twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Intinti Gruhalakshmi Today Episode: తులసి రిపోర్టులు చూసి డాక్టర్ షాక్.. ఇంట్లో వాళ్లకు తెలియడంతో!

    |

    ఇండియాలోని మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూసేయండి మరి!

    Photos Courtesy: Star మా and Disney+Hotstar

    గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. లాస్య మాటలకు పడిపోయిన తులసి.. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది. అందుకు అనుగుణంగానే బ్యాగ్ పట్టుకుని బయటకు వస్తుంది. అప్పుడు ఆమెను అందరూ ఆపాలని ప్రయత్నిస్తారు. కానీ, తులసి మాత్రం నిర్ణయాన్ని మార్చుకోదు. ఆ సమయంలోనే నందూ.. లాస్యను పెళ్లి చేసుకుంటానికి ఒప్పుకుంటాడు.

    అప్పుడు దివ్య, ప్రేమ్, అభిలు నిరాశ చెందుతారు. ఆ తర్వాత లాస్య నందూను తప్పుదోవ పట్టిస్తుంది. అనంతరం ఇంట్లో వాళ్లంతా కలిసి నందూ, లాస్య పెళ్లి ఆపాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు.

    Pushpa Twitter Review: బన్నీ మూవీకి షాకింగ్ టాక్.. మొత్తం అదిరింది కానీ.. ఓవరాల్‌గా ఎలా ఉందంటే!Pushpa Twitter Review: బన్నీ మూవీకి షాకింగ్ టాక్.. మొత్తం అదిరింది కానీ.. ఓవరాల్‌గా ఎలా ఉందంటే!

     తులసిని క్షమాపణ కోరిన అనసూయ

    తులసిని క్షమాపణ కోరిన అనసూయ

    నందూ పెళ్లి అవుతుండడంతో అనసూయ తులసిని ఆలోచించుకుంటూ ఏడుస్తుంటుంది. అప్పుడు ఆమె దగ్గరకు తులసి రావడంతో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అవుతుంది. అప్పుడు 'నా తప్పు వల్ల నేను నా కొడుకుకు దూరం అవుతున్నాను. నువ్వు నీ అందమైన జీవితానికి దూరం అవుతున్నావు. నన్ను క్షమించు అమ్మా' అంటుంది అనసూయ. దీనికి తులసి 'అత్తయ్య కాసేపు మీ ఒడిలో తల పెట్టుకొని పడుకోవచ్చా? అమ్మ గుర్తొచ్చింది' అంటుంది. ఆ తర్వాత అనసూయ.. తులసిని తన ఒడిలో పడుకోబెట్టుకుంటుంది. ఆ సమయంలో ఇద్దరూ బాధ పడుతుంటారు.

    నందూతో తులసి పెళ్లి అనగానే అలా

    నందూతో తులసి పెళ్లి అనగానే అలా

    తన ఒడిలో పడుకున్న తులసితో అనసూయ 'అమ్మా తులసి.. నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను నిజం చెబుతావా' అని అడుగుతుంది. దీనికి తులసి చెప్పమని అంటుంది. అప్పుడు అనసూయ 'నందూ.. లాస్యను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా?' అని ప్రశ్నిస్తుంది. దీనికి తులసి 'నా ఇష్టాఇష్టాల మీద ఏముంటుంది' అని అంటుంది.

    అప్పుడు అనసూయ 'ఒకవేళ నందూ.. లాస్యను వద్దనుకొని నీ దగ్గరికి తిరిగి వస్తే ఏం చేస్తావు' అని ఊహించని ప్రశ్న అడుగుతుంది. దీంతో తులసి 'నేను అనేదాన్ని ఉంటే కదా.. కంచికి వెళ్లిన కథ ఇక అటే కదా' అంటుంది.

    Bigg Boss Voting Result: ఐదో రోజు మారిన ఓటింగ్.. సన్నీ, షన్నూకు బిగ్ షాక్.. టాప్‌లో ఎవరు ఉన్నారంటే!Bigg Boss Voting Result: ఐదో రోజు మారిన ఓటింగ్.. సన్నీ, షన్నూకు బిగ్ షాక్.. టాప్‌లో ఎవరు ఉన్నారంటే!

    తులసి రిపోర్టులు చూసి అద్వైత షాక్

    తులసి రిపోర్టులు చూసి అద్వైత షాక్

    ఇక, తులసికి పరీక్షలు చేయించిన అద్వైత కృష్ణకు ఆమె రిపోర్టులు అందుతాయి. అప్పుడు టెన్షన్ పడుతూనే ఆ రిపోర్టులను చూస్తాడతను. అందులో తులసికి క్యాన్సర్ సెకెండ్ స్టేజ్ అని ఉంటుంది. అంతేకాదు, రెండు రోజుల్లోనే ఆమెకు సర్జరీ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు, కృష్ణుడి విగ్రహం దగ్గరకు వచ్చిన తులసి 'భగవంతుడా.. మంచికో చెడుకో ఈ పరిస్థితుల్లో నీ దగ్గర ఉండేలా చేసుకున్నావు. నా ఆరోగ్యం కూడా తొందరగా నయం అయ్యేలా చూడు స్వామి' అని వేడుకుంటుంది. సరిగ్గా అప్పుడే డాక్టర్ అద్వైత కృష్ణ అక్కడకు బాధ పడుతూ వస్తాడు.

    తులసికి సెకెండ్ స్టేజ్ అన్న అద్వైత

    తులసికి సెకెండ్ స్టేజ్ అన్న అద్వైత

    డాక్టర్ అద్వైత కృష్ణను చూసిన తులసి.. మీకోసమే వచ్చానని అంటుంది. అంతేకాదు, తన రిపోర్టుల గురించి అడుగుతుంది. దీంతో అద్వైత ఆమెకు రిపోర్టులు ఉన్న ఫైల్‌ను అందిస్తాడు. దీనికి తులసి 'నాకు చదవడం చేతకాదండి. చదివి చెప్పండి. నాకింకా ఎంత టైమ్ ఉంది' అని అడుగుతుంది. దీనికి కృష్ణ ఏమీ మాట్లాడడు.

    తర్వాత తులసికి క్యాన్సర్ సెకండ్ స్టేజ్‌లో ఉందని చెబుతాడు. దీంతో 'ఇది ఇంతకుముందే చెప్పారు కదా. నయం అవుతుంది కదా' అని అడుగుతుంది తులసి. దీనికి కృష్ణ 'సర్జరీ చేయాలి.. అది కూడా వెంటనే చేయాలి' అంటాడు.

    Bigg Boss Winner: 4వ రోజు ఒక్కసారిగా మారిన పోలింగ్.. అతడికి భారీగా ఓటింగ్.. టాప్ ప్లేయర్‌కు షాక్!Bigg Boss Winner: 4వ రోజు ఒక్కసారిగా మారిన పోలింగ్.. అతడికి భారీగా ఓటింగ్.. టాప్ ప్లేయర్‌కు షాక్!

    తులసి ధైర్యానికి ఆశ్చర్యపోయిన కృష్ణ

    తులసి ధైర్యానికి ఆశ్చర్యపోయిన కృష్ణ

    రిపోర్టుల గురించి మాట్లాడిన తర్వాత అద్వైత కృష్ణ 'నీకు క్యాన్సర్ సెకండ్ స్టేజ్ అన్నా కూడా నువ్వు ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నావు' అని ప్రశ్నిస్తాడు. దీనికి తులసి 'విడాకులు తీసుకున్నప్పుడే ఎంతో గుండె నిబ్బరంగా ఉన్నాను. ఇదో లెక్కా' అంటుంది. అప్పుడు రెండు రోజుల్లోనే తులసికి ఆపరేషన్ చేయాలి అంటాడు డాక్టర్. అప్పుడామె డబ్బులు లేవని సమాధానం చెబుతుంది. దీనికి అద్వైత కృష్ణ 'డబ్బులు ఇప్పుడు అవసరం లేదు. సర్జరీ చేసిన తర్వాత ఇవ్వండి' అంటాడు. దీంతో తులసి ఆ ఫైల్ తీసుకొని ఎంతో బాధగానే ఇంటికి వస్తుంది.

    అందరితో మాట తీసుకున్న తులసి

    అందరితో మాట తీసుకున్న తులసి

    రిపోర్టులు పట్టుకుని ఇంటికి వచ్చిన తులసికి అందరూ నవ్వుతూ ఉండడం కనిపిస్తుంది. దీంతో దివ్య వచ్చి ఒక జోక్ చెబుతా అంటుంది. అప్పుడు తులసి 'మీకే ఒక జోక్ చెబుతాను. కానీ, మీరందరూ కచ్చితంగా నవ్వుతాను అని నాకు మాట ఇవ్వాలి' అని అంటుంది. అందుకు వాళ్లందరూ ఆమె చేతిలో చేయి వేస్తారు. అప్పుడు తనకు క్యాన్సర్ రెండో స్టేజ్ అన్న విషయాన్ని చెబుతుంది తులసి. దీంతో అందరూ ఏడుస్తుంటారు. అప్పుడు 'మీరంతా నవ్వుతామని మాటిచ్చారు. నా సర్జరీ అయ్యే వరకూ అలాగే ఉండాలి' అని వాళ్ల దగ్గర మాట తీసుకుంటుంది.

    Bigg Boss: ఆ కంటెస్టెంట్‌కు ప్రభాస్ ఫ్యామిలీ సపోర్ట్.. స్పెషల్ వీడియోతో కృష్ణంరాజు భార్య సర్‌ప్రైజ్Bigg Boss: ఆ కంటెస్టెంట్‌కు ప్రభాస్ ఫ్యామిలీ సపోర్ట్.. స్పెషల్ వీడియోతో కృష్ణంరాజు భార్య సర్‌ప్రైజ్

     పెళ్లి కార్డుతో లాస్య... నందూ బాధగా

    పెళ్లి కార్డుతో లాస్య... నందూ బాధగా

    అందరూ తులసి ఆరోగ్యం గురించి బాధ పడుతూ ఉంటారు. అప్పుడే నందూ, లాస్య అక్కడకు వస్తారు. ఆ సమయంలో తమ పెళ్లి కార్డును తులసికి ఇస్తుంది లాస్య. అంతేకాదు, మొత్తం దగ్గరుండి జరిపించాలని కోరుతుంది. అప్పుడు నందూ 'తులసి ఇప్పుడు నువ్వు హ్యాపీనే కదా' అంటాడు. ఆ సమయంలో ప్రేమ్ తన తల్లి ఆరోగ్యం గురించి చెబుతాడు. దీంతో నందూ షాకైపోతాడు. అంతేకాదు, చాలా బాధ పడుతూ ఉంటాడు. ఆ తర్వాత తులసి రూమ్‌లోకి వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.

    English summary
    Intinti Gruhalakshmi Episode 505: Advaith Krishna Told About Health Report To Tulasi. After That Lasya Gave Marriage Invitation Card to Tulasi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X