For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: పెళ్లికి ఓకే అన్న సామ్రాట్.. అది చూసి తులసి ఇంట్లో పెను తుఫాను

  |

  రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి మరి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి మీద అనుమానం వచ్చిన విషయాన్ని అనసూయ.. పరందామయ్యకు చెప్తుంది. దీంతో అతడు ఆమెకు విలువైన సలహాలు చెప్పి సర్ధి చెబుతాడు. ఆ తర్వాత పరందామయ్య సామ్రాట్ ఇంటికి వెళ్లి తులసిని అర్జెంటుగా రమ్మని ఫోన్ చేస్తాడు. దీంతో తులసి కంగారుగా అక్కడకు చేరుకుంటుంది. అక్కడ ఆమెకు మ్యూజిక్ స్కూలుకు సంబంధించిన ఇన్విటేషన్ కార్డును చూపించి సర్‌ప్రైజ్ చేస్తారు. అది చూసి తులసి తెగ సంతోషిస్తుంది. మరోవైపు, శృతి, ప్రేమ్ ఒకే రూములో ఉన్నా గొడవ పడి వేరు వేరుగా పడుకుంటారు.

  Liger: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు అషు రెడ్డి షాక్.. ఆ పని మాత్రం చేయకండి అంటూ!

  సామ్రాట్‌తో కలిసి తులసి వంట

  సామ్రాట్‌తో కలిసి తులసి వంట

  ఇన్విటేషన్ కార్డులో తన పేరు వేయించడంపై తులసి సంతోషంగా ఉంటుంది. అప్పుడు సామ్రాట్ 'ఈ కల నీది.. ఆశయం నీది. ఇందులో నాదేం లేదు' అంటాడు. దీంతో తులసి డబ్బు ఇచ్చేది మీరే కదా అంటుంది. అప్పుడే పరందామయ్య ఇక నీ ఆశయం తీరే సమయం వచ్చింది అని తులసితో అంటాడు. దీనికి తులసి 'మామయ్య ఇప్పుడే నేను ఇంటికి వెళ్లి మన వాళ్లందరికీ ఈ గుడ్ న్యూస్ చెబుతా' అంటుంది. అప్పుడు సామ్రాట్ బాబాయి 'కాస్త గుర్రాన్ని కట్టేయమ్మా. ముందు నువ్వు స్వీట్ రెడీ చేసి మా నోరు తీపి చేశాక కానీ వెళ్లకూడదు' అంటాడు. దీనికి సామ్రాట్ 'నేనొప్పుకోను. స్వీట్ నేను కూడా తయారు చేస్తాను. ఇద్దరం కలిసి తయారు చేద్దాం' అంటాడు.

  నందూ, లాస్యను అవమానించి

  నందూ, లాస్యను అవమానించి

  నందూ, లాస్య ఇద్దరూ కలిసి తులసి ఇంటికి వస్తారు. అక్కడ అనసూయ ఉంటుంది. అప్పుడు లాస్య అత్తయ్య బిజీగా ఉన్నట్టున్నారు. మనల్ని చూడటానికి కూడా టైమ్ లేదు అని నందూతో అంటుంది. దీంతో అనసూయ 'పాడైపోయిన ఆకులు.. ఎన్నిసార్లు తెంపినా సిగ్గులేకుండా మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి. నువ్వేంటి నాన్న ఇంత పొద్దున్నే వచ్చావు. అమ్మ మీద బెంగ పెట్టుకున్నావా? నన్ను చూడాలని వచ్చావా' అని నందూను ప్రశ్నిస్తుంది. దీనికతడు ఆఫీసు పని మీద తులసి కోసం వచ్చాను అంటాడు. దీంతో అనసూయ తులసి ఇంట్లో లేదు అంటుంది.

  దారుణమైన ఫొటోతో షాకిచ్చిన దిశా పటానీ: ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!

  నందూకు ఝలక్ ఇచ్చిన తల్లి

  నందూకు ఝలక్ ఇచ్చిన తల్లి

  తులసి లేదని అనసూయ చెప్పడంతో ఎక్కడికి వెళ్లింది అని నందూ అడుగుతాడు. దీనికి అనసూయ 'కట్టుకున్న మొగుడు అడగొచ్చు కానీ.. వదిలేసిన మొగుడు ఇవన్నీ అడగాల్సిన అవసరం లేదు' అంటుంది. ఇంతలో అభి వచ్చి ఏదో ఫోన్ వస్తే కంగారుగా వెళ్లింది.. లోపలికి రండి డాడ్ అంటాడు. దీంతో లాస్య, నందూ ఇంట్లోకి వెళ్లి కూర్చొంటారు. అప్పుడు లాస్య 'ఇంత ఉదయమే తులసి ఎక్కడికి వెళ్లింది. సామ్రాట్‌తో లాంగ్ డ్రైవ్ కు వెళ్లిందేమో' అంటుంది. దీనికి నందూ 'ఇప్పుడు మనకు ఆ విషయాలు ఎందుకు. వచ్చిన పని చూసుకొని వెళ్దాం' అంటాడు.

  నిజం తెలిసి నందూ, లాస్య షాక్

  నిజం తెలిసి నందూ, లాస్య షాక్

  తులసి, సామ్రాట్ ఇద్దరూ కలిసి స్వీట్ తయారు చేయడం ప్రారంభిస్తారు. అది చేయడం పూర్తయ్యాక తులసి ఇంటికి వెళ్తుంది. ఇంట్లో అప్పటికే నందూ, లాస్యను చూసి ఆమె షాక్ అవుతుంది. అప్పుడు లాస్య ఇంత ఉదయమే ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది. దీంతో పరందామయ్య 'ఆమె వెళ్లలేదు. నేను అక్కడికి వెళ్లి తులసికి ఫోన్ చేసి రమ్మన్నాను. అందుకే తను వచ్చింది' అని చెప్తాడు. దీంతో నందూ మీరు సామ్రాట్ గారి ఇంటికి ఎందుకు వెళ్లారు నాన్న అని అడుగుతాడు. అప్పుడు పరందామయ్య 'నీకు అనవసరం. నువ్వు నన్ను అడగాల్సిన అవసరం లేదు. మేము మంచి మూడ్‌లో ఉన్నాం. దాన్ని చెడగొట్టకు' అని ఒక ప్లేట్ తీసుకొని ఇంట్లో వాళ్లు ఎక్కడున్నా హాల్‌లోకి రావాలి అని డప్పు కొడతాడు.

  ఘోరమైన ఫొటోలు వదిలిన హీరోయిన్: ఏం చూపించకూడదో అవే చూపిస్తూ!

  తులసి పేరు.. వాళ్లంతా కోపంగా

  తులసి పేరు.. వాళ్లంతా కోపంగా

  పరందామయ్య పిలవగానే అందరూ అక్కడకు వస్తారు. అప్పుడు పిల్లలంతా ఏంటి తాతయ్య అంటారు. దీనికాయన ఒక శుభవార్త చెప్పాలని అందరినీ పిలిచాను. నీ నోటితో నువ్వే చెప్పమ్మా అంటాడు. దీంతో తులసి 'అత్తయ్య నేను కలలు కన్న మ్యూజిక్ స్కూల్‌కు రేపే శ్రీకారం చుట్టబోతున్నాం. రేపే భూమి పూజ జరగబోతోంది' అని కార్డును అనసూయకు చూపిస్తుంది. తర్వాత అత్తయ్య కార్డులో నా పేరు కూడా వేశారు చూడండి అని చూపిస్తుంది. లాస్య, నందూ ఆ పేరు చూసి షాక్ అవుతుంది. ఆ వెంటనే లాస్య 'నీ పేరు, సామ్రాట్ పేరు పక్కపక్కన చూస్తుంటే నిజంగా ఇది శుభలేఖ లాగానే ఉంది' అంటుంది. దీంతో అభి ఆ కార్డును చూసి షాక్ అవుతాడు.

  ఆ కార్డును చింపేసి వెళ్లిన అభి

  ఆ కార్డును చింపేసి వెళ్లిన అభి

  కార్డును చూసిన అభి 'ఏంటమ్మా ఇది నీ పేరు ఉందని మురిసిపోతున్నావు కానీ.. ఇలా ఆయన పేరును వేయించడం ఏంటి. సంస్కారం ఉన్న మనిషేనా' అని అంటాడు. దీంతో ప్రేమ్ సమస్యలు లేని చోట సమస్యలు క్రియేట్ చేయకు అని అంటాడు. దీంతో లాస్య అభి అన్నదాంట్లో తప్పేముంది అంటుంది. అప్పుడు తులసికి అనసూయ సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, నాకైతే ఇందులో ఎలాంటి తప్పు కనిపించడం లేదు అంటుంది. అప్పుడు అభి 'ఆ భూమి పూజ ఏదో ఆయన్నే చేసుకోనివ్వు. మనకు సంబంధం లేదు. మనం ఎవ్వరం వెళ్లడం లేదు' అంటాడు. దీంతో తులసి నాకు నచ్చినట్టు, నాకు న్యాయం అని అనిపించినట్టు నడుచుకుంటాను అంటుంది. ఆ తర్వాత కాస్త గొడవ పెట్టుకుని కార్డును చించేసి వెళ్లిపోతాడు.

  శివాత్మక రాజశేఖర్ షాకింగ్ స్టిల్: తొలిసారి ఈ రేంజ్‌లో అందాల ఆరబోత

  ఆమెను పెళ్లి చేసుకుంటావా అని

  ఆమెను పెళ్లి చేసుకుంటావా అని

  సామ్రాట్, ఆమె బాబాయి స్వీట్ తింటూ ఉంటారు. అది టేస్ట్ చేసిన వెంటనే సూపర్‌గా ఉంది బాబాయి అంటాడు. అంతేకాదు, 'ఇదే స్వీట్ మనం షాపు నుంచి కూడా తెచ్చుకుంటాం కదా. మరి ఆ స్వీట్ ఎందుకు ఇంత టేస్ట్ ఉండదు' అని అడుగుతాడు. దీంతో ఆయన అది తులసి చేసిన స్వీట్ కాదు కదా అంటాడు. తర్వాత సామ్రాట్ ఇంకోసారి తులసిని పిలిచి స్వీట్ చేయిద్దాం అంటాడు. దీంతో బాబాయి 'పెళ్లి చేసుకొని ఒక ఇల్లాలును ఈ ఇంటికి తీసుకొస్తా అని మాత్రం చెప్పవా? తులసి లాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటావా.. చెప్పరా' అని అడుగుతాడు. దీంతో సామ్రాట్ అది అనుకున్నంత ఈజీ కాదు బాబాయి అంటాడు. దీనికాయన బాధ్యత నాది అనగా సామ్రాట్ సరే అంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 721: Tulasi Shares Good News to her Family. Then Abhi Creates A Scene About This. After That Samrat Uncle Ask Him about Marriage.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X