Intinti Gruhalakshmi Today Episode: గొడవలో నోరు జారిన నందూ.. సామ్రాట్‌కు నిజం తెలియడంతో ట్విస్ట్

సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ప్రెస్‌మీట్‌లో తులసిని మాజీ భర్త ఎవరు అని రిపోర్టర్లు ప్రశ్నిస్తారు. కానీ, దానికి ఆమె సమాధానం చెప్పదు. అయినప్పటికీ ప్రశ్నిస్తుంటారు. కానీ, తులసి మాత్రం సమాధానం దాటవేస్తుంది. తర్వాత సామ్రాట్, తులసి కలిసి పూజ చేస్తుంటారు. అది చూసిన నందూ, లాస్య ఆగ్రహంగా ఉంటారు. అనంతరం శృతి.. మా ఆంటీకి ఎందుకు సహాయం చేస్తున్నారు? మీరు ఆమెను ఇష్టపడుతున్నారా? అని సామ్రాట్‌ను సూటిగా ప్రశ్నిస్తుంది. దీనికి ఆయన తులసి అంటే గౌరవం అంటాడు. తర్వాత అభి అక్కడకు వచ్చి నానా గొడవ చేస్తాడు.

సామ్రాట్‌ను అలా నిలదీసిన అభి

సామ్రాట్‌ను అలా నిలదీసిన అభి


భూమి పూజ జరుగుతోన్న చోటుకు ప్లాన్ ప్రకారమే వచ్చిన అభి.. తులసి, సామ్రాట్‌ మధ్య ఏదో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తాడు. ఆ సమయంలో 'నేను మామ్‌ను అనుమానించడం లేదు. నా అనుమానం సామ్రాట్ గారి మీదే. అసలు ఏ ఉద్దేశం లేకుండానే మామ్‌కు ఎందుకు హెల్ప్ చేస్తున్నారు చెప్పండి' అని ప్రశ్నిస్తుంటాడు. అప్పుడు పరందామయ్య వచ్చి అభిపై కోప్పడతాడు. దీంతో సామ్రాట్ 'ఆగండి.. అభి నువ్వు అడుగు' అని అంటాడు. దీంతో అతడు మరింతగా రెచ్చిపోయి నోటికి వచ్చినట్లు ప్రశ్నలు వేస్తాడు. అప్పుడు అందరూ షాక్ అవుతారు.

అతడిపై విరుచుకు పడిన దీపక్

అతడిపై విరుచుకు పడిన దీపక్


సామ్రాట్‌తో అభి 'చదువు అర్హత లేని మా మామ్‌ను మీరు బిజినెస్ పార్ట్‌నర్ ఎందుకు చేసుకున్నారు? అసలు ఏ అర్హత ఉందని నందగోపాల్ గారి ప్రాజెక్టును కాదని మామ్‌ ప్రాజెక్టుకు ఒప్పుకున్నారు' అని ప్రశ్నిస్తాడు. అప్పుడు సామ్రాట్ 'మీ అమ్మ గొప్పదనం, టాలెంట్ గురించి మీకు తెలియట్లేదు' అని అంటాడు. దీంతో అభి వెటకారంగా మాట్లాడతాడు. అప్పుడు సీన్‌లోకి దీపక్ ఎంట్రీ ఇస్తాడు. 'అరేయ్ అభి.. ఇంకో మాట నీ నోటి నుంచి వస్తే బాగోదు. ఆయన చేస్తున్న పనికి అందరూ గౌరవించాలి. సామ్రాట్ గారిని అభినందించాలి' అంటూ విరుచుకుపడతాడు.

నందూ ఎంట్రీ.. సామ్రాట్‌కు షాక్

నందూ ఎంట్రీ.. సామ్రాట్‌కు షాక్

అంతేకాదు, దీపక్ 'మీ నాన్న లాగే నువ్వు కూడా మా అక్కని తొక్కాలని చూస్తున్నారు. అప్పుడు ఆయన వల్ల బాధ పడింది. ఇప్పుడు నీ వల్ల ఇబ్బంది పడుతుంది. అసలు నిన్ను ఎవరు రెచ్చగొట్టి ఇక్కడకు పంపించారో మాకు తెలుసు' అని అంటాడు. దీంతో నందూ కోపంతో ఊగిపోతాడు. 'అరేయ్ దీపక్ మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. మర్యాద ఇవ్వు' అని అంటాడు. దీంతో దీపక్ 'మా అక్క భర్తగా ఉన్నప్పుడు నీకు మర్యాద ఇచ్చాను. ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి? ఇప్పటికీ నువ్వు మా అక్కను ఇబ్బంది పెడుతున్నావు' అంటాడు. దీంతో సామ్రాట్‌కు నిజం తెలుస్తుంది.

సామ్రాట్‌కు సారీ చెప్పి వెళ్లిపోగా

సామ్రాట్‌కు సారీ చెప్పి వెళ్లిపోగా


ఒకవైపు లాస్య ఆపుతున్నా నందూ మాత్రం రెచ్చిపోయి మాట్లాడతాడు. దీంతో సామ్రాట్‌కు తులసి, నందూ మాజీ భార్య భర్తలన్న విషయం తెలిసిపోతుంది. అప్పుడు సామ్రాట్ 'అంటే తులసి, నందూ ఒకప్పుడు భార్య భర్తలా' అని అంటాడు. తర్వాత 'తులసి గారు ఇది నిజమేనా' అని ప్రశ్నిస్తాడు. అప్పుడు పరందామయ్య వచ్చి సామ్రాట్‌కు నమస్కారం చేసి క్షమించమని అడుగుతాడు. అంతేకాదు, 'నా కొడుకు వల్ల అప్పుడు.. మనవడి వల్ల ఇప్పుడు పెద్దరికం కోల్పోయాను' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత తులసి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా అక్కడి నుంచి వెళ్లిపోతారు. చివర్లో తులసి కూడా సామ్రాట్‌కు క్షమాపణ చెప్పి వెళ్లిపోతుంది. దీంతో సామ్రాట్ ఒక్కడే ఒంటరిగా మిగిలిపోతాడు.

అభితో తీవ్రంగా గొడవ పడ్డ ప్రేమ్

అభితో తీవ్రంగా గొడవ పడ్డ ప్రేమ్


ఇంటికి వచ్చిన తర్వాత తులసి కుటుంబ సభ్యులు అందరూ ఒకచోటకు చేరుకుంటారు. అప్పుడు ప్రేమ్ 'ఇప్పుడు వీడికి సంతోషంగా ఉంది. మామ్ ఎదుగుదలను ఆపాలని అప్పుడు ఆయన.. ఇప్పుడు వీడు చూశారు. అలాగే చేశారు. అంతా అయిపోయింది. వీడివల్ల మన పరువును మనమే పోగొట్టుకున్నాం' అంటూ అభిని తిడతాడు. దీనికి అభి 'నేను మామ్‌ను ఏమీ అనలేదు. ఆ సామ్రాట్‌నే ప్రశ్నించారు. అయినా నా బాధ, ఆవేదన మీకు ఇప్పుడు అర్థం కాదు. అది తెలిసిన సమయంలో మీరంతా నాకే సారీ చెబుతారు' అంటూ ఇంకా సపోర్టుగా మాట్లాడుకుంటాడు.

శృతి క్లారిటీ.. అభి వెటకారంగానే

శృతి క్లారిటీ.. అభి వెటకారంగానే

అభి మాటలకు ప్రేమ్‌కు కోపం వచ్చి అతడి మీదకు దూసుకొస్తాడు. అప్పుడు శృతి 'మీరు ఒక్క నిమిషం ఆగండి. నేను ఆల్రెడీ ఇదే విషయం గురించి సామ్రాట్ గారిని సూటిగా ప్రశ్నించాను. మీరు మా ఆంటీని ఇష్టపడుతున్నారా అని అడిగాను. ఆయన తనకు తులసి ఆంటీ అంటే గౌరవం మాత్రమేనని, ఆమెకు సహాయం మాత్రమే చేస్తున్నానని చెప్పారు' అని అంటుంది. దీంతో అభి చప్పట్లు కొట్టి వెటకారంగా మాట్లాడతాడు. దీంతో పరందామయ్య, అనసూయ కూడా తులసిని వెనకేసుకొచ్చి అభిని తిడతారు. అప్పుడు తులసి వచ్చి అభిని ఏమీ అనొద్దని చెబుతుంది.

నందూపై లాస్య ఫైర్.. ఊరుకోనని

నందూపై లాస్య ఫైర్.. ఊరుకోనని

ఇక, పూజ కార్యక్రమం దగ్గర నందూ అసలు నిజాన్ని చెప్పేయడంతో పాటు ఇంటికి వచ్చి షర్ట్ విప్పేసి చిరాకు పడుతుంటాడు. అప్పుడు లాస్య వచ్చి 'అంతా అయిపోయింది. ఏం జరగకూడదని అనుకున్నానో అదే జరిగింది. నువ్వు కాసేపు మౌనంగా ఉండలేకపోయావా? ఇప్పుడు నువ్వు చేసిన దానికి మన భవిష్యత్ ప్రశ్నార్థం అయింది. ఆ తులసి.. సామ్రాట్‌ను వాడుకుని మన ఉద్యోగాలు లేకుండా చేస్తుంది' అని ఫైర్ అవుతుంది. దీంతో నందూ 'ఆఫ్ట్రాల్ ఉద్యోగం కోసం నేను పరువు పోగొట్టుకోవాలా? ఆ దీపక్ గాడు నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే ఊరుకోవాలా? నాకు ఉద్యోగం కంటే పరువే ముఖ్యం' అంటాడు. తర్వాత దీపక్, తులసి ఇంట్లో మాట్లాడుతుండగా.. నందూ, లాస్య అక్కడకు వెళ్తారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X