Intinti Gruhalakshmi Today Episode: లాస్య ప్లాన్‌తో బుక్కైన తులసి.. పెళ్లి ఆపాలని ఎదురు తిరగడంతో!

మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ ఓ లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి ఓదార్చుతోన్న సమయంలో లాస్య తన ప్లాన్‌ను అమలు చేసే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే తులసిని బాగా రెచ్చగొడుతుంది. సరిగ్గా అప్పుడే పెళ్లి విషయంలో నందూను అడగమంటూ పరోక్షంగా చెబుతుంది. అదే సమయంలో ఆమెను ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అంటూ ఊహించని డిమాండ్‌‌ను తులసి ముందు ఉంచుతుంది. దీంతో తులసి ఇల్లు వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది. అందుకు అనుగుణంగానే వెళ్లిపోడానికి రెడీ అయిపోతుంది. అప్పుడు ఇంట్లో వాళ్లందరూ షాకైపోవడంతో పాటు ఆపుతారు.

 లాస్య కన్నింగ్ ప్లాన్... బుక్కైన తులసి

లాస్య కన్నింగ్ ప్లాన్... బుక్కైన తులసి

తులసిని నందూకు దూరం చేయాలని ప్లాన్ చేసిన లాస్య.. అందుకు అనుగుణంగానే ఆమెను రెచ్చగొడుతుంది. దీంతో తులసి ఇంట్లో నుంచి వెళ్లడానికి రెడీ అవుతుంది. అప్పుడు అందరూ చెప్పినా వినకుండా వెళ్లిపోవాలనుకుంటుంది. అప్పుడు లాస్య వచ్చి 'ఆగు తులసి నువ్వు ఎక్కడికీ వెళ్లడానికి వీలు లేదు. ఒకవేళ ఇప్పుడు కనుక నువ్వు వెళ్లావంటే నిన్ను రెచ్చగొట్టి నేనే నిన్ను పంపిస్తున్నానని వీళ్లు అనుకుంటారు. పొరపాటున కూడా నువ్వు వెళ్లాక నీకు ఏదైనా జరిగితే నన్నే బాధ్యురాలిని చేస్తారు' అంటుంది లాస్య. దీంతో తులసికి పిచ్చి ఎక్కినట్లు అవుతుంది.

నందూతో పాటు వాళ్లను వారించింది

నందూతో పాటు వాళ్లను వారించింది

లాస్య మాటలకు తులసి 'ఇక ఆపు లాస్య. ఇది తెగ సమస్య కాదు. అందుకే తెంపేసుకొని వెళ్తున్నాను. ఆయన పెట్టిన సమస్యల ముందు ఇదో లెక్క కాదు' అంటుంది. దీనికి నందూ 'తులసి నేను నీ గురించి ఆలోచిస్తున్నాను' అంటాడు. అప్పుడామె 'నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే నేను 1000 సార్లు చెప్పాను. నన్ను చూసుకోవడానికి అందరూ ఉన్నారు. కానీ, లాస్యను చూసుకోవడానికి మీరు తప్పించి ఇంకెవ్వరూ లేరు' అంటుంది. అప్పుడు నువ్వు వెళ్లిపోతే మేము కూడా మీతో వస్తాము అంటారు కుటుంబ సభ్యులు. తనతో పాటు బయటికి వస్తారు.

లాస్యతో పెళ్లికి ఒప్పేసుకున్న నందూ

లాస్యతో పెళ్లికి ఒప్పేసుకున్న నందూ

ఇంట్లో వాళ్లందరూ వద్దని వేడుకుంటున్నా తులసి మాత్రం వినకుండా బయటకు వెళ్లిపోవాలని చూస్తుంది. అప్పుడు నందూ కూడా వచ్చి ఆమెను బాగా బ్రతిమాలుతాడు. దీంతో తులసి 'నేను ఇక్కడే ఉండాలంటే వెంటనే లాస్యను పెళ్లి చేసుకుంటా అని చెప్పండి' అంటుంది. అప్పుడు నందూకు ఏం చేయాలో అర్థం కాదు. కాసేపు ఆలోచించుకున్న తర్వాత 'సరే ఒప్పుకుంటున్నాను వెంటనే లాస్యను పెళ్లి చేసుకుంటాను' అని చెప్పి లోపలికి వెళ్లిపోతాడు. తర్వాత తులసి లోపలికి వెళ్తుండగా.. లాస్య థ్యాంక్స్ చెబుతుంది. కానీ, ఆమె అలా వెళ్లిపోతుంది.

వాళ్లంతా పెళ్లి ఆపాలని ప్లాన్ చేశారు

వాళ్లంతా పెళ్లి ఆపాలని ప్లాన్ చేశారు

నందూ.. లాస్యను పెళ్లి చేసుకోవాలని ఒప్పుకున్న తర్వాత ఇంట్లో ఉన్న వాళ్లంతా ఆలోచనలో పడిపోతారు. అదే సమయంలో పిల్లలు దివ్య, ప్రేమ్, అభిలు 'అసలు మమ్మీకి ఎందుకు ఇంత టెన్షన్? ఇంత మంచితనం ఎందుకు? తను అంత రిస్క్ తీసుకొని వాళ్ల పెళ్లి ఎందుకు చేయించాలి?' అని అనుకుంటారు. ఆ తర్వాత 'మనమందరం మరిచిపోయిన ఒక మాట ఒకటుంది. లాస్య పెళ్లి చేస్తా అని మమ్మీ లాస్యకు మాటిచ్చింది' అంటాడు ప్రేమ్. దీంతో అంకిత 'ఏది ఏమైనా మనం ఈ పెళ్లి ఆపుదాం' అంటుంది. దీనికి దివ్య కూడా బాగా సహరిస్తుంది. లాస్య తమపై పెత్తనం చెలాయిస్తుందని.. ఎలాగైనా పెళ్లి ఆపాలని వాళ్లంతా చర్చించుకుంటారు.

ప్రేమ్ ఆలోచన.. మార్చాలని ప్లాన్‌తో

ప్రేమ్ ఆలోచన.. మార్చాలని ప్లాన్‌తో

అందరూ మాట్లాడుతుండగా.. 'మనం ఈ పెళ్లి ఆపితే అమ్మకు ఎదురు తిరిగినట్టే అవుతుంది కదా' అంటాడు ప్రేమ్. అప్పుడు శృతి 'మనమే తన వాళ్లు అని అనుకుంటోంది తను. ఈ సమయంలో మనం ఏం చేయాలన్నా ఒకటికి పది సార్లు ఆలోచించాలి' అంటుంది. దీంతో ప్రేమ్ ఏది ఏమైనా అమ్మ సంతోషం మనకు ముఖ్యం అంటాడు. అప్పుడు అభి 'మామ్ తప్పు చేసిందని అదే తప్పును మనం కూడా చేద్దామా' అని అడుగుతాడు. దీంతో 'ఒడ్డున ఉన్నవాళ్లం మనమే ఇంతగా ఆ సమస్య గురించి ఆలోచిస్తుంటే.. అన్నీ తన మెడలో వేసుకున్న అమ్మ ఈ సమస్య గురించి ఎంతలా ఆలోచిస్తుందో' అంటాడు ప్రేమ్.

నందూపై లాస్య అసంతృప్తిగా ఉండి

నందూపై లాస్య అసంతృప్తిగా ఉండి

మరోవైపు నందూ ఇంకా తులసి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో లాస్య వచ్చి 'నందూ నాకు చాలా హ్యాపీగా ఉంది. గాల్లో ఎగురుతున్నట్టుగా ఉంది' అంటుంది. దీనికి అతడు 'మనకు పెళ్లేమీ కొత్త కాదు కదా' అంటాడు. దీంతో 'మనిద్దరం చేసుకుంటున్నాం కదా. ఎన్నో ఏళ్లబట్టి డేటింగ్‌లో ఉన్నవాళ్లు అయినా, ప్రెష్‌గా పెళ్లి అనేసరికి మొహంలో పెళ్లి కల కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కానీ, నువ్వు మాత్రం ఏం పట్టనట్టుగా ఉన్నావు ఎందుకు?' అని ప్రశ్నిస్తుంది. దీనికి నందూ చిరాకు పడతాడు. అప్పుడు లాస్య తులసి వల్లే పెళ్లికి ఒప్పుకున్నావుగా అంటుంది.

లాస్య అసహనం.. అనసూయ బాధగా

లాస్య అసహనం.. అనసూయ బాధగా

నందూ అంతగా మాట్లాడకపోవడంతో 'అయినా నువ్వు ఎలా ఒప్పుకుంటే ఏంటి? నాకు మన పెళ్లి అవడం అనేది ముఖ్యం. అయినా నువ్వు ఇంకా తులసి గురించే ఆలోచిస్తున్నావా? తను నిన్ను పట్టించుకోకున్నా నువ్వు మాత్రం ఎందుకు తన గురించే ఆలోచిస్తున్నావు? తను నిన్ను గడ్డిపోచలాగా తీసేసినా నువ్వు తన వెనుకే తిరగడం నాకు నచ్చడం లేదు' అంటుంది లాస్య. ఆ తర్వాత తన గురించి ఆలోచిస్తున్న అనసూయ దగ్గరకు తులసి వెళ్తుంది. ఆ సమయంలో ఇద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకుంటారు. అలాగే బాధలు చెప్పుకుంటారు. దీంతో ఈ ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X