Intinti Gruhalakshmi Today Episode: సామ్రాట్‌కు దండం పెట్టి వెళ్లిపోయిన తులసి.. నందూకు కొత్త డౌట్స్
తెలుగు బుల్లితెరపై మాత్రమే ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూ, సామ్రాట్ మధ్యన ఆర్మ్ రెజ్లింగ్ పోటీ జరుగుతుంది. అప్పుడు తులసి ఇద్దరిలో ఎవరు గెలుస్తారా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అది చూసిన సామ్రాట్ ఏమైందని సైగల ద్వారా అడుగుతాడు. దీంతో తులసి అతడిని ఓడిపోమని చెప్తుంది. దీంతో సామ్రాట్ ఓడిపోతాడు. ఆ తర్వాత ఎందుకు ఓడిపోమన్నదో తులసి వివరిస్తుంది. ఆ సమయంలోనే అతడు గులాబీ పువ్వును ఇస్తాడు. అది చూసి నందూ కోపంత రగిలిపోతాడు. అనంతరం సామ్రాట్.. తులసి కోసం ఓ వీణను గిప్టుగా ఇస్తాడు. దీనితో తులసి పాట పాడుతుంది.

గతంలో గుర్తు చేసుకున్న తులసి
సామ్రాట్ కోరిక మేరకు తులసి పాట పాడుతుంది. అది అయిన వెంటనే ఇన్నాళ్లు మీరు ఎందుకు ఇంటికి బంధీ అయ్యారు అని అడుగుతాడు. అప్పుడు తులసి ఒక్కసారిగా గతంలోకి వెళుతుంది. అప్పుడు తులసి.. నందూకు పాలు ఇచ్చి అక్కడే ఉండిపోతుంది. దీంతో ఏంటని అడుగుతాడు. అప్పుడు తులసి 'గుడిలో శ్రీరామనవమి పాట పాడితే ఓ సినిమా డైరెక్టర్ విన్నారు. ఆయన నాకు సినిమాలో పాడే అవకాశం ఇస్తానని చెప్పారు. నాకు గాయని అవ్వాలని కోరిక' అంటుంది. దీంతో నందూ ఆమెపై ఫైర్ అవడంతో పాటు సింగర్ అవడానికి ఒప్పుకోనని అంటాడు.

తప్పు చేశానని అన్న అనసూయ
తులసి గతం నుంచి బయటకు వచ్చిన వెంటనే అక్కడే ఉన్న అనసూయ 'నేను కూడా తులసి ఎదగకపోవడానికి కారణమే. పాతకాలం అత్తలు చేసినట్లే తులసి ఎదగకుండా ఇంట్లో నేను చెప్పిన మాటే వినాలి అని అనుకున్నాను. ఇప్పుడు నా తప్పు తెలుసుకున్నాను.. ఇక మీదట ఆ తప్పు జరగదు. తులసి ఎదుగుదలకు నేను అండగా ఉంటాను' అని సామ్రాట్‌తో అంటుంది. అప్పుడు అభి.. అనసూయను సమర్థిస్తూ 'నానమ్మది తప్పు ఏం లేదు' అంటాడు. అప్పుడు ప్రేమ్ 'నానమ్మే తప్పు ఒప్పుకుంటే నువ్వేంటి రా సమర్థిస్తున్నావు' అని అంటాడు. అంతలో అభి 'నానమ్మదీ చాలా పెద్ద మనసు అందుకే తప్పు ఒప్పుకుంది' అంటాడు. ఇలా వాళ్ల మధ్య డిస్కర్షన్ జరుగుతుంది.

నందూకు సపోర్టు చేసిన లాస్య
వాళ్లు గొడవ పడుతుండగా సామ్రాట్ 'ఈరోజు పార్టీ పెట్టిన ముహూర్తం బాగోలేదు.. ఏ టాపిక్ డిస్కషన్ మొదలుపెట్టినా అది ఎక్కడికో వెళ్తుంది. మీ మమ్మీ ఎంకరేజ్ చేసినట్లయితే గొప్ప సింగర్ అయి ఉండేది కదా అని అన్నాను. అంతే టాపిక్ ఎక్కడికో వెళ్లిపోయింది' అని అంటాడు. అప్పుడు వాళ్ల బాబాయి 'భార్య ఎదగాలి అంటే తప్పనిసరిగా భర్త సపోర్టు ఎంకరేజ్మెంట్ ఉండాలి. లేకపోతే అది జరగదు' అంటాడు. అప్పుడు లాస్య 'ఏ భర్త ఏ భార్యను కావాలని అనగదొక్కకోవాలని అనుకోడు.. నేను నందూను అంతే ఎంకరేజ్ చేస్తాను. నాకు ఏం కావాలో నందూ అది ఇస్తాడు. నందూకు ఏం కావాలో అది నేను ఇస్తాను. అలాగే తులసి భర్త విషయంలో అతని ప్రాబ్లం ఏంటో ఎవరికి తెలుసు' అని అంటుంది.

సామ్రాట్‌కు దండం పెట్టేసింది
లాస్య మాటలకు సామ్రాట్ వాళ్ల బాబాయి 'అవును లాస్య నువ్వు చెప్పింది కూడా కరెక్టే.. బయట నుంచి మనం కామెంట్ చేయకూడదు. నిజం ఏంటో చెప్పగలిగేది తులసి ఒక్కటే. అమ్మ తులసి నీలాంటి మంచి మనసున్న భార్య దొరకడం నీ భర్త చేసుకున్న పుణ్యం. నిన్ను వదిలేసుకోవడం అతని దురదృష్టం మీ మధ్య అసలు ఏం జరిగిందమ్మా? ఎందుకు వదిలేశాడు' అని ప్రశ్నిస్తాడు. దీంతో తులసికి కోపం వస్తుంది. ఆ వెంటనే 'సామ్రాట్ గారూ మీరు మమ్మల్ని పార్టీకి పిలిచినందుకు ధన్యవాదాలు' రెండు చేతులతో దండం పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

బాబాయిపై కోప్పడిన సామ్రాట్
తులసి కోపానికి కారణం అయిన వాళ్ల బాబాయిపై సామ్రాట్ అసహనం వ్యక్తం చేస్తాడు. 'అయినా ఎప్పుడు ఎవరిని ఎలాంటి ప్రశ్నలు అడగాలి అనేది తెలుసుకోవాలి కదా బాబాయ్? వాళ్ల పర్సనల్ విషయాలు అడిగే సమయంలో ఆలోచించాలి కదా బాబాయ్. ఇప్పుడు చూడు తులసి గారు హర్ట్ అయి వెళ్లిపోయారు. అందరి ముందే అలా అగక్కుండా ఉండాల్సింది' అంటాడు. అప్పుడాయన 'ఏదో పెద్దరికం వల్ల అలా అడిగాను. ఒకసారి వెళ్లి తులసికి క్షమాపణ చెప్పి రానా' అని అడుగుతాడు. దీనికి సామ్రాట్ 'వద్దులే బాబాయ్. చూద్దాం ఏమవుతుందో' అంటాడు.

మామయ్య ముందు తులసి బాధ
ఇంటికి వచ్చిన తర్వాత సామ్రాట్ ఇంట్లో జరిగినది తలచుకుంటూ తులసి బాధ పడుతూ ఉంటుంది. అప్పుడాయన వచ్చి 'ఏమైందమ్మా తులసి? ఎందుకు బాధ పడుతున్నావు? నిన్ను కాదనుకున్నందుకు నందూను దురదృష్టవంతుడు. దాని గురించి నువ్వు బాధ పడి మమ్మల్ని కూడా నిరాశ చెందేలా చేయకు' అంటాడు. అప్పుడు తులసి 'బాధ కాదు మామయ్య. ఆ లాస్య మాటలే నన్ను ఇబ్బంది పెట్టాయి. లాస్య అడిగిన ప్రశ్నకు నాకు ఎప్పటి వరకు సమాధానం దొరకలేదు మామయ్య.. దాని గురించే ఆలోచిస్తున్నాను' అని సమాధానం చెబుతుంది.

సామ్రాట్.. తులసి గురించి నందూ
నందూ కూడా ఇంటికి వెళ్లి 'తులసి ఎందుకు సామ్రాట్ దగ్గర నన్ను ఓడిపోవాలి అని అనుకోలేదు. సామ్రాట్‌ను ఓడిపోమని ఎందుకు రిక్వెస్ట్ చేసింది' అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే లక్కీ వచ్చి 'ఈ బొమ్మ నాకు సామ్రాట్ గారు కొనిచ్చాడు. ఎంత కాస్ట్లీ బొమ్మ తెలుసా అంకుల్.. అంకుల్ చాలా మంచివారు' అని లక్కీ అంటాడు. దీంతో నందూ కోపంతో ఆ బొమ్మను విసిరి కొట్టాలని అనుకుంటాడు. అప్పుడే లాస్య వచ్చి చిన్నపిల్లడు నందూ తన మీద ఎందుకు కోపం చూపిస్తున్నావు అని అడ్డుకుంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











