Intinti Gruhalakshmi August 3 Episode: అనసూయతో కలిసి లాస్య ప్లాన్.. తులసే నందూను తీసుకెళ్లేలా!

ఎంతో కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. శృతిని టార్గెట్ చేసిన అంకిత ఆమెపై నిందలు వేస్తుంది. దీంతో ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది. ఆ తర్వాత ప్రేమ్ ఆమెకు సారీ చెబుతాడు. అనంతరం నందూ గురించి తులసి మామతో మాట్లాడుతుంది. అతడి గురించి మళ్లీ ఆలోచించుకోమని చెబుతుంది. ఆ తర్వాత లాస్య, అనసూయను కాకపడుతుంది. దీంతో ఆమె నందూకు ధైర్యం చెబుతుంది.

గార్మెంట్ కంపెనీ వాళ్లకు తులసి రిక్వెస్ట్

గార్మెంట్ కంపెనీ వాళ్లకు తులసి రిక్వెస్ట్

గార్మెంట్ కంపెనీకి వెళ్లిన తులసి రామచంద్ర ఫ్యాక్టరీని తీసుకుంటున్నట్లు చెబుతుంది. దీనికి ఆ కంపెనీ మేనేజర్ సతీష్ సంతోషిస్తాడు. అప్పుడు తులసి 'మీరు ఈ సారి అడ్వాన్స్ లేకుండా మెటీరియల్ ఇవ్వండి' అని రిక్వెస్ట్ చేస్తుంది. దీనికి అతడు 'నేను మిశ్రా గారితో మాట్లాడతాను. మీ మీద ఆయనకు మంచి ఒపీనియన్ ఉంది. సో దీనికి ఒప్పుకోవచ్చు' అంటూ భరోసా ఇస్తాడు.

అనసూయను బాగా రెచ్చగొట్టిన లాస్య

అనసూయను బాగా రెచ్చగొట్టిన లాస్య

నందూ ఇంటికి వచ్చిన అనసూయను లాస్య రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఆమెతో 'నందూ పరిస్థితి ఏం బాలేదు ఆంటీ. మామూలు మనిషి అవ్వాలంటే మీ చేతుల్లోనే ఉంది ఆంటీ. మీరే ఎలాగైనా చేసి ఆయనను ఆ ఇంటికి తీసుకెళ్లాలి. దీనికి అంకుల్ ఒప్పుకోరు. కానీ, మీరే ఎలాగోలా చేసి ఆయనను అక్కడకు తీసుకెళ్లాలి. అలా చేస్తేనే నందూ తేరుకుంటాడు' అంటూ చెబుతుంది లాస్య.

తులసి వచ్చి మా ఇద్దరినీ తీసుకెళ్తుంది

తులసి వచ్చి మా ఇద్దరినీ తీసుకెళ్తుంది

అనసూయ లాస్య మధ్య జరిగే చర్చలోకి తులసిని కూడా తీసుకొస్తారు. అప్పుడు ఎలాగైనా ఆమెను బయటకు పంపించేయాలని ప్లాన్ చేస్తారు. అంతేకాదు, 'తులసే స్వయంగా వచ్చి నన్ను, నందూను ఇంటికి తీసుకెళ్లేలా మీరే చేయాలి ఆంటీ. అందుకోసం నేను చెప్పనట్లు చేయండి' అంటూ కొన్ని సలహాలు, సూచనలు ఇస్తుంది. దీంతో అనసూయ కూడా అందుకు అంగీకరిస్తుంది.

 మాధవి, మోహన్ రాక.. మరో వాగ్వాదం

మాధవి, మోహన్ రాక.. మరో వాగ్వాదం

పరందామయ్యను పరామర్శించేందుకు మాధవి, మోహన్ ఇంటికి వస్తారు. అప్పుడు తులసి గార్మెంట్ కంపెనీ వాళ్లను రిక్వెస్ట్ చేశానని చెబుతుంది. దీంతో అందరూ సంతోషంగా మాట్లాడుతుంటారు. అంతలో అక్కడకు అనసూయ వచ్చి 'నా కొడుకు అక్కడ ఏకాకిలా బాధ పడుతుంటే.. మీరు సంతోషంగా ఉంటున్నారు' అంటూ దెప్పిపొడుస్తుంది. దీంతో కాసేపు వాళ్ల మధ్య వాగ్వాదం అవుతుంది.

డబ్బులన్నీ అందరికీ పంచేయ్ నందూ

డబ్బులన్నీ అందరికీ పంచేయ్ నందూ

ఇంట్లో దిగాలుగా ఉన్న నందూకు ఆఫీస్‌ను ఫోన్ వస్తుంది. జీతాలు ఇవ్వడానికి మనీ కావాలంటే తన దగ్గర ఉంది ఇంటికి రమ్మని చెబుతాడు. అప్పుడు లాస్య 'మనం దాచుకున్న డబ్బంతా పంచేయ్ నందూ. నువ్వు వాళ్ల కోసం ఎంత చేసిన వేస్ట్. వాళ్ల కాళ్లు పట్టుకుంటే గొప్పోడు అనుకోరు. చేతకాని వాడు అనుకుంటారు. ఇప్పటికైనా మారు. రేపు ఆఫీస్‌కు రా' అని సలహా ఇస్తుంది.

 తులసికి మాధవి.. మోహన్ సలహాలు

తులసికి మాధవి.. మోహన్ సలహాలు

నందూను ఇంటికి తీసుకొచ్చేందుకు ఒప్పుకున్న తులసితో మోహన్, మాధవి మాట్లాడతారు. 'బావగారిని ఇంటికి తీసుకు రావాలని అత్తయ్య గారికి లాస్యనే సలహా ఇచ్చిందనుకుంటా. అయినా నువ్వు ఆయనను తీసుకొచ్చేందుకు ఒప్పుకోవద్దు' అని చెబుతాడు మోహన్. అయినప్పటికీ ఆమె మాత్రం వాళ్లకు సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తుంది. తర్వాత ఆమె బిజినెస్ గురించి ప్రోత్సహిస్తారు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
నందూను పంపించేందుకు లాస్య ప్లాన్

నందూను పంపించేందుకు లాస్య ప్లాన్

లాస్య దగ్గరకు వచ్చిన భాగ్య ప్లాన్ ఎంత వరకూ వచ్చిందని అడుగుతుంది. అప్పుడామె 'ప్లాన్లు బాగానే వర్కౌట్ అవుతున్నాయి భాగ్య. ఇప్పటికే ఇంట్లో దీని గురించి యుద్ధం జరుగుతూ ఉంటుంది. ముందు నందూ అక్కడకు వెళ్తే చాలు. ఆ తర్వాత నేను ఎలా రావాలో మార్గం చూసుకుంటాను. ముందైతే ఆయన ఆ ఇంట్లో అడుగు పెట్టాలి' అని అంటుంది. ఈ ప్లాన్ భాగ్యకు అర్థం కాదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X