India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తులసికి సామ్రాట్ ఊహించని గిఫ్ట్.. వాళ్లను అలా చూసి నందూ షాక్

  |

  ఇండియాలోని మిగిలిన ఇండస్ట్రీల కంటే తెలుగు బుల్లితెరపై మాత్రమే ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  బాక్స్ ఆఫీస్ యుద్ధం లో బింబిసారుడు గెలిచాడా లేదా *Reviews | Telugu OneIndia
  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూ, సామ్రాట్ మధ్యన వంటల పోటీ జరుగుతుంది. అప్పుడు నందూకు లాస్య, సామ్రాట్‌కు తులసి సహాయం చేస్తారు. ఆ తర్వాత జడ్జ్‌గా తులసి వద్దని నందూ అడ్డు పడతాడు. కానీ, దీనికి తులసి ఒప్పుకోదు. పైగా నందూకు ఓ రేంజ్‌లో క్లాస్ పీకుతుంది. ఆ తర్వాత పరందామయ్య, అనసూయ ఆ వంటలు రుచి చూసి సామ్రాట్ గెలిచినట్లు ప్రకటిస్తారు. అనంతరం దివ్యతో సామ్రాట్ చెస్ ఆడి గెలుస్తాడు. ఇదంతా చూసిన నందూకు కోపం వచ్చి వెళ్లిపోవాలనుకుంటాడు. కానీ, అతడిని తీసుకొచ్చి సామ్రాట్‌తో మరో పోటీ పెడతారు.

  నువ్వు వర్జిన్‌వేనా అంటూ అషు రెడ్డికి నెటిజన్ ప్రశ్న: ఇండైరెక్టుగా బదులిచ్చిన బ్యూటీ

  తులసిని ఓడించినట్లే అనుకుని

  తులసిని ఓడించినట్లే అనుకుని

  లక్కీ విజిల్ వేయడంతో నందూ, సామ్రాట్ మధ్యన ఆర్మ్ రెజ్లింగ్ పోటీ ప్రారంభం అవుతుంది. ఇందులో ఇద్దరూ తమ తమ సత్తాతో పోటీ పడుతూ ఉంటారు. ఆ సమయంలో నందూ ‘ఇప్పుడు ఓడిపోతే అందరి ముందు నా పరువు పోతుంది. అయినా ఎలాగైనా ఇందులో గెలవాలి. సామ్రాట్‌ను ఓడిస్తే తులసి ఇగోను ఓడించినట్లే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని వదులుకోకూడదు' అని అనుకుంటాడు. అలాగే, లాస్య కూడా మనసులో ‘వామ్మో ఇప్పుడు నందూ ఓడిపోతే పరువు పోవడమేమో కానీ.. ఈ పోటీ పెట్టినందుకు నా పని అయిపోతుంది' అని అనుకుంటుంది.

  తులసి సైగలు.. ఓడిన సామ్రాట్

  తులసి సైగలు.. ఓడిన సామ్రాట్

  అటు నందూ, ఇటు సామ్రాట్ ఎవరికి వారే గెలవాలని గట్టిగా పోటీ పడుతూ ఉంటారు. ఒక దశలో నందూ ఓడిపోయే పరిస్థితికి చేరుకుంటాడు. ఆ సమయంలో తులసి ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? అని తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. అది చూసిన సామ్రాట్ ఏమైంది అన్నట్లుగా సైగలు చేస్తాడు. దీంతో తులసి ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ఉంటుంది. ఆ తర్వాత కాసేపటికి ఓడిపోమంటూ సైగలు చేస్తుంది. దీంతో సామ్రాట్.. నందూ చేతిలో పరాజయం పాలవుతాడు. ఇక, ఈ పోటీలో గెలిచిన నందూను అందరూ చప్పట్లు కొట్టి మరీ అభినందిస్తారు.

  Bimbisara Twitter Review: బింబిసారకు అలాంటి టాక్.. అఖండ, RRR తర్వాత ఇదే.. అదొక్కటే పెద్ద మైనస్

  సామ్రాట్‌కు వివరించిన తులసి

  సామ్రాట్‌కు వివరించిన తులసి

  నందూ చేతిలో ఓడిపోయిన తర్వాత సామ్రాట్.. తులసి దగ్గరకు వెళ్తాడు. అప్పుడు ఆమె ‘ఆతిథ్యం కోసం నందూను నీ ఇంటికి పిలిచి తనని ఓడించడం నిజంగా అవమానం అవుతుంది. అందుకే మిమ్మల్ని ఓడిపోమని చెప్పాను' అని వివరిస్తుంది. దీనికి సామ్రాట్ ‘నిజమే తులసి గారు.. పైకి తను నాతో అనకపోయినా ఖచ్చితంగా మనసులో ఫీలయ్యాడు. ఇంత చిన్న విషయం నా మనసుకు ఎందుకు అర్థం కాలేదు' అని తులసితో అంటాడు. అప్పుడామె మీరు ఆట మీద మాత్రమే దృష్టి పెట్టారు.. అందుకే మీకు ఈ ఆలోచన తట్టులేను అనుకుంటా అని అంటుంది.

  తులసికి పువ్వు ఇచ్చిన సామ్రాట్

  తులసికి పువ్వు ఇచ్చిన సామ్రాట్

  తులసి చెప్పిన మాటలకు మరింత ఫిదా అయిన సామ్రాట్ ‘అయినా మీరు ఆలోచించే తీరులోనే న్యాయం ఉంటుందండి. ఎదుటి మనిషి బాధపడకూడదు అనే ఆరాటం ఉంటుంది' అని పొగడ్తలతో ముంచేత్తుతాడు. అప్పుడు తులసి ‘మా ఇంట్లో వాళ్ళే ఇప్పటి దాకా ఈ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇప్పుడు మీరు కూడానా' అని అంటుంది. దీంతో సామ్రాట్ అయితే ఈ గులాబీ పువ్వు వైపు ఒకసారి చూడండి అంటాడు. అప్పుడామె చాలా బాగుంది అని అంటుంది. దీంతో వెంటనే ఆమె చేతికి అందిస్తాడు. దాన్ని తులసి అడిగి మరీ తీసుకుంటుంది.

  షర్ట్ విప్పేసి మరీ సమీరా రెడ్డి అందాల ఆరబోత: ఎన్టీఆర్ హీరోయిన్ ఇలా మారిందేంటి!

  సీన్ చూసి రగిలిపోయిన నందూ

  సీన్ చూసి రగిలిపోయిన నందూ

  తులసికి సామ్రాట్ గులాబీ పువ్వు ఇవ్వడం చూసిన నందూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. కానీ ఏమీ అనలేక మౌనంగా ఉండిపోతాడు. ఆ తర్వాత సామ్రాట్ ‘నేను నీకోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. అదేంటో మీకు చూపిస్తాను' అని తులసిని ఇంట్లోకి తీసుకువెళ్తాడు. ఆ తర్వాత అందరినీ పిలిచి ఈ విషయం చెబుతాడు. అంతేకాదు, ‘మా హనీని స్కూల్ కాంపిటిషన్‌లో గెలవడానికి సహయపడనందుకు మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను' అంటాడు. ఆ తర్వాత సామ్రాట్ చప్పట్లు కొట్టగానే పని వాళ్లు వచ్చి తులసి ఎదురుగా ఒక టేబుల్ పెట్టి వెళ్లిపోతారు.

  తులసికి సామ్రాట్ సర్‌ప్రైజ్ గిప్ట్

  తులసికి సామ్రాట్ సర్‌ప్రైజ్ గిప్ట్

  ఆ టేబుల్ అక్కడ పెట్టగానే అక్కడ ఏముందని అంతా ఆసక్తిగా చూస్తుంటారు. అప్పుడు దివ్య అంకుల్ ఇదేం గిఫ్ట్ అని అడుగుతుంది. దీంతో సామ్రాట్ తులసి గారు ఆ గిఫ్ట్ ఏంటో రివిల్ చేయండి అని అంటాడు. దీంతో తులసి టేబుల్ మీద ఉన్న క్లాత్ ఓపెన్ చేయగా అక్కడ ఓ వీణ ఉంటుంది. అది చూసిన వెంటనే తులసి థాంక్స్ అండి బహుమతి నచ్చింది అని చెబుతుంది. అప్పుడు సామ్రాట్ ‘మీరు నాకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి. నేను ఇచ్చిన ఈ వీణతో మీ మొదటి పాట ఇక్కడే పాడాలి' అని అడుగుతాడు. దీంతో తులసి యమునా నది అంటూ ఓ పాటను పాడుతుంది.

  శ్రీహాన్‌ను మోసం చేసిన సిరి హన్మంత్: అడ్డంగా దొరికి బుక్కైపోయిన బ్యూటీ

  నందూకు క్లాస్ పీకిన సామ్రాట్

  నందూకు క్లాస్ పీకిన సామ్రాట్


  తులసి పాడిన ఆ పాటకి మురిసిపోయి అందరూ క్లాప్స్ కొడతారు. కానీ, నందూ మాత్రం మౌనంగానే ఉండిపోతాడు. దీంతో సామ్రాట్ ‘తులసి పాట ఎలా పాడారు' అని అడుగుతాడు. దీనికతడు బాగా పాడారు అని అంటాడు. అప్పుడు సామ్రాట్ బాగా పాడారా.. చాలా బాగా పాడారా అని ప్రశ్నిస్తాడు. దీనికి నందూ చాలా బాగా పాడారు అంటాడు. అప్పుడు సామ్రాట్ ‘మరి ఎందుకు క్లాప్స్ కొట్టలేదు' అని ప్రశ్నిస్తాడు. దీనికి లాస్య ‘ఆ పాటను ఆస్వాదిస్తూ మర్చిపోయినట్టు ఉన్నాడు' కవర్ చేస్తుంది. దీనికి నందూ కూడా అవును అంటాడు. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 703: Samrat Loses the game with Nandhu for Tulasi. After That Samrat Gives A Present Gift to Tulasi for Supporting Honey.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X