For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi August 28th Episode: శృతి కోసం తులసి కొత్త ప్లాన్.. ఇంట్లో శుభకార్యానికి రెడీ

  |

  ఎన్నో ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఆఫీస్‌లో సమస్య రావడంతో నందూ బాగా టెన్షన్‌ పడుతుంటాడు. ఈ క్రమంలోనే లాస్య కన్నింగ్ ప్లాన్ చెప్పడంతో నందూ ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడతాడు. అంతేకాదు, ఆమె నిర్లక్ష్యం వల్లే కంపెనీ కష్టాల్లో పడిందని నిందిస్తాడు. ఆ కోపంతోనే ఇంటికి వచ్చిన నందూకు శృతి చూసుకోకుండా తగులుతుంది. దీంతో ఆమె చేతిలో ఉన్న జ్యూస్ అతడి మీద పడడంతో అనాథ అని అంటూ ఫైర్ అవుతాడు. అప్పుడు ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఆ తర్వాత అంకిత కూడా అలానే మాట్లాడడంతో శృతి బాగా బాధపడుతుంది.

  ఘాటు ఫోజులతో రెచ్చిపోయిన సుస్మితా సేన్: 45 ఏళ్ల వయసులో మరీ ఇంత దారుణంగానా!

  తులసి ముందు సారీ.. ఆమెతో అలా

  తులసి ముందు సారీ.. ఆమెతో అలా

  శృతి బాధ పెట్టడంతో అంకితను తులసి మందలిస్తుంది. దీంతో ఆమె ముందు సారీ చెప్పిన అంకిత.. శృతికి కూడా చెప్తానని వెళ్తుంది. ఆమె దగ్గరకు వెళ్లడం వెళ్లడమే ‘ఏంటి శృతి బాధ పడుతున్నావా? అయినా నేనైతే ఇన్ని మాటలు పడుకుంటూ ఉండలేను. ఎందుకంటే నాకు అభిమానం ఉంది కాబట్టి' అంటుంది. అప్పుడు శృతి ‘అంకుల్ ఏదో తిట్టారని బాధ పడట్లేదు. నాక్కూడ ఆత్మాభిమానం ఉంది. నేనేమీ ఎవరి మీద ఆధారపడి బతకడం లేదు. ఇక్కడ నన్ను ఇష్టపడే వాళ్లు, ప్రేమించే వాళ్లు చాలా మందే ఉన్నారు' అంటూ ధీటైన సమాధానం చెబుతుంది.

  నాకు తోడికోడలు అవ్వాలని చూడకు

  నాకు తోడికోడలు అవ్వాలని చూడకు

  శృతితో మాట్లాడుతోన్న సమయంలోనే అంకిత ఓవర్‌గా రియాక్ట్ అవుతుంది. ‘ప్రేమ్ ఏదో ప్రేమగా మాట్లాడుతున్నాడని తెగ ఫీలైపోకు. తనను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నావేమో. నాకు తోడికోడలు అవ్వాలని చూడకు. నీకు నాకూ అస్సలు ఏ విషయంలోనూ పొంతన లేదు. నీ ముఖం చూడాలంటే చిరాకుగా ఉంది. ఇక్కడి నుంచి వెళ్లిపో. నేను ఎలాగైనా అభిని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతా. అప్పటి వరకూ నీకు చుక్కలు చూపిస్తా' అంటూ వార్నింగ్ ఇస్తుంది. దీనికి శృతి ఎంతగానో బాధ పడుతుంది. ఆ తర్వాత అంకిత అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

  సుడిగాలి సుధీర్ రెమ్యూనరేషన్ లీక్: ఏ షోకు ఎంత వస్తుందంటే.. వామ్మో నెలకే అంత ఆదాయమా!

   శృతి కన్నీటి పర్యంతం... ఓదార్చుతూ

  శృతి కన్నీటి పర్యంతం... ఓదార్చుతూ

  ఇంట్లో జరుగుతున్న అవమానాలను తలచుకుంటూ తన తండ్రి ఫొటో దగ్గర ఏడుస్తూ ఉంటుంది శృతి. ఆ సమయంలో ‘మీరు ఎందుకు వెళ్లిపోయారు నాన్న. ఇలా అవమానాలను ఎదుర్కోవాలనే నన్ను వదిలేసి వెళ్లిపోయావా? చిన్నప్పుడే అమ్మ ప్రేమను కోల్పోయాను. ఇప్పుడు మీరూ వెళ్లిపోయి నన్ను అనాథను చేసేశారు. అసలు నా జీవితానికే అర్థం తెలియట్లేదు. నేనేం చేయాలో తెలియట్లేదు. ఎలా ఉండాలో అర్థం కావట్లేదు' అని బాధ పడుతుంటుంది. అదంతా ప్రేమ్, తులసి అక్కడే ఉండి చూస్తుంటారు. ఆ సమయంలో ఆమెలో ధైర్యం నింపేలా ఓదార్చుతారు.

  ప్రమాణం చేశాను కదా... మరిచావా?

  ప్రమాణం చేశాను కదా... మరిచావా?

  తులసి ఎంత చెప్పినా శృతి ఏడుస్తూనే ఉంటుంది. అప్పుడు ప్రేమ్ ‘నీకు నేనున్నా అంటూ ప్రమాణం చేశాను కదా. నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను అనే కదా ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాను. అలాంటిది ఇప్పుడు ఎవరూ లేరని ఎలా అంటున్నావ్' అని అడుగుతాడు. అప్పుడామె తన బాధను అతడికి మరోసారి వివరిస్తుంది. ఆ తర్వాత తులసి కూడా విలువైన మాటలు చెప్పి శృతిని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. అయినా శృతి వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంటుంది. అప్పుడు మరింతగా ధైర్యం చెబుతుంది. దీంతో శృతి.. తులసిని హత్తుకుని దాన్ని మర్చిపోతుంది.

  ఆరియానాపై అవినాష్ సంచలన వ్యాఖ్యలు: అతడితో అలాంటి పనులు.. తప్పని చెప్పినా వినలేదంటూ!

  శృతికి పెళ్లి.. ఇద్దరూ కలిసి నిర్ణయం

  శృతికి పెళ్లి.. ఇద్దరూ కలిసి నిర్ణయం

  శృతి పరిస్థితిని చూసి బాధ పడుతోన్న తులసి దగ్గరకు మాధవి వస్తుంది. అప్పుడు ‘ఏంటి వదినా? శృతి గురించి ఆలోచిస్తూ బాధ పడుతున్నావా? ఏదైనా అన్నయ్య తనను అలా అనకుండా ఉండాల్సింది. తన పరిస్థితి తెలుసి కూడా అనాథ అంటూ బాధ పెట్టి ఉండాల్సింది కాదు' అంటూ అంటుంది. అప్పుడు తులసి ‘నేను కూడా అదే ఆలోచిస్తున్నా మాధవి. శృతికి అనాథ అనే భావన కలుగకుండా చేయాలి. అందుకోసం ఆమె ఆలోచనను మార్చాలి' అని అంటుంది. దీనికి మాధవి ‘ఒకపని చేస్తే బాగుంటుంది వదినా. శృతికి పెళ్లి చేసేస్తే ఎలా ఉంటుంది' అని అంటుంది.

  ప్రేమ్‌తో శృతి పెళ్లి.. మాధవి సలహాతో

  ప్రేమ్‌తో శృతి పెళ్లి.. మాధవి సలహాతో

  శృతి పెళ్లి గురించి ప్రస్తావన వచ్చిన సమయంలోనే మాధవి మాట్లాడుతూ.. ‘ప్రేమ్ ఒకప్పుడు శృతిని ప్రేమించాడు కదా. ఇప్పుడు వాళ్లిద్దరినీ ఏకం చేస్తే.. అంటే ఇద్దరికీ పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది?' అని సలహా ఇస్తుంది మాధవి. అప్పుడు తులసి ‘అప్పుడైతే ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇప్పుడు వాళ్లు ప్రేమలో ఉన్నారో.. ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారో తెలియదు కదా. మనం పెళ్లి గురించి అడిగితే ఎలా ఫీల్ అవుతారో అని భయంగా ఉంది' అని అంటుంది. దీనికి మాధవి ‘ముందు అడిగితేనే కదా వదినా తెలిసేది. ప్రేమ్‌ను ముందు అడుగుదాం. ఆ తర్వాత శృతితో మాట్లాడదాం' అంటుంది.

  మెగా హీరోల కోసం అభిమాని సాహసం: సర్‌ప్రైజ్ చేసిన చిరంజీవి, పవన్.. ఏ హీరో చేయని విధంగా!

   నందూ టెన్షన్.. తండ్రితో ప్రేమ్ ఫైటింగ్

  నందూ టెన్షన్.. తండ్రితో ప్రేమ్ ఫైటింగ్

  ఆఫీస్‌లో వచ్చిన సమస్య గురించి నందూ ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటాడు. దీంతో లాస్య అతడికి ధైర్యం చెప్పేలా మాట్లాడుతుంది. కానీ, నందూ మాత్రం తెగ భయపడిపోతుంటాడు. అంతలో అక్కడకు ప్రేమ్ ఆవేశంగా వస్తాడు. ఆ సమయంలో ‘నాన్న మీరు చాలా తప్పు చేశారు. శృతి అన్ని మాటలు అని చాలా పెద్ద తప్పు చేశారు' అని గొడవకు రెడీ అవుతాడు. అప్పుడతను ‘అరేయ్ ప్రేమ్.. నేను టెన్షన్‌లో ఉన్నాను. ఇప్పుడు నీతో మాట్లాడే మూడ్ లేదు వెళ్లిపో' అని అంటాడు. కానీ, ప్రేమ్ మాత్రం వెళ్లకపోగా తండ్రితో ఫైటింగ్‌కు రెడీ అవుతుంటాడు. దీంతో ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 410: Ankitha Blamed Shruthi with Strong Words. Then Prem and Tulasi comforted Shruthi. After That Madhavi Suggested to Do to Marriage Prem and Shruthi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X