Intinti Gruhalakshmi: విక్రమ్‌ను నిజం చెప్పిన దివ్య.. రాజ్యలక్ష్మికి బిగ్ షాక్.. తులసికి గుడ్ న్యూస్
చాలా కాలంగానే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే:మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఆస్పత్రికి వచ్చిన దివ్యకు అక్కడి సిబ్బంది ఘన స్వాగతం పలుకుతారు. అది చూసిన రాజ్యలక్ష్మి బ్యాచ్‌కు కంగారెత్తిపోతుంది. తర్వాత దివ్య ఉద్యోగులకు హామీలు ఇస్తుండడంతో అత్త ఎంట్రీ ఇచ్చి.. తను కూడా ఇక్కడ ఉద్యోగి మాత్రమే అని చెబుతుంది. ఉద్యోగంలోకి రాగానే తులసి క్యాంటీన్ ఓనర్‌తో గొడవకు దిగుతుంది. అతడు రెండు ఇడ్లీలు తక్కువగా పెడుతున్నాడని ప్రశ్నిస్తుంది. దీనికి కాంట్రాక్టర్ అయిన అతడు దివ్యపై ఎదురు తిరుగుతాడు. అంతేకాదు, కాళ్లు విరగ్గొడతానంటూ అందరి ముందరే వార్నింగ్ కూడా ఇచ్చేస్తాడు.

నా బతుకు ఇంతేనా అంటూ:నందూతో మాట్లాడుతున్న తులసి 'లాస్య నాముందే నా మొగుడి పక్కన నా గదిలో పడుకుంటే నా ఆత్మాభిమానాన్ని మర్చిపోయా. దూరంగా ఉంటాం తప్పదు అంటే నా పిల్లల్ని మర్చిపోయాను. నా మాజీ భర్త కష్టాల్లో ఉంటే అతను పెట్టిన కష్టాలను మర్చిపోయాను. అతనికి అండగా నిలబడ్డాను. ఇక నాబతుకు ఇంతేనా? ఎవరు ఏమన్నా అన్నీ మర్చిపోయి తోలు బొమ్మలా బతకడమేనా? జీవితంలో తగిలిన దెబ్బలకు నా మనసు తూట్లు పడింది. అయినా తట్టుకుని మీ ముందు ఎందుకు నిలబడ్డానో తెలుసా? నన్ను నమ్ముకున్న అత్త మామల కోసం' అంటుంది.

మన మధ్య ఉన్న స్నేహమే:ఆ తర్వాత తులసి 'నేను జీవితాన్ని పోగొట్టుకున్నా బాధపడను. కానీ ఆత్మాభిమానాన్ని పోగొట్టుకోను. నా కూతురు జీవితాన్ని ఒక దారిలో పెట్టాలి. అత్త మామలకు ఆసరాగా ఉండాలి. అంతకు మించి నా మనసులో వేరే ఆలోచనలు లేవు రావు ఉండవు కూడా. మీ మనసులో కూడా ఉండకూడదు. మన మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అని చాలాసార్లు చెప్పాను. మీకు అర్ధం కాకపోతే నా తప్పు కాదు. మరోసారి మన జీవితాన్ని ప్రమాదంలో పడేయకండి. నిలకడ లేని మనిషితో ఎప్పటికైనా ప్రమాదమే. అది తెలుసుకోండి' అని నందూకు ఓ రేంజ్‌లో ఇచ్చేస్తుంది.

తులసికి సూత్రాలు ఇచ్చేసి:తులసి మాటలను పట్టించుకోని నందూ గతంలో తాకట్టు పెట్టిన మంగళసూత్రాన్ని ఇవ్వబోతాడు. అంతేకాదు, 'నా తప్పు గురించి మాట్లాడావు. క్షమించమని కూడా అడగను. కానీ ఒక్క రిక్వెస్ట్.. ఈ మంగళసూత్రాన్ని నిజాయితీగా పవిత్రమైన మనసుతో విడిపించుకుని వచ్చాను. నిజానికి దీన్ని తాకట్టు పెట్టడం ఇష్టం లేదు. గిల్టీగా ఉంది. నాపై ఉన్న కోపాన్ని దీనిపై చూపించకు. నీ వైవాహిక జీవితంతో ఆటలు ఆడుకున్నానేమో కానీ.. ఈ మంగళసూత్రంతో ఆటలాడటం లేదు. దయచేసి తీసుకో. నీకు నాపై ఉన్నది కోపమే తప్ప ద్వేషం కాదంటే దీన్ని తీసుకో' అంటాడు.
తులసిని మళ్లీ పెళ్లి చేసుకో:నందూ అడగడంతో మంగళసూత్రం తీసుకుని తులసి వెళ్లిపోతుంది. ఆ తర్వాత నందూ ఆమెనే చూస్తూ ఉంటాడు. అది చూసిన పరందామయ్య 'మనిషికి దగ్గరవ్వాలని అనుకున్నప్పుడు ఇలా దూరంగా ఉంటే కుదరదురా.. వెళ్లి నీ మనసులో మాట చెప్పరా' అంటాడు. దీంతో పరందామయ్య 'అది కూడా చెప్పడమేనా' అని రెచ్చగొట్టగా.. నందూ 'అది చెప్పినందుకే తులసి నన్ను దూరం పెట్టేస్తుంది. తన మనసులో ఏముందో చెప్పి.. పిచ్చి వేషాలు వేయొద్దని అన్నది' అంటాడు. దీంతో పరందామయ్య ఎలాగైనా తులసి పెళ్లి చేసుకో అన్నట్లు నందూను రెచ్చగొడతాడు.

క్యాంటీన్ గొడవ చెప్పింది:ఆస్పత్రికి లంచ్ బాక్స్ తీసుకు వచ్చిన విక్రమ్.. రాజ్యలక్ష్మి, సంజయ్‌కు వడ్డిస్తూ ఉంటాడు. అంతలోనే దివ్య వచ్చి రాజ్యలక్ష్మి ప్లేట్‌ను లాక్కుంటుంది. దీంతో అందరికీ కోపం వస్తుంది. అప్పుడు ఏమైందని సంజయ్ అడగడంతో దివ్య 'మనం కడుపు నిండా తింటే సరిపోదు. మన ఆస్పత్రికి వచ్చే వాళ్లు కూడా కడుపు నిండా తినాలి. కానీ, ఆ క్యాంటీన్ ఓనర్ మాత్రం సగం సగం ఫుడ్ పెడుతూ వాళ్లను ఇబ్బంది పెడుతున్నాడు' అంటూ అసలు విషయం చెప్తుంది. దీంతో సంజయ్ భయపడుతూ ఉంటాడు. అప్పుడు విక్రమ్ ఆ కాంట్రాక్టర్‌ను మార్చమని ఆర్డర్ ఇస్తాడు.

తులసి వాళ్లకు కాంట్రాక్టు:ఇంటికి వచ్చిన తర్వాత దివ్య తన తల్లి తులసికి ఫోన్ చేస్తుంది. అంతేకాదు, 'అమ్మా.. ఎలాగైనా ఈ కాంట్రాక్టు మీ చేతికి వచ్చేలా చేసుకోండి. ఈ అవకాశం మళ్లీ మళ్లీ రాదు. ఎలాగైనా మంచిగా ప్లాన్ చేసుకుని కాంట్రాక్టు వచ్చేలా చేసుకోండి. నేను మాత్రం ఇన్వాల్వ్ కాను' అని అంటుంది. ఆ సమయంలోనే బసవయ్యను చూసి కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత ఇద్దరూ ఒకరిపై ఒకరు అనుమానపడుతూ ఉంటారు. ఆ వెంటనే బసవయ్య వెళ్లి ఈ విషయాన్ని రాజ్యలక్ష్మికి చెప్తాడు. దీనికామె 'నాక్కూడా దివ్యపై అనుమానం ఉంది. ఎలాగైనా అడ్డుకట్టు వేయాలి' అంటుంది.

మళ్లీ దూరం పెట్టాలంటూ:విక్రమ్ గదిలో పడుకుని ఉండగా దివ్య కూడా అతడి పక్కన పడుకుంటుంది. ఆమెను చూసి షాకైన అతడు వెంటనే పైకి లేస్తాడు. కానీ, దివ్య మాత్రం భర్తను రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. పైగా ప్రేమగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంది. కానీ, విక్రమ్ మాత్రం ఆమె మాటలను పట్టించుకోకుండా ఉంటాడు. అలాగే, ఇద్దరి మధ్యలో చీర కడుతుంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











