Intinti Gruhalakshmi Today Episode: తులసి రిపోర్టులపై అద్వైతకు డౌట్.. ఆమెకు మనసులో మాట చెప్పిన నందూ

ఎంతో కాలంగా తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి తన ఆరోగ్యం గురించి నిజం తెలుసుకున్న తర్వాత కుటుంబ సభ్యులందరినీ తన వింత వైఖరితో ప్రశ్నిస్తుంది. దీంతో ఇంట్లో ఉన్న వాళ్లంతా షాక్ అవుతారు. మధ్యలో నందూ కలుగజేసుకోవడంతో తులసి అతడిపై ఫైర్ అవుతుంది. దీంతో నీ నోటి నుంచి చావు అనే మాటను మాత్రం తీసుకు రావొద్దని నందూ ఆమెను కోరుకుంటాడు. ఆ తర్వాత తులసి ఇంట్లో వాళ్లందరినీ తన కోసం నటించడం ఆపేయమని అభ్యర్థిస్తుంది. మీరంతా నా వెంట ఉన్నంత కాలం నాకేమీ కాదని అంటుంది. దీంతో అందరూ షాక్ అయిపోతారు.

తులసి రిపోర్టులపై అద్వైత కృష్ణ డౌట్

తులసి రిపోర్టులపై అద్వైత కృష్ణ డౌట్

తనకు క్యాన్సర్ అని తెలిసిన తర్వాత తులసి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ.. ఇంట్లో వాళ్లందరినీ యాక్టింగ్ చేయొద్దని బ్రతిమాలుతుంది. మరోవైపు, ఆమె రిపోర్టులను డాక్టర్ అద్వైత కృష్ణ మరోసారి పరిశీలిస్తాడు. ఆ సమయంలోనే మరో డాక్టర్ జగదీష్‌కు అతడు ఫోన్ చేస్తాడు. అప్పుడు 'ఒకరి రిపోర్టుల విషయంలో నాకు నీ సమయం కావాలి. నీకు ఆ రిపోర్టులను పంపుతాను. అవి చూసి పేషెంట్ కండీషన్ ఇప్పుడెలా ఉందో చెప్పు' అని అంటాడు. దీనికి ఆ డాక్టర్.. అద్వైత కృష్ణకు ఏదో సమాచారం చెబుతాడు. అది ఏంటి అన్నది మాత్రం సస్పెన్స్‌గానే ఉంచేశారు.

 తులసికి సత్యం చెప్పేసిన కుటుంబం

తులసికి సత్యం చెప్పేసిన కుటుంబం

ఇంట్లో వాళ్లందరిపై ఫైర్ అయిన తర్వాత తులసికి అందరూ కలిసి నిజం చెప్పేస్తారు. అంతేకాదు, ఆ విషయం తెలిస్తే బాధ పడతావనే దాచి పెట్టామని అంటారు. ఆ తర్వాత అందరూ కలిసిపోతారు. సరదాగా నవ్వుతూ ఉంటారు. అంతలో అనసూయ 'నన్ను క్షమించు తులసి. నిన్ను క్షమించు అన్నది నీ దగ్గర నిజాన్ని దాచిపెట్టినందుకు కాదు.. నువ్వు తులసివి అని మరిచిపోయినందుకు. తులసి వ్యక్తిత్వం ఎప్పుడూ మారదు. అబద్ధం చెప్పినందుకు సారీ' అంటుంది. ఆ తర్వాత అందరూ ఆమెకు సారీ చెబుతారు. దీంతో తులసి కూడా నవ్వేసి క్షమిస్తుంది.

తన కోరికలను బయట పెట్టిన తులసి

తన కోరికలను బయట పెట్టిన తులసి


తులసి కోపం తగ్గిపోవడంతో అందరూ సంతోషంగా నవ్వుతూ కనిపిస్తారు. అప్పుడు తులసి 'చూశారా అత్తయ్య ఇవీ నిజమైన నవ్వులు అంటే. ఇక నుంచి పూర్తి సంతోషంగా జీవిస్తాను' అని చెబుతుంది. దీనికి అనసూయ 'మేము కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోము' అంటుంది. తర్వాత ప్రేమ్ 'నువ్వు ట్రీట్ మెంట్ కూడా సరిగ్గా తీసుకోవాలి' అంటాడు. దీనికి తులసి 'తీసుకుంటాను కానీ.. నా ఆయుష్షు ఇంకా ఎన్ని రోజులు ఉందో తెలియదు. నా చిట్టి తల్లి పెళ్లి చూడాలి. మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకోవాలి' అంటూ తన కోరికల చిట్టాను విప్పుతుంది.

నందూను మెచ్చుకున్న అద్వైత కృష్ణ

నందూను మెచ్చుకున్న అద్వైత కృష్ణ

అందరూ మాట్లాడుకున్న తర్వాత బయటకు వెళ్లి ఫుట్‌బాల్ ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే లాస్య వచ్చి వాళ్లను చూసి కుళ్లుకుంటూ ఉంటుంది. అదే సమయంలో అక్కడకు డాక్డర్ అద్వైత కృష్ణ కూడా వచ్చి.. నందూను చూసి సూపర్ అంటాడు. అంతేకాదు, బాగా ఆడుతున్నారంటూ మెచ్చుకుంటాడు. సరిగ్గా అప్పుడే లాస్యను తులసి చూస్తుంది. ఆ సమయంలోనే అనసూయ 'తులసి ఈరోజు అన్ని ఆటల్లో నువ్వే గెలిచావు.. రేపు జీవితంలో కూడా నువ్వే గెలుస్తావు' అంటుంది. దీనికామె 'తప్పకుండా అత్తయ్య. నేను గెలిచి మిమ్మల్ని గెలిపిస్తాను' అంటుంది.

 నందూను లాస్య దగ్గరకెళ్లమన్న తులసి

నందూను లాస్య దగ్గరకెళ్లమన్న తులసి

అప్పటి వరకూ ఆడుకున్న నందూ మంచి నీళ్లు తాగేందుకు వెళ్తాడు. అప్పుడు తులసి వచ్చి 'మీరు ఉండాల్సింది నా దగ్గర కాదు లాస్య పక్కన' అంటుంది. దీనికి నందూ 'అదేం కాదులే.. కాసేపు ఒంటరిగా ఉండటం వల్ల వచ్చే సమస్యేమీ లేదు' అంటాడు. దీనికి తులసి తనకు నీ అవసరం ఉంది అనగా.. ఏం కాదులే నువ్వు పదా అంటూ ఆమెను తీసుకెళ్లిపోతాడు. దీంతో అక్కడే ఉండి మొత్తం విన్న లాస్యకు కోపం వస్తుంది. 'నన్ను ప్రేమించానంటాడు. కానీ, తులసి మీద జాలి చూపిస్తాడు' అంటూ అక్కడి నుంచి వెళ్లబోతుండగా.. అద్వైత కృష్ణను తగులుతుంది.

డాక్టర్‌తో లాస్య... నందూ కోసం తులసి

డాక్టర్‌తో లాస్య... నందూ కోసం తులసి

లాస్య, అద్వైత కృష్ణ ఒకరినొకరు తగిలిన తర్వాత పరిచయం చేసుకుంటారు. అప్పుడు డాక్టర్ 'హాయ్.. నేను డాక్టర్ అద్వైత కృష్ణ. మీరు ఎవరు? ' అంటాడు. దీనికి లాస్య 'మీరు నాకు తెలుసు. తులసికి ట్రీట్‌మెంట్ చేసేది మీరే కదా' అంటుంది. దీనికాయన అవును అంటాడు. అలాగే, ఇంతకీ మీరు ఎవరు అని మరోసారి అడుగుతాడు. అప్పుడామె నేను నందూకు.. అంటూ ఏదో చెప్పబోగా.. ఓహో నందూ ప్రేమించిన అమ్మాయి మీరేనా అంటాడు. మరోవైపు నందూ ఒంటరిగా కూర్చొని తులసి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తులసి అతడి కోసం టీ తీసుకోస్తుంది.

తులసితో మనసు విప్పి మాట్లాడాడు

తులసితో మనసు విప్పి మాట్లాడాడు

నందూకు టీ తీసుకుని వస్తుండగా తులసికి కళ్లు తిరగడంతో పాటు కడుపు నొప్పి వస్తుంది. దీంతో ఆమె కాసేపు ఆగిపోతుంది. మళ్లీ తేరుకున్నాక వచ్చి టీ ఇస్తుంది. దీంతో నందూ 'థ్యాంక్స్ తులసి.. దూరంగా ఉన్నా గుర్తుపెట్టుకొని తీసుకొచ్చావు. తులసి నీతో కొంచెం సేపు మాట్లాడాలి. నీ జీవితంలో జరిగిన ఎక్కువ నష్టానికి కారణం నేనే. బాధగా ఉందా' అని అడుగుతాడు. దీనికి తులసి 'మీ మీద కోపం తెచ్చుకోవడం వల్ల మనసుకు బాధ కలగడం తప్పితే ఇంకా ఒరిగేదేం లేదు' అంటుంది. దీనికి 'ఇక నుంచి నేను నీ తోడుగా ఉంటాను తులసి' అని నందూ మాటిస్తాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X