంటికొచ్చిన లాస్య: లక్కీ మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తూ లాస్య తులసి ఇంటికి వస్తుంది. అప్పుడు 'నాన్నా లక్కీ.. ఎక్కడున్నావు బుజ్జకన్నా? నా బంగారు తండ్రీ ఎక్కడున్నావు' అంటుంది. అప్పుడామెను చూసి అందరూ అసహ్యించుకుంటారు. అప్పుడే లక్కీ రావడంతో.. దగ్గరకు తీసుకుని ముద్దాడుతుంది. ఇంతలో అనసూయ వచ్చి 'ఆపవే.. నీ నాటకాలు పక్కనెట్టు. ఏదో వంకతో ఇంటికి రావడం.. గొడవ చేయడం.. నీకు ఇదే పని' అంటుంది. దీంతో లాస్య 'నన్ను ఎన్ని మాటలంటున్నారో చూస్తున్నావా లక్కీ? ఇప్పుడు నీకోసం వస్తే దొంగ ప్రేమ అంటున్నారు. నేను ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేక నిన్ను ఎత్తుకొచ్చారు. ఇప్పుడు నిన్ను చూడ్డానికి వస్తే ఎన్ని మాటలంటున్నారో చూశావా' అంటాడు. దీంతో లక్కీ 'నన్ను చూశావు కదా ఇంక వెళ్లు' అంటూ షాకిస్తాడు.

నన్ను చూడొద్దంటే ఎలా అని: ఆ తర్వాత లాస్యను లక్కీ వెళ్లిపోమనగా.. 'వెళ్లిపోవడం ఏంట్రా.. నీకోసం పాయసం చేసి తీసుకుని వచ్చాను. నీకు నా చేతులతో తినిపిద్దాం అని తీసుకుని వచ్చాను. ఈ కన్నతల్లి ప్రేమను కలిపి మరీ చేశాను. తినరా. ఏంటి నాన్నా ఇలా చిక్కిపోయావు' అంటుంది. అది విన్న అనసూయ మండిపడుతుంది. దీంతో లాస్య 'ఏంటి మీరు.. వాడ్ని ఎలాగూ నా దగ్గరకు రానీయరు... ఇప్పుడు నన్ను కూడా వాడి దగ్గరకు రావొద్దంటే ఎలా?' అంటుంది. దీనికి నందూ 'వాడు హాస్టల్‌లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఇలా వెళ్లి ప్రేమగా చూసుకున్నావో నాకు తెలుసు' అని అంటాడు.
ఆ ప్రేమ ఇప్పుడు వస్తుందా: తర్వాత 'లక్కీ కోసం వెళ్లమన్నా వెళ్లేదానివి కాదు.. అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు పొంగుకొస్తుందా' అంటాడు. దీనికి లాస్య 'అప్పుడు తప్పు చేశానని ఇప్పుడు కూడా తప్పు చేయమంటావా? నువ్వెప్పుడూ తప్పు చేయలేదా? చేసిన తప్పుల్ని సరిదిద్దుకోలేదా? తల్లీకొడుకుల బంధాన్ని ఎగతాళి చేసి మాట్లాడొద్దు నందూ. నీకు కూడా తల్లి ఉందని గుర్తుపెట్టుకో.. అమ్మ ఎవరికైనా అమ్మే' అంటుంది. ఇలా ఇద్దరూ కాసేపు వాగ్వాదానికి దిగుతారు. దీంతో లక్కీ ఆ పాయసం తీసుకుని తాగేసి వెళ్లిపోమంటాడు. అప్పుడు లాస్య వాళ్లందరికీ శాపనార్థాలు పెట్టి మరీ వెళ్లిపోతుంది.
విక్రమ్ బాధగా.. దివ్య టెంప్ట్: తల్లి కోసం సంజయ్ పూజలు చేస్తూ కష్టపడడం చూసిన విక్రమ్ తట్టుకోలేక కన్నీరు పెట్టుకుంటాడు. అంతేకాదు, పంతులుతో మరోసారి మాట్లాడదామా అని దివ్యను అడుగుతాడు. అప్పుడామె 'మనం పదే పదే అడిగితే ఆయన ఒప్పుకుంటారేమో కానీ.. అత్తయ్య గారి దోషాలు తీరవు. అందుకే ఎంత కష్టమైన సంజయ్‌నే చేయమందాం' అంటుంది. ఆ తర్వాత విక్రమ్ తనకు తలనొప్పి వస్తుందని అనగా.. బాయ్ తీసుకొచ్చి రాస్తుంది. కానీ, విక్రమ్ చూపు దివ్య నడుముపై పడుతుంది. అది గమనించిన దివ్య అతడిని మరింతగా టెంప్ట్ చేసి కొంగును దోపమని అడుగుతుంది.
తులసిని మమ్మీ అన్న లక్కీ: లక్కీతో మంచిగా ఉండమని తులసి క్లాస్ పీకడంతో నందూలో మార్పు వస్తుంది. అప్పుడే లక్కీ వచ్చి చెస్ ఆడడానికి నందూను బలవంతంగా తీసుకు వెళ్తాడు. తప్పని పరిస్థితుల్లో నందూ ఆ చిన్నారితో చెస్ ఆడుతుండగా తులసి వచ్చి చూస్తుంది. అది గమనించిన నందూ భయపడుతూ ఉంటాడు. అప్పుడు తులసి 'మీ డాడీకి నువ్వుంటే చాలా ఇష్టం నాన్న. ఆయనను అస్సలు వదలకు' అంటుంది. దీంతో 'సరే మమ్మీ' అంటూ తులసితో తల్లి వరస కలుపుతాడు. అది విని వాళ్లు షాక్ అవుతారు. తర్వాత పరందామయ్య వాళ్లు వచ్చి తులసిని లైన్‌లో పెట్టమని నందూకు సూచనలు చేస్తారు.

దివ్య కోరికను కాదన్న విక్రమ్: ఉదయాన్నే ఆస్పత్రికి వెళ్లేందుకు రెడీ అవుతున్న విక్రమ్.. బెడ్‌పై ఓ బ్లేజర్‌ను చూస్తాడు. అది అక్కడ ఎవరు పెట్టారు అనుకుంటాడు. అంతలోనే దివ్య అక్కడకు వచ్చి 'త్వరగా రెడీ అవు విక్రమ్. అది నీకోసమే పెట్టాను. ఇది వేసుకుని ఈరోజు ఆస్పత్రికి వెళ్దాం' అంటుంది. దీంతో విక్రమ్ 'ఏంటి ఆర్డర్ వేస్తున్నావా? అయినా నువ్వు ఏంటి? వద్దనుకుని ఇల్లు వదిలి వెళ్లిపోయావు. మళ్లీ వచ్చి విడాకులకు టైం ఉంది అన్నావు. ఇప్పుడు ఆర్డర్లు వేస్తున్నావు' అంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











