Intinti Gruhalakshmi: లాస్య కండీషన్ సీరియస్.. నందూతో కలవాలని పట్టు.. లక్కీ ఊహించని కోరికతో అంతా షాక్
మారుతున్న పరిస్థితులకు తగ్గట్లుగా కొత్త షోలు వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే:మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసిని, నందూను కలపడానికి లక్కీ సహాయం చేస్తానని ముందుకు వస్తాడు. అప్పుడు నందూకు తన ప్లాన్లు చెప్తుంటాడు. దీంతో నందూ ఆ బుడ్డోడిని హగ్ చేసుకుంటాడు. అప్పుడే వచ్చిన తులసి నందూను అపార్థం చేసుకుంటుంది. ఆ తర్వాత తులసి మంచి మూడ్‌లో ఉందని నందూను లక్కీ ఆమె గదిలోకి పంపిస్తాడు. కానీ, నందూ మాత్రం ఏమీ చెప్పకుండానే వచ్చేస్తాడు. తర్వాత అందరూ ప్లాన్ చేసుకుని పార్కుకు వెళ్తారు. అప్పుడు నందూ తులసికి ప్రపోజ్ చేయాలని అనుకోగా.. లాస్య ఆత్మహత్య చేసుకోబోయిందని తెలుస్తుంది.

గదిలోకి రమ్మని ఫోన్ చేయగా:ప్లాన్ ప్రకారం తులసి, నందూను వదిలేసి పరందామయ్య వాళ్లు పార్కుకు వెళ్తారు. దొరికిన చాన్స్ వాడుకోవాలని అనుకున్న నందూ 'దేవుడిపై భారం వేసి.. నా ప్రయత్నం నేను చేస్తా' అని తులసిని తన గదిలోకి రమ్మని ఫోన్ చేస్తాడు. ఆ వెంటనే గదిలోకి వచ్చిన తులసి 'ఎందుకు పిలిచారు' అని ప్రశ్నలు అడుగుతుంది. దీంతో నందూ 'అబ్బే ఏం లేదు.. నీతో ఒంటరిగా కాసేపు మాట్లాడదాం.. అదే మన జీవితాల గురించి' అని అంటాడు. దీనికామె ఇప్పుడంత అవసరం ఏంటని తులసి అనగా. 'అవసరాలు చెప్పి రావు.. అవకాశం ఉన్నప్పుడే మాట్లాడదాం' అంటాడు.
దేవుడు కూడా చేయడంటూ:నందూ మాటలకు తులసి 'నా జీవితానికి వచ్చిన సమస్య ఏం లేదు. వచ్చినా కూడా నా తంటాలు నేను పడతాను' అని వెళ్లిపోబోతుంది. దీంతో నందూ 'మరి నా జీవితం గురించి ఆలోచించవా' అని అనగా.. వెనక్కి తిరిగి నందూను తదేకంగా చూస్తూ 'మీ గురించి ఏం ఆలోచించాలి? కావాలని జీవితాలకు చిక్కుముడులు వేసుకునే వాళ్లకి.. దేవుడు సహాయం చేయలేడు' అని అంటుంది. దీనికి నందూ 'అందుకే దేవుడిని అడగడం లేదు. నిన్ను అడుగుతున్నా. ఒక్క పది నిమిషాలు నా కోసం కేటాయిస్తావా తులసీ' అని కోరుకుంటాడు.

తులసికి గిఫ్ట్ ఇచ్చిన నందూ:నందూ అడగ్గానే తులసి 'నా ఓపిక గురించి మీకు తెలియదా? పాతికేళ్లు మీతో కాపురం చేశాను. సర్లే చెప్పండి' అంటుంది. దీంతో నందూ బెడ్ మీద దాచిన ఫొటో ఆల్బమ్ తీసి ఇస్తాడు. ఆ ఆల్బమ్ చూసిన తర్వాత తులసి ముఖం వెలిగిపోతుంది. తర్వాత 'చేజారిపోయిన తర్వాతే మధురక్షణాల విలువ తెలుస్తుందని అంటారు. అది నిజమే అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ బయటకు ఎందుకు తీశారు' అని అడుగుతుంది. దీనికి నందూ 'నా మనసులో దాచుకున్న విషయాలు బయటపెడదామని' అంటాడు. దీంతో తులసి 'పొంగిపోయిన పాలు నేలపాలు అయ్యాక బాధపడి ఏం లాభం? ఎలాగూ పాతికేళ్లు వేస్ట్ అయ్యాయి.. ఈ పది నిమిషాలు వేస్ట్ చేయడం ఎందుకు' అని అంటుంది.

నందూ ప్రపోజ్ చేద్దామని:తులసి మాటలకు నందూ 'తులసీ అలా అనొద్దు. గుండెల్లో పెట్టి చూసుకోవాల్సిన నిన్ను గుండె పగిలేలా ఏడిపించాను. అవన్నీ మనసుని తొలిచేస్తూ.. ఇప్పుడు నాతో కన్నీళ్లు పెట్టిస్తున్నాయి' అని ఏడుస్తాడు. దీనికి తులసి 'ఇప్పుడు మీరు పెట్టుకునే కన్నీళ్లు శవం ముందు కూర్చుని కార్చే కన్నీళ్లు లాంటివి. ఆ కన్నీళ్లు శవాన్ని బతికించలేవ్.. పోయిన ప్రాణాన్ని తీసుకుని రాలేవు. సానుభూతి కోసం తప్పితే ఎందుకూ పనికిరావు. నాకు వాటిని చూసే ఓపిక లేదు' అంటుంది. అలా మాట్లాడుతుండగా గులాబీ ఇచ్చి తులసికి ప్రపోజ్ చేయాలని నందూ అనుకుంటాడు.

లాస్య ఆత్మహత్య అంటూ:నందూ పువ్వు ఇవ్వబోతుండగా తులసికి దివ్య ఫోన్ చేసి 'అమ్మా.. లాస్య ఆంటీ సూసైడ్ చేసుకోబోయింది. ఇప్పుడు ఆసుపత్రిలో ఉంది' అని చెప్తుంది. ఆ వెంటనే నందూతో 'లాస్య ఆత్మహత్య చేసుకోబోయిందట.. మనం లక్కీని తీసుకుని వెళ్దాం పదండి' అని కంగారుగా వెళ్లిపోతుంది. అప్పుడు నందూ మాత్రం స్వార్ధంగా 'ఛ ఛా.. నా మనసులో మాట తులసికి చెప్పేద్దాం అనుకున్నా.. మంచి అవకాశం చేజారిపోయింది' అని బాధపడిపోతాడు. ఇక హాస్పిటల్‌లో లాస్య చావు బతుకుల్లో ఉంటుంది. అప్పటికే దివ్య, రాజ్యలక్ష్మి, విక్రమ్‌లు అక్కడికి చేరుకుంటారు.
కండీషన్ సీరియస్‌గానే:లాస్య ఆత్మహత్యయత్నం చేసిందని తెలిసి దీక్షలో ఉన్న సంజయ్ కూడా ఆస్పత్రికి వచ్చి ఆమెకు వైద్యం చేస్తాడు. అప్పుడు లాస్య కండీషన్ సీరియస్‌గా ఉందని చెప్తాడు. అది తెలిసి అందరూ టెన్షన్ పడుతుంటారు. అంతలోనే అక్కడకు తులసి వాళ్లు వస్తారు. అప్పుడు దివ్య జరిగింది చెప్తుంది. ఇక, లక్కీని, లాస్యను దూరం చేయడం వల్లే లాస్య ఈ పని చేసిందని రాజ్యలక్ష్మి అంటుంది. అంతేకాదు, ఆ నిందలను తులసి వాళ్ల మీద వేస్తుంది. కానీ, నందూ మాత్రం ఆమె మాటలకు ఒప్పుకోడు. దీంతో తులసిని సాక్ష్యం చెప్పమని రాజ్యలక్ష్మి అడుగుతుంది.

నందూతో కలవాలంటూ:ఆ తర్వాత సంజయ్ బయటకు వచ్చి లాస్యకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్తాడు. దీంతో అందరూ లోపలికి వెళ్లగా.. లక్కీ ఏడుస్తూ తల్లి దగ్గరకు వెళ్తాడు. అప్పుడు లాస్య మరింత నటిస్తూ ఉంటుంది. అది చూసిన లక్కీ 'మమ్మీ నువ్వు కూడా నాతో పాటు ఉండేందుకు డాడీ దగ్గరకు వచ్చేయ్' అంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. నందూ దానికి ఒప్పుకోకపోవడంతో లాస్య పీక నొక్కుకుంటూ ఉంటుంది. అప్పుడు లక్కీ.. తులసి కాళ్లపై పడి బ్రతిమాలతాడు. అది చూసిన విక్రమ్.. లాస్యతో మళ్లీ కలవమని నందూకు చెప్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











