Intinti Gruhalakshmi: లాస్య ప్లాన్ బయటపెట్టిన తులసి.. శాశ్వతంగా ఇంటికి దూరం కావాలని!
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అందరూ కలిసి పార్కుకు వెళ్లిపోవడంతో తులసిని తన గదిలోకి రమ్మని నందూ ఫోన్ చేస్తాడు. అప్పుడామె వెళ్లగా ప్రపోజ్ చేసేందుకు ఇబ్బంది పడుతుంటాడు. అలా చాలా సేపు మాట్లాడిన తర్వాత గులాబీ పువ్వు అందించబోతాడు. అంతలోనే దివ్య ఫోన్ చేసి లాస్య ఆత్మహత్యయత్నం చేసిందని తులసికి చెప్తుంది. ఇక, అందరూ ఆస్పత్రికి వెళ్లగా.. లాస్య కండీషన్ బాగానే ఉందని సంజయ్ చెప్తాడు. అనంతరం లాస్యను కూడా తనతో పాటు నందూ దగ్గరకు వచ్చేయమని లక్కీ అడుగుతాడు. దీంతో అంతా షాక్ అవుతారు.

మా మమ్మీ కూడా వచ్చేస్తుంది: లాస్యకు ఏమైనా అయితే లక్కీ ఒంటరి వాడు అయిపోతాడని పరందామయ్య బాధ పడగా.. అనసూయ మాత్రం ఆ బుడ్డోడిని తిడుతుంది. అనవసరంగా ఇంటికి రానిచ్చాం అని అంటుంది. అంతలోనే తులసి, నందూ అక్కడకు వస్తారు. అప్పుడు పరందామయ్య 'ఒరేయ్ నందూ.. లాస్యకి ఎలా ఉందిరా.. ప్రమాదం ఏమీ లేదు కదా' అని ప్రశ్నిస్తాడు. కానీ, వాళ్లు మాత్రం సైలెంట్‌గానే ఉండిపోతారు. అప్పుడు లక్కీ 'నేను చెప్తాను నానమ్మా. మా మమ్మీకి ఏం కాలేదు. ఇంకో గుడ్ న్యూస్ కూడా ఉంది. మా మమ్మీ ఇంటికి వచ్చేస్తుంది. నాతో పాటు ఇక్కడే ఉంటుం' అంటాడు.
ఇంటికి నిప్పు పెట్టాకా ఎలా?: లక్కీ మాటలు విన్న అనసూయ 'ఏంట్రా నందూ ఇదీ? వాడు చెప్పేది అంతా నిజమేనా' అని అడగ్గా.. 'అవును నిజమే' అని చెప్తాడు. దీంతో ఆమె 'అది రావడం ఏంటి? మీరు ఒప్పుకోవడం ఏంటి? మమ్మల్ని అడగాల్సిన పనిలేదా' అని కోప్పడుతుంది. దీనికి నందూ 'అమ్మా ఆవేశ పడకు. కాస్త ప్రశాంతంగా మాట్లాడుకుందాం' అంటాడు. అప్పుడు పరందామయ్య 'ఇంటికి నిప్పు పెట్టి ప్రశాంతంగా మాట్లాడుకుందాం అంటావు ఏంట్రా? లాస్య ఇంట్లోకి వస్తే ఎంత నరకం ఉంటుందో మీకూ తెలుసు కదా. మళ్లీ ఇంటికి రావడానికి ఎందుకు ఒప్పుకున్నారు' అంటాడు.

మీ అబ్బాయినే అడగండని: ఆ తర్వాత నందూ మీ ప్రశ్నలకు తులసి సమాధానం చెప్తుంది అంటాడు. అప్పుడు తులసి 'ఏ మీరు చెప్పలేరా? మీకు తెలియదా? మీకు సంబంధం లేదా? అసలు ఈ గొడవ రావడానికి కారణం మీ అబ్బాయే. లక్కీని ఇక్కడికి తీసుకుని రావడంతోనే సమస్య మొదలైంది. లాస్య సూసైడ్ చేసుకోవడానికి కూడా మీ అబ్బాయే కారణం. మీరు ఏదైనా అడగాల్సిఉంటే మీ అబ్బాయిని అడగండి. నన్ను కాదు' అని వెళ్లిపోతుంది. తర్వాత నందూ 'లాస్య చేసిన ఎమోషనల్ బ్లాక్‌మెయిల్‌కు తులసి కరిగిపోయింది. లాస్య ఇక్కడికి రావడానికి ఒప్పుకుంది' అని అసలు విషయం చెప్తాడు.
నిజంగా అందుకే వచ్చావా?: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన లాస్య పాటలు పాడుకుంటూ నందూ ఇంటికి వెళ్లేందుకు బట్టలు సర్ధుకుంటూ ఉంటుంది. అప్పుడు తులసి అక్కడకు వెళ్లగా.. లాస్య చూసి షాక్ అవుతుంది. దీంతో తులసి 'ఏంటీ నేనొస్తానని ఎక్స్‌పెక్ట్ చేయలేదా' అని అడగ్గా.. 'నిన్ను చూద్దాం అనిపించి వచ్చానులే' అని అంటుంది. దీంతో లాస్య నిజంగా అందుకే వచ్చావా? అని అడగడంతో 'నాకు నీలా అబద్దాలు చెప్పడం చేతకాదు' అని అంటుంది. దీంతో లాస్య 'నువ్వు ఇంకా పాత విషయాలు మర్చిపోయినట్టు లేదే' అని అంటుంది.
నీ ప్లాన్ మొత్తం తెలుసుగా: లాస్య మాటలకు తులసి 'ఎలా మర్చిపోతాను? నువ్వు పాత లాస్యవే కదా. చాలా హుషారుగా ఉన్నావు. కూని రాగాలు తీస్తున్నావు ఏంటి సంగతీ' అని అంటుంది. దీనికి లాస్య 'కొడుకు దగ్గరకు వెళ్తున్నాను. అది కూడా నీ పుణ్యంతో. హుషారుగా ఉండమా ఏంటీ' అని చెప్తుంది. తర్వాత ఇద్దరూ అలా కాసేపు మాట్లాడుకుంటారు. అప్పుడు తులసి 'నువ్వు ఐసీయూలో ఉన్నప్పుడు లోపలికి వద్దాం అని తలుపు తోశాను. నువ్వు నీ తోడు దొంగలు సంజయ్, రాజ్యలక్ష్మిలు నవ్వుకోవడం చూశాను. మీరు మాట్లాడుకున్నది విన్నాను కూడా' అంటుంది. అప్పుడు లాస్య 'తులసి తెలివైనది అని ఇన్నాళ్లూ భ్రమలో ఉన్నా. ఎంత తెలివి తక్కువదో ఇప్పుడు తెలిసింది. నేను సూసైడ్ చేసుకోవడం నిజం అని నమ్మేసింది. జాలి పడి వాళ్ల ఇంటికి వచ్చేయమని అనేసింది' అంటుంది.
తులసిని దూరం చేస్తాను: ఆ తర్వాత లాస్య 'లక్కీని అడ్డుపెట్టుకుని ఆ ఇంట్లోకి అడుగుపెడతాను. మళ్లీ చక్రం తిప్పుతాను. నందూను నా సొంతం చేసుకుంటాను. తులసిని ఆ ఇంటికి శాశ్వతంగా దూరం చేస్తాను. నిజంగానే నేను సూసైడ్ చేసుకున్నట్టు బాగానే నమ్మించాం. మన ప్లాన్ సక్సెస్' అంటూ రాజ్యలక్ష్మి వాళ్లకు చెప్పిన విషయాన్ని తులసి గుర్తు చేస్తుంది. తర్వాత నీ గురించి తెలిసి కూడా నిన్ను నమ్మమంటావా అని ప్రశ్నిస్తుంది. దీంతో లాస్య 'అసలు కథ తెలిశాక.. ఈ కట్టు కథలతో టైం వేస్ట్ ఎందుకు తులసీ? నా టార్గెట్ ఏంటో తెలిసిపోయింది కదా' అని అంటుంది.

బలవంతంగా తీసుకెళ్తా: అనంతరం లాస్య 'నీ అతి మంచితనమే ఎప్పటిలాగే ఇప్పుడు కూడా నాకు కలిసి వస్తుంది. ఇంకో విషయం నా గురించి ఈ విషయం లక్కీకి చెప్పి అడ్డం పడదాం అనుకుంటున్నావేమో. వాడు నమ్మడు. ఒకవేళ నమ్మి నాకు ఎదురుతిరిగితే.. వాడ్ని బలవంతంగా లాక్కుని వెళ్లిపోతా ఆపై నీ ఇష్టం. లక్కీని ఆ డాడీ కానీ డాడీకి దూరం చేసి ఆ పని మనసుని బాధపెట్టాలనుకుంటే నీ ఇష్టం.. నాకేం అభ్యంతరం లేదు.. నానివ్వు' అంటుంది. దీంతో తులసి 'ఛీ ఛీ అసలు నువ్వు మనిషివేనా' అనగా.. 'అరే నీకు గొప్ప అనుమానం వచ్చిందే.. నీకో ఇంకో విషయం క్లారిటీగా చెప్తున్నాను విను.. నేను మళ్లీ నందూకు భార్యను కాబోతున్నా. నీ బెదిరింపులకు భయపడేది లేదు.. అత్తాంటింట్లో అడుగెట్టడం ఖాయం. హారతి పళ్లెంతో రెడీగా ఉండు' అంటుంది. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











