Intinti Gruhalakshmi: పగక గదిలో రెచ్చిపోయిన దివ్య.. అత్తతో ఛాలెంజ్.. ఇంట్లో నుంచి వెళ్లిపోతా అంటూ!

చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

 Intinti Gruhalakshmi Serial Today Episode August 5th 2023

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. దివ్య గురించి తులసి ఆలోచిస్తుండగా నందూ వెళ్లి ఆమెతో మాట్లాడతాడు. అప్పుడు తులసి.. నందూ తనకు విడాకులు ఇచ్చిన విషయంపై క్లాస్ పీకుతుంది. ఆ తర్వాత తన అనుభవాన్ని దివ్య కోసం వాడతానని అంటుంది. ఇక, ఇంటికి వెళ్లిన దివ్య అత్తగారితో చాలెంజ్ చేస్తుంది. ఆ తర్వాత నందూ ఇంట్లో మందు తాగుతూ ఉండగా.. లాస్య వస్తుంది. అప్పుడు నందూ రెచ్చిపోతాడు. అంతేకాదు, తులసిని మళ్లీ పెళ్లి చేసుకుంటాను అంటూ వంకర మాటలు మాట్లాడతాడు. దీంతో ఆమెకు కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

నీ పెళ్లాం అనుకుంటే పెట్టకు: విక్రమ్‌ను దివ్య బావా రారా అంటూ తెగ రెచ్చిపోతుంది. అప్పుడు అతడిపై పడిపోబోతుండగా పట్టుకుంటాడు. తర్వాత తన మీద ఎందుకు పడ్డావు అంటూ కోప్పడగా.. బావ అందంగా ఉన్నాడని అంటుంది. దీంతో విక్రమ్ 'నీకస్సలు సిగ్గు లేదా' అనగా.. దివ్య 'నా పూలు మీ తలపై పడ్డాయి. కావాలనే జారిపడేట్టు చేశారు. జారిపోయిన నా పూలను సరిచేయొచ్చు కదా. నా తలలో పూలు పెట్టొచ్చు కదా' అంటుంది. దీంతో విక్రమ్ పెట్టననగా.. దివ్య 'సర్లే నీ పెళ్లాం అనుకుంటే మాత్రం అస్సలు పెట్టకు' అని అంటుంది. దీంతో విక్రమ్.. దివ్య తల్లో మల్లెపూలు పెట్టేస్తాడు.

చీరకు అడ్డుగా కట్టేసిన భర్త: రాత్రి అవడంతో విక్రమ్, దివ్య ఒకే మంచంపై పడుకుంటారు. అప్పుడు విక్రమ్ నిగ్రహం నటిస్తూ మొత్తం ముడుచుకుని పడుకుంటాడు. కానీ, దివ్య మాత్రం అతడిని రెచ్చగొట్టే పనులు చేస్తుంది. ఆ సమయంలో కావాలనే అతడి ముఖంపై జడ వేస్తుంది. దీంతో విక్రమ్ చిరాకు పడుతూ ఉంటాడు. అప్పుడామె ఇంకా దగ్గరకు వచ్చేయమంటావా అని అడగ్గా.. విక్రమ్ పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దంటూఅడ్డుగా చీరను కట్టేస్తాడు. దీంతో దివ్య ఫోన్ తీసి 'ఇదిగో తెల్లచీర ఇవిగో మల్లెపూలు' అంటూ సాంగ్ పెట్టి అతడిని మరింతగా రెచ్చగొట్టాలని చూస్తుంది. కానీ, విక్రమ్ మాత్రం ఆమె ప్లాన్లు అన్నీ చెడగొట్టేస్తాడు.

నందూ మాటలు ఆలోచిస్తూ: ఇంట్లో ఒంటరిగా ఉన్న లాస్య.. నందూ అన్న మాటలనే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అంతేకాదు, అతడు తులసిని పెళ్లి చేసుకుంటా అన్న మాటలను పదే పదే ఆలోచిస్తుంటుంది. ఆ సమయంలోనే 'పక్కన తులసిని పెట్టుకుని ఆ మాట అన్నాడంటే.. ఇద్దరి మధ్య అగ్రిమెంట్ కుదిరినట్టుంది. అంతా వాళ్లిష్టమేనా.. నేనెలా ఊరుకుంటా' అని అనుకుంటుంది.

 Intinti Gruhalakshmi Serial Today Episode August 5th 2023

ఆమెకు హామీ ఇచ్చిన దివ్య: దివ్య గదిలో నుంచి బయటకు వస్తుండగా పని మనిషి వచ్చి పెద్దమ్మ గారు ఎక్కడమ్మా అని అడుగుతుంది. దీనికి దివ్య 'ఏమో లోపలెక్కడో ఉండి ఉంటారు. నీకేమైనా అవసరమా? డబ్బులేమైనా కావాలా' అని అడగ్గా 'లేదమ్మా.. నా కొడుకుని పెద్దాసుపత్రికి తీసుకుని వెళ్లమని అడుగుదాం అని. నా కొడుక్కి చాలా రోజులుగా జ్వరం తగ్గడం లేదు. పెద్దాసుపత్రికి తీసుకుని వెళ్లి చూపిద్దాం' అని అంటుంది. దీంతో మన ఆస్పత్రికి తీసుకెల్లొచ్చుగా అనగా.. అది చాలా ఖర్చు కదా అని అంటుంది. దీంతో 'ఆస్పత్రికి రా నేను వచ్చి చూసుకుంటా' అని చెప్తుంది.

 Intinti Gruhalakshmi Serial Today Episode August 5th 2023

దివ్యకు షాక్ ఇచ్చిన అత్త: పనిమనిషితో దివ్య ఆ మాట చెప్పగానే రాజ్యలక్ష్మి వచ్చి 'ఏంటి అదేమన్నా నీ బాబుగారి హాస్పిటల్ అనుకున్నావా? వరాలు కురిపిస్తున్నావు' అని షాకిస్తుంది. దీనికి దివ్య 'నా బాబుగారి హాస్పిటల్ కాదు అత్తయ్యా.. నా మామగారి హాస్పిటల్. మావారి బాబుగారి హాస్పిటల్' అని అంటుంది. దీంతో రాజ్యలక్ష్మి 'కాదు.. అది ఈ రాజ్యలక్ష్మి హాస్పిటల్. అక్కడ నుంచి చీమ కదలాలన్నా నా పర్మిషన్ ఉండాల్సిందే. ఏ ధైర్యంతో పని మనిషికి మాటిచ్చావు' అని ప్రశ్నిస్తుంది. దీనికి దివ్య 'చూడు అత్తయ్యా.. నేను హాస్పిటల్‌కు సంబంధించిన డాక్టర్' అంటుంది. దీంతో రాజ్యలక్ష్మి 'మర్చిపోయానూ.. నువ్వు కూడా డాక్టర్ అనే మాట మర్చిపో.. నిన్ను జాబ్‌లో నుంచి తీసేశాను' అని అంటుంది.

 Intinti Gruhalakshmi Serial Today Episode August 5th 2023

సిగ్గులేకపోతే సరి అంటూ: రాజ్యలక్ష్మి మాటలకు దివ్య 'నేను హాస్పిటల్ చైర్మన్ భార్యను' అనడంతో.. 'ఆ మాట చెప్పడానికి సిగ్గుండాలి. విడాకుల నోటీసుల ఇచ్చావు. విక్రమ్‌తో నీ బంధం తెగిపోయినట్టే' అని అత్త బదులిస్తుంది. దీనికి దివ్య 'ఆమాట చెప్పాల్సింది మీరు కాదు కోర్టు. ఈ మాట మీకు వందసార్లు చెప్పాను. ఒకసారి స్కానింగ్ చేయించుకోండి. మైండ్‌లో ఏదో తేడా ఉన్నట్టు ఉంది' అని అంటుంది. దీంతో అత్త 'ప్రాబ్లమ్ ఉన్నది నాకు కాదు నీకు. భర్తతో పనిలేదని పుట్టింటికి పోయావు కదా. విడాకులు నోటీసులు పంపించావు. ఇప్పుడు సిగ్గులేకుండా తిరిగొచ్చి నా మొగుడు నా ఇల్లు అంటున్నావు. నా ఉద్యోగం అంటున్నావు. సిగ్గులేకపోతే సరి' అని అంటుంది.

ఇంట్లో నుంచి వెళ్లిపోతా: అత్త మాటలకు దివ్య 'నేను, నీ కొడుకు రాత్రి ఒకే మంచంపై పడుకున్నాం. అది తెలీదా' అనగా.. 'మీరు పడుకున్నా దూరంగా ఉన్నారు. మధ్యలో చీర కట్టుకున్నారు' అని రాజ్యలక్ష్మి అంటుంది. దీంతో దివ్య 'ఓహో.. మా గదిలోవి కూడా స్కాన్ చేస్తున్నారా? సరే చూడండి.. నేను మీ కొడుకును నా దారిలోకి తెచ్చుకుంటా. ఆయనే నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లమని మీకు చెప్పేలా చేస్తా' అంటుంది. దీనికి రాజ్యలక్ష్మి 'ఒకవేళ అలా జరగకపోతే ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్లిపోతావా' అని అడగ్గా.. 'వెళ్లిపోతా చాలెంజ్' అంటుంది. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X