Intinti Gruhalakshmi: విక్రమ్ ఊహించని నిర్ణయం.. ఆస్పత్రి దివ్య చేతికే.. అంతలోనే మరో ట్విస్ట్!
భారతదేశంలోని చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే : శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. రాజ్యలక్ష్మికి వరుస షాక్‌లు ఇస్తున్న దివ్య.. 101 రోజులు పూర్తయ్యే సరికి ఎవరికీ కాకుండా పోతావు అంటూ వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత లాస్య.. తులసి వాళ్ల ఇంటికి వెళ్తుంది. లక్కీ కోసం వచ్చానని నాటకం ఆడుతుంది. కానీ, ఆ చిన్నారి మాత్రం అక్కడి నుంచి వెళ్లిపోమంటూ తల్లికి షాక్ ఇస్తాడు. మరోవైపు, సంజయ్ తల్లి కోసం కష్టపడడం చూసిన విక్రమ్ బాధ పడుతుంటాడు. అప్పుడు దివ్య మాత్రం అతడిని ఓదార్చుతుంది. ఆ తర్వాత విక్రమ్‌ను కోటు వేసుకోమని దివ్య అడగ్గా.. అతడు మాత్రం ఆమె మాటలను అస్సలు వినిపించుకోడు.

నాకేం సంబంధం అంటూ : విక్రమ్ ఎంత దూరం పెట్టాలని చూసినా దివ్య మాత్రం అతడిని రెచ్చగొట్టాలని చూస్తుంటుంది. అప్పుడు విక్రమ్ 'నీకు దగ్గరున్నంత మాత్రాన.. నిన్ను మళ్లీ భార్యగా ఒప్పుంకుంటానని అనుకోకు. నాకు ఎలాంటి ఆర్డర్స్ వేయకు' అని వార్నింగ్ ఇస్తాడు. దీనికామె 'నేను నీ భార్యగా మాట్లాడటం లేదు. నీ బాధ్యతల్ని గుర్తు చేస్తున్నాను' అని అంటుంది. అప్పుడు విక్రమ్ 'నా బాధ్యతలు ఏంటో నాకు తెలుసు. హాస్పిటల్ నాకు సంబంధం లేదు. చూస్తే సంజయ్ చూసుకోవాలి. లేదంటే అమ్మ చూసుకోవాలి. అంతేకానీ నాకేం సంబంధం' అని అంటాడు.

దివ్యకే ఆస్పత్రి బాధ్యతలు : విక్రమ్ మాటలకు దివ్య 'అత్తయ్య నడవలేని స్థితిలో ఉన్నారు. జాతకం ప్రకారం ఆమెకు ప్రాణగండం ఉంది. సంజయ్ దీక్షలో ఉన్నాడు. ఆస్పత్రిని ఎవరు చూసుకుంటారు' అంటుంది. దీనికతడు నువ్వు ఉన్నావు కదా చూసుకో అని అనగా.. 'నేను పరాయి దాన్ని కదా' అంటుంది. దీంతో విక్రమ్ 'నీకు కావాలనుకుంటే భార్యనంటావు. ఇష్టం లేకపోతే పరాయిదాన్ని అని అంటావు. ఎటుపడితే అటు మాట్లాడతావు ఏంటి' అని ప్రశ్నిస్తాడు. దీనికి దివ్య 'సర్లే నేను ఎవరో నువ్వే చెప్పు' అని ప్రశ్నించగా.. 'ఈ ఇంట్లో ఉండి.. మా తిండి తింటున్నావు. మా ఆస్పత్రిలో పని చేస్తూ నేను ఇచ్చే జీతం తీసుకుంటున్నావు. అమ్మ వచ్చే వరకూ బాధ్యతల్ని ఆ మాత్రం చూసుకోలేవా' అని కోప్పడతాడు.

నీ సొంత పెత్తనం వద్దంటూ : విక్రమ్ అడగ్గానే దివ్య 'చూసుకుంటాను విక్రమ్.. కానీ నీ వెంటే ఉండి చూసుకుంటాను. మనం మీ నాన్న ఆశయాన్ని కొనసాగిద్దాం. ఎవరొకరు ఆస్పత్రి బాధ్యతలు తీసుకోకపోతే అక్కడ పరిస్థితులు అదుపు తప్పుతాయి. కొడుకుగా మీ తండ్రి ఆశయాన్ని ముందుకు తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత నీదే విక్రమ్. నువ్వే చైర్మన్‌వి' అంటుంది. దీనికి విక్రమ్ 'నాకు కుదరదని చెప్తున్నా కదా. నువ్వే చూసుకో.. కానీ ఏం చేయాలన్నది మాత్రం అమ్మను అడుగు. తను ఫోన్‌లో చెప్తుంది. అమ్మ చెప్పినట్టు మాత్రమే చెయ్.. నీ సొంత పెత్తనం చేయకు' అని చెప్పి వెళ్లిపోతాడు.
వాళ్లు గుడికి.. లాస్య అక్కడ : తులసితో ఏకాంతంగా మాట్లాడడం కోసం ఆమెను గుడికి తీసుకు వెళ్లాలని నందూ డిసైడ్ అవుతాడు. దీంతో ఇద్దరూ కలిసి బయలుదేరుతారు. మరోవైపు లాస్య ఏమో రాజ్యలక్ష్మి ఇంటికి వెళ్తుంది. అప్పుడు 'లక్కీ గాడు అక్కడ లాక్ అయిపోయాడు. వాడి కోసం వెళ్తుంటే నన్ను రానీయడం లేదు. బెదిరించినా భయపెట్టినా ప్రయోజనం ఉండటం లేదు. ఏం చేయాలో తెలియడం లేదు' అని చెప్తుంది. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని రాజ్యలక్ష్మి అడగడంతో లాస్య 'ఎట్టిపరిస్థితుల్లో నేను మళ్లీ ఆ ఇంట్లో అడుగుపెడతాను' అని బదులిస్తుంది.

నువ్వే ఏదో ఒకటి చేయాలి : ఇక, దివ్య ఏమంటుంది అని లాస్య అడగడంతో రాజ్యలక్ష్మి 'నా కాళ్లు విరగ్గొట్టి మూలన కూర్చోబెట్టింది. అటు ఆస్పత్రిని, ఇటు ఇంటిని దున్నేస్తుంది. విక్రమ్‌ను అడ్డుపెట్టుకుని పెత్తనం చేస్తుంది. దాన్ని ఎలా అడ్డుకోవాలో అర్ధం కావడం లేదు. నువ్వే ఏదోటి చేయాలి' అంటుంది. దీంతో బసవయ్య 'తన ముక్కు తుడుచుకోవడమే లాస్యకు చేతకావడం లేదు.. నీ ముక్కు తుడుస్తుందా' అని వస్తాడు. దీంతో లాస్య 'అందుకే నేను ఈ ఇంటికి రావడం లేదు. మీ తమ్ముడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నా సలహాలు నచ్చకపోతే నువ్వే ఇవ్వు' అంటుంది.
తులసి ఇంట్లోకి వెళ్తానని : లాస్య మాటలకు బసవయ్య కౌంటర్లు వేయడంతో ఇద్దరూ వాదనకు దిగుతారు. అప్పుడు లాస్య 'రేపో మాపో నేను ఆ తులసి ఇంట్లో అడుగు పెట్టడం గ్యారంటీ. ఆ తర్వాత తులసిని దెబ్బతీస్తాను. దాంతో దివ్య దారిలోకి వస్తుంది. అప్పుడు దివ్య, విక్రమ్‌లను విడగొట్టడం తేలిక. మీరు ఓపిగ్గా వెయిట్ చేయండి. నా పనిలో నేను ఉంటాను' అని చెప్పి వెళ్లిపోతుంది. దీంతో బసవయ్య 'ఏంటి అక్కా.. ఓపిగ్గా వెయిట్ చేసేది. లాస్య చెప్పినట్టు జరిగితే నేను గుండు కొట్టించుకుని సున్నం బొట్లతో గాడిదపై ఊరేగుతా.. ఇంకా ఆ లాస్యనే నమ్మితే నిన్ను ఎవరూ కాపాడలేరు' అని అంటాడు.

పంతులు దీవించడంతో : ఇక, గుడికి వెళ్లిన తర్వాత తులసి 'అవునూ.. శ్రావణమాసం అన్నారు.. పూజ అన్నారు.. అభిషేకం అన్నారు.. సామాన్లు ఏమీ తీసుకుని రాలేదేంటి' అనగా.. నందూ 'అదే.. నువ్వు ఎలాగూ తీసుకుని వస్తావు కదా అనుకున్నా' అంటాడు. దీంతో మీరు వేరు నేను వేరు అన్నట్లుగా తులసి మాట్లాడుతుంది. తర్వాత ఇద్దరూ పక్కపక్కనే ఉండడంతో పంతులు వచ్చి 'ధర్మపత్నీ' అంటూ మంత్రాలు చదువుతుంటాడు. అది విని నందూ లోలోపల సంతోషిస్తాడు. తులసి మాత్రం విన్నా కామ్‌గానే ఉండిపోతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











