Intinti Gruhalakshmi Today Episode: నందూను చివరి కోరిక కోరిన తులసి.. లాస్య ఆరోగ్యానికి ప్రమాదమంటూ!

సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి.

Photos Courtesy: Star మా and Disney+Hotstar

 శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి తన ఆరోగ్యం గురించి నిజం తెలుసుకున్న తర్వాత కుటుంబ సభ్యులందరినీ తన వింత వైఖరితో ప్రశ్నిస్తుంది. దీంతో వాళ్లంతా ఆమెకు నిజం చెప్పేస్తారు. అప్పుడు కోప్పడిన ఆమె.. తర్వాత సంతోషంగా వాళ్లతో ఆటపాటల్లో పాల్గొంటుంది. అప్పుడు లాస్యను చూసి నందూను ఆమె దగ్గరకు వెళ్లమని చెబుతుంది. కానీ, దీనికి అతడు నిరాకరిస్తాడు. ఇక, తులసి రిపోర్టులను చూడమని అద్వైత కృష్ణ మరో డాక్టర్‌కు చెబుతాడు. అనంతరం అతడు తులసి వాళ్ల దగ్గరకు వచ్చే సమయంలో లాస్యను పరిచయం చేసుకుంటాడు.

నందూకు వార్నింగ్ ఇచ్చిన తులసి

నందూకు వార్నింగ్ ఇచ్చిన తులసి

తులసి, నందూ మధ్య జరుగుతున్న చర్చతో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. నందూ తనపై ప్రేమను చూపిస్తుండడంపై తులసి మాట్లాడుతూ.. 'మీరు కట్టిన ఈ తాళిని మీ మీద గౌరవంతో ఈ మెడలో ఉంచుకోలేదు. మన సంప్రదాయం మీద గౌరవంతో ఉంచుకున్నాను. నాకు మీ తోడు అవసరం లేదు. సానుభూతి అస్సలు అవసరం లేదు. నా వాళ్లు నాతో ఉన్నారు. బంధాలు బాధనిస్తాయి. సంతోషాన్నిస్తాయి. కానీ, అవి మనసుకు సంబంధించి మాత్రమే. నాకు వచ్చిన ఈ జబ్బుకు కారణం నా తలరాత. తప్పును మీ మీద ఎందుకు వేసుకుంటారు' అని అడుగుతుంది.

 నీ సంతోషం కావాలి తులసి అంటూ

నీ సంతోషం కావాలి తులసి అంటూ

ఆ తర్వాత తులసి 'మీరు తప్పు చేశానని అనాల్సి అవసరం లేదు. నాకు తోడుగా ఉంటాను. సాయం చేస్తానని ఇంకెప్పుడూ అనకండి. మన దారులు వేరు. అది మరిచిపోకండి' అంటూ అక్కడి నుంచి వెళ్లబోతుంది తులసి. దీంతో నందూ 'ఎందుకంత కఠినంగా మాట్లాడుతున్నావు' అని అడుగుతాడు. దీనికి తులసి 'నేను ఏ బంధం వెంట పరిగెడుతున్నా నాకు బాధ తప్ప ఇంకేం మిగలడం లేదు' అని బదులిస్తుంది. అప్పుడు నందూ 'మన దారులు వేరు కావచ్చు కానీ పాతికేళ్ల వైవాహిక జీవితం ఉంది కదా. నువ్వు సంతోషంగా ఉండటం చూడాలని ఉంది' అంటాడు.

నందూను చివరి కోరిక కోరిన తులసి

నందూను చివరి కోరిక కోరిన తులసి

నందూ అన్న మాటలకు తులసి స్పందిస్తూ.. 'నేను సంతోషంగా ఉండటం చూడాలంటే మీరు ఒక పని చేయాలి. మీరు వెంటనే లాస్యను పెళ్లి చేసుకోవాలి' అంటుంది. దీనికి నందూ ఒక్కసారిగా షాక్‌కు గురవుతాడు. అనంతరం తులసి 'ఏదో ఒక బంధం విషయంలో మీ బాధ్యతను చివరి వరకు నిలబెట్టుకోండి. నా జీవితం ముగిసే లోపు మీరు లాస్యను పెళ్లి చేసుకుంటే నేను చూస్తాను. ఇది నా చివరి కోరికగా అనుకుంటారో... వేరేగా అనుకుంటారో మీ ఇష్టం' అంటుంది. ఆమె మాటలకు నందూకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాక అలా ఉండిపోతాడు.

లాస్యకు అద్వైత కృష్ణ సూచనలు

లాస్యకు అద్వైత కృష్ణ సూచనలు

లాస్యతో పరిచయం అయిన తర్వాత అద్వైత కృష్ణ ఆమెను ఒక చోటుకు తీసుకుని వెళ్తాడు. అక్కడకు వెళ్లిన తర్వాత ఆమెకు కోపం ఎక్కువ అని గ్రహించిన ఆయన.. దాన్ని ఎలా తగ్గించుకోవాలన్న దానిపై కొన్ని సూచనలు చేస్తాడు. 'కోపాన్ని ఎప్పుడైనా వెంటనే మన మనసులో నుంచి తీసేసుకోవాలి. కోపాన్ని అస్సలు మన మనసులో దాచుకోకూడదు. లేకపోతే మనసు భారంగా మారుతుంది' అని చెబుతాడు అద్వైత కృష్ణ. ఆ తర్వాత బ్యాట్‌తో బాల్‌ను కొట్టమంటుంది. అలా లాస్యతో రెండుసార్లు కొట్టిస్తాడు. దీంతో ఆమె మనసు కుదుటపడినట్లు ఉంటుంది.

నందూ ప్రస్తావన తెచ్చిన అద్వైత

నందూ ప్రస్తావన తెచ్చిన అద్వైత

లాస్యతో మాట్లాడుతోన్న సమయంలో 'నందూను తలుచుకుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే రేపు బాల్ ప్లేస్‌లో నందూ ఉండబోతున్నాడు కదా' అంటాడు. ఇంతలో నందూ అక్కడకు వస్తాడు. అప్పుడే లాస్య 'నందూతో ఉన్న రిలేషన్‌షిప్ స్టేటస్ మాత్రం ఇప్పటికీ నాకు అర్థం అవడం లేదు' అంటుంది. దీంతో నందు సీరియస్ అవుతాడు. అప్పుడామె 'నీకు తులసి దగ్గర ఎటువంటి రూల్స్ ఉండవు. కానీ, నా దగ్గరే నీకు రూల్స్ ఉంటాయా?' అని ప్రశ్నిస్తుంది. అప్పుడు అక్కడే ఉన్న డాక్టర్ అద్వైత కృష్ణ ఇద్దరినీ సముదాయించే ప్రయత్నాలు చేస్తుంటాడు.

క్రిష్ లాస్యతో అలా.. నందూతో ఇలా

క్రిష్ లాస్యతో అలా.. నందూతో ఇలా

తన ముందే లాస్య, నందూ గొడవ పడుతుండగా క్రిష్ అలియాస్ అద్వైత కృష్ణ 'రిలాక్స్.. మీ చుట్టూ ఉన్న ఈ అందమైన ప్రకృతిని పాడు చేయకండి. నేను ఎవ్వరి పర్సనల్ లైఫ్‌లో ఇన్వాల్వ్ కాదల్చుకోలేదు. కానీ, మీరు ఇలా పబ్లిక్‌లో మీ ప్రైవేటు లైఫ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. లాస్య మీరు మీ కోపాన్ని చాలా తగ్గించుకోవాలి. లేదంటే అది మీ ఆరోగ్యానికే ప్రమాదం. అలాగే నందూ మీరు ఇద్దరిలో ఒక్కరినే సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే మీ వాళ్లందరికీ ప్రమాదమే. వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటే బెటర్' అంటాడు.

 మళ్లీ పడిన తులసి.. నందూపై కోపం

మళ్లీ పడిన తులసి.. నందూపై కోపం

మరోవైపు తులసి జామకాయలు కోస్తూ కింద పడిపోతుంది. అప్పుడు వెంటనే ప్రేమ్ అక్కడకు వచ్చి ఆమెను లేపుతాడు. ఆ సమయంలోనే నందూ కూడా అక్కడకు చేరుకుంటాడు. జామకాయలు కోయడానికి చెట్టు ఎక్కాలా అంటూ కంగారుగా ఆమెపై సీరియస్ అవుతాడు. దీనికి తులసి 'మీరు ఏనాడైనా నాకు జామకాయ కోసి ఇచ్చారా? మన ఇంట్లో ఉన్న చెట్టు జామకాయలను ఏనాడైనా కోసి ఇచ్చారా? భర్త కోసిచ్చిన కాయలు చిలక్కొట్టిన వాటితో సమానం అంటారు. నాకు అప్పుడా అదృష్టం లేదు. ఇప్పుడు విడిపోయాక ఎలా అడుగుతా' అంటూ నందూపై కోపం చూపిస్తుంది. తర్వాత లాస్యను అనసూయ అవమానించేలా మాట్లాడుతుంది. అనంతరం తులసి గురించి నందూకు ధైర్యం చెబుతుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X