Intinti Gruhalakshmi Today Episode: తులసికి నందూ ఊహించని గిఫ్ట్.. లాస్యకు ఆ మాట చెప్పేయడంతో!
తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ ఓ లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూతో తులసి మాట్లాడుతోన్న సమయంలో లాస్యను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. అదే తన చివరి కోరిక అని చెబుతుంది. ఆ తర్వాత లాస్యకు కోపం ఎలా తగ్గించుకోవాలో డాక్టర్ అద్వైత కృష్ణ సూచనలు ఇస్తుంటాడు. అప్పుడే నందూ అక్కడకు వెళ్లగా.. వివాహం గురించి మంచి నిర్ణయం తీసుకోమని అతడికి సలహా ఇస్తాడు. అలాగే, లాస్యను కోపం తగ్గించుకోమని చెబుతుంది. అనంతరం జామకాయలు కోస్తూ తులసి కింద పడిపోతుంది. దీంతో అందరూ కంగారు పడతారు. అప్పుడు నందూకు తల్లి అనసూయ ధైర్యం చెబుతుంది.

తల్లి ఆరోగ్యం గురించి ప్రేమ్ ఆందోళన
గత ఎపిసోడ్‌లో జామకాయలు కోసుకుని వచ్చిన తులసి వాటితో మిల్క్ షేక్ చేస్తానని చెబుతుంది. అందుకోసం కిచెన్‌లో శృతి సహాయం తీసుకుని మరీ పని చేస్తుంటుంది. అప్పుడు 'శృతి నువ్వు ఈ జామకాయలు కడుగు. నేను ఇప్పుడే పాల ప్యాకెట్ తీసుకొస్తాను' అని అక్కడి నుంచి వెళ్తుంది. ఇంతలో అక్కడకు ప్రేమ్ వస్తాడు. వచ్చీ రావడమే 'నువ్వు అమ్మకు తోడుగా ఉంటున్నావు. అమ్మను ప్రేమగా చూసుకుంటున్నావు. అమ్మ కష్టకాలంలో కూడా నువ్వు తోడుంటున్నావు. కానీ, అమ్మకు ఏమవుతుందోనని భయమేస్తుంది' అని భయపడిపోతుంటాడు.

శృతికి ప్రేమ్ ముద్దు.. తులసి సంతోషం
ప్రేమ్ తన తల్లి ఆరోగ్యం గురించి భయపడుతూ ఉండగా 'ఆంటికి ఏం కాదు ప్రేమ్. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు' అంటుంది శృతి. దీనికి ప్రేమ్ థ్యాంక్స్ చెబుతాడు. అప్పుడు శృతి భార్యకు ఎవరైనా థ్యాంక్స్ చెబుతారా అని అడుగుతుంది. దీంతో ప్రేమ్ 'సరే.. సరే.. థ్యాంక్స్ మాత్రమే చెబితే సరిపోదు కదా. ఇంకా ఏం చెప్పాలి' అంటూ అక్కడే ఆమెకు ఒక ముద్దు ఇస్తాడు. ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న తులసి ఎంతగానో సంతోష పడుతుంది. తన కోసం పిల్లలు ఆలోచించడం చూసి బాధ పడినా.. వాళ్లు సరదాగా గడపడం చూసి మాత్రం చాలా ముచ్చటపడుతుంది.

నందూకు ఇష్టమైనవి ఇచ్చిన తులసి
తులసి జామకాయలను ముక్కలుగా కోస్తుండగా నందూ అక్కడకు వస్తాడు. అప్పుడు ఇద్దరూ ఒకరినొకరు అలా చూస్తూ ఉండిపోతారు. ఆ సమయంలో నందూకు జామకాయలు అంటే ఇష్టమన్న విషయాన్ని తులసి గుర్తు చేసుకుంటుంది. ఆ వెంటనే ఆమె ముక్కలుగా కోసిన వాటిపై ఉప్పు కారం చల్లి నందూ దగ్గరకు తీసుకొస్తుంది. కానీ, అతడు మాత్రం తనకు వద్దు అన్నట్లుగా సైగలు చేస్తాడు. దీంతో తులసి కళ్లు మూసుకుని 'నా మీద కోసంతో జామకాయల మీద ఇష్టాన్ని వద్దనుకుంటే నష్టపోతారు' అని అంటుంది. ఆ వెంటనే నందూ వాటిని తీసుకుని తినేస్తాడు

తులసి పరిస్థితి చూసి బాధపడిన శృతి
ప్రేమ్ మాట్లాడి వెళ్లిన తర్వాత శృతి.. తులసి ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంటుంది. అంతలో ప్రేమ్ వచ్చి ఏమైందని అడుగుతాడు. తర్వాత ఏం ఆలోచిస్తున్నావో చెప్పమని అంటాడు. కానీ, శృతి మాత్రం ఏమీ లేదని అంటుంది. అప్పుడు ప్రేమ్ మరి ఎందుకు ఏడుస్తున్నావ్ అని ప్రశ్నిస్తాడు. దీనికి శృతి 'ఆంటీ పరిస్థితి ఆలోచిస్తే కన్నీళ్లు ఆగడం లేదు. ఆంటికి ఆ దేవుడు ఎందుకు అలాంటి జీవితాన్ని ఇచ్చాడు? మనం కోరుకున్నది దక్కనివ్వడు. ఆంటీ ఆరోగ్యం కోసం అంకుల్ కూడా టెన్షన్ పడుతున్నారు. పాత విషయాలను మరిచిపోయారు' అని చెప్పుకొస్తుంది.

లాస్యతోనే మనకు ప్రమాదం అంటూ
నందూలో చాలా మార్పులు వచ్చాయని చెప్పిన శృతి.. 'అంకుల్ ఇప్పుడు తులసి ఆంటీతో క్లోజ్‌గా ఉంటున్నారు. ఆంటీలో సంతోషాన్ని చూడటం కోసం ప్రయత్నిస్తున్నారు. మనందరం ఆంటీ సంతోషం కోసం ప్రయత్నిస్తున్నాం. కానీ, ఒక్క లాస్య తప్ప' అంటుంది శృతి. దీనికి ప్రేమ్ 'ఆ లాస్యతో మనకేంటి సంబంధం? అమ్మకు మనం ఉన్నాం. పరిస్థితి ఇంతకుముందులా లేదు' అంటాడు. దీనికి శృతి 'లాస్య చాలా డేంజర్ పర్సన్. తను అంత ఈజీగా ఓటమి ఒప్పుకోదు. తను ఆంటిని ఎక్కడ కార్నర్ చేస్తుందోనని భయంగా ఉంది' అని ఆందోళన చెందుతుందామె.

పెళ్లి విషయంలో తేల్చి చెప్పిన నందూ
ఇక, నందూతో లాస్య మనసు విప్పి మాట్లాడుతుంది. 'నాకు నువ్వు ఎక్కడ దక్కకుండా పోతావో అని భయం వేస్తోంది' అంటుంది. దీనికి నందూ 'తులసి ఆరోగ్యం దృష్ట్యా తనను సంతోషంగా ఉంచేందుకు తనతో దగ్గరగా ఉండాల్సి వస్తోంది' అంటాడు. అప్పుడు లాస్య 'నన్ను పెళ్లి చేసుకో. నేను కూడా సేవలు చేస్తాను' అంటుంది. దానికి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని అంటాడు నందూ. అప్పుడు లాస్య మరి ఏ హోదాతో తులసికి సేవ చేయాలంటున్నావు అని అడుగుతుంది. నందూ.. సేవ చేయడానికి హోదాలు అవసరం లేదు లాస్య అంటాడు. ఆ తర్వాత నందూ 'నువ్వు వేయి సార్లు అడిగినా ఒకటే సమాధానం. ఈ పరిస్థితిలో నాకు తులసి మాత్రమే ముఖ్యం' అని తేల్చేస్తాడు.

తులసికి నందూ గిఫ్ట్.. వాళ్ల తిట్టడంతో
ఉదయాన్నే తులసి పూజ చేస్తుండగా నందూ ఆమెకు గజ్జెలు గిఫ్టుగా తీసుకొస్తాడు. అంతేకాదు, 'నా కారణంగా నీకు ఇష్టమైన నాట్యానికి దూరం అయ్యావు. అందుకే నీకు ఇష్టమైన నాట్యం చేయడం కోసం గజ్జెలు తీసుకొచ్చాను' అని చెబుతాడు. దీనికి తులసి సంశయిస్తూ ఉంటుంది. అంతలో అక్కడికి వచ్చిన మాధవి, మోహన్ నందూను విమర్శిస్తూ మాట్లాడతారు. లాస్య వెంట తిరిగి తులసిని పట్టించుకోలేదని విమర్శిస్తారు. ఆ తర్వాత మాధవి 'నీ పరిస్థితి తెలిసింది వదిన.. దేవుడు మంచోళ్లకే కష్టాలు ఇస్తాడు' అంటుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.


Click it and Unblock the Notifications











