Intinti Gruhalakshmi: నిజం చెప్పి షాకిచ్చిన లాస్య.. మరో పెళ్లి చేయాలని డిమాండ్.. తులసికి అవమానం

ఇండియాలో చాలా భాషలు ఉన్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. దివ్య బాధను చూసిన నందూ.. రాజ్యలక్ష్మికి ఫోన్ చేసి విషయం తెలుసుకోమని తులసికి చెప్తాడు. ఆమె మాత్రం విక్రమ్‌కు చెప్తే బాగుంటుందని అతడికి కాల్ చేస్తుంది. కానీ, ఆ ఫోన్ తీసుకున్న రాజ్యలక్ష్మి కాల్ కట్ చేస్తూ ఉంటుంది. దీంతో తులసి వాళ్లు టెన్షన్ పడుతుంటారు. తర్వాత లాస్య వచ్చి విడాకుల డ్రామా మొదలు పెడుతుంది. దివ్య పంపినట్లుగా విక్రమ్‌కు నోటీసులు పంపిస్తుంది. అప్పుడు విక్రమ్ అది నిజమే అనుకుని దివ్యకు కూడా నోటీసులు పంపిస్తాడు. అది చూసిన తులసి వాళ్లు గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటారు.

Intinti Gruhalakshmi Serial Today Episode August 2nd 2023

దివ్యను బాగా తిట్టిన తులసి:దివ్యకు నోటీసులు రావడంతో తులసి 'విక్రమ్ మంచోడే.. ఇదే అతడితో గొడవపడి విడాకుల నోటీసుల వరకూ తెచ్చుకుంది. తన ఆట తననే ఆడుకోమని అంటుంది కదా. నేను పట్టించుకోను. దాన్ని కూడా దాని అమ్మ చచ్చిపోయిందని అనుకోమని చెప్పండి అత్తయ్యా' అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. దీంతో నందూ 'ఏం మాట్లాడుతున్నావు తులసీ.. అందరికీ ధైర్యం చెప్పే నువ్వే ఇలా ఆవేశపడితే ఎలా? ముందు ఈ సమస్యకు పరిష్కారం ఏంటో ఆలోచించు. దివ్యపై ఆవేశ పడితే లాభం ఏముంటుంది' అంటాడు. దీంతో దివ్య కూడా ఏడుస్తుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode August 2nd 2023

విక్రమ్ కోపం.. తులసి ఎంట్రీ:విక్రమ్ అయితే దివ్య అన్న మాటలను గుర్తు చేసుకుని కోప్పడుతూ ఉంటాడు. దీంతో దివ్య ఫొటోను చించేస్తాడు. అంతలోనే తులసి విడాకుల నోటీసులు తీసుకుని అక్కడకు వస్తుంది. వచ్చీ రావడమే విక్రమ్ బాబు అని పిలుస్తుంది. దీంతో రాజ్యలక్ష్మి, విక్రమ్ అక్కడకు వస్తారు. అప్పుడు తులసి 'ఏంటి బాబూ ఇలా చేశావు' అని అడగడంతో లాస్య 'విడాకుల నోటీసులు.. నీకు ఆ మాత్రం తెలియదా? ఆల్రెడీ నీకు అనుభవం ఉంది కదా' అని అంటుంది. దీంతో తులసి ఆమెపై ఫైర్ అవుతుంది. అప్పుడు విక్రమ్ 'లాస్య మా కుటుంబంలో ఒకరు' అని బదులిస్తాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode August 2nd 2023

మీ కూతురికి గౌరవం తెలీదు:విక్రమ్ మాటలకు తులసి 'అది కాదు విక్రమ్ బాబూ.. నేను వచ్చింది మీతో మాట్లాడటానికి.. నీ సమాధానం తెలుసుకోవడానికి' అంటుంది. దీంతో ఏంటని అడగ్గా.. దివ్యకు మీరు పంపిన విడాకుల నోటీసుల గురించి మాట్లాడటానికి వచ్చా అంటుంది. దీంతో విక్రమ్ 'ఆ విషయంలో మాట్లాడాలంటే మీరు మా అమ్మతో మాట్లాడాలి. మీ కూతురికి అత్తగారంటే గౌరవం లేదు.. మొగుడంటే మర్యాద లేదు. మొగుడి ఫ్యామిలీ అంటే ఇష్టమే లేదు. అయినా నేను తనని ప్రేమించాను. ప్రేమిస్తూనే ఉన్నాను. ఆ ప్రేమ మీ కూతురికి సరిపోవడం లేదట. మా అమ్మని వదిలేసి తన మాట వింటేనే.. తనతోనే ఉంటేనే ప్రేమ ఉన్నట్టా? మీరు మీ అత్తగారితో ఇలాగే ప్రవర్తిస్తున్నారా? ఇలాగే అందర్నీ ఎదిరించి మాట్లాడారా' అని కోప్పడతాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode August 2nd 2023

తులసిని అవమానించేలా:ఆ తర్వాత బసవయ్య 'కూతురికి కూడా తల్లి పోలిక వచ్చినట్టు ఉంది. తెలిసిపోతుందిగా' అంటాడు. దీంతో తులసి అతడి వైపు కోపంగా చూస్తుంది. అప్పుడు బసవయ్య 'నేను విక్రమ్ మామయ్యను.. నాకూ మాట్లాడే హక్కు ఉంది' అంటాడు. అప్పుడు తులసి 'భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూనే ఉంటాయి. మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలి.. అంతేకానీ ఇలా విడాకుల వరకూ వెళ్లకూడదు. అది పద్దతి కాదు' అని అంటుంది. అప్పుడు ప్రసన్న కూడా ఆమెను అవమానిస్తుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode August 2nd 2023

నమస్కరించి అడుగుతూ:వాళ్లంతా ఎంతలా అవమానించినా తులసి మాత్రం సైలెంట్‌గానే ఉంటుంది. అంతేకాదు, 'మీ అందరికీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా.. దయచేసి విక్రమ్ బాబునే మాట్లాడనివ్వడి.. అతడి మనసులో ఉన్నది చెప్పనీయండి' అని అడుగుతుంది. దీంతో విక్రమ్ 'నేను చెప్పాల్సింది ఏమీ లేదు అత్తయ్యా.. మీ కూతురి కోరిక మేరకే.. విడాకులకు సిద్దం అని చెప్పండి. మీరు ఇలా మా ఇంటి మీదికి వచ్చి గొడవ చేయడం కరెక్ట్ కాదు. మీరు చెప్పాల్సింది మీ కూతురితో చెప్పుకోండి. నాతో మాట్లాడి ప్రయోజనం లేదు' అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో తులసి ఏడుస్తుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode August 2nd 2023

నేనే కారణం.. పెళ్లి చెయ్:ఇక, అవమానం తర్వాత తులసి వెళ్లిపోతుండగా అక్కా అంటూ లాస్య ఆపుతుంది. అంతేకాదు, 'నీకో రహస్యం చెప్పనా? అసలు విక్రమ్, దివ్యల మధ్య పెద్ద గొడవలే లేవు. విడాకులు తీసుకోవాలనే ఆలోచనే లేదు. ఎందుకో నాకు వాళ్లు చిన్నగా గొడవలు పడటం నచ్చలేదు. నాకు తిండి అయినా గొడవలైనా స్పైసీగా ఉండాలి. నాకు అప్పుడే మజా.. అందుకే మంటపెట్టా. దివ్య-విక్రమ్‌ల మధ్య గొడవను వేరే లెవల్‌కి తీసుకుని వెళ్లడానికి ఈ విడాకుల డ్రామాని ప్లే చేశాను. అది పెద్ద హిట్ అయింది' అని బాంబ్ పేల్చుతుంది. అంతేకాదు, 'నందూకు నాకు మళ్లీ పెళ్లి చేస్తే.. దివ్య, విక్రమ్ విడాకులు నేను ఆపుతాను' అని ఆఫర్ ఇస్తుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode August 2nd 2023

దివ్యకు నందూ పాఠాలు:జరిగింది తలుచుకుంటూ బాధ పడుతున్న దివ్యను నందూ ఓదార్చుతాడు. అప్పుడు దివ్య 'నేను ఈ ఆటను ఇంక ఆడలేను నాన్న. అందరూ ఒక్కటై నన్ను ఒంటరిని చేస్తున్నారు. విక్రమ్ నుంచి నన్ను దూరం చేయాలని చూస్తున్నారు' అని చెప్తుంది. అప్పుడు నందూ 'ఆ తప్పు మాత్రం చేయొద్దు దివ్య. మీ అమ్మ, నేను ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. కానీ మధ్యలో నేను కొన్ని తప్పులు చేశా. లాస్యకు దగ్గరయ్యాను. అప్పుడు తను నన్ను నిలదీయాల్సింది పోయి విడాకులు ఇచ్చింది. ఇప్పుడదే తప్పు నువ్వు చేయొద్దు' అని చెప్తాడు. అదంతా పక్కనే ఉన్న తులసి వింటూ ఉంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X