Intinti Gruhalakshmi: నాతో పడుకుని ఆమె ఆలోచనా? తులసిని పెళ్లి చేసుకుంటా.. ట్విస్ట్ ఇచ్చిన నందూ

దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఇంటికి వచ్చిన కూతురికి నందూ విలువైన మాటలు చెబుతాడు. అంతేకాదు, అత్తగారి ఇంట్లోనే ఉండి కాపురాన్ని నిలబెట్టుకోమని సలహా ఇస్తాడు. దీంతో దివ్య తన ఇంటికి వెళ్లిపోవాలని అనుకుంటుంది. మరోవైపు, విక్రమ్ బాధ పడుతూ ఉన్న సమయంలోనే లాస్య, రాజ్యలక్ష్మి వెళ్లి అతడిని మరింతగా రెచ్చగొడతారు. అంతేకాదు, రెండో పెళ్లి చేస్తామని అనడంతో అతడికి కోపం వస్తుంది. ఇక, దివ్య ఇంటికి రావడంతో విక్రమ్ కోప్పడతాడు. ఆ సమయంలోనే నోటీసుల గురించి చెప్తాడు. అప్పుడామెకు దాని గురించి నిజం తెలుస్తుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode August 4th 2023

ఏ భర్త అయినా భయపడాలి:దివ్య గురించి తులసి ఆలోచిస్తుండగా నందూ 'మనం ఇక్కడ కూర్చుని ఎంత ఆలోచించినా లాభం లేదు తులసి. అంతా దివ్య చేతుల్లోనే ఉంది' అంటాడు. దీంతో తులసి 'నేను చేసిన తప్పు దివ్య చేయకూడదని అంటారు అంతేకదా. మీరు దివ్యతో చెప్పిన మాటలను విన్నా. నేను నిజంగానే తప్పు చేశానా? మీరు దారి తప్పుతున్నారని తెలిసిన రోజున మీ చొక్కా పట్టుకుని నిలదీసి ఉంటే లాస్యను వదిలేసేవారా? నాతోనే ఉండేవారా' అని అడుగుతుంది. దీనికి నందూ 'ఖచ్చితంగా నీతోనే ఉండేవాడ్ని.. భార్య ఎదురుతిరిగితే ఏ భర్త అయినా భయపడాల్సిందే' అంటాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode August 4th 2023

నా పక్కన పడుకుని కూడా:నందూ మాటలకు తులసి 'అంటే భయపడి నాతో ఉండేవారు అంతే కదా. కానీ నాకు కావాల్సింది భయంతో కాపురం చేసే భర్త కాదు. ప్రేమతో నాతో కలిసి ఉండే భర్త. మనిషి నా పక్కన ఉంటూ.. మనసులో ఎవరినో ఊహించుకునే భర్త నాకు అవసరం లేదు. నాతోనే ఉండాలి. నాతోనే జీవితం పంచుకోవాలి. మనసు నిండా నన్నే నింపుకోవాలి. నేను నిలదీసి ఉంటే ఖచ్చితంగా అది జరిగేది కాదు. మొక్కుబడిగా మంచంపై నా పక్కన పడుకుని లాస్య గురించి ఆలోచించేవారు. ఇష్టం లేని కాపురం చేస్తూ ఇంట్లో నా కళ్లు కప్పి బయట ఇద్దరూ కలిసి తిరిగేవాళ్లు కదా' అని అడుగుతుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode August 4th 2023

అందుకే తల ఎత్తుకున్నాం:'ఏమో తులసి నువ్వు ప్రయత్నిస్తే మెల్లగా నా మనసు మారేదేమో కదా' అని నందూ అనగా.. తులసి 'మారకపోతే నా పరిస్థితి ఏంటి? ప్రతిరోజూ పిల్లల ముందు గొడవ పడేవాళ్లం. సమాజం విలువ పోగొట్టుకునేవాళ్లం. నేను చెప్పేది వాస్తవం. మనం విడాకులు తీసుకోవడం వల్లే ఎవరి గౌరవం వాళ్లు కాపాడుకోగలిగాం. పిల్లల ముందు తల ఎత్తుకుని మర్యాదగా ఉండగలిగాం. వాళ్ళు మన మాట వినేలా చేసుకోగలిగాం. లేకపోతే వాళ్లు కూడా దారి తప్పేవారు. రెండో పెళ్లి విషయంలో కూడా మీ చేతులు కాలాయి కాబట్టే ఈరోజు వేదాంతం మాట్లాడుతున్నారు' అంటుంది.

నా అనుభవం దివ్య కోసమే:ఆ తర్వాత తులసి 'ఎదురు తిరగకపోవడం నా తప్పే అని మీరు అంటున్నారు. మీరు లాస్య కుదురుగా కాపురం చేసి కలిసి ఉంటే మీరు ఆ మాట అనేవారా? అసలు నా గురించి ఆలోచించేవారా? నేనెప్పుడూ తొందరపాటుతో నిర్ణయం తీసుకోను. తీసుకున్న నిర్ణయం తప్పు అని బాధపడను. అందుకే ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. మీకు ఆలోచించే అలవాటు ముందు నుంచి లేదు. మీ కారణంగా మన జీవితాలు ఇలా తయారయ్యాయి. నా కారణంగా కాదు. దివ్యకు నచ్చజెప్పేటప్పుడు మీరు చెప్పిన ఒక మాట నాకు బాగా నచ్చింది. దివ్య విక్రమ్‌ల మధ్య అంతులేని ప్రేమ ఉంది. కేవలం బయట వ్యక్తుల ప్రమేయం వల్లే గొడవలు జరుగుతున్నాయి. వాళ్ల ప్రేమే వాళ్లని కలుపుతుంది. ఇదంతా దివ్యకు ఉపయోగపడేలా చేయాలి' అని తన ప్లాన్ నందూకు చెప్తుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode August 4th 2023

వంకరబుద్ధి అత్తయ్య అని:దివ్య ఇంటికి రావడంతో రాజ్యలక్ష్మి, లాస్య ఆమె ప్లాన్‌తోనే వచ్చింది అని మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలోనే అక్కడకు వచ్చిన దివ్య 'శెభాష్ వంకరబుద్ది అత్తయ్యా' అంటూ చప్పట్లు కొడుతుంది. దీనికామె ఏయ్ అని అరవడంతో దివ్య 'ఉష్.. అరవకు. మనం మనం మాట్లాడుకుందాం. మొదటిసారి కోడలి మనసులో మాట కరెక్ట్‌గా గెస్ చేశావు. అందుకే చప్పట్లు కొట్టాను. నేను ప్లాన్‌తోనే వచ్చాను.. నేను వచ్చింది మీ ఆట కట్టించడానికే' అంటూ వాళ్లలో మరింత టెన్షన్ పెంచుతుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode August 4th 2023

నందూ మందు తాగి రచ్చ:దివ్యను అత్తగారి ఇంటికి పంపానన్న సంతోషంలో నందూ ఇంట్లో కూర్చుని మందు తాగుతాడు. ఆ సమయంలో తనను ఎవరూ డిస్టర్బ్ చేయొద్దని తండ్రితో చెప్తాడు. ఆ సమలో లాస్య అక్కడకు వస్తుంది. అప్పుడు నందూ కోపంతో 'ఓసినా వెలిసిపోయిన మాజీ పెళ్లమా.. నిన్ను తన్ని తరిమేశాను కదా.. నీకు సిగ్గులేదా' అని అంటాడు. దీంతో లాస్య 'ఏం చేయను? బెంగపుడుతుంది. చూడాలనిపిస్తుంది' అని అంటుంది. దీనికి నందూ 'అవునే.. నా కూతురు బతుకు నాశనం చేస్తాను అని కోర్టు దగ్గర ఛాలెంజ్ చేశావు కదా. ఇప్పుడు నా కూతురు పుట్టింటికి రావడానికి కూడా కారణం నువ్వే అని తెలుసు. నీ ఆటలు ఇక సాగవే లాస్యా. ఇక్కడ ఉన్నది ఎవరో తెలుసా' అంటూ రెచ్చిపోతాడు. దీంతో లాస్య తెలుసు నా ముద్దుల మాజీ మొగుడు అంటుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode August 4th 2023

తులసిని పెళ్లి చేసుకుంటా:ఆ తర్వాత లాస్య రెచ్చగొట్టడంతో నందూ మరింత వాగుతుంటాడు. అప్పుడే తులసి రావడంతో ఆమె ప్రస్తావన వస్తుంది. దీంతో లాస్య 'ఏంటి సామీ.. తులసిని అంతలా పొగిడేస్తున్నావు? కొంపతీసి మాజీ పెళ్లానికి లైన్ వేస్తున్నావా' అని అడుగుతుంది. దీంతో నందూ 'అవును తులసికి లైన్ వేస్తున్నా. నా దారిలో పెట్టుకుంటున్నాను. చెట్టాపట్టాలేసుకుని తిరుగుతాను. కలిసి బతుకుతాను నీకేంటి? నీకెందుకు ఏడుపు? తులసి నీలా రాక్షసి కాదు దేవత.. తను ఊ అంటే మొహమాటం లేకుండా తాళి కట్టేస్తా. తాళి కట్టడమే కాదు.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటా. క్షణం కూడా ఆలోచించను. అంతకంటే అదృష్టం లేదనుకుంటా. మా పెళ్లికి నిన్ను కూడా పిలుస్తా లాస్యా' అంటాడు. దీంతో తులసి కోపంతో వెళ్లిపోతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X