For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: ఫ్రెండ్‌ను కలిసిన తులసికి షాక్.. లాస్య వల్ల వాళ్ల మధ్య గొడవ

  |

  దాదాపు రెండు మూడేళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

  దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి, సామ్రాట్ ఇంట్లో ఉండగానే ఒకరు అక్కడకు వెళ్తారు. ఆ వచ్చింది వాళ్ల సంగీతం టీచర్ అని ఆమె గుర్తిస్తుంది. అంతేకాదు, తాను కొత్తగా మ్యూజిక్ స్కూల్‌ను పెట్టబోతున్నానని, దాని ఓపెనింగ్‌ను రావాలని గురువును కోరుతుంది.

  దీనికాయన ఓకే అంటాడు. అనంతరం ఈ ఇంటిని తులసికి వచ్చేలా చేస్తానని సామ్రాట్ అంటాడు. ఇక, పేషెంట్ల దగ్గర డబ్బులు తీసుకున్నదని లాస్యతో అంకిత గొడవ పడుతుంది. దీంతో ఆమెను లాస్య అవమానించేలా మాట్లాడుతుంది. తర్వాత నందూకు లేనిపోనివి చెప్పి క్లాస్ పీకిస్తుంది.

  డెలివరీ తర్వాత తెగించిన హీరోయిన్: ఎద అందాలు హైలైట్ చేస్తూ ఘోరంగా!

  తులసికి దొరికిన పాత వాక్‌మెన్

  తులసికి దొరికిన పాత వాక్‌మెన్

  ఇంట్లో దొరికిన పెట్టెలో పాత వస్తువులను చూసి తులసి ఎంతగానో సంతోషిస్తుంటుంది. అలాగే, అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటోంది. అలా ప్రతి విషయాన్ని సామ్రాట్‌కు వివరిస్తుంది. అప్పుడే ఆమెను ఆ పెట్టెలో పాత వాక్‌మెన్ దొరుకుతుంది. అప్పుడు సామ్రాట్ దీన్ని కూడా మీరే దాచుకున్నారా అని అడుగుతాడు.

  అప్పుడు తులసి 'ఇది ఇందులో ఉందా. చిన్నప్పుడు ఇందులో క్యాసెట్ పెట్టి మా అమ్మ పాటను రికార్డ్ చేశాను. కానీ ఇది ఓపెన్ కాలేదు. టేప్ చుట్టుకుపోయింది. బలవంతంగా ఓపెన్ చేస్తే టేప్ తెగిపోతుందని అలానే ఉంచేశా' అని అంటుంది.

  మళ్లీ ట్రై చేయమన్న సామ్రాట్

  మళ్లీ ట్రై చేయమన్న సామ్రాట్

  తులసి వాక్‌మెన్‌లో వాళ్ల అమ్మ పాట.. దానికి వచ్చిన ఇబ్బంది గురించి చెప్పగానే సామ్రాట్ 'అయ్యో.. అయితే, ఇప్పుడు మళ్లీ పాడి ఒక పాటను రికార్డు చేయొచ్చు కదా' అని సలహా ఇస్తాడు. దీనికి తులసి 'అప్పుడు పాడింది వేరు.. ఇప్పుడు పాడింది వేరు. అది నా చిన్నతనంలో పాడిన పాట. ఇప్పుడు పాడితే గుర్రం అరిచినట్లు ఉంటుంది. కాబట్టి ఇది ఇలా ఉంచితేనే బెటర్' అంటుంది.

  దీంతో సామ్రాట్ 'సరే.. అది నేను చూసుకుంటాను లెండి' అంటాడు. తర్వాత తులసికి ఇల్లు వదిలి వెళ్లాలని అనిపించదు. దీంతో సామ్రాట్ 'మీరు ఇక్కడ ఫొటోలు దిగండి. అలా అయితే మీ ఇంటిని రోజూ చూసుకోవచ్చు' అంటాడు. దీనికి తులసి ఓకే అనడంతో ఆమెను ఇంటి ముందు నిల్చోబెట్టి ఫొటోలు తీస్తాడు.

  Bigg Boss Winner: షో చరిత్రలోనే చెత్త నిర్ణయం.. బిగ్ బాస్ పెద్ద పొరపాటు.. రేవంత్‌, శ్రీహాన్‌కు షాక్

  లాస్య మాటలకు అంకిత బాధ

  లాస్య మాటలకు అంకిత బాధ

  లాస్య తనను అవమానించిన మాటలను గుర్తు తెచ్చుకుని అంకిత బాధ పడుతూ ఉంటుంది. అంతేకాదు, నందూ కూడా ఏం జరిగిందో తెలియకుండా తనకే క్లాస్ పీకడం పైనా ఆమె మరింత ఫీల్ అవుతుంటుంది. ఆ సమయంలో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది.

  అంతలో అక్కడకు పరందామయ్య, అనసూయ వస్తారు. వచ్చీ రావడమే తాతయ్య బాధపడుతున్నావా అమ్మ అని అడుగుతాడు. అప్పుడు అంకిత 'చూశారా తాతయ్యా.. లాస్య ఆంటి ప్రవర్తన. తనే తప్పు చేసి దాన్ని మనమే చేసిన తప్పులా మార్చేసింది' అంటుంది. దీంతో వాళ్లు అంతా చూశాం అంటారు.

  అభితో గొడవకు దిగిన అంకిత

  అభితో గొడవకు దిగిన అంకిత

  ఆ తర్వాత వాళ్లతో అంకిత 'నేను చేసే మంచిపని కూడా తనవైపు తిప్పుకొని మామయ్య ముందు నన్ను చులకన చేసింది' అంటుంది. ఇంతలో అభికి వాళ్ల మాటలు వినిపించడంతో అక్కడికి వస్తాడు. అంతేకాదు, 'మనిషి ఎలాంటి వాళ్లు అయినా మంచి మాటలు చెప్పినప్పుడు వింటే మంచిదే కదా. అయినా అంత కష్టపడి చదివింది ఉచితంగా ట్రీట్ మెంట్ చేయడానికా' అని ప్రశ్నిస్తాడు. దీంతో అంకిత 'అసలు నా పేషెంట్లకు ట్రీట్‌మెంట్ చేయొద్దు అనడానికి ఆమె ఎవరు? నా ప్రొఫెషన్ నా ఇష్టం. మంచి పని చేస్తానంటే వద్దు అంటుందా' అని ఫైర్ అవుతుంది.

  అఖండ హీరోయిన్ హాట్ సెల్ఫీ: ఓర్నాయనో ఆ డ్రెస్సేంటి బాబోయ్!

  ఛీ అంత చీప్‌గా అంటావా అని

  ఛీ అంత చీప్‌గా అంటావా అని


  వాళ్లిద్దరూ గొడవ పడుతుండగా అక్కడే ఉన్న పరందామయ్య 'లాస్య ఎవరో ఈ ఇంట్లో అందరికీ తెలుసు అమ్మ. అయినా మనం ఏం చేయలేం. ఇప్పుడు పరిస్థితులు అన్నీ ఆమెకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఏం జరిగినా సర్ధుకుని పోవాల్సిందే తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు' అంటాడు. దీంతో అభి 'తాతయ్యకు అర్థం అయినంత కూడా నీకు అర్థం కావడం లేదు అంకిత' అంటాడు. అప్పుడు అంకిత 'ఛీ.. అంత చీప్‌గా ఎలా మాట్లాడగలుగుతున్నావు అభి' అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతుంది. తర్వాత వాళ్లు కూడా వెళ్లిపోతారు.

  ఫ్రిడ్జ్‌కు తాళం... లాస్య దెబ్బ

  ఫ్రిడ్జ్‌కు తాళం... లాస్య దెబ్బ


  ఇక, పేపర్ చదువుకుంటూ పరందామయ్య నిద్ర పోతుంటాడు. దీంతో శృతిని పిలిచి అనసూయ చూపిస్తుంది. ఆ తర్వాత ఆయనను నిద్ర లేపుతారు. దీంతో తనకు టీ కావాలని పరందామయ్య అడుగుతాడు. అప్పుడు శృతి నేను తీసుకొస్తా అంటూ కిచెన్‌లోకి వెళ్లగా ఫ్రిడ్జ్‌కు తాళం వేసి ఉంటుంది. దీంతో 'ఇప్పుడు పాల ప్యాకెట్ కోసం కూడా అమ్మ గారిని వెళ్లి అడగాలన్నమాట. ఏం చేస్తాం.. తాతయ్య గారి కోసం తప్పదు కదా' అని లాస్య దగ్గరికి వెళ్లి అడుగుతుంది. కానీ, లాస్య మాత్రం ఇవ్వడం కుదరదు అంటుంది. దీంతో చేసేదేం లేక శృతి వెనక్కి తిరిగి వచ్చేస్తుంది.

  నటి సురేఖ వాణి అందాల ఆరబోత: షర్ట్ విప్పేసి.. ప్యాంట్ లేకుండా వామ్మో!

  ఫ్రెండ్‌ను కలిసి తులసికి షాక్


  ఊరిలోనే తులసి, సామ్రాట్ కారులో వెళ్తుంటారు. అంతలో ముగ్గురు మహిళలు కారుకు అడ్డంగా నిలబడి వాళ్లను దిగమంటారు. దీంతో చందాల కోసం వచ్చేరేమో అని తులసి అనుకుంటుంది. అప్పుడు వాళ్లు చందాలు అడిగే వాళ్లం కాదు దిగండి అంటాడు. అనంతరం సామ్రాట్‌ను పక్కకు తప్పుకోమని చెప్పి.. 'పొద్దున నుంచి కారులో మా రోడ్లన్నీ తెగ తిరుగుతున్నారు.. ఏంటి విషయాలు? పుట్టి పెరిగిన ఊరు గుర్తుంది కానీ.. తన స్నేహితులు మాత్రం గుర్తులేరే. తీసుకెళ్లి చిన్న చెరువులో ముంచేద్దాం' అంటారు. దీంతో వాళ్లు తన స్నేహితులు అని తులసి గుర్తిస్తుంది. తర్వాత వాళ్లతో మాట్లాడుతుంది. అప్పుడు వాళ్లంతా సామ్రాట్‌ను తులసి భర్త అనుకుని కామెంట్ చేస్తారు. దీంతో తులసి షాక్ అవుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 818: Abhi and Ankita Got Into an Argument about Tulasi Behaviour. After That Tulasi Met her Childhood Friends at Village.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X