For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: అభితో కలిసి లాస్య ప్లాన్.. తులసి కనిపించకపోవడంతో టెన్షన్

  |

  చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి మరి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే


  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. సామ్రాట్‌తో కలిసి స్వీట్ చేసిన తర్వాత తులసి ఇంటికి వెళ్లిపోతుంది. అప్పటికే అక్కడ నందూ, లాస్య ఉంటారు. అప్పుడు సామ్రాట్ ఇంటికి ఎందుకు వెళ్లావని తులసిని వాళ్లు ప్రశ్నిస్తారు. దీంతో పరందామయ్య నేనే తీసుకెళ్లానని అంటుంది. ఆ తర్వాత తులసి ఇన్విటేషన్ కార్డును అందరికీ చూపిస్తుంది. అప్పుడు అనసూయ శుభాకాంక్షలు చెప్పగా.. అభి మాత్రం కోపంతో ఊగిపోతాడు. సామ్రాట్ పేరు పక్కన తులసి పేరు ఉండడంతో కార్డును చించి పడేస్తాడు. ఇక, సామ్రాట్‌ను మళ్లీ పెళ్లి చేసుకోవాలని వాళ్ల బాబాయి ఒప్పిస్తాడు.

  హీరోయిన్ ప్రణిత అందాల ఆరబోత: డెలివరీ తర్వాత హాట్ షోతో అరాచకం

  సారీ చెప్పిన ప్రేమ్... శృతి ఫిదా

  సారీ చెప్పిన ప్రేమ్... శృతి ఫిదా


  ఇంట్లో గొడవ జరిగిన తర్వాత శృతి, ప్రేమ్ మధ్య చర్చ జరుగుతుంది. అప్పుడు ప్రేమ్ 'అన్నయ్యకు అమ్మ మీద కోపం ఉందని అనుకున్నా కానీ.. ఇంతలా అమ్మ మీద పగ పెంచుకున్నాడని అనుకోలేదు. మళ్లీ నాన్న సపోర్ట్ వాడికి' అంటాడు. దీంతో శృతి 'ఈ ఇంట్లో మగాళ్లు అందరూ అంతే కదా. మీరు తప్పు చేయడం అది ఆడవాళ్ల మీదికి నెట్టేయడం. మేము మంచోళ్లం కాబట్టి నెట్టుకొస్తున్నాం. లేకపోతేనా' అంటుంది. దీంతో ప్రేమ్ లేకపోతే ఏంటి అని అడుగుతాడు. అప్పుడు శృతి 'నువ్వు నన్ను మామూలుగా ఇబ్బంది పెట్టావా? ఏడేడు జన్మలకు సంబంధించిన ఇబ్బంది పెట్టేశావు' అంటుంది. దీంతో అంత ఇబ్బంది పడి ఉండటం ఎందుకో అంటాడు. అప్పుడు శృతి బ్యాగ్ సర్ధుతుండగా ప్రేమ్ సారీ చెప్తాడు. దీంతో ఆమె ఆగిపోయి పడుకుంటుంది.

   పెళ్లి గురించి సామ్రాట్ ఆలోచన

  పెళ్లి గురించి సామ్రాట్ ఆలోచన


  ఒంటరిగా ఉన్న సామ్రాట్ తులసి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. కానీ, అసలు ఏం చేయాలి? ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? అన్నది మాత్రం అతడికి అర్థం కాదు. అప్పుడు నిద్ర పోతోన్న హనీని చూస్తాడు. ఆ సమయంలో తన బాబాయి చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటాడు. కానీ, ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు హనీ దగ్గరకు వెళ్లగానే గుడ్ మార్నింగ్ నాన్న అంటుంది. దీంతో అప్పుడే లేచావా అని అడగ్గా.. నువ్వు నా దగ్గరికి వచ్చి పడుకున్నప్పుడే నేను నిద్రలేచా అంటుంది. దీనికి సామ్రాట్ నాటకాలు చేస్తున్నావా ఆగు అంటూ కాసేపు ఆడుకుంటాడు.

  హాట్ షోలో హద్దు దాటిన జాన్వీ కపూర్: శ్రీదేవి కూతురా మజాకానా!

   తులసి ఆంటీ చెప్పిందన్న హనీ

  తులసి ఆంటీ చెప్పిందన్న హనీ


  అప్పుడే నిద్ర లేచిన హనీతో సామ్రాట్ ఈరోజు పూజ ఉంది అని అంటాడు. దీంతో హనీ 'తెలుసు.. తులసి ఆంటి చెప్పింది. ఈరోజు ఏ డ్రెస్ వేసుకోవాలో కూడా చెప్పింది' అని బదులిస్తుంది. దీనికి సామ్రాట్ 'మరి ఇప్పుడు నువ్వు లేచి ఫ్రెష్ అవుతావా లేక తులసి ఆంటి వచ్చి నీకు రెడీ చేస్తుందా' అని ఆ చిన్నారిని అడుగుతాడు. దీంతో హనీ నీకు జలసీ నాన్న అంటుంది. ఆ తర్వాత పదా అని కూతురిని రెడీ చేస్తాడు. అనంతరం తను ఏ డ్రెస్ వేసుకోవాలో సామ్రాట్‌కు మాత్రం అర్థం కాదు. అప్పుడు హనీ ఓ డ్రెస్‌ను చూపించి అది వేసుకో అని అంటుంది. తర్వాత సామ్రాట్, హనీ కిందకు వస్తారు. ఆ సమయంలో సామ్రాట్ వాళ్ల బాబాయితో హనీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. దీనికి సామ్రాట్ ఇదంతా తులసి ట్రైనింగ్ అంటాడు.

  అభికి సలహాలు ఇచ్చిన లాస్య

  అభికి సలహాలు ఇచ్చిన లాస్య


  మరోవైపు, తులసి.. ఇంట్లో ఉన్న తులసి కోటకు పూజ చేస్తుంది. ఆ సమయంలో 'నేను కోరిన వరాన్ని ప్రసాదించావు. ఈరోజే మ్యూజిక్ స్కూల్ భూమి పూజ. అడుగడుగునా ఆటంకాలు.. అయినా వదల్లేదు. నువ్వు నా వెనుక ఉన్నావని నేను నమ్మాను' అని అనుకుంటుంది. ఇంతలో లాస్య.. అభికి ఫోన్ చేసి తులసి ఏం చేస్తోంది అని అడుగుతుంది. దీంతో తులసి కోటకు మొక్కుకుంటోంది అంటాడు. అప్పుడు లాస్య భూమి పూజ ఆపలేవా. అది జరిగిందంటే మీ ఇంటికి యజమాని కూడా సామ్రాట్ అవుతాడు' అంటూ అభిని మరింతగా రెచ్చగొడుతుంది.

  టాప్‌ను పైకి లేపి షాకిచ్చిన నిహారిక: తొలిసారి మెగా డాటర్ హాట్ ట్రీట్

  అభితో కలిసి లాస్య కన్నింగ్ ప్లాన్

  అభితో కలిసి లాస్య కన్నింగ్ ప్లాన్


  లాస్య మాటలకు అభి ఏం చేయమంటారు అని అడుగుతాడు. దీంతో లాస్య నేను చెప్పేది పొల్లు పోకుండా విను అని ఒక ప్లాన్ చెబుతుంది. అంతేకాదు, 'ఈ పని చేశావనుకో భూమి పూజ కాదు.. మ్యూజిక్ స్కూల్ అడుగు అనేది వెనక్కి పోతుంది' అంటుంది. దీంతో అభి 'మామ్ హర్ట్ అవుతుందేమో. డాడ్, మామ్ గురించి సామ్రాట్ గారికి తెలియకూడదనే కదా' అంటాడు. అప్పుడామె 'ఆ సీక్రెట్ బయటపడకుండానే పూజ ఆపొచ్చు. నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు' అంటుంది. దీంతో సరే ఆంటి మీరు చెప్పినట్టే చేస్తాను అని అభి పోన్ పెట్టేస్తాడు. అప్పుడు లాస్య తెగ సంతోషిస్తుంది. దీంతో నందూ వచ్చి ఏమైందని అడుగుతాడు. ఎక్సర్‌సైజ్ చేస్తున్నా అంటుంది. తర్వాత తులసి మ్యూజిక్ స్కూల్ ప్లాన్ తీసుకుని నందూ వెళ్లిపోతాడు.

  శృతి, ప్రేమ్ మధ్య రొమాంటిక్‌గా

  శృతి, ప్రేమ్ మధ్య రొమాంటిక్‌గా

  శృతి చక్కగా స్నానం చేసి రెడీ అవుతూ ఉంటుంది. చీర కట్టుకొని ఉన్న శృతిని చూసి ప్రేమ్ షాక్ అవుతాడు. తర్వాత ఆమెను అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో ప్రేమ్‌లో నుంచి అతడి రూపంలోనే ఉన్న ఆత్మ బయటికి వస్తుంది. అతడు శృతి వైపు వెళ్తుంటే వెళ్లొద్దురా అని అసలైన ప్రేమ్ అంటాడు. అప్పుడు ప్రేమ్ ఆత్మ 'నేను ఆగలేనురా. వెనుక నుంచి వెళ్లి లటుక్కున పట్టుకొని కిస్ పెడతా' అంటాడు. అప్పుడు ప్రేమ్ అరవగా.. 'ఉదయాన్నే లేచి రెడీ అవ్వాల్సింది పోయి.. అరుస్తున్నావా' అని శృతి అక్కడి నుంచి కోపంతో వెళ్లిపోతుంది.

  ఘోరమైన ఫొటోలు వదిలిన హీరోయిన్: ఏం చూపించకూడదో అవే చూపిస్తూ!

  తులసిపై లాస్య వెటకారంగానే

  తులసిపై లాస్య వెటకారంగానే


  భూమి పూజ కోసం సామ్రాట్, హనీ వస్తారు. తులసి కోసం వెతుకుతాడు. కానీ.. ఆమె రాలేదేంటని అనుకుంటాడు. అప్పుడు లాస్య 'రావాల్సిన వాళ్లు రాకపోయేసరికి ఎదురు చూస్తున్న మనసు ముందు టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత భయపడుతుంది. ఈరోజు ఫంక్షన్‌కు మీరు గెస్ట్ కాదు మేడమ్.. హోస్ట్. మీరు ఆలస్యంగా వస్తే సామ్రాట్ గారు టెన్షన్ పడతారు. భూమి పూజ ఏర్పాట్లు అదిరిపోయాయి సార్. తులసి మేడమ్ మీరు పార్టనర్‌గా చేస్తున్న ఈ పూజ ఏర్పాట్లు ఇలా ఉంటే.. ఇక మీ పెళ్లికి ఏ రేంజ్‌లో ఏర్పాట్లు ఉంటాయో. అదేంటి అందరూ అంత షాక్‌గా చూస్తున్నారు. నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? సామ్రాట్ గారికి మీరు మంచి సంబంధం చూస్తున్నారు కదా. ఏదైనా సంబంధం చూస్తే పెళ్లి చేస్తారు కదా' అంటుంది. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 722: Prem and Shruthi Have a Healthy Argument with Each Other. After That Lasya Persuades Abhi to Ruin Tulasi and Samrat Event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X