For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi August 27th Episode: లాస్య గురించి నిజం తెలుసుకున్న నందూ.. శృతికి కొండత కష్టం

  |

  మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అభి, ప్రేమ్, దివ్య రాఖీ పండుగను జరుపుకుంటారు. వాళ్లు సంతోషంగా పండుగను జరుపుకుంటుండగా.. నందూ తన చెల్లి మాధవిని గుర్తు చేసుకుని బాధ పడతాడు. తను రాలేదని దిగులు చెందుతోండగా మాధవి వచ్చి నందూకి రాఖీ కడుతుంది. ఆ తర్వాత లాస్య మాధవికి ఓ చీరను బహుమతి ఇస్తే.. దాన్ని ఆమె తీసుకోదు. తర్వాత తులిసి చెప్పడంతో దాన్ని తీసుకుని పని మనిషి రాములమ్మకు ఇచ్చి ఘోరంగా అవమానిస్తుంది. ఇక, కంపెనీలో నందూకు మరో కష్టం వస్తుంది. దీంతో అతడు తెగ టెన్షన్ పడిపోతుంటాడు.

  కాలేజ్‌ టైమ్‌లో అలాంటి పనులు.. ఆ ఉద్దేశం లేకపోయినా: నిరుపమ్ భార్య మంజుల షాకింగ్ కామెంట్స్

  లాస్య సలహాలు.. నందూ తీవ్ర ఆగ్రహం

  లాస్య సలహాలు.. నందూ తీవ్ర ఆగ్రహం

  కంపెనీలో వచ్చిన సమస్య గురించి నందూ టెన్షన్ పడుతుంటాడు. అంతలో లాస్య అక్కడకు వచ్చి ‘మనం వంద శాతం కష్టపడి పని చేశాం. చిన్న సమస్యకు పెద్ద మొత్తంలో పెనాల్టీ కట్టాలంటే ఎవరి వల్ల కాదు. వాళ్లు మన మీద పెనాల్టీ వేసే ముందే మనం వాళ్ల మీద కోర్టులో కేసు వేద్దాం. సరైన సమయానికి పూర్తవని ప్రాజెక్టును మనకు అంటగట్టారని కేసు పెడదాం' అని కన్నింగ్ సలహాలు ఇస్తుంది. అప్పుడు నందూ ‘చూడు లాస్య.. ఇంట్లో సలహాలు ఇచ్చినట్లు ఇక్కడ కూడా ఇలాంటివి ఇచ్చి నన్ను దిగజార్చకు. కాసేపు ఒంటరిగా వదిలేయ్' అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.

  పొరపాటును వేలెత్తి చూపించడం తప్పా

  పొరపాటును వేలెత్తి చూపించడం తప్పా

  రాఖీ కట్టిన తర్వాత మాధవి చేసిన పని గురించి తులసి గుర్తు చేస్తూ.. ‘నువ్వు అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదని నాకు అనిపించింది మాధవి. మీరు ఇప్పటికే ఆయనను ఎన్నోసార్లు దీని గురించి అడాగారు. దానికి ఆయన సమాధానం కూడా చెప్పారు కదా' అని అంటుంది. అప్పుడు మాధవి ‘ఔను.. మేము అడిగితే తను బాధ పడతాడు. మరి నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం అన్నయ్య కాదా? అన్నయ్య చేసిన దాన్ని నేను ఎప్పటికీ అంగీకరించలేను. అయినా పొరపాటును వేలెత్తి చూపించడం తప్పా వదినా. ఆయన పని కరెక్ట్ కాదు' అంటూ సమాధానం ఇస్తుంది మాధవి.

  టాప్‌ను అమాంతం పైకి లేపిన విష్ణుప్రియ: అందాలు కనిపించేలా ఘాటు ఫోజులతో రచ్చ

  నీవల్లే కంపెనీకి ఈ పరిస్థితి వచ్చిందని

  నీవల్లే కంపెనీకి ఈ పరిస్థితి వచ్చిందని

  కంపెనీ సమస్యల్లో ఉండడంతో నందూ టెర్రస్ మీద ఒంటరిగా టెన్షన్ పడుతుంటాడు. అంతలో లాస్య అక్కడకు వెళ్లి ‘ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నావ్? ఇంత దానికే అసలు నువ్వు ఇలా అయిపోతావని అనుకోలేదు' అని అంటుంది. అప్పుడు నందూ ‘ఏం మాట్లాడుతున్నావ్ లాస్య? అసలు నువ్వు అలెర్ట్‌గా ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నీ ప్రవర్తన వల్లే ఈ సమస్య వచ్చింది. అసలు నీ వల్లే ఈరోజు కంపెనీకి ఈ దుస్తితి వచ్చింది. అప్పుడెదో అట్రాక్షన్‌తో దగ్గరయ్యాం. మనం కూడా ఎప్పటికీ ప్రేమించుకుంటూ ఉంటామా?' అంటూ ఆమెపై ఫైర్ అవుతాడు.

  దారిన పోయే అనాథలు ఇలానే చేస్తారు

  దారిన పోయే అనాథలు ఇలానే చేస్తారు

  ఆఫీస్‌లో టెన్షన్స్‌తో ఇంటికి వచ్చిన నందూను చూసుకోకుండా శృతి తగులుతుంది. దీంతో ఆమె చేతిలో ఉన్న జ్యూస్ షర్ట్‌పై పడుతుంది. అప్పుడు తీవ్ర ఆగ్రహానికి లోనైనా నందూ ‘నీకు అసలు బుద్ధుందా? కళ్లు నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నావా? అసలు నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావో తెలీదు. కానీ తెగ హడావిడి చేసేస్తావు. అయినా దారిన పోయే అనాథలను తీసుకొచ్చి పెట్టినోళ్లను అనాలి' అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అంతలో అక్కడకు పరందామయ్య, తులసి, ప్రేమ్ వస్తారు. వీళ్లంతా ఎంత ఆపడానికి ప్రయత్నించినా నందూ మాత్రం ఫైర్ అవుతూనే ఉంటాడు.

  అందాలు ఆరబోసి షాకిచ్చిన రష్మిక మందన్నా: ఆమెను ఇంత ఘాటుగా ఎప్పుడూ చూసుండరు!

  మీరు ఎవరినైనా తీసుకొచ్చి పెట్టొచ్చా?

  మీరు ఎవరినైనా తీసుకొచ్చి పెట్టొచ్చా?

  శృతిని నందూ తిడుతుండగా తులసి కలుగజేసుకుని ‘అసలు ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఇంతలా ఫైర్ అవుతున్నారు' అని అడుగుతుంది. అప్పుడతను ‘సంబంధం లేని వాళ్లందరినీ ఇంటికి తీసుకొచ్చి సమస్యలు సృష్టిస్తున్నావు' అని నిందిస్తాడు. దీంతో ప్రేమ్ మాట్లాడుతుండగా.. అతడిని ఆపిన తులసి ‘ఎవరు సంబంధం లేని వాళ్లు? దిక్కుతోచని స్థితిలో ఉంటే ఆమెను తీసుకొచ్చాను. అయినా మీరు ఎవరినైనా తీసుకొచ్చి ఇంట్లో పెట్టొచ్చా' అని లాస్యను ఉద్దేశించి అంటుంది. దీనికి పరందామయ్య కూడా సపోర్ట్ చేస్తాడు. దీంతో నందూ ఏదేదో అనుకుంటూ వెళ్లిపోతాడు.

  లాస్య వివరణ... అనసూయ ఆగ్రహం

  లాస్య వివరణ... అనసూయ ఆగ్రహం

  నందూ వెళ్లిపోగానే అక్కడకు అనసూయ వస్తుంది. అప్పుడు ‘ఏమైంది లాస్య? ఎందుకు వాడలా అరుస్తున్నాడు' అని అడుగుతుంది. దీనికామె ‘ఆఫీస్‌లో టెన్షన్స్ ఆంటీ. ప్రాజెక్టు చేయి దాటి పోయే పరిస్థితి వచ్చింది. కంపెనీపై నమ్మకం కూడా పోయే ప్రమాదం వచ్చింది. అందుకే ఆయనలా ఉన్నాడు' అని చెబుతుంది. అప్పుడు అనసూయ ‘వాడి పరిస్థితి అర్థం చేసుకోకుండా ఇంట్లో వాళ్లందరూ ఎలా అరుస్తున్నారో చూడు. అమ్మో నా కొడుకుకి ఎంత కష్టం వచ్చిందో' అని తిడుతుంది. అప్పుడు తులసి ‘మేము పరాయి వాళ్లం కాదు కదా. మాకు చెప్పుకోవచ్చుగా' అని అంటుంది.

  RRR హీరోయిన్ ఒలీవియా మోరిస్ హాట్ ఫొటోలు: ఎంతైనా హాలీవుడ్ కదా.. ఇంత ఘాటుగా ఉండాల్సిందే

  శృతికి అభి సపోర్ట్.. అంకిత మాటలతో

  శృతికి అభి సపోర్ట్.. అంకిత మాటలతో

  ఇంట్లో గొడవ అయిన తర్వాత అంకిత వచ్చి అభిని ఏమీ పట్టించుకోవడం లేదేంటి అని అడుగుతుంది. అప్పుడతను ‘ఏం పట్టించుకోవాలి అంకిత? శృతి ఏదో చిన్న పొరపాటు చేసింది. దానికి డాడ్ ఆఫీస్‌లో ఉన్న టెన్షన్స్ అన్నీ తనపై చూపించి గట్టిగట్టిగా అరిచేశారు. ఆ విషయంలో డాడ్‌ అలా చేసుండకూడదను అనిపించింది' అని అంటాడు. అప్పుడు అంకిత ‘బాగుంది అభి. ఇంట్లో వాళ్లు అందరూ శృతికి సపోర్ట్ చేస్తున్నారేంటీ. అసలు అంకుల్‌కు శృతి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. అందుకే ఆయనలా ప్రవర్తించారని అనిపిస్తుంది' అని అనగా.. ఆ మాటలు శృతి వింటుంది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  జాలైనా ఉండాలి.. అలా మాట్లాడకమ్మా

  జాలైనా ఉండాలి.. అలా మాట్లాడకమ్మా

  అంకిత మాటలను విన్న శృతి వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది. అంతలో అక్కడకు తులసి కూడా వస్తుంది. అప్పుడామె శృతికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ, ఆమె మాత్రం ఏడుస్తూ వెళ్లిపోతుంది. ఆ తర్వాత అంకితను పిలిచి ‘చూడమ్మ అంకిత. శృతికి ఎవరూ లేరు. ఆ విషయాన్ని గుర్తు చేయకుండా మనమే చూసుకోవాలి. ఆమె మీద జాలైనా ఉండాలి కదా. ఎప్పుడూ అలా మాట్లాడకు' అంటుంది. అంతలో అభి ‘అంకిత ఆ ఉద్దేశంతో అనలేదు మామ' అంటాడు. దీనికి ‘నేను అన్నీ విన్నా' అని బదులిస్తుంది తులసి. అప్పుడు అంకిత తనలో తానే మాట్లాడుకుంటుంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 409: Nandhu Tension about Company Problems. Then He Angry on Shruthi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X