Intinti Gruhalakshmi: తల్లికి షాకిచ్చిన విక్రమ్.. లక్కీ ట్విస్టుతో మైండ్ బ్లాక్.. నందూకు మళ్లీ నిరాశ
గతంలో కంటే ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు వస్తున్నప్పటికీ తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
శనివారం ఎపిసోడ్‌లో జరిగిందిదే:శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఆస్పత్రి బాధ్యతలు తీసుకోవాలని విక్రమ్‌ను దివ్య ఎంత రెచ్చగొట్టినా అతడు మాత్రం ఒప్పుకోడు. పైగా దివ్యనే ఆస్పత్రి వ్యవహారాలను చూసుకోమని చెప్తాడు. అంతేకాదు, తల్లి సలహాలు కూడా తీసుకోవాలని సూచిస్తాడు. ఇక, రాజ్యలక్ష్మి ఇంటికి వచ్చిన లాస్య దివ్యను దెబ్బకొట్టేందుకు ప్లాన్ చేస్తానని అంటుంది. దీంతో తులసి ఇంట్లోకి వెళ్లి ఆమెను దెబ్బకొడతానని చెప్తుంది. ఇక, తులసి, నందూ కలిసి గుడికి వస్తారు. అక్కడ పంతులు ఇద్దరూ భార్యభర్తలు అని పొరబడతాడు. దీంతో తులసి ఇబ్బంది పడగా.. నందూ తెగ సంతోషిస్తాడు.

పంతులు తిట్టడంతో పరార్:గుడిలో ఉండగానే ఎలాగైనా తులసికి ప్రపోజ్ చేయాలని నందూ ప్రయత్నిస్తుంటాడు. అప్పుడు ఆమెను ఒక దగ్గర కూర్చోబెట్టి మాట్లాడుతుంటాడు. ఆ పక్కనే చాలా ప్రేమ జంటలు కూడా ఉంటాయి. ఒకరి ఒళ్లో ఒకరు పడుకుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. దీంతో పంతులు వచ్చి వాళ్లను తిట్టేస్తాడు. అది చూసిన నందూ తనను కూడా అన్నాడనుకుని అక్కడి నుంచి లేస్తాడు. అప్పుడు పంతులు మిమ్మల్ని అనలేదు.. మీరు కూర్చోండి అంటాడు. అయినా నందూ వెళ్లిపోతాడు. తర్వాత నందూ కొబ్బరికాయ కొడుతూ గాయం చేసుకోగా.. తులసి వచ్చి క్లాస్ పీకుతుంది.
విక్రమ్‌ను ఒప్పించిన దివ్య:విక్రమ్‌ను సూటు వేసుకోమని అడిగితే ఒప్పుకోడు. దీంతో దివ్య మామ ప్రకాశం సాయంతో అతడిని ఒప్పిస్తుంది. అంతేకాదు, ఆస్పత్రి బాధ్యతలను తీసుకునేలా చేసి.. అతడి రూపురేఖలన్నీ మార్చే ప్రయత్నం చేస్తుంది. దీంతో సూటు వేయించి మరీ ఆస్పత్రికి వెళ్లేందుకు రెడీ చేస్తుంది. అప్పుడు అతడు మెట్లు దిగుతూ దివ్య మీద పడగా.. ఇద్దరూ రొమాంటిక్‌గా చూసుకుంటారు. అది చూసిన రాజ్యలక్ష్మి షాక్ అవడంతో పాటు దివ్య చేష్టలకు కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తర్వాత విక్రమ్ వెళ్లి తల్లి కాళ్లకు నమస్కరించి ఆశీర్వదించమని అడుగుతాడు.

ఆ అవసరం నీకేంటి బాబు:విక్రమ్ రెడీ అవడం చూసిన రాజ్యలక్ష్మి ఏదైనా పార్టీకి వెళ్తున్నావా అని అడుగుతుంది. దీంతో విక్రమ్ 'లేదమ్మా.. ఆస్పత్రికి వెళ్తున్నా' అని బదులిస్తాడు. దీనికామె 'ఆస్పత్రికి ఏంటి? నువ్వు వెళ్లాల్సిన అవసరం ఏంటి? నేను ఉన్నాను కదా' అని అనగా.. 'నీకు ఓపిక సరిపోవడం లేదు కదమ్మా. పైగా నీ కాలు కూడా బాలేదు. అందుకే నేను వెళ్తున్నా' అని విక్రమ్ బదులిస్తాడు. దీంతో రాజ్యలక్ష్మి 'నా కాలు పూర్తిగా తగ్గిపోయింది. చూడు ఎలా ఫాస్ట్‌గా నడుస్తున్నానో' అని కుంటుకుంటూ నడుస్తుంది. బలవంతంగా నడవడంతో కాలు మళ్లీ బెణికి సోఫాలో కూర్చుండిపోతుంది.

ఆస్పత్రిని నేను చేస్తానని:రాజ్యలక్ష్మి మాటలకు ప్రకాశం, దివ్య వెటకారం చేస్తుంటారు. దీనికామె 'నాన్నా విక్రమ్.. నాకు బాగానే ఉంది. నువ్వు ఎవరి మాటలూ వినకు. ఎవరి మాటలూ పట్టించుకోకు. నువ్వు నీ ఇంట్లో ఉండు. హాస్పిటల్ సంగతి నేను చూసుకుంటాను కదా' అంటుంది. దీంతో సంజయ్ 'అవును అన్నయ్యా.. అమ్మకు తోడుగా నేను ఉంటాను కదా' అంటాడు. దీంతో విక్రమ్ 'అదెలా కుదురుతుంది నువ్వు దీక్షలో ఉన్నావ్ కదా' అంటాడు. అప్పుడు సంజయ్ 'మధ్యాహ్నం నుంచి ఖాళీగానే ఉంటాను కదా అన్నయ్యా' అని సమాధానం చెబుతాడు.

సంజయ్‌కు విక్రమ్ క్లాస్:ఆ తర్వాత సంజయ్ 'ఇంట్లో దేవుడుకి దండం పెట్టుకుంటే సరిపోతుందిలే' అంటాడు. దీంతో విక్రమ్‌కి కోపం వచ్చి 'అంతా నీ ఇష్టమేనా? ఈ దీక్ష చేస్తున్నది సరదా కోసం కాదు.. అమ్మ ఆరోగ్యం కోసం. అమ్మ ప్రాణగండం తప్పించాలి. దీనిపైనే నీ దృష్టి ఉండాలి' అని అరుస్తాడు. కాసేపు అలా మాట్లాడుకున్న తర్వాత విక్రమ్ ఆస్పత్రికే వెళ్తానని తేల్చి చెప్తాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్తూ సూటులో ఇబ్బంది పడుతూ ఉంటాడు. అప్పుడు దివ్య అతడిని పట్టుకుని నడిపిస్తుంది. అది చూసి రాజ్యలక్ష్మి వాళ్లు కుళ్లుకుంటారు. ఆ తర్వాత దివ్య 'విక్రమ్.. నువ్వు చాలా బాగున్నావు. అద్దంలో నీ కళ్లతో చూసుకుని ఉంటావు. ఇప్పుడు నా కళ్లతో చూస్తున్నా. నిజంగానే చాలా అందంగా ఉన్నావు' అని అనగా.. విక్రమ్ ఆమెకు క్లాస్ పీకుతాడు.

నువ్వు వస్తే నో హ్యాపీ అని:లక్కీకి లాస్య ఫోన్ చేయడంతో ఆ బుడ్డోడు విసుక్కుంటాడు. తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో కాల్ లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు లాస్య ఎలా ఉన్నావు అనగా.. ఇంకెలా ఉంటా.. నువ్ ఫోన్ చేశావ్ కదా అని అంటాడు. కాసేపు అలా మాట్లాడిన తర్వాత లాస్య 'ఇలా మర్చిపోతావ్ అనే వచ్చి నీతో ఉందాం అనుకుంటున్నా. మన అగ్రిమెంట్ ఏంటిరా.. నేను నిన్ను అక్కడికి పంపింది. మనిద్దరం కలిసి అక్కడ ఉందాం అనే కదా' అంటుంది. దీనికి లక్కీ 'నాకు నువ్వు వద్దు.. డాడీనే కావాలి' అంటాడు. దీంతో లాస్య 'రేయ్ నా మాట వినకపోతే వచ్చి గొడవ పెడతా. అప్పుడు వాళ్లు నాతో పాటు నిన్ను కూడా బయటకు గెంటేస్తారు. బుద్దిగా నా మాట విను. మమ్మీ కావాలని ఏడువు' అంటుంది. దీంతో లక్కీ 'వద్దు మమ్మీ నువ్వు వస్తే హ్యాపీగా ఉండలేను' అంటాడు.
మాకు సంబంధం లేదు:లక్కీ మాటలకు లాస్య 'రేయ్ నన్ను రెచ్చగొట్టకు. నా మాట వినాల్సిందే.. మళ్లీ సాయంత్రం కాల్ చేస్తా' అని ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడే అక్కడకు వచ్చి అదంతా విన్న తర్వాత నందూ 'లక్కీని వాళ్ల అమ్మ లాస్య ఎలా ఇబ్బంది పెడుతుందో చూశావా తులసీ.. కారణం ఏంటో కనుక్కో' అంటాడు. దీనికామె 'వాడు ఈ ఇంటికి వచ్చాడు కాబట్టి.. ఇక్కడ ఉంటున్నాడు కాబట్టి.. వాడి మంచి చెడ్డలు చూస్తున్నా.. అంతేగానీ గొడవలో జోక్యం చేసుకోను. లక్కీ ఇక్కడికి రావడానికి కారణం మీరు.. కావాలంటే వాడి అమ్మతో మాట్లాడండి' అంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











