For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: సామ్రాట్‌ను అలా పిలిచిన దివ్య.. నందూ రాకతో కథలో సూపర్ ట్విస్ట్

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఒంటరిగా కూర్చున్న హనీ బాధ పడుతూ ఉంటుంది. అది చూసిన సామ్రాట్ ఏమైందని అడగ్గా.. ఇంట్లో ఒంటరిగా ఉండడం తట్టుకోలేకపోతున్నానని చెప్తుంది. దీంతో ఈ విషయాన్ని సామ్రాట్ తన బాబాయితో పంచుకుంటాడు. అప్పుడు ఆయన తులసికి ఫోన్ చేసి ఇంట్లో పార్టీ చేస్తున్నాం అందరూ రండి అని చెప్తాడు. దీనికి తులసి ఓకే అంటుంది. కానీ, దీనికి నందూ రానని అంటాడు. దీంతో లాస్య.. తులసిని బ్రతిమలాడు అని చెప్తుంది. దీంతో సామ్రాట్.. తులసి దగ్గరకు వెళ్లి మన విషయం చెప్పొద్దు అని అడుగుతాడు.

  మేకప్ రూంలో తెలుగు హీరోయిన్ హాట్ ట్రీట్: ఆ పార్ట్‌లను హైలైట్ చేస్తూ!

  తులసి కోసం ఇంటికొచ్చిన నందూ

  తులసి కోసం ఇంటికొచ్చిన నందూ

  తులసిని కలిసేందుకు వచ్చిన నందూ ఆమె ఒంటరిగా ఉండడం చూసి ఊపిరి పీల్చుకుంటాడు. ఆ వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి మాట్లాడబోతుంటాడు. అప్పుడు తులసి 'ఓడలు బళ్లు.. బళ్లు ఓడలు అవడం అంటే ఇదేనేమో. ఒకప్పుడు మీకు నేను భయపడి మాట్లాడేదాన్ని. ఇప్పుడు మీరు మీ తప్పు తెలుసుకుని నా దగ్గరకు వచ్చి భయపడుతున్నారు' అని అంటుంది. అప్పుడు నందూ 'నేను సారీ చెప్పడానికి రాలేదు. నీతో ఒక విషయం గురించి మాట్లాడదామని వచ్చాను. అది మనిద్దరికీ సంబంధించింది కాబట్టి నీకోసం వచ్చాను' అంటూ సమాధానం చెప్తాడు.

  వాళ్లిద్దరూ నా దగ్గర ఉన్నారంటూ

  వాళ్లిద్దరూ నా దగ్గర ఉన్నారంటూ

  నందూ మాటలకు తులసి 'మీరు ఇప్పుడు ఏమంత సంతోషంగా ఉన్నారు చెప్పండి. నిత్యం బాధ పడుతూ, భయపడుతూ కనిపిస్తున్నారు' అంటుంది. దీనికి నందూ 'నా దగ్గర అందమైన భార్య ఉంది. చదువుకున్న భార్య ఉంది. నన్ను అర్థం చేసుకునే భార్య ఉంది' అంటుంది. దీనికి తులసి 'కానీ, మీ దగ్గర కన్నతల్లి లేదు. కన్నతండ్రి లేడు. కడుపున పుట్టిన బిడ్డలు లేరు. ఇప్పుడు వాళ్లంతా నా దగ్గర ఉన్నారు. అందుకే నేను అందరి కంటే సంతోషంగా ఉన్నాను. మీ దగ్గర లేనిది.. నా దగ్గర ఉన్నది వాళ్ల వళ్ల వచ్చిందే' అంటూ ఘాటుగా బదులిస్తుంది.

  విచిత్రమైన డ్రెస్‌లో జాన్వీ కపూర్ రచ్చ: వామ్మో మరీ ఇంత దారుణమా!

  నేను నీ బాస్‌కు పార్ట్‌నర్‌ను అంటూ

  నేను నీ బాస్‌కు పార్ట్‌నర్‌ను అంటూ


  తులసితో వాదనకు దిగిన తర్వాత నందూ 'ఏదైతే అది అయింది. నీతో ఓ విషయం మాట్లాడడానికి వచ్చాను. అదేంటంటే.. నేను నీ మాజీ భర్తనన్న విషయాన్ని సామ్రాట్ గారికి చెప్పొద్దు' అని అంటాడు. అప్పుడు తులసి 'అప్పుడు నన్ను మీ భార్య అని చెప్పుకోడానికి అసహ్యించుకునే వారు. ఇప్పుడు మీరు నా మాజీ భర్త అని చెప్పుకోడానికి భయపడుతున్నారు. మీరు మరీ అడుగుతున్నారు కాబట్టి.. సామ్రాట్ గారు అడగనంత వరకూ నేను నిజం చెప్పను. ఒకవేళ అడిగితే అబద్దం మాత్రం చెప్పను. మీకోసం నా వ్యక్తిత్వాన్ని మార్చుకోను' అని హామీ ఇస్తుంది.

  సామ్రాట్ ఇంటికి తులసి ఫ్యామిలీ

  సామ్రాట్ ఇంటికి తులసి ఫ్యామిలీ


  హనీ కోసం ఏర్పాటు చేసిన పార్టీకి సామ్రాట్ రెడీ అవుతుంటాడు. అప్పుడు అతడి షర్ట్ బాలేదని ఓ టీ షర్ట్ తీసుకు వస్తుంది. అది వేసుకోగానే సూపర్ అంటూ పొగుడుతుంది. ఆ తర్వాత తులసి ఫ్యామిలీ అక్కడకు వస్తుంది. ఈ విషయం సర్వెంట్ చెప్పగానే హనీ వెళ్లి తులసిని హత్తుకుంటుంది. అంతకు ముందే తులసి తన కుటుంబ సభ్యులకు నందూ తన మాజీ భార్య అన్న విషయం చెప్పొదని అంటుంది. ఇక, వాళ్లు ఇంట్లోకి రాగానే సామ్రాట్ వాళ్ల బాబాయి 'పాత గొడవలను పట్టించుకోకుండా మా ఇంటికి వచ్చినందుకు థాంక్యూ' అని వాళ్లకు స్వాగతం పలుకుతాడు.

  దీప్తి సునైనాకు బిగ్ బాస్ కంటెస్టెంట్ ముద్దులు: నీ ప్రవర్తన ఏంటి అంటూ వీడియో వదిలి మరీ!

  సామ్రాట్‌ను అలా పిలిచిన దివ్య

  సామ్రాట్‌ను అలా పిలిచిన దివ్య


  కాసేపటి తర్వాత నందూ, లాస్య కూడా అక్కడకు వస్తారు. ఇంట్లో అందరూ మాట్లాడుతుండగా సామ్రాట్‌ను దివ్య అంకుల్ అని పిలుస్తుంది. ఆ వెంటనే అతడికి సారీ అని కూడా చెబుతుంది. దీనికి సామ్రాట్ 'పర్వాలేదు నువ్వు అంకుల్ అని పిలవచ్చు. ఏదో చెప్పాలనుకుంటున్నావో చెప్పు' అని అంటాడు. దీనికి దివ్య మీ ఇల్లు ప్యాలెస్ లాగా ఉంది అని అంటుంది. అప్పుడు సామ్రాట్ 'మా ఇంట్లో ఉన్నది ఇద్దరమే.. మా హానికి మీలా ఇంట్లో చాలా మంది ఉండాలని కోరి అందుకే.. ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నాం. నా ఆశ ఎప్పుడు నెరవేరుతుందో' అని అంటాడు.

  సామ్రాట్, నందూ మధ్యలో పోటీ

  సామ్రాట్, నందూ మధ్యలో పోటీ

  ఆ తర్వాత సామ్రాట్ వాళ్ల బాబాయి 'నల బీముడు మా సామ్రాట్ మీ అందరి కోసం ఈరోజు వంట రెడీ చేస్తాడు' అని చెప్తాడు. ఆ వెంటనే లాస్య మా నందూ కూడా బాగా వంట చేస్తాడు అని అంటుంది. దీంతో ఆయన 'అయితే ఇద్దరూ కలిసి వంట చేయండి. సామ్రాట్ వాళ్ళ టీంలో ప్రేమ్ దివ్య ఉంటారు. నందూ వాళ్ళ టీంలో అభి అంకిత ఉంటారు' అని చెప్తాడు. అప్పుడు తులసి అలా అయితే నేను లాస్య ఇద్దరం మీరు చేసిన వంటలను టేస్ట్ చేసి అవి ఎలా ఉన్నాయో చెబుతాము అంటుంది. అప్పుడు సామ్రాట్ 'అయితే ఇంకెందుకు ఆలస్యం రా నందూ మనిద్దరం కలిసి వంటలు సిద్ధం చేద్దాం' అంటాడు. ఆ తర్వాత ముందుగానే మనం ఏమేమి తయారు చేసుకోవాలో లిస్టు రాసుకున్నాం కదా ఇక వాటిని ఫాలో అవుదాం అని సామ్రాట్ అంటాడు. ఆ తర్వాత ఇద్దరూ వంటలు రెడీ చేస్తుంటారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 701: Nandhu Asks Tulasi not to reveal their past to Samrat. After That Nandhu and Samrat Compete with Each Other in Cooking competition.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X