For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi August 9th Episode: తులసితో కలిసేందుకు నందూ రెడీ.. లాస్య ప్లాన్‌తో మరో చిక్కు

  |

  ఎంతో కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ ఓ లుక్కేయండి మరి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. లాస్యను ఇంటి నుంచి పంపించేందుకు ప్రేమ్ ప్లాన్ చేసి అందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తాడు. ఆ విషయాన్ని అంకిత.. లాస్యకు వివరిస్తుంది. కానీ, ఆమె మాత్రం దీనికి అస్సలు భయపడదు. ఆ తర్వాత తులసికి ఫోన్ చేసిన సతీష్ శుభవార్త అగ్రిమెంట్‌లు రెడీగా ఉన్నాయని, వచ్చి సంతకం చేయమని చెప్పాడు. అప్పుడు ఆమె రామచంద్రతో కలిసి కంపెనీకి వెళ్లి ఒప్పందంపై సంతకం చేసింది. అప్పుడు రామచంద్ర, తులసికి కొన్ని సలహాలు ఇచ్చాడు. ఆ తర్వాత నందూ, లాస్య తులసిని నిరుత్సాహపరిచేలా మాట్లాడతారు.

  తల్లికి అభి సలహా.. నందూ కోపంగా

  తల్లికి అభి సలహా.. నందూ కోపంగా

  నందూ, తులసిని కించ పరుస్తూ మాట్లాడడంపై ఇంట్లో గొడవ జరుగుతుంది. అప్పుడు అంకిత కూడా ఆయనకు సపోర్ట్ చేయడంతో అభి ఆమెను మందలిస్తాడు. ఆ తర్వాత తన తల్లితో ‘మామ్.. నిన్ను డాడీ కంపెనీని నడపొద్దు అనలేదు. జాగ్రత్తలు చెబుతున్నారు అంతేకదా. నీకు నచ్చితే పాటించు.. లేదంటే లైట్ తీసుకో' అని సలహా ఇస్తాడు. అప్పుడు నందూ కోపంగా ‘ఇక్కడ నా మాటలకు ఎవరూ విలువ ఇవ్వడం లేదు. అందుకే నేనేమీ సలహాలు ఇవ్వకూడదు. ఇచ్చినా పాటిస్తారని లేదు కదరా' అంటూ తులసిని ఉద్దేశించి అంటాడు.

  HBDMaheshBabu: మహేశ్ వల్లే బతికిన ఆ వేయి మంది.. సూపర్ స్టార్ గురించి తెలియని నిజాలివే!

  నందూకు ఇంట్లో ఘోర అవమానం

  నందూకు ఇంట్లో ఘోర అవమానం

  నందూ అన్న మాటలకు పరందామయ్యకు కోపం వస్తుంది. అప్పుడాయన ‘నందూ నిన్ను చూస్తుంటే గురవింద గింజ సామెత గుర్తొస్తుందిరా. నీ కంపెనీనే నష్టాల్లో ఉంది. నువ్వే జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నావు. అలాంటిది తనకు సలహాలు ఇస్తావా? నిన్ను చేతకాని వాడు అనడం కంటే పెద్ద మాట ఉంటే అనాలి. నీ ఫ్రెండ్ దివాకర్ అంట.. ఉదయం ఇంటికి వచ్చాడు. నాకు ఇవ్వాల్సిన డబ్బులివ్వకుండా కార్లు కొనుక్కొని ఎంజాయ్ చేస్తున్నారు అని ఎన్నో మాటలు అని వెళ్లాడు' అంటూ కొడుకును తీవ్రంగా అవమానిస్తాడు. దీంతో నందూ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

  తులసి మాట చాటుగా విన్న లాస్య

  తులసి మాట చాటుగా విన్న లాస్య

  నందూ వెళ్లిపోగానే తులసికి ధైర్యం చెప్పి ప్రొత్సహిస్తాడు పరందామయ్య. అప్పుడు దిగాలుగా ఉన్న తులసి ‘ఫ్యాక్టరీ నడపడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, గిరిధర్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒకడు రామచంద్ర గారిని ఇబ్బంది పెడుతున్నాడు. దాని గురించే ఆందోళనగా ఉంది' అని అందరికీ చెబుతుంది. అప్పుడు ప్రేమ్ ‘నీతిగా వ్యాపారం చేసే నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా' అని ధైర్యం చెబుతాడు. ఈ మాటలు మొత్తాన్ని లాస్య చాటుగా వింటుంది. అంతేకాదు, తులసిని దెబ్బకొట్టేందుకు గిరిధర్‌ను వాడుకోవాలని అప్పటికప్పుడే ప్లాన్‌ను రెడీ చేసేస్తుందామె.

  ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన యాంకర్ మంజూష: అదిరిపోయే ఫోజులతో ఘాటు ఘాటు ఫోజులు

  చేతులు కలిపిన తులసి శత్రువులు

  చేతులు కలిపిన తులసి శత్రువులు

  గిరిధర్ గురించి తెలుసుకున్న లాస్య.. అతడికి ఫోన్ చేసి కలుస్తుంది. అప్పుడు ఇద్దరం కలిసి ఆమెను ఇబ్బంది పెట్టాలని అనుకుంటారు. ఆ సమయంలో లాస్య ‘రూల్స్, రెగ్యూలేషన్స్ అని ఇబ్బంది పెడితే కుడితలో పడ్డ ఎలుకలా కొట్టుకుంటుంది' అని అంటుంది. అప్పుడు గిరిధర్ ‘తులసి పిచ్చుక లాంటిది. ఆమె మీద బ్రహ్మాస్త్రం ఎందుకు? అయినా ఆమె నుంచి మీరు ఏమి ఆశిస్తున్నారు' అని అడుగుతాడు. దీనికి ‘ఆమె భర్త నాకు ప్రియుడు' అని చెబుతుంది. అప్పుడు గిరిధర్ ‘ఇంట్లో మీరు ఇబ్బంది పెట్టండి.. ఫ్యాక్టరీ సంగతి నేను చూస్తా' అని అంటాడు.

  తులసి లాస్య పందెం.. జగడం స్టార్ట్

  తులసి లాస్య పందెం.. జగడం స్టార్ట్

  గిరిధర్‌తో మాట్లాడి వచ్చిన లాస్య తులసిని దిగజార్చేలా మాట్లాడుతుంది. ఆమెను నిరుత్సాహ పరిచేందుకు ప్రయత్నిస్తుంది. అప్పుడు ‘నువ్వు కనుక మా కంటే ఎక్కువ సంపాదిస్తే.. మాకంటే ఎక్కువ ఎదిగితే నందూను వదిలి పెట్టి వెళ్లిపోతాను. లేదంటే నువ్వు నీ కుటుంబం మొత్తాన్ని వదిలేసి వెళ్లిపోతావా?' అని ప్రశ్నిస్తుంది. దీనికి తులసి ‘ఎందుకు లాస్య ఎప్పుడూ ఓడిపోవాలని ప్లాన్ చేసుకుంటావ్. నేను ఈ ఛాలెంజ్‌కు ఒప్పుకుంటున్నా. అది నీ ఓటమి కోసం కాదు.. న్యాయం ఎప్పుడూ నిజాయితీ వైపే ఉంటుందని నిరూపించడానికే' అంటుంది. దీంతో జగడం మొదలవుతుంది.

  నందూ, తులసి పూజ.. దివ్య కోరిక

  నందూ, తులసి పూజ.. దివ్య కోరిక

  ఇంట్లో వాళ్లు అందరినీ పిలిచిన తులసి ఫ్యాక్టరీలో పూజా కార్యక్రమం చేయడానికి ముహూర్తం పెట్టినట్లు చెబుతుంది. దీంతో అందరూ సంతోషిస్తారు. అప్పుడు దివ్య ‘పూజా అంటే మామ్, డాడ్ ఇద్దరూ కలిసి చేయాలి కదా' అని కోరుకుంటుంది. దీనికి ప్రేమ్ ‘అక్కడకు అనవసరమైన వాళ్లు ఎవరూ రావక్కర్లేదు. అయినా అమ్మ ఎదగకూడదనే వాళ్లు అవసరం లేదు' అడ్డు చెబుతాడు. అప్పుడు అభి ‘డాడ్ ఇవేమీ పట్టించుకోకండి. రేపు మీరు పూజకు వస్తున్నారు అంతే' అని అంటాడు. దీంతో నందూ ‘తులసికి అభ్యంతరం లేకపోతే నాకు ఓకే' అని సమాధానం ఇస్తాడు.

  హీరోయిన్ ఆండ్రియా అదిరిపోయే ఫొటోలు: షర్ట్ బటన్స్ తీసేసి మరీ బోల్డు ఫోజులు!

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  అనసూయ, లాస్య అడ్డుపుల్ల వేస్తూ

  అనసూయ, లాస్య అడ్డుపుల్ల వేస్తూ

  పూజ చేయడానికి తులసితో కలిసి వెళ్లేందుకు నందూ ఓకే చెప్పడంతో లాస్య షాక్ అవుతుంది. అప్పుడు ‘ఆమె ఒప్పుకునేందేంటి నందూ. నీ చేయి లక్కీ. నువ్వు మొదలు పెడితే ఫ్యాక్టరీ చక్కగా రన్ అవుతుంది. తులసి గెలిస్తే మనమంతా గెలిచినట్లే కదా' అని అంటుంది. అంతకు ముందు అనసూయ ‘ఏంట్రా నందూ. నువ్వు దానితో కలిసి పూజ చేయడమేంటి? అలా చేశావంటే నిన్ను నువ్వు దిగజార్చుకోవడమే' అంటూ అడ్డుపుల్ల వేస్తుంది. దీనికి నందూ ‘పిల్లలు అడుగుతున్నారని ఒప్పుకున్నాను' అంటూ బదులిస్తాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 393: Parandamayya Blame Nandhu In Front of Family Members. Then Lasya Teamup with Giridhar. After That Lasya Challeged Tulasi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X