For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi August 6 Episode: తులసితో వచ్చిన నందూ.. లాస్యకు చెక్ పెట్టాలని ప్రేమ్ ప్లాన్

  |

  ఎన్నో ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ ఓ లుక్కేయండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. కొడుకు పరిస్థితిని చూసి చలించిపోయిన అనసూయ ఏడుస్తూ, నందుని ఇంటికి తీసుకు రమ్మని తులసిని అభ్యర్థిస్తుంది. ఆమెకు అభి, అంకిత మద్దతు ఇస్తారు. అదే సమయంలో నందూను బుట్టలో వేసుకునేందుకు లాస్య కన్నింగ్ ప్లాన్ అమలు చేస్తుంది. ఇందులో భాగంగానే తనను వదిలేయమని ఏడుస్తుంది. ఆ తర్వాత పరందామయ్యను నందూ గురించి మరోసారి ఆలోచించమని చెబుతుంది. కానీ, ఆయన మాత్రం తులసితో ఏకీభవించడు.

  SR Kalyanamandapam Twitter Review: ఇద్దరే నిలబెట్టారు.. మూవీ హైలైట్స్ అవే.. అవి లేకుంటే వేరే లెవెల్

  నువ్వు అనుకున్నవి చేయలేవమ్మా

  నువ్వు అనుకున్నవి చేయలేవమ్మా

  నందూను వెనక్కి తీసుకు రమ్మని మామగారు పరందామయ్యను తులసి బ్రతిమాలుతుండగా ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అవుతుంది. అప్పుడాయన ‘వాడు ఇక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాతనే నువ్వు స్వయంగా ఎదుగుతున్నావు. నీ పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నావు. ధైర్యంగా ఉండగలుగుతున్నావు. నందూ తిరిగొస్తే అవన్నీ కుదరదు తులసి' అంటాడు. దీనికి తులసి ‘ఆయన వల్ల నాకు నష్టమేమో కానీ, మీకు ఆయన అవసరం మాత్రం ఇప్పుడు చాలా ఉంది. దయచేసి ఒప్పుకోండి మామయ్య' అని బ్రతిమాలుతుంది.

  అడ్డు చెప్పిన ప్రేమ్.. పాపం వద్దంటూ

  అడ్డు చెప్పిన ప్రేమ్.. పాపం వద్దంటూ

  తులసి తన మామను బ్రతిమాలుతుండగా ప్రేమ్ ఎంట్రీ ఇస్తాడు. ‘ఏంటమ్మా నువ్వు కూడా వాళ్లలా చేస్తున్నావ్? ఆయన రావడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు' అని అంటాడు. అప్పుడు తులసి అతడికి సర్ధి చెప్పే ప్రయత్నం చేస్తుంది. అంతలో అక్కడున్న అభి ‘ఏంట్రా ప్రేమ్ అలా మాట్లాడుతున్నావ్? ఆయన మన నాన్న. ఇలా దూరం పెడితే తర్వాత శాశ్వతంగా ఆయనను దూరం చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉంది' అని అంటాడు. దీనికి తులసి కూడా ఏకీభవిస్తుంది. దీంతో ప్రేమ్ సైలెంట్ అయిపోతాడు.

  అందుకే నన్ను దూరం చేసుకున్నారు

  అందుకే నన్ను దూరం చేసుకున్నారు

  పరందామయ్య ఎంత చెప్పినా ఒప్పుకోడు. అప్పుడు తులసి ‘మీరు ఎంత కాదనుకున్నా ఆయన మీ రక్తం పంచుకుని పుట్టిన మనిషి. మీరంతా ఆయన రక్తం పంచుకుని పుట్టిన పిల్లలు. మీకు ఆయన అవసరం ఉంది. నేనంటే కేవలం తాళి కట్టిన భార్యను. మధ్యలో వచ్చాను కాబట్టి ఆయనకు నా మీద అంత ప్రేమ ఉండదు. కానీ, మీ అందరినీ ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి ఆయన ఇక్కడికి రావడానికి నాకు ఏమాత్రం అభ్యంతరం లేదు' అంటూ చెబుతుంది. దీంతో అందరూ ఒప్పుకున్నట్లే ఉంటారు.

  సినీ నటితో ఓంకార్‌కు రిలేషన్: సుడిగాలి సుధీర్‌ షాకింగ్ కామెంట్స్.. ఆ మాటతో ఇరుక్కున్న కమెడియన్

  లాస్యతో పాటు నా కుటుంబం కావాలి

  లాస్యతో పాటు నా కుటుంబం కావాలి

  నందూను ఇంటికి తీసుకొచ్చేందుకు తులసి అక్కడకు వెళ్తుంది. అప్పుడు తిరిగి రమ్మని అంటుంది. అప్పుడతను ‘నేను అక్కడకు రాలేను. ఒకవేళ వచ్చినా లాస్యను తీసుకుని రావాలి. ఆమె అక్కడకు వస్తే ఇంట్లో జరిగిన అవమానాలు గుర్తుకు వస్తాయి. అందుకే అక్కడకు రాలేను' అని అంటాడు. దీనికి తులసి ‘అక్కడ ఏమీ జరగవు. అయినా అప్పుడు మనద్దరం భార్య భర్తలం. ఇప్పుడు కాదు. మీరు ఎవరిని తీసుకు వచ్చినా నాకు అభ్యంతరం లేదు' అంటూ లాస్యను తీసుకొచ్చేందుకు అంగీకరిస్తుంది.

  లాస్య యాక్టింగ్.. తులసి పని మనిషి

  లాస్య యాక్టింగ్.. తులసి పని మనిషి

  నందూతో కలిసి లాస్య తులసి ఇంటికి వస్తుంది. కానీ, లోపలికి రాకుండా యాక్టింగ్ చేస్తుంది. ఆ సమయంలో అనసూయ ఆమెను ఎంతగానో బ్రతిమాలుతుంది. అప్పుడు ‘నన్ను మెడ పట్టుకుని గెంటేసిన వాళ్లు ఇక్కడ మహారాణిలా మెలుగుతున్నారు' అని అంటుంది. అప్పుడు అనసూయ ‘దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. అది ఇంట్లో వాళ్లందరికీ సేవలు చేసే పని మనిషి లాంటిది మాత్రమే' అని అంటుంది. దీనికి ప్రేమ్, శృతి ఆమెపై ఫైర్ అవుతారు. అప్పుడు తులసి వాళ్లను ఆపుతుంది.

  నందూకు తండ్రి ప్రశ్న... తులసి అలా

  నందూకు తండ్రి ప్రశ్న... తులసి అలా

  లాస్య లోపలికి వెళ్లిపోయిన తర్వాత పరందామయ్య ‘ఏరా నందూ.. నువ్వు ఒక్కడివే వస్తావనుకుంటే లాస్యను కూడా వెంట పెట్టుకుని వచ్చావు. ఇది అసలు భావ్యమేనా?' అని ప్రశ్నిస్తాడు. దీనికి నందూ ‘ఇప్పుడు లాస్యను ఎందుకు అంటున్నారు నాన్న? నేను మీ కొడుకును.. మీ బాధ్యత చూడాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే వచ్చాను. మధ్యలో లాస్యను ఏమీ అనకండి' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు ప్రేమ్ మాట్లాడుతుండగా.. ‘నేను మీ గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా' అని అంటుంది తులసి.

  అరాచకమైన ఫొటోలతో సెగలు రేపుతోన్న యువరాజ్ మాజీ ప్రేయసి.. ఇంత ఘాటుగా ఎవరినీ చూసుండరు!

  ప్రేమ్ సూపర్ ప్లాన్... అంకితపై డౌట్స్

  ప్రేమ్ సూపర్ ప్లాన్... అంకితపై డౌట్స్

  నందూ, లాస్య ఇంటికి వచ్చిన తర్వాత దివ్య, శృతి, అభి, అంకితలతో కలిసి ప్రేమ్ సమావేశం అవుతాడు. అప్పుడు అంకితను ‘ఈ మధ్య నువ్వు ఎక్కువగా లాస్యకు సపోర్ట్ చేస్తున్నావని అనిపిస్తుంది' అంటాడు. అప్పుడు అభి అతడితో వాదనకు దిగుతాడు. ఆ తర్వాత ప్రేమ్ ‘లాస్య వల్ల మనకు ప్రాబ్లమ్ ఉండకూడదు అంటే.. ఆమె నిజస్వరూపాన్ని నాన్న, తాతయ్య దగ్గర బయట పెట్టాలి' అని ప్లాన్ చేస్తాడు. దీనికి అభి ‘వాళ్లిద్దరూ విడిపోయారు. మళ్లీ ఎలా కలుస్తారు' అని అడుగుతాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  Intinti Gruhalakshmi Episode 391: Parandamayya Agree for Nandhu Come Back. Then Tulasi Went Lasya's House and Bringed Back Them. After That Prem Create Super Plan for Lasya.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X