Intinti Gruhalakshmi Today Episode: లాస్య ప్లాన్ వర్కౌట్.. ఆమె చేసిన పనికి బుక్కైన తులసి, నందూ
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ ఓ లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూ తనను పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పడంతో లాస్య తెగ ఫీల్ అయిపోతుంది. దీంతో వెంటనే సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఈ విషయం తెలిసి నందూ బాగా ఏడుస్తాడు. ఆ తర్వాత ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్తారు. ఆ సమయంలోనే లాస్యను ఏమన్నారంటూ తులసి.. నందూను ప్రశ్నిస్తుంది. అనంతరం నందూ.. లాస్య దగ్గరకు వెళ్తాడు. అప్పుడు అతడిని తనకు దూరంగా ఉండమంటుందామె. ఆ తర్వాత తులసి వచ్చి లాస్య చెంపపై కొడుతుంది. అనంతరం ఆమెను హగ్ చేసుకుని ధైర్యం చెబుతుంది.

లాస్య అసహనం.. ధైర్యం చెప్పిన తులసి
ఆత్మహత్యాయత్నం చేసిన లాస్యతో తులసి ధైర్యం చెబుతుండగా ఈరోజు ఎపిసోడ్ మొదలైంది. అప్పుడు లాస్య 'ఇక్కడ ఉన్న ప్రతి వాళ్లూ నీ గురించి ఆలోచించే వాళ్లే తప్పితే నా గురించి ఎవరికీ సానుభూతి లేదు. నా గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదు. కనీసం నన్ను ప్రేమించిన వాడు కూడా నా బాధను పట్టించుకోవడం లేదు' అని తులసితో చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు తులసి 'అది అహంకారం మాత్రమే. బయటకు వచ్చి ఆయనతో యుద్ధం చేయి. తల ఎత్తి మాట్లాడు' అంటూ ధైర్యం చెప్పే ప్రయత్నాలు చేస్తుంటుంది.

నువ్వుంటే ఇష్టమే.. ఒప్పుకున్న నందూ
ఆ తర్వాత తులసి 'ఇక్కడ నువ్వంటే ఎవరికీ ఇష్టం లేదా? నువ్వు ఇష్టం లేకపోతే వీళ్లంతా నీ చుట్టు ఎందుకు చేరుతారు? నీకు ఏమైందో అని ఎందుకు టెన్షన్ పడుతున్నారు' అని ప్రశ్నిస్తుంది. దీనికి లాస్య 'నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కానీ నందూ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు' అంటుంది లాస్య. అప్పుడు నందూ 'నేను చెప్పదలుచుకుంది ఇంతకుముందే చెప్పాను కదా. నేను నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. కానీ తులసి ఆరోగ్యం కుదుటపడగానే చేసుకుంటాను' అని అందరి ముందే అంటాడు.

తులసిని మాయ చేయాలని లాస్య ప్లాన్
అందరూ మాట్లాడుతూ ఉండగానే తులసి.. తన మేనేజర్‌కు ఫోన్ చేస్తుంది. అప్పుడు డెలివరీలు అన్నీ సరిగా చేయమని కొన్ని సలహాలు ఇస్తుంది. అనంతరం లాస్య 'డెడికేషన్ అంటే అది.ఏ పని ఎలా చేస్తే పూర్తవుతుందో.. ఎవరు ఏ పని చేస్తే పూర్తవుతుందో ఇక్కడి నుంచే చక్కగా గైడ్ చేస్తున్నావు. చేసే పని మీద నీకు చాలా క్లారిటీ ఉంటుంది తులసి. ఇంత గొప్పగా ఆలోచించే కెపాసిటీ ఉన్న నీకు.. నువ్వు ఏం చేస్తే నందూ నన్ను త్వరగా పెళ్లి చేసుకుంటాడో తెలియదా? లేక తెలిసినా తెలియనట్టు నాకెందుకులే అని ఊరుకుంటున్నావా' అని అడుగుతుంది.

తులసిపై అలా నిందలు వేసిన లాస్య
లాస్య మాటలకు తులసి 'నాకు నటించాల్సిన అవసరం లేదు. నటించడం తెలియదు' అంటుంది. అప్పుడు లాస్య 'అదేంటో తులసి.. నువ్వు నాకు అర్థం కావు. నందూను నన్ను పెళ్లి చేసుకోవాలంటూ అందరి ముందు నిలదీస్తావు. ఆ తర్వాత ఆయనకు సేవలు చేస్తావు. ఓ వైపు నాతో మంచిగా ఉంటూనే నీ మంచిని చూసుకుంటున్నావేమో అని నాకు అనిపిస్తుంది' అంటుంది. దీనికి తులసి 'నేను నీకోసం నీతిగా ఉండను. నాకోసం ఉంటాను. నీకోసం నేను మంచిగా నటించలేను. మంచితనం నా రక్తంలోనే ఉంది' అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇస్తుంది.

తులసి కఠినమైన కోరిక కోరిన లాస్య
ఆ తర్వాత తులసి 'అయినా నీ నందూ నీతో పెళ్లికి ఒప్పుకోవడానికి నాకేంటి సంబంధం? నాకేంటి ఈ బాధ. ప్రస్తుతం నాకున్న ఈ పరిస్థితుల్లో నీ గురించి నేనెందుకు ఆలోచించాలి' అంటుంది. దీనికి లాస్య 'ఎందుకంటే ప్రతిసారి నీ గురించే ఆలోచించి నందూ మా పెళ్లిని వాయిదా వేస్తున్నాడు. మా పెళ్లి విషయంలో నందూ స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలంటే.. నువ్వు ఒక పని చేయాల్సిందే. నువ్వు నందూ కళ్ల ముందు కనిపించకూడదు. నువ్వు నందూ కళ్ల ముందు ఉన్నంత కాలం ఇలాగే ఇన్ ఫ్లూయెన్స్ అవుతూనే ఉంటాడు' అంటూ ఆమెను వెళ్లిపోమంటుంది.

రెచ్చగొట్టిన లాస్య.. ఒప్పుకున్న తులసి
తులసిని మరింత రెచ్చగొట్టేందుకు 'మా పెళ్లి జరగాలంటే నువ్వు ఇచ్చిన మాటలో నిజాయితీ ఉంటే నందూకు దూరంగా వెళ్లిపో' అంటుంది. అప్పుడు తులసి 'నీ ముందు నిజాయితీని చూపించుకోవాల్సిన అవసరం లేదు' అంటుంది. కాసేపు ఆలోచించిన తర్వాత 'నీ జీవితం ఒక దారిలోకి రావడం కోసం నేను నువ్వు అడిగినట్టు చేస్తాను. తులసి మాటిచ్చిందంటే వెనక్కి తగ్గదు' అంటుంది తులసి. దీనికి లాస్య 'నాకు కావాల్సింది అదే తులసి' అని చెప్పి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత తులసి తన పరమాత్మతో మాట్లాడుతుంది.

లాస్య ప్లాన్ వర్కౌట్.. సిద్ధమైన తులసి
లాస్య ప్లాన్ ప్రకారమే ఆమె మాటలకు అనుగుణంగానే తులసి తన బట్టలు సర్దుకుంటుంది. తన పెళ్లి డైరీ అప్పుడే కనిపిస్తుంది. తన పెళ్లి ఫోటోలు చూసి కోపం తెచ్చుకొని పెళ్లి ఫోటోలను చెత్త బుట్టలో విసిరేస్తుంది. అనంతరం ఆ డైరీని తీసుకున్న లాస్య.. ఆ ఫోటోలను తీసి మంటల్లో వేస్తుంది. తర్వాత ఇంట్లో వాళ్లంతా సరదాగా గడుపుతుంటారు. ఇంతలో తులసి బ్యాగు సర్దుకొని వస్తుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. దీంతో అందరూ ఎక్కడికి వెళ్తున్నావంటూ ప్రశ్నిస్తారు. కానీ తులసి మాత్రం సమాధానం చెప్పకుండా అలా నిలబడి ఉండిపోతుంది.

నందూ ప్రశ్నలు.. తేల్చేసిన తులసి
ఆ తర్వాత నందూ ఆమెను ప్రశ్నిస్తాడు. దీనికి తులసి 'ఎవ్వరి అవసరం లేని చోటుకు. ఎవ్వరూ నా గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేని చోటుకు' అంటుంది. దీనికి నందూ 'నీకు ఏమైంది. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలియదా' అంటాడు. అప్పుడు 'నా జబ్బుతో మీరొక్కరినే కాదు.. ఇంకొక్కరిని కూడా బాధపెడుతున్నారు. అసలు నా జబ్బు గురించి మీరెందుకు ఆలోచించాలి. నాకు ట్రీట్‌మెంట్ ఎన్ని ఏళ్లు ఆగితే అన్ని ఏళ్లు మీరు అలాగే లాస్యను పెళ్లి చేసుకోకుండా ఉంటారా? నా జబ్బు గురించి ఆలోచించడానికి మీరెవరు' అని ప్రశ్నిస్తుంది. దీనికి నందూ పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో ఈ ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











