twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Intinti Gruhalakshmi Today Episode: అనసూయకు తులసి ప్రామిస్.. నీ అంతు చూస్తానంటూ సవాల్

    |

    జనరేషన్లు ఛేంజ్ అవుతున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

    Photos Courtesy: Star మా and Disney+Hotstar

    బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. సామ్రాట్, తులసి నడుచుకుంటూ వెళ్తుండగా ఐస్ బండి కనిపించడంతో కుల్ఫీలు కొనుక్కొని తింటారు. ఆ తర్వాత చిన్ననాటివి గుర్తు చేసుకుని సంతోషిస్తారు. అనంతరం పరందామయ్యకు అనసూయ క్షమాపణ చెప్పడంతో పాటు చాలా బాధ పడుతుంది. కానీ, ఆయన మాత్రం ఇష్టం లేకుండానే మాట్లాడి వెళ్లిపోవాలని అనుకుంటాడు. దీంతో అనసూయ కళ్లు తిరిగి పడిపోతుంది. అప్పుడు ప్రేమ్.. తులసికి ఫోన్ చేయగా వెంటనే అక్కడకు వస్తుంది. ఆ తర్వాత లాస్యను వెళ్లిపోమని తులసితో అనసూయ మాట్లాడుతుంది.

    సెల్ఫీలో పూజా హెగ్డే క్లీవేజ్ షో: టాప్ నుంచి చూపిస్తూ అరాచకంసెల్ఫీలో పూజా హెగ్డే క్లీవేజ్ షో: టాప్ నుంచి చూపిస్తూ అరాచకం

    పాతాలానికి దిగజారిపోయానంటూ

    పాతాలానికి దిగజారిపోయానంటూ

    తులసిని పక్కన కూర్చోబెట్టుకున్న అనసూయ 'నాకు చెబుతున్నారు కానీ.. ఇదంతా మీరు మర్చిపోతారా? మీ అందరినీ బాధ పెట్టారు. ఈ ఇంట్లో సంతోషాన్ని దూరం చేశాను. ఆయన పెదాల మీద నవ్వును దూరం చేశాను. ఇంత చేసి ఏమీ చేయనట్లు.. ఏమీ జరగనట్లు ఎలా ఉండగలను. అది జరిగే పనేనా? ఒక్కసారిగా మీ అందరి దృష్టిలో పాతాలానికి దిగజారిపోయాను.. మీ అందరికీ శత్రువును అయిపోయాను' అని అంటుంది. అప్పుడు తులసి 'మీరు చెప్పాలనుకున్నది ఇదే అయితే.. ఇక్కడున్న ఎవరూ ఇది వినడానికి సిద్ధంగా లేరు' అని ఓదార్చాలని చూస్తుంది.

    తులసి ముందు అనసూయ కోరిక

    తులసి ముందు అనసూయ కోరిక

    ఆ తర్వాత అనసూయ తనను క్షమించమని తులసిని అడుగుతుంది. దీంతో తులసి అభ్యంతరం వ్యక్తం చేయగా.. మరి నా పాపం ఎలా పోతుంది అని ఆమె ప్రశ్నిస్తుంది. దీనికి తులసి 'ప్రశ్చాత్తపంతో పాపం పోతుంది. మీరు ఇప్పుడు బాధ పడుతున్నారు కాబట్టి అందరూ అర్థం చేసుకుంటారు' అని ధైర్యం చెబుతుంది. అప్పుడు అనసూయ 'నువ్వు చెప్పినట్టే చేస్తాను. నేను కూడా నిన్ను ఒక కోరిక కోరుతాను కాదు అనకూడదు. నా మాట వినాలి' అంటుంది. దీంతో తులసి 'పాతికేళ్లుగా మీ మాట విన్నాను. ఇప్పుడు విననా. బిడ్డ మీద హక్కు ఎప్పటికైనా తల్లికి ఉంటుంది. నన్ను ఏం అడగాలని అనుకుంటున్నారో అడగండి' అంటుంది.

    Bigg Boss Elimination: 13వ వారం డబుల్ ఎలిమినేషన్.. ఎలిమినేట్ అయ్యే ఇద్దరు ఎవరంటే!Bigg Boss Elimination: 13వ వారం డబుల్ ఎలిమినేషన్.. ఎలిమినేట్ అయ్యే ఇద్దరు ఎవరంటే!

    ఇంటికి వచ్చేయమన్న అత్తయ్య

    ఇంటికి వచ్చేయమన్న అత్తయ్య

    కోరిక కోరడానికి తులసి పర్మీషన్ ఇవ్వడంతో అనసూయ 'నువ్వు తల్లిగా భావించే ఈ రాక్షసి నిన్ను అనుమానించి ఈ ఇంటి నుంచి వెళ్లిపోయేలా చేసింది' అని ఏదో చెబుతూ ఉండగా.. తులసి 'అత్తయ్య నన్ను మాత్రం తిరిగి ఈ ఇంటికి రమ్మని చెప్పొద్దు' అంటుంది. అప్పుడామె 'వస్తూ పోతూ ఉండమని అడుగుతున్నాను. రోజంతా ఉండొద్దు కానీ.. రోజూ ఒక అరగంట, కనీసం పదినిమిషాలు అయినా సరే. నాతో మాట్లాడాలని లేకుంటే కనీసం ఈ ముసలిదాన్ని తిట్టడానికి అయినా రా అమ్మ' అంటుంది. కానీ, తులసి మాత్రం ఇంటికి వచ్చేందుకు ఒప్పుకోదు.

    అత్త కోసం ఒప్పేసుకున్న తులసి

    అనసూయ మాటలకు తులసి 'మీరు మా ఇంటికి రావచ్చు. మీరే కాదు అందరూ మా ఇంటికి రావచ్చు' అంటుంది. దీంతో అనసూయ 'కనీసం బయటి నుంచి అయినా నీ ముఖం చూపించు. నువ్వు లేని ఈ ఇంట్లో మేము మాత్రం సంతోషంగా ఉండగలమా చెప్పు. మాకిది యావజ్జీవ కారాగార శిక్ష లాంటిది. నువ్వు వస్తూ పోతూ ఉంటే శిక్ష తాలుకు కష్టం కాస్తయినా రాకుండా ఉంటుంది. నువ్వు ఒప్పుకోవా' అంటూ దండం పెడుతుంది. దీంతో తులసి 'సరే అత్తయ్య. నా ఇబ్బందిని పట్టించుకోను. మీరు అడిగినట్టే వస్తూ పోతూ ఉంటాను. సరేనా? సంతోషమేనా? మీ మాట విన్నాను కాబట్టి నా మాట కూడా వినాలి. ఇక నుంచి మీ కన్నీళ్లు కనబడకూడదు. కొద్దిగా కూడా కనబడకూడదు. మీ ఆరోగ్యం జాగ్రత్త' అంటూ చెబుతుంది. దీంతో అంతా హ్యాపీగా ఉంటారు.

    నెట్ డ్రెస్‌లో గబ్బర్ సింగ్ బ్యూటీ: ఈ ఏజ్‌లోనూ మరీ ఇంత ఘోరంగానా!నెట్ డ్రెస్‌లో గబ్బర్ సింగ్ బ్యూటీ: ఈ ఏజ్‌లోనూ మరీ ఇంత ఘోరంగానా!

    తులసిపై లాస్యకు అనుమానాలు

    తులసిపై లాస్యకు అనుమానాలు

    బయట వెయిట్ చేస్తున్న లాస్యకు కోపం వస్తుంటుంది. అప్పుడామె 'పోనీలే గొడవ ఎందుకు అని తలొంచుకుంటే నేను పరాయిదాన్ని అయిపోయానా? వాళ్లు సీక్రెట్ మాట్లాడుకోవడానికి నన్ను బయటికి తరిమేస్తుందా? ఆ ముసలిదానికి ఏదైనా ఆస్తి కలిసి వచ్చిందా? నా కళ్లు కప్పి వాళ్లు వాళ్లే పంచుకుందామని అనుకుంటున్నారా? శాశ్వతంగా తులసిని ఈ ఇంటికి దూరం చేస్తా' అనుకుంటుంది. అంతలో తులసి నేను వెళ్లొస్తాను అని చెప్పి వెళ్లబోతుండగా.. దేవుడి ముందు దీపం కొండెక్కడం చూసి అందులో కాస్త నూనె పోస్తుంది. అది లాస్య చూసి కోపం వస్తుంది.

    తులసితో గొడవకు దిగిన లాస్య

    తులసితో గొడవకు దిగిన లాస్య

    లాస్య చప్పట్లు కొడుతూ వస్తుండడంతో తులసి నీ గురించే ఆలోచిస్తున్నాను అంటుంది. అప్పుడు లాస్య 'చెప్పుకోవడానికి మొహమాట పడుతున్నావు కానీ, నువ్వే తమాషాలు ఎక్కువగా చేస్తావు కదా' అంటుంది. అప్పుడామె 'నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టాకే తమాషాలు, డ్రామాలు మొదలయ్యాయి' అంటుంది. దీంతో లాస్య 'బయటికి పో అన్నా నేను పిచ్చిదానిలా బయటికి రావడం ఏంటి? మా ఇంట్లో దేవుడి ముందు దీపం వెలిగిస్తున్నావు ఏంటి' అని ప్రశ్నిస్తుంది. అప్పుడు తులసి 'మీ దేవుడు, మా దేవుడు అంటూ సపరేట్‌గా ఉండరు లాస్య' అని బదులు ఇస్తుంది.

    బాత్రూంలో ఏమీ లేకుండా అషు రెడ్డి: సెల్ఫీ వీడియోలో మొత్తం చూపిస్తూ!బాత్రూంలో ఏమీ లేకుండా అషు రెడ్డి: సెల్ఫీ వీడియోలో మొత్తం చూపిస్తూ!

    నీ అంతు చూస్తానంటూ సవాల్

    నీ అంతు చూస్తానంటూ సవాల్

    ఆ తర్వాత తులసి 'అయినా నువ్వు నా ఇంట్లో అడుగుపెట్టి నా కాపురంలో నిప్పులు పోశావు. ఇంట్లో ఉండి కూడా దేవుడి ముందు దీపం ఉందా లేదా? కొండెక్కిందా అని పట్టించుకోవడం లేదు. అయినా నీకు దీపాలు ఆర్పడం తప్పించి ఇంకేం తెలుసు. ఎవరు అయితే బంధాలకు విలువ ఇవ్వకుండా తెంపేసుకుంటున్నారో ఆ మనిషి జీవితం అక్కడితో అయిపోయినట్టే అంటుంది తులసి.

    అత్తయ్య చూడు.. ఇన్నేళ్లుగా బంధాలు ఏర్పరుచుకుంటూ వస్తున్నారు తెగిపోయాయా? తప్పు తెలుసుకొని అత్తయ్య మారుతోంది. నువ్వు కూడా మారొచ్చు కదా. నీకే మంచిది. నువ్వు అత్తారింట్లో కలిసిపోతే ఆ ఇల్లు కూడా నీతో పాటు కలిసిపోతుంది' అని ఫైర్ అవుతుంది. దీంతో లాస్య నీ అంతు చూస్తా అని మనసులో అనుకుంటుంది. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.

    English summary
    Intinti Gruhalakshmi Episode 804: The Family Worried about Anasuya Health Condition. After That Tulasi And Lasya Gets Into Heated Argument about Family Unity.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X