For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: దీపక్ ఎంట్రీతో మారిన సీన్.. సామ్రాట్‌ను హత్తుకోవడంతో!

  |

  తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి మరి!

   శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే


  శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి ఇంట్లో గొడవ జరిగిన తర్వాత ప్రేమ్, శృతి మధ్య రొమాంటిక్‌గా సంభాషణ జరుగుతుంది. ఆ సమయంలో శృతి వెళ్లిపోతానని అనగానే ప్రేమ్ ఆమెకు సారీ చెప్తాడు. అనంతరం అభికి ఫోన్ చేసిన లాస్య అతడిని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. అంతేకాదు, ఈ పూజను ఆపేందుకు ఓ ప్లాన్ కూడా అతడికి చెప్తుంది. హనీ, సామ్రాట్ రెడీ అవుతారు. ఇక, వాళ్లు భూమి పూజ జరిగే ప్రదేశానికి వస్తారు. కానీ, తులసి మాత్రం ఆలస్యంగా వస్తుంది. ఆ సమయంలో లాస్య.. తులసి, సామ్రాట్ మధ్య సంబంధం ఉన్నట్లు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుంది.

  HBD Nagarjuna: నాగార్జునకు అన్ని కోట్ల ఆస్తులు.. రెమ్యూనరేషన్ ఇలా.. ప్రపంచంలో ఏకైక హీరోగా రికార్డు

  లాస్యపై పరందామయ్యకు డౌట్

  లాస్యపై పరందామయ్యకు డౌట్


  పూజ దగ్గరకు వచ్చిన పరందామయ్య 'ఈ లాస్య కావాలని భూమి పూజను ఆపడానికి ప్రయత్నిస్తున్నట్టుంది. అది జరగని పని' అని అనసూయతో అంటాడు. అప్పుడామె 'హా.. దాని బొంద. అదేం చేయలేదు. పూజ విజయవంతంగా పూర్తి అవుతుంది. మీరేమీ కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టకండి' అని అంటుంది. అందుకు అనుగుణంగానే పూజకు తగిన ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. అప్పుడు సామ్రాట్ 'తులసి గారు, నేను పూజలో కూర్చొంటాం. మీరు ఇక్కడికి వచ్చే గెస్టులను చూసుకోండి. మర్యాదల్లో తేడా ఉండకూడదు' అని లాస్య, నందూకు చెబుతాడు.

  సామ్రాట్‌ను హత్తుకున్న ప్రేమ్

  సామ్రాట్‌ను హత్తుకున్న ప్రేమ్

  పూజకు ఏర్పాట్లు జరుగుతూ ఉండగా ప్రేమ్.. సామ్రాట్ దగ్గరకు వచ్చి హత్తుకుంటాడు. అంతేకాదు 'మా అమ్మ కలను నెరవేర్చుతున్నారు. ఇన్ని రోజులు మా అమ్మ తన కోసం కాకుండా మా అందరి కోసం బతికింది. అయినా తనకు ఇప్పటి వరకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు. మా అమ్మకు ఎవరూ ఇవ్వలేని గౌరవాన్ని మీరు ఇస్తున్నారు. ఎప్పటి నుంచో ఈ విషయాన్ని చెప్పాలని అనుకున్నాను. మీరు ఏమంటారో అని అనుకున్నాను. కానీ, మీరు ఏమనుకున్నా చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేశాను. నాకు నా జీవితంలో మా అమ్మ తర్వాతే ఎవరైనా' అంటాడు.

  పాయల్‌ను ఏమీ లేకుండా చూపించమన్న నెటిజన్: ఆ ఫొటో షేర్ చేయడంతో షాక్

   ప్రేమ్‌కు మాటిచ్చిన సామ్రాట్

  ప్రేమ్‌కు మాటిచ్చిన సామ్రాట్


  ప్రేమ్ మాటలకు సామ్రాట్ అమ్మంటే ఎవరికైనా అంతే అంటాడు. దీంతో ప్రేమ్ 'ఏదో ఒక రోజు మా అమ్మ ఎంతో ఎత్తుకు ఎదగాలి. లోకమంతా మా అమ్మవైపు చూడాలి అని అనుకున్నాను. ఆ కలను మీరు నిజం చేశారు. ఎప్పటికీ ఇలాగే మా అమ్మకు సపోర్ట్‌గా ఉంటానని మాటివ్వండి సార్ ప్లీజ్. ఒకవేళ తను అలసిపోయి ఆగిపోయినా మీరు మాత్రం ఆగనివ్వకూడదు. మాటివ్వండి సార్' అంటాడు. దీంతో సరే అని అంటాడు సామ్రాట్. ఆ తర్వాత భూమి పూజ ప్రారంభం అవుతుంది. ఆ సమయంలో తులసి పంతులు గారు అన్నీ వచ్చినట్టే కదా అని అడుగుతుంది.

  తులసి, సామ్రాట్‌తో ప్రెస్‌మీట్

  తులసి, సామ్రాట్‌తో ప్రెస్‌మీట్


  ఇక, తులసిని చూసిన పంతులు మీరు వచ్చాకే పూజకు కలొచ్చింది అంటాడు. ఇంతలో సామ్రాట్ వచ్చి పూజ మొదలు పెట్టడానికి ఇంకెంత టైమ్ పడుతుంది అని అడుగుతాడు. దీంతో పంతులు ఇంకో పావుగంట పడుతుంది అంటాడు. దీంతో సామ్రాట్‌ 'ఈలోగా మనం ప్రెస్‌మీట్ పూర్తి చేద్దాం' అని తులసితో అంటాడు. దీనికామె అయ్యో.. ప్రెస్‌మీటా అదెందుకు అంటుంది. దీంతో సామ్రాట్ 'నేను స్టార్ట్ చేసిన వెంచర్స్‌లో ఇది 20వది. దీంతో మీడియా వాళ్లు ఇంటర్వ్యూ కావాలంటూ ఒకటే విసిగిస్తున్నారు' అని చెప్తాడు. అప్పుడు తులసి అయ్యో.. నాకు అందరి ముందు మాట్లాడటం రాదు అంటుంది. దీంతో ఏం కాదు వెళ్లండి.. అని అందరూ బతిమిలాడుతారు. అప్పుడు నందూను రెచ్చగొట్టేలా లాస్య మాట్లాడుతుంది.

  హాట్ షోలో హద్దు దాటిన దివి: ఏకంగా స్నానం చేస్తోన్న పిక్ వదలడంతో!

  దీపక్ ఎంట్రీ.. నందూ టెన్షన్‌గా

  దీపక్ ఎంట్రీ.. నందూ టెన్షన్‌గా


  భూమి పూజ జరిగే ప్రదేశానికి తులసి తమ్ముడు దీపక్ వస్తాడు. వచ్చీ రావడమే అతడు నందూతో నమస్కారం మాజీ బావ గారు అంటాడు. ఇంతలో తులసి అతడిని చూసి 'రా.. ఏమైంది.. ఎంత సేపు అయింది వచ్చి. అమ్మ రాలేదా. రా.. సామ్రాట్ గారిని పరిచయం చేస్తాను' అని తీసుకెళ్తుంది. సామ్రాట్ గారు అంటూ పరిచయం చేయబోతుండగా మీ తమ్ముడు దీపక్ కదా అంటాడు. దీంతో తులసి మీకెలా తెలుసు అని అడుగుతుంది. దీనికి సామ్రాట్ 'మీ కళ్లలో ఆ వెలుగు చూసి చెప్పాను. మిమ్మల్ని చూడటం మొదటి సారే కానీ.. తులసి గారు మీ గురించి చాలా చెప్పారు. మీకు మీ అక్కంటే చాలా ఇష్టమట కదా' అని అడుగుతాడు. ఆ సమయంలో నందూ తెగ టెన్షన్ పడుతూ ఉంటారు.

  దీపక్ ఆగ్రహం.. తులసి ఇలా

  దీపక్ ఆగ్రహం.. తులసి ఇలా


  సామ్రాట్ అడిగిన దానికి దీపక్ 'ఇష్టమే సార్ కానీ ఏం చేయగలను.. ఒక మగాడి దాష్టికానికి బలయితే నేను ఏం చేయలేక చేతులు ముడ్చుకొని కూర్చొన్నాను' అంటాడు. అప్పుడు తులసి 'దీపక్ సంతోషంగా పూజ చేసుకోబోతున్నాం. ఇలాంటప్పుడు బ్యాడ్ మెమోరీ ఎందుకు. వదిలేయ్' అంటుంది. దీనికి దీపక్ 'చేదు గతాన్ని నువ్వు మరిచిపోయావేమో కానీ.. నేను మరిచిపోలేదు అక్క. కొన్నింటిని అంత ఈజీగా మరిచిపోలేం. వాటిని మరిచిపోయినట్టు నటించాలి. అక్క జీవితం ఎడారిలా మారుతుంది చూస్తూ ఎలా ఊరుకోవాలి. అయినా ఊరుకున్నా' అని అంటాడు.

  Bigg Boss 6: సీజన్ ముందు బిగ్ బాస్‌కు షాక్.. చివరి నిమిషంలో ఇద్దరు బిగ్ స్టార్స్ ఔట్

  సామ్రాట్‌కు థ్యాంక్స్ చెప్పాడు

  సామ్రాట్‌కు థ్యాంక్స్ చెప్పాడు


  దీపక్ ఆవేశంగా మాట్లాడిన తర్వాత సామ్రాట్ 'మరి మీ అక్కకు అన్యాయం జరుగుతుండగా మీరు ఎందుకు చూస్తూ ఊరుకున్నారు చెప్పండి' అని ప్రశ్నిస్తాడు. దీనికి దీపిక్ 'నేను ఏదో ఒకటి చేయాలనే అనుకునే వాడిని. కానీ, ఎప్పటికప్పుడు మా అక్క నా కాళ్లకు సంకెళ్లు వేసేది. లేకపోతేనా' అంటాడు. అప్పుడు సామ్రాట్ మీ బాధలో నిజాయితీ ఉంది దీపక్ గారు అంటాడు. దీనికి దీపక్ 'మా అక్క ఎదుగుదలకు తమ్ముడుగా నేను ఏం చేయలేకపోయినా మీరు పెద్దమనసుతో అన్నీ చేస్తున్నారు. చాలా థాంక్స్ సార్' అంటూ ధన్యవాదాలు చెబుతాడు.

   తులసిపై సామ్రాట్ ప్రశంసలు

  తులసిపై సామ్రాట్ ప్రశంసలు


  ఆ తర్వాత సామ్రాట్ వాళ్ల బాబాయి మీడియా వాళ్లు వచ్చారని చెప్తాడు. తులసి, సామ్రాట్ ప్రెస్‌మీట్‌కు వెళ్తారు. వాళ్లతో పాటే లాస్య, నందూ కూడా అక్కడికి వెళ్తారు. ప్రెస్‌మీట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు సామ్రాట్ 'మ్యూజిక్ స్కూల్ అనేది ఒక బిజినెస్ కాదు.. మ్యూజిక్‌ను అందరి జీవితాల్లో భాగం చేయాలని మొదలు పెట్టిన పవిత్ర కార్యం. ఇది నా ఆలోచన కాదు. ఒక మధ్యతరగతి మహిళ మనసులో నుంచి వచ్చిన అద్భుతమైన ఆలోచన. తన బ్రెయిన్ చైల్డ్ తులసి వనం గురించి తులసి గారి మాటల్లోనే విందాం' అంటాడు. దీంతో తులసి మాట్లాడటం మొదలు పెడుతుంది. 'ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉందంటారు. కానీ, నా విజయం వెనుక ఒక మగాడి ఉక్రోషం ఉంది' అని తన గతాన్ని గుర్తు చేసుకుంటుంది. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 723: Deepak Meets Samrat and said Thanks him for Supporting Tulasi Dream. After That Samrat Praises on Tulasi in the Press Meet.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X