For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi August 5th Episode: మామకు నిజం చెప్పిన తులసి.. నందూకు దూరమయ్యేందుకు లాస్య రెడీ

  |

  వేరు భాషలతో పోలిస్తే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

   బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అడ్వాన్స్ ఇవ్వకుండానే మెటీరియల్ ఇచ్చేందుకు మిశ్రా ఓకే చెప్పాడని గార్మెంట్ కంపెనీ మేనేజ్ సతీష్ తులసికి శుభవార్త చెబుతాడు. దీంతో అందరూ సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత నందు కారులో ఆఫీసుకు వెళ్తుంటాడు. అప్పుడు అతను ప్రమాదానికి గురయ్యాడు. తలకు బలమైన గాయంతో ఇంటికి చేరుకుంటాడు. అప్పుడతడిని చూడ్డానికి వచ్చిన తులసిని లాస్య, అనసూయ నిందిస్తారు.

  మామగారికి నిజం చెప్పేసిన తులసి

  మామగారికి నిజం చెప్పేసిన తులసి

  నందూకు యాక్సిడెంట్ అవడం గురించి తులసి, పరందామయ్య మధ్య చర్చ జరుగుతుంది. ఆ సమయంలో ప్రమాదం ఎలా జరిగిందని మామగారు అడగగా.. ‘కారులో ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఏదో పరధ్యానంగా ఉన్నారట. అందుకే ఇది జరిగింది. ఆయన మీ గురించి, మన కుటుంబం గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. దీని వల్లే ఇలా అయింది. కాబట్టి ఆయనను ఇంటికి తీసుకొచ్చే విషయం గురించి మీరు మరోసారి ఆలోచిస్తే బాగుంటుంది మామయ్య' అని చెబుతుంది తులసి.

  నిహారిక భర్త చైతన్యపై పోలీస్ కేసు: అర్ధరాత్రి ఆ విషయంలో మొదలైన గొడవ.. సీసీ పుటేజ్‌లో కీలక ఆధారాలు

  తులసిని ఏడుస్తూ దండం పెట్టిన అత్త

  తులసిని ఏడుస్తూ దండం పెట్టిన అత్త

  మామగారితో మాట్లాడి వస్తుండగా తులసిని అనసూయ అడ్డుకుంటుంది. అప్పుడు ఏడుస్తూ.. ‘నాకు తెలుసే. మీరంతా కలిసి నా కొడుకును చంపే వరకూ ఊరుకోరు' అంటుంది. దీనికి తులసి ‘మా మధ్య కోపాలు ఉన్నాయి కానీ ప్రాణాలు తీసుకునేంత లేదు' అని అంటుంది. అప్పుడు అనసూయ ‘నా అహం పక్కన పెట్టి అడుగుతున్నా. నా కొడుకు గురించి మీరు ఆలోచించండి తులసి. నా కడుపు కోత గురించి మీకు అర్థం కావడం లేదా' అంటూ ధీనంగా అభ్యర్ధిస్తుంది.

  పుత్ర భిక్ష పెట్టమంటూ తులసికి రిక్వెస్ట్

  పుత్ర భిక్ష పెట్టమంటూ తులసికి రిక్వెస్ట్

  అనసూయ ఏడుస్తూ అడుగుతుండగా.. ప్రేమ్ ఆమెను ఎదురించి మాట్లాడతాడు. ‘శాంతంగా ఉన్న ఇంట్లో గొడవలు పెట్టడానికి ఆయనను తీసుకు రమ్మంటావా' అని ప్రశ్నిస్తాడు. అంతలో అక్కడకు అంకిత వచ్చి ప్రేమ్‌తో వాదనకు దిగుతుంది. అప్పుడు అనసూయ వాళ్లిద్దరూ సైలెంట్‌గా ఉండమని అరుస్తుంది. అంతేకాదు, ‘తులసి నువ్వు చెప్పవే. నా కొడుకు ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి. వాడు ఇక్కడుంటేనే మంచిగా ఉంటాడు. నందూకు ప్రాణ భిక్ష పెట్టవే' అంటూ తులసిని అభ్యర్ధిస్తుంది.

  నందూ మీద సింపతీ.. లాస్య మరో ప్లాన్

  నందూ మీద సింపతీ.. లాస్య మరో ప్లాన్

  నందూ విషయంలో తులసి ఇంట్లో జరుగుతోన్న రచ్చ గురించి లాస్య, భాగ్య సంతోషిస్తుంటారు. అంతేకాదు, మరికొన్ని ప్లాన్లు కూడా వేస్తుంటారు. ఆ సమయంలో భాగ్య ‘నీ ప్లాన్ వర్కౌట్ అవుతుంది లాస్య. అనుకున్నట్లే బావ గారి మీద సింపతీ బాగా పెరుగుతుంది. దీంతో ఆయన ఆ ఇంటికి వెళ్లడానికి లైన్ క్లియర్ అయిపోయింది. అలాగే, నువ్వు కూడా ఎంటర్ అవ్వొచ్చు' అంటుంది. అప్పుడు ‘నందూ నన్ను కూడా అక్కడకు తీసుకొస్తా అనేలా చేస్తాను' అంటుంది లాస్య.

  తల్లిని నిందించిన అభి... ఆయన ఇష్టం

  తల్లిని నిందించిన అభి... ఆయన ఇష్టం

  అభి (ఆర్టిస్టును మార్చారు)ని తీసుకుని తులసి దగ్గరకు వస్తుంది అంకిత. అప్పుడతను ‘మామ్.. డాడీ విషయంలో ఏం నిర్ణయించారు? మీ పంతాల వల్ల ఆయనను మాకు కూడా దూరం చేస్తావా? ఇలా అయితే కొన్ని రోజులకు ఆయన మాకు శాశ్వతంగా దూరం అయిపోతారు' అంటూ తల్లిని నిందిస్తాడు. అప్పుడు అంకిత కూడా అతడికి సపోర్టుగా మాట్లాడుతుంది. దీంతో తులసి ‘మీ నాన్న ఇక్కడకు రావాలంటే తాతయ్య ఇష్టం. వెళ్లి ఆయనను అడుగు' అని బదులిస్తుంది.

  మంచు లక్ష్మీ ఘాటు ఫోజులు: గతంలో ఎన్నడూ చూడని విధంగా.. షాకిస్తోన్న ఆమె పర్సనల్ ఫొటోలు

  లాస్య ప్లాన్ అమలు.. నందూ నిర్ణయం

  లాస్య ప్లాన్ అమలు.. నందూ నిర్ణయం

  ఒంటరిగా బాధ పడుతూ ఉన్న నందూతో ‘నందూ నా వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చింది. నేను లేకపోతే నువ్వు నీ కుటుంబంతో కలిసి ఉంటావు. తులసి నన్ను గెంటేసినప్పుడు నువ్వు అక్కడే ఆగిపోయి ఉంటే బాగుండేది. ఇప్పటికైనా నన్ను వదిలేసి నువ్వు ఆ ఇంటికి వెళ్లిపో' అని ప్లాన్ ప్రకారం ఏడుస్తుంది. దీనికి నందూ ‘అలా అనుకోకు లాస్య. నీతో ఎప్పటికీ సంతోషంగా ఉండాలి అనుకుంటున్నా. అందుకోసం నా ఫ్యామిలీనైనా వదులుకుంటా. వాళ్లు రమ్మంటే మాత్రం నువ్వు లేకుండా వెళ్లను' అని ఆమె ట్రాక్‌లో పడిపోతాడు.

  అక్షర హాసన్ అదిరిపోయే ఫొటోలు: శృతి హాసన్‌కు ఏమాత్రం తక్కువ కాకుండా.. రెచ్చిపోయిన పిల్లికళ్ల పిల్ల

  #YoSonakshiSoDumb | Sonakshi Sinha Trolled For Not Knowing Ramayana
  పరందామయ్య క్లారిటీ... తులసి కోసం

  పరందామయ్య క్లారిటీ... తులసి కోసం

  నందూను ఇంటికి తీసుకొచ్చే విషయమై తులసి తన మామగారితో మరోసారి మాట్లాడుతుంది. అప్పుడు దానికి ఆయన మాత్రం అస్సలు ఒప్పుకోడు. ఆ సమయంలో అభి, అంకిత, అనసూయ అక్కడకు వచ్చి నానా రచ్చ చేస్తారు. కానీ, ఆయన మాత్రం అందుకు అంగీకరించడు. పైగా తులసితో ‘నువ్వు చెప్పమ్మా తులసి. నందూ రావడం నీకు ఇష్టమేనా' అంటాడు. దీనికి అందరి కోసం ఒప్పుకుంటున్నా అంటుంది. అప్పుడాయన ‘వాడు వస్తే నీకు ఇబ్బందులు తప్పవు. పదే పదే అవమాన పడాల్సి వస్తుంది' అంటూ హెచ్చరిస్తాడు.

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  Intinti Gruhalakshmi Episode 390: Anasuya Crying and Requested to Tulasi for Nandhu. Then Abhi and Ankitha Also Supported to Nandhu. But Parandamayya Not Agree with Tulasi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X