Don't Miss!
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Intinti Gruhalakshmi August 26th Episode: లాస్యకు మాధవి షాక్.. వాళ్ల పొరపాటుతో నందూ కంపెనీ దివాళా
చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పూజ విజయవంతంగా పూర్తవడంతో శృతిని మాధవి, తులసి సహా అక్కడకు వచ్చిన వాళ్లంతా పొగుడుతుంటారు. ఆ తర్వాత తమ ప్లాన్ వర్కౌట్ కాకపోవడంతో లాస్య, భాగ్య తెగ బాధ పడుతుంటారు. అనంతరం తులసి, శృతికి బంగారు గొలుసును గిఫ్ట్‌గా ఇస్తుంది. ఇది చూసిన అంకిత షాక్ అవడంతో పాటు కుల్లుకుంటోంది. ఇక తులసి గురించి బాధ పడుతోన్న పరందామయ్యతో నందూ మాట్లాడగా.. అతడిని తండ్రి విమర్శిస్తూ మాట్లాడతాడు. ఆ సమయంలో తులసికి అండగా నిలిచి మాట్లాడతాడు.
అందాలు ఆరబోసి షాకిచ్చిన రష్మిక మందన్నా: ఆమెను ఇంత ఘాటుగా ఎప్పుడూ చూసుండరు!

నువ్వే వదిలేశావ్.. పిల్లలు చూస్తారా?
నందూతో పరందామయ్య మాట్లాడుతుండగా ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. తులసి గురించి బాధ పడుతోన్న ఆయన.. 'నువ్వే తనను వదిలేశావ్. నీ పిల్లలు చూసుకుంటారని గ్యారెంటీ ఎంట్రా. ఈరోజు నేను ఉన్నాను.. తర్వాత నాకేదైనా అయినా తులసిని ఎవరు చూసుకుంటారాని భయపడుతున్నా. అయినా.. నీకివ్వనీ చెప్పినా నువ్వు తీరుస్తావా? లేదు ఎందుకంటే తన పరిస్థితికి నువ్వే కారణం కాబట్టి' అంటాడు. అప్పుడు నందూ 'తులసికి ఫ్యాక్టరీ ఉంది. బాగానే ఉంటుంది' అంటాడు. అప్పుడాయన 'బాగా ఉండడం వేరు.. సంతోషంగా ఉండడం వేరు' అని అంటాడు.

నాకు ఇద్దరు ఉన్నారన్న ధైర్యం ఉంది
తర్వాతి రోజు ఉదయాన్నే దివ్య.. ప్రేమ్‌ను సర్‌ప్రైజ్ అంటూ తీసుకుని వస్తుంది. అప్పటికే అక్కడ ప్రేమ్, అంకిత, శృతి అందరూ ఉంటారు. అప్పుడు దివ్య 'ఈరోజు రాఖీ పండుగ' అని చెబుతుంది. దీనికి అంకిత 'హో దీనికేనా ఇంత హడావిడి చేస్తున్నావ్' అని అడుగుతుంది. దీంతో దివ్య 'ఇది హడావిడి కాదు వదిన.. నాకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారన్న ధైర్యం' అని అంటుంది. ఆ తర్వాత ఆమె ఇద్దరికీ రాఖీలు కట్టగా.. ఇద్దరూ ఎప్పటికీ తోడుగా ఉంటామని ధైర్యం చెబుతారు. ఆ తర్వాత శృతి వచ్చి ప్రేమ్, అభిని గిఫ్ట్‌లు కూడా డిమాండ్ చేయమని దివ్యతో అంటుంది.
టాప్‌ను అమాంతం పైకి లేపిన విష్ణుప్రియ: అందాలు కనిపించేలా ఘాటు ఫోజులతో రచ్చ

దివ్యను ఆటపట్టించిన ప్రేమ్... గిఫ్టులు
రాఖీ కట్టిన తర్వాత ఇద్దరు అన్నయ్యలను గిఫ్ట్‌లు ఇవ్వమని అడుగుతుంది. కానీ, వాళ్లిద్దరూ ఏమీ ఇవ్వమని అంటారు. ఆ తర్వాత కాసేపు కవ్వించిన తర్వాత అభి, దివ్యకు వేయి రూపాయలు ఇస్తాడు. దీంతో ప్రేమ్‌ను కూడా ఆమె అడుగుతుంది. అప్పుడు అభి ఇచ్చిన డబ్బులు కూడా తీసుకుని కాసేపు చెల్లెలిని ఆటపట్టిస్తాడు. అలా కొద్ది సేపు చేసిన తర్వాత ఆమెకు ఓ వాచ్‌ను గిఫ్టుగా ఇస్తాడు. అప్పుడు 'నువ్వు అమ్మను చాలా రోజులుగా వాచ్ అడుగుతున్నావ్ కదా.. అందుకే ముందే కొని ఉంచాను' అని చెప్తాడు. దీంతో అభి, ప్రేమ్, దివ్యలు చాలా సంతోషిస్తారు.

మాధవిని తలచుకుని నందూ బాధతో
ఇంట్లో రాఖీ పండుగను జరుపుకుంటుండగా అంతా సందడిగా సాగుతుంది. ఆ సమయంలోనే నందూ.. మాధవిని తలుచుకుని బాధ పడుతుంటాడు. తర్వాత లాస్యతో 'మాధవి నాకు ప్రతి సంవత్సరం రాఖీ కట్టడానికి వచ్చేది లాస్య. కానీ, ఈసారి రాలేదు. నీ విషయంలో నేను తీసుకున్న నిర్ణయంతో తను నాకు దూరంగా ఉంటోంది. ఆ దూరం అలాగే ఉంటుందేమో. సో.. ఇప్పుడు అందుకే రాలేదు అనిపిస్తుంది. కానీ, ఎందుకో తను నాకు రాఖీ కట్టడానికి వస్తుందనే నమ్మకం మాత్రం ఉంది' అని అంటాడు నందూ. దీనిపై మనసులో కుల్లుకుంటుంది లాస్య.
అభిమాని పెళ్లిలో పవన్ కల్యాణ్: ఇదేం క్రేజురా నాయనా.. తల్లిదండ్రులను కూడా కాదని పవర్‌స్టార్‌తో!

దూరం పెరిగినా మర్చిపోను అన్నయ్య
నందూ అలా మాట్లాడుతుండగానే మాధవి రాఖీ కట్టేందుకు వచ్చి అతడిని పిలుస్తుంది. దీంతో సంతోషంగా అక్కడకు వెళ్లి రాఖీ కట్టించుకుంటాడు. ఆ సమయంలో 'నువ్వు రావనుకున్నాను మాధవి' అని అంటాడు. దీనికి 'మన మధ్య దూరం పెరిగినా నిన్ను, నీకు రాఖీ కట్టడాన్ని మాత్రం మర్చిపోను అన్నయ్య' అని బదులిస్తుందామె. అలా ఇద్దరి మధ్య సెంటిమెంట్ సాంగ్ వస్తుంది. ఆ తర్వాత నందూకు రాఖీ కట్టినందుకు గానూ లాస్య.. మాధవికి చీర పెట్టాలని చూస్తుంది. కానీ, దాన్ని తీసుకోడానికి మాధవి ఇష్టపడదు. ఆ సమయంలో వద్దు అని తెగేసి చెప్పేస్తుంది.

లాస్యకు ఘోర అవమానం.. వాగ్వాదం
లాస్య ఇస్తున్న చీరను తీసుకోను అన్న మాధవితో 'లాస్యను నేను పెళ్లి చేసుకోబోతున్నాను. తను నీకు వదిన అవుతుంది' అని అంటాడు. అప్పుడు మాధవి 'నువ్వు తులసి వదినను భార్యగా వద్దనుకున్నావేమో.. నేను మాత్రం వదినగానే చూస్తున్నా' అని బదులిస్తుంది. ఆ తర్వాత 'ఎవరిస్తే ఏముంది? మీ అన్నయ్య నీకు ప్రేమగా ఇస్తున్నారు. తీసుకో' అని తులసి చెప్పగా.. మాధవి తీసుకుంటుంది. అనంతరం రాములమ్మను పిలిచి ఆ చీర ఇచ్చేస్తుంది. దీంతో లాస్యకు ఘోర అవమానం జరుగుతుంది. దీంతో మాధవికి, లాస్యకు మధ్య కాసేపు వాగ్వాదం జరుగుతుంది.
టూపీస్ బికినీలో రామ్ చరణ్ భామ ఘాటు ఫోజులు: బట్టలు ఉన్నా లేనట్లే మరీ దారుణంగా!

నాకు ఇష్టం లేని పని ఎందుకు చేశావ్?
లాస్య ఇచ్చిన చీరను రాములమ్మకు ఇచ్చి ఘోరంగా అవమానించిన మాధవితో 'నాకు ఇష్టం లేని పనులు ఎందుకు చేస్తున్నావ్' అని ప్రశ్నిస్తాడు నందూ. అప్పుడామె 'నీకు నచ్చని పనులు నేను చేయొద్దు. కానీ, నువ్వు మాత్రం ఇంట్లో ఎవరికీ ఇష్టం లేని పనులు చేయొచ్చా' అని ప్రశ్నిస్తుంది. అంతలో అనసూయ వచ్చి 'రాఖీ కట్టడానికి వచ్చిన దానివి కట్టి ఇచ్చింది తీసుకుని వెళ్లిపో' అని అంటుంది. అప్పుడు మాధవి 'అసలు లాస్య ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. తనకు ఇంట్లో ఉండే అర్హత లేదు' అంటుంది. దీంతో లాస్య ఏడుస్తూ లోపలికి వెళ్లిపోతుంది.
Recommended Video

నందూకు కొత్త కష్టం.. అందరికీ వార్నింగ్
కంపెనీలో నందూ.. ఉద్యోగులు అందరినీ పిలిచి మీటింగ్ పెడతాడు. అప్పుడు 'ఎవరి వల్ల తప్పు జరిగిందో తెలియదు కానీ.. ఒక్క బగ్ మన కంపెనీని దివాళా తీసే ప్రమాదంలో పడేసింది. అందరూ ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేసి దాన్ని సాల్వ్ చేయండి' అని అంటాడు. ఆ తర్వాత లాస్య వచ్చి ధైర్యం చెప్పబోగా 'ఎంత పెద్ద తప్పు జరిగిందో.. కంపెనీ దివాళా తీస్తే రోడ్డున పడాల్సి వస్తుంది. అలా జరిగితే శశికళ అప్పు ఎలా తీరుస్తాం' అంటాడు. దీనికి లాస్య 'పరిస్థితి చేయి దాటితే మనం కూడా ప్లేట్ ఫిరాయించాలి' అంటూ మరో కన్నింగ్ ప్లాన్ వేస్తుంది. దీంతో ఈ ఎపిసోడ్ పూర్తైంది.