Intinti Gruhalakshmi: తొలి రోజే ఆస్పత్రిలో దివ్య షాక్.. కాళ్లు విరగ్గొడతానని మాణిక్యం వార్నింగ్

తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. వంటగదిలో పని చేసుకుంటున్న తులసి దగ్గరకు వెళ్లిన నందూ చాటుగా చూస్తుంటాడు. దీంతో ఆమె అతడికి వినిపించేలా తిడుతుంటుంది. తర్వాత రాములమ్మను పిలిచి విషయం అడగ్గా 'తులసమ్మను పెళ్లి చేసుకుంటా' అన్నారు కదా.. అందుకే ఆమె కోపంగా ఉన్నారు అని చెప్తుంది. ఇక, దివ్య ఆస్పత్రికి వెళ్లేందుకు బయలుదేరగా.. రాజ్యలక్ష్మి వాళ్లు ఎగతాళి చేస్తారు. అంతలోనే విక్రమ్ వచ్చి దివ్యకు అపాయింట్‌మెంట్ లెటర్ ఇస్తాడు. చివరకు దాన్ని రాజ్యలక్ష్మి చేత్తో ఇచ్చేలా దివ్య ప్లాన్ చేసి అందరికీ షాక్ ఇచ్చేస్తుంది.

Intinti Gruhalakshmi:

దివ్య క్రేజ్ చూసి షాక్ అవుతూ: రాజ్యలక్ష్మి చేతితోనే అపాయింట్‌మెంట్ లెటర్ తీసుకుని మరీ ఆస్పత్రికి వచ్చిన దివ్యకు అక్కడి సిబ్బంది ఘనస్వాగతం పలుకుతారు. దీంతో దివ్యకు సంతోషం రెట్టింపు అయిపోతుంది. అంతేకాదు, అప్పుడామె 'పంజరం నుంచి బయటపడ్డంత ఆనందంగా ఉంది. ఇన్నిరోజులు నేను డాక్టర్ అనే విషయమే మర్చిపోయాను' అని అనుకుంటుంది. తర్వాత ఆస్పత్రి స్టాఫ్ అంతా.. దివ్యకు వెల్కమ్ చెప్పడం చూసిన సంజయ్, రాజ్యలక్ష్మి, లాస్యలు షాక్ అయిపోతారు. అప్పుడు సంజయ్ 'వదిన ఇన్నాళ్లూ ఇంట్లోనే ఉంది కదమ్మా.. అయినా ఇంత క్రేజ్ ఏంటి' అంటాడు.

మీరు రావడంతో కళ వచ్చింది: సంజయ్ మాటలకు లాస్య 'దివ్యను తక్కువ అంచనా వేస్తున్నావ్ సంజయ్. ఇన్నేళ్లుగా నువ్వు, మీ అమ్మ నిర్మించిన సామ్రాజ్యాన్ని కబ్జా చేసేస్తుంది. మీరు మీ వదిన ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి తీసుకుని వస్తుంది' అని అంటుంది. దీంతో రాజ్యలక్ష్మి 'దివ్య హాస్పిటల్‌కు వస్తున్న విషయం స్టాఫ్‌కు ఎలా తెలిసింది' అని అడుగుతుంది. దీనికి లాస్య ఇదంతా దివ్య ప్లానే అని అంటుంది. ఇక, ఆస్పత్రి సిబ్బంది 'చాలా రోజుల తర్వాత ఈ హాస్పిటల్‌కు కల వచ్చింది మేడమ్. మీరు లేని లోటు తెలిసింది మేడమ్.. చైర్మన్ గారి భార్యగా మీరు హాస్పిటల్‌లోకి అడుగుపెడుతున్నారు. మా సమస్య లు తీర్చే దేవత వచ్చిందని సంబరపడుతున్నాం. మీ హోదా ఏదైనా మీరు మాలో మనిషిగా మాతో కలిసే ఉండాలి' అని అంటాడు.

చైర్మన్ భార్య అంటే ఆగదని: ఆస్పత్రి సిబ్బంది మాటలకు దివ్య 'మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా.. నేను పరిష్కరిస్తాను. చైర్మన్ గారితో మాట్లాడి నేను సాయం చేస్తాను' అంటూ హామీలు ఇస్తుంది. దీనికి లాస్య 'ఇది డాక్టర్‌గా చేస్తున్నప్పుడే పట్టుకోలేకపోయాం. ఇప్పుడు చైర్మన్ గారి భార్య హోదాలో అడుగుపెట్టిందంటే మామూలు రచ్చ చేయదు' అని రాజ్యలక్ష్మితో అంటుంది. ఆ తర్వాత హాస్పిటల్‌లో అడుగుపెట్టిన దివ్య 'నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అత్తయ్యా.. చూశారా నా కోసం ఎంత మంది ఉన్నారో' అని గర్వంగా చెబుతుంది.

Intinti Gruhalakshmi:

అప్పుడే భయం మొదలైందా: ఆ తర్వాత రాజ్యలక్ష్మి 'ఇక్కడ దివ్య డాక్టర్ మాత్రమే.. హాస్పిటల్‌లో అడ్మిషన్స్ అన్నీ సంజయ్ మాత్రమే చూసుకుంటాడు. మీ సమస్యలు దివ్యకు చెప్పి విసిగించొద్దు. డాక్టర్‌గా డ్యూటీ చేసుకుని వెళ్లనీయండి. మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా సంజయ్‌కు చెప్పండి. మీటింగ్‌లు ఆపి వెళ్లి డ్యూటీ చేసుకోండి' అని సిబ్బందికి క్లాస్ పీకుతుంది. ఆ తర్వాత దివ్యతో ఆమె బలప్రదర్శన చేస్తున్నావా? కోడలా? అని అనగా.. 'నేను హాస్పిటల్‌లో అడుగుపెట్టకుండానే భయం మొదలైందా అత్తయ్యా' అని కౌంటర్ ఇస్తుంది.

బొకేను విసిరి కొట్టిన అత్తయ్య: దివ్య మాటలకు లాస్య 'అత్తయ్య ఏంటీ.. అత్తయ్యా.. రేపో మాపో విడాకుల పేపర్స్ నీ చేతిలో ఉంటాయి చూడు' అని అంటుంది. దీనికి దివ్య 'ఈ విడాకుల డ్రామా నువ్వు ఆడిస్తున్న నాటకం అని నాకు తెలుసు. ఏం జరుగుతుందో మీరే చేస్తారు కదా. మీరు వెళ్లి మీ పరువు పోకుండా చూసుకోండి. ఆల్ ది బెస్ట్' అని తనకు హాస్పటల్ స్టాఫ్ ఇచ్చిన బొకేను అత్త చేతిలో పెడుతుంది. దీంతో రాజ్యలక్ష్మి కోపంతో ఆ బొకేను నేలకేసి కొడుతుంది.

దివ్యకు షాకిచ్చిన కాంట్రాక్టర్: ఆస్పత్రిలోని క్యాంటీన్‌లో రెండు ఇడ్లీలో పెడుతున్నారని ఓ మహిళ దివ్యకు కంప్లైంట్ చేస్తుంది. దీంతో ఆమె వెళ్లి 'లెక్క ప్రకారం మీరు నాలుగు ఇడ్లీలు ఇవ్వాలి నిజమా కదా' అని నిలదీస్తుంది. దీనికి అక్కడ ఉన్న కాంట్రక్టర్ 'చూడు డాక్టరమ్మా.. ఇది నీకు సంబంధం లేని విషయం. నీకు కావాలంటే ఓ ప్లేట్ ఇడ్లీ ఫ్రీగా ఇస్తాను వెళ్లి తిను' అని అంటాడు. దీంతో దివ్య 'నేను చైర్మన్ గారి భార్యని తెల్సా' అని అంటుంది. దీనికతడు 'మీరు నాకు ఈ కాంట్రాక్ట్ ఇవ్వలేదు. సంజయ్ బాబు ఇచ్చారు. ఆయన వచ్చి అడిగితే సమాధానం చెప్తాను.. వెళ్లి పని చూసుకోండి' అని దివ్యపై తిరగబడతాడు.

Intinti Gruhalakshmi:

కాళ్లు విరగ్గొడతా అని వార్నింగ్: క్యాంటిన్ ఓనర్ మాటలకు దివ్య 'రూల్స్ మార్చకపోతే కాంట్రాక్ట్ వదులుకోండి.. అంతే తప్ప పేషెంట్స్‌ని దోచుకోవద్దు' అని అంటుంది. దీనికాయన 'అవసరం లేని టెస్ట్ రాస్తూ.. పేషెంట్స్‌ను దోచుకుంటున్నదెవరో అందరికీ బాగా తెలుసు. మీరు మా జోలికి రావొద్దు' అంటాడు. దీంతో దివ్య ఎదురు తిరగ్గా.. 'చైర్మన్ భార్య అని మర్యాదగా మాట్లాడితే రెచ్చగొడుతున్నావేంటీ.. పేషెంట్స్ ముందు బిల్డప్పా. ఇదిగో నువ్వు ఈ హాచైర్మన్‌కు భార్యవి అయితే.. నేను క్యాటరింగ్ అసోసియేషన్‌కి చైర్మన్‌ను. ఎగిరెగిరి పడకు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో.. నేను ఎవరికీ భయపడను. ఆడకూతురివి కాబట్టి మాటలతో వదిలేస్తున్నా లేదంటే.. నేనేంటో చూపించేవాడిని. ఎక్కువ మాట్లాడితే కాళ్లు చేతులు విరుగుతాయ్' అని అనగా దివ్య వెళ్లిపోతుంది. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X