For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi August 4th Episode: నందూ సర్‌ప్రైజ్.. తులసికి గుడ్ న్యూస్.. అంతలోనే ప్రమాదం

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అంకిత సూచనల మేరకు అనసూయను బుట్టలో వేసుకునేందుకు లాస్య ప్రయత్నాలను ప్రారంభిస్తుంది. ఇందులో భాగంగానే తులసి ఇంటికి వెళ్లేందుకు అనసూయకు లాస్య మాయ మాటలు చెబుతుంది. దీంతో వాళ్లిద్దరూ కలిసి కొత్త ప్లాన్లు ఆలోచిస్తారు. అనంతరం నందూకు అనసూయ ధైర్యం చెబుతుంది. తప్పు ఆ తులసి వల్లే నాన్నకు అలా అయిందని అంటుంది. ఆ తర్వాత తులసి గార్మెంట్ కంపెనీ వాళ్ల ముందు ఓ రిక్వెస్ట్‌ను ఉంచుతుంది. అందుకు వాళ్లు సుముఖంగానే స్పందిస్తారు. మోహన్, మాధవి తులసికి ధైర్యం చెబుతారు.

  గృహలక్ష్మి హీరోయిన్ కస్తూరి పర్సనల్ ఫొటోలు: సీరియల్‌లో అలా.. రియల్‌గా ఇలా.. లేటు వయసులో ఘాటు ఫోజులు

  లాస్యను సర్‌ప్రైజ్ చేసిన నందూ... షాక్

  లాస్యను సర్‌ప్రైజ్ చేసిన నందూ... షాక్

  తులసి ఇంట్లోకి ఎలా వెళ్లాలి అని లాస్య, భాగ్య మధ్య చర్చ జరుగుతుండగా ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. వీళ్లిద్దరి మధ్య సరికొత్త ప్లాన్లు, వ్యూహాల గురించి వాదనలు జరుగుతుంటాయి. అంతలో అక్కడికి నందూ వస్తాడు. రావడం రావడమే ‘ఏంటి లాస్య? ఈరోజు ఆఫీస్‌కు రావడం లేదా? ఇంకా రెడీ అవలేదేంటి?' అని ప్రశ్నిస్తాడు. అప్పటి వరకూ బాధగా ఉన్న నందూ ఒక్కసారిగా ఆఫీస్‌కు వెళ్లేందుకు రెడీ అవడంతో లాస్య షాక్ అవుతుంది. అప్పుడు ‘నువ్వు వెళ్లు నందూ.. నేను గంటలో వస్తాను' అంటుంది. దీంతో భాగ్య ‘బావగారు నీ మాట వినేలా చేశావుగా' అని అంటుంది.

   తులసికి సతీష్ గుడ్ న్యూస్.. సంతోషం

  తులసికి సతీష్ గుడ్ న్యూస్.. సంతోషం

  ఇంట్లో ఒంటరిగా ఉన్న తులసికి గార్మెంట్ కంపెనీ మేనేజర్ సతీష్ ఫోన్ చేస్తాడు. ఈ సమయంలో ‘కంగ్రాట్స్ తులసి గారూ. మీరు అడ్వాన్స్ ఇవ్వకుండా మీకు మెటీరియల్ పంపేందుకు మిశ్రా సార్ ఒప్పుకున్నారు. ఇన్నేళ్లలో ఆయన ఎవరికీ ఇలా సాయం చేయలేదు. ఈ క్రెడిట్ మొత్తం మీదే తులసి గారూ. మీ డిజైన్స్, డెడికేషన్ నచ్చే ఆయన మీపై మంచి అభిప్రాయం ఏర్పరచుకున్నారు. అందుకే దీనికి ఒప్పుకున్నారు. ఇక, మీరు వెంటనే పనిని మొదలు పెట్టవచ్చు' అని చెబుతాడు. దీంతో వెంటనే తులసి ఇంట్లో వాళ్లందరినీ పిలిచి ఈ గుడ్ న్యూస్‌ను చెప్పడంతో సంతోషిస్తారు.

   నా కొడుకును ఎవరూ పట్టించుకోవట్లేదు

  నా కొడుకును ఎవరూ పట్టించుకోవట్లేదు

  సతీష్ చెప్పిన విషయాన్ని ఇంట్లోని అందరికీ చెబుతుంది తులసి. దీంతో అందరూ తెగ సంతోషిస్తారు. ఆ సమయంలో అందరూ ఆమెకు కంగ్రాట్స్ అని చెబుతారు. అప్పుడు మామగారు ‘నా ఆపరేషన్ వల్ల డబ్బు అయిపోయాయని బాధ పడుతున్నానమ్మా. ఇప్పుడు మంచి వార్త చెప్పావు' అని అంటాడు. అంతలో అక్కడకు అనసూయ ఎంట్రీ ఇస్తుంది. రావడం రావడమే ఆమె అసూయగా మాట్లాడడం మొదలు పెడుతుంది. ‘ఇక్కడ అందరూ సంతోషంగా ఉన్నారు. నా కొడుకునే ఎవరూ పట్టించుకోవడం లేదు' అని నిట్టూరుస్తుంది. దీంతో మరో వాదనకు తెర లేస్తుంది.

   వాడు చేసిన దానికి అనుభవిస్తున్నాడు

  వాడు చేసిన దానికి అనుభవిస్తున్నాడు

  అనసూయ మాటలకు పరందామయ్య సీరియస్ అవుతాడు. ‘వాడి గురించి పట్టించుకోడానికి వాడు మన గురించి ఎప్పుడైనా పట్టించుకున్నాడా? ఎవరూ కాదనుకుని వెళ్లిపోయాడు. దానికి ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఇంకే మాట్లాడకు' అంటూ వార్నింగ్ ఇస్తాడు. దీంతో అనసూయ ‘ఏ వాడికి నచ్చింది వాడు చేస్తున్నాడు' అని అంటుంది. అప్పుడు ప్రేమ్ నానమ్మతో గొడవకు దిగుతాడు. దీంతో ఆమె ‘ఏ నీకు మ్యూజిక్ అంటే ఇష్టం. దాన్ని వద్దంటే నువ్వు ఊరుకుంటావా' అని ప్రశ్నిస్తుంది. దీంతో ‘నా మ్యూజిక్‌కు ఆయన సంసారానికి సంబంధమా' అని అంటాడు ప్రేమ్.

  నందూకు యాక్సిడెంట్... మరో గొడవతో

  నందూకు యాక్సిడెంట్... మరో గొడవతో

  ఆఫీస్‌కు కారులో ఒంటరిగా వెళ్తున్న నందూకు తన తండ్రి, లాస్య, తులసిలు అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ బాధ పడుతుంటాడు నందూ. అంతలో ఓ బైక్ అడ్డం రావడంతో దాన్ని తప్పించబోయి ప్రమాదానికి గురవుతాడు. దీంతో అతడి తలకు గాయం అవుతుంది. ఈ విషయాన్ని లాస్య ఫోన్ చేసి దివ్యకు చెబుతుంది. దీంతో అందరూ కంగారు పడిపోతారు. అదే సమయంలో అనసూయ గట్టిగా ఏడుస్తుంది. అప్పుడు నీ వల్లే ఇలా జరిగింది అంటూ తులసిపై కోప్పడుతుంది. అంతలో మామగారికి కూడా ఈ విషయం తెలుస్తుంది. ఆయన నందూను చూసి రమ్మంటాడు.

  Evaru Meelo Koteeswarulu సెట్స్‌లో తారక్.. మీసం తిప్పిన స్టార్ హీరో.. గెస్ట్ చైర్‌లో ఉన్న ప్రముఖుడు ఎవరంటే!

  లాస్య ఇంటికి తులసి... నిందలు వేస్తూ

  లాస్య ఇంటికి తులసి... నిందలు వేస్తూ

  నందూను ఇంటికి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెడుతుంది లాస్య. ఇది తెలిసిన తులసి, అనసూయ, దివ్యలు అక్కడకు వస్తారు. ఆ సమయంలో లాస్య ‘చేసిందంతా చేసి ఇప్పుడు చూడ్డానికి వచ్చావా తులసి? మీ కుటుంబం కోసం ఎంతో బాధ పడుతుంటే మీరు మాత్రం పట్టించుకోవడం లేదు. మీరు ఇలా చేయడం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగింది. నందూ ఒత్తిడికి లోనవుతున్నాడని డాక్టర్ చెప్పారు' అని అంటుంది. దీనికి సరైన సమాధానాలు చెప్పిన తులసి నందూను చూడడానికి లోపలికి వెళ్తుంది. అప్పుడు స్ఫృహలో లేకుండా ఉన్న అతడని చూసి బాధ పడుతుంది.

  తులసికి కష్టాలు... దివ్య సపోర్టుతో రచ్చ

  తులసికి కష్టాలు... దివ్య సపోర్టుతో రచ్చ

  నందూను చూసి బాధ పడుతూ వచ్చిన తులసిని లాస్య సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతుంది. ‘చూశావా తులసి. ఆయన పరిస్థితి ఎలా ఉందో.. ఇప్పటికైనా ఆయనను బాధ పెట్టకు' అని అడుగుతుంది. అంతలో అక్కడకు అనసూయ వచ్చి ‘ఎందుకు లాస్య దాన్ని అడుగుతున్నావు? దాన్ని వదిలేసి నిన్ను చేసుకుంటున్నాడని కుళ్లుకుని ఇలా కావాలని కోరుకుంటుంది' అంటూ నిందలు వేస్తుంది. అప్పుడు పక్కనే ఉన్న దివ్య నానమ్మతో తీవ్ర స్థాయిలో గొడవకు దిగుతుంది. తల్లికి సపోర్ట్ చేస్తుంది. అప్పుడు తులసి వాళ్లను చీదరించుకుంటూ దివ్యతో వచ్చేస్తుంది.

  ఘాటు ఫొటోలతో పవన్ హీరోయిన్ రచ్చ: హద్దు దాటేసి మరీ అందాలు ఆరబోత.. చూస్తే షాక్ అవుతారు!

  పరందామయ్య బాధ... ప్రేమ్ భరోసాతో

  పరందామయ్య బాధ... ప్రేమ్ భరోసాతో


  తులసి వెళ్లిపోగానే లాస్య, అనసూయ మాట్లాడుకుంటారు. ఆ సమయంలో ఇద్దరూ కలిసి ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటారు. మరోవైపు, తన కొడుకుకు యాక్సిడెంట్ అవడంపై పరందామయ్యా బాధ పడుతుంటాడు. ‘నాకు ఆపరేషన్ అవడం ఏంటో.. ఆ వెంటనే నందూకు ఇలా ప్రమాదం జరగడమేంటో. మన ఇంటి మీద ఎవరి కన్నో పడింది' అని అంటాడు. అంతలో అక్కడకు వచ్చిన తులసి ‘ఆయన తలకు బలమైన గాయం అయింది. కానీ, ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారంట' అంటుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది. రేపటి ఎపిసోడ్‌లో తులసి, నందూ ఇంటికి వెళ్తుంది.

  టాలీవుడ్, బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా తాజా వార్తల కోసం, తారల ఇంటర్యూల కోసం, టెలివిజన్ సీరియల్ అప్‌డేట్స్ కోసం, ఫోటో గ్యాలరీల కోసం, సినిమా ఈవెంట్ల కోసం, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణల కోసం.. మీరు వెంటనే ఫేస్‌బుక్ ( https://www.facebook.com/TeluguFilmibeat/) ట్విట్టర్ (https://twitter.com/TeluguFilmibeat), ఇన్స్‌టాగ్రామ్ (https://www.instagram.com/filmibeatteluguofficial/) అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  Intinti Gruhalakshmi Episode 389: Sathish Said Good News to Tulasi. After That Nandhu Went Office in Car. Then He Met An Accident. Lasya and Anasuya Blame Tulasi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X