Intinti Gruhalakshmi Today Episode: పెళ్లి చెడగొట్టేందుకు అనసూయ ప్లాన్.. నందూతో ఆ మాటలు చెప్పడంతో!

అన్ని భాషలతో పోలిస్తే తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూసేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూతో షికారుకు వెళ్లొచ్చిన లాస్య.. అందరికీ స్వీట్లు తీసుకుని వస్తుంది. కానీ, అవి ఎవరూ తీసుకోరు. అప్పుడామె తన ఆనందాన్ని తులసితో పంచుకుంటుంది. కానీ, లాస్యతో తన పెళ్లి గురించి నందూ చాలా టెన్షన్ పడుతుంటాడు. ఎలాగైన సర్జరీ జరిగే సమయంలో తులసి దగ్గరే ఉంటానని చెప్పిన నందూ ఆమె దగ్గర నుంచి కోపంగా వెళ్లిపోతాడు. అదే సమయంలో తులసి పరిస్థితి గురించి ఎమోషనల్ అవుతాడు. ఇక, తులసి కోసం ఆమె తల్లి పూజలు జరిపించడంతో పాటు కూతురి కోసం అక్షింతలను పంపిస్తుంది.

తులసిపై అత్త ఫైర్.. సలహా ఇవ్వగా

తులసిపై అత్త ఫైర్.. సలహా ఇవ్వగా

లాస్య కోసం గోరింటాకు నూరుతున్న అనసూయ దగ్గరకు తులసి వస్తుంది. అప్పుడు అసలు ఈ పెళ్లి జరగడానికి కారణం అయిన తులసిపై అనసూయ ఫైర్ అవుతుంది. అలా కాసేపు ఇద్దరి మధ్య సరదా సంభాషణ జరుగుతుంది. ఆ సమయంలో తులసి 'మీ అబ్బాయి లాస్యను పెళ్లి చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాడేమో అనిపిస్తుంది. మీరు అటువంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే ఆపుకోవాలని మీ అబ్బాయికి చెప్పండి' అంటూ అనసూయతో చెబుతుంది. దీనికి అనసూయ 'అవును అవును.. కరెక్ట్ నువ్వు చెప్పింది. నేను చూసుకుంటాను' అంటుంది.

పెళ్లి ఆపేందుకు అనసూయ ప్లాన్స్

పెళ్లి ఆపేందుకు అనసూయ ప్లాన్స్


తులసి చెప్పినట్లు నందూ నిరాశగా ఉండడాన్ని అనసూయ కూడా గ్రహిస్తుంది. దీన్ని ఆసరాగా తీసుకుని నందూ, లాస్యల పెళ్లిని ఆపేయాలని అనసూయ అనుకుంటుంది. అందుకు అనుగుణంగానే ఆమెకు మంచి ఐడియా వస్తుంది. ఆ సమయంలో 'లాస్యతో నందూ పెళ్లిని ఆపించి.. నీతో జరిపించేందుకు నాకు మంచి ఐడియా వచ్చింది తులసి. అలా మీ ఇద్దరి పెళ్లి మళ్లీ చేస్తాను. అప్పుడు ఈ గోరింటాకును నేనే నీకు నా చేతులతో పెడుతా' అని తనలో తానే అనుకుంటుంది. ఆ తర్వాత తులసి అక్కడి నుంచి వెళ్లిపోగా.. అనసూయ ఆలోచనలో పడుతుంది.

నందూకు లాస్య సర్‌ప్రైజ్ గిఫ్టులు

నందూకు లాస్య సర్‌ప్రైజ్ గిఫ్టులు

మరోవైపు, పెళ్లి జరుగుతుందనే ఉత్సాహంలో ఉన్న లాస్య.. నందూ కోసం వెడ్డింగ్ డ్రెస్‌ను తీసుకుని అతడిని సర్‌ప్రైజ్ చేస్తుంది. అప్పుడే దివ్య వస్తుంది. దీంతో లాస్య 'రా దివ్య.. మీ నాన్న కోసం వెడ్డింగ్ డ్రెస్ తీసుకున్నాను. ఎలా ఉంది? నువ్వే మీ నాన్నకు ఈ పెళ్లి డ్రెస్‌ను సెట్ చేయాలి' అని చెబుతుంది. దీంతో దివ్యకు చాలా కోపం వస్తుంది. కానీ, ఏమీ అనకుండా అలా సైలెంట్‌గానే తలూపుతుంది. ఇంతలో లాస్య తన పెళ్లి చీర, నగలను చెక్ చేసుకుంటూ ఉంటుంది. తనను తాను చూసుకుంటూ మురిసిపోతుంటుంది. అప్పుడే అంకిత అక్కడకు వస్తుంది.

లాస్యకు చేదువార్త చెప్పిన అంకిత

లాస్యకు చేదువార్త చెప్పిన అంకిత

అంకిత రాగానే 'రా అంకిత నీకు నిండు నూరేళ్లు. ఇప్పుడే నీకు కాల్ చేద్దామనుకున్నాను. నాకు ఈ శారీ బాగుంటుందా? నగలు బాగుంటాయా' అని అడుగుతుంది లాస్య. దీంతో 'నీకు అప్పుడే ఏ శారీకి ఏ నగలు బాగుంటాయో అన్నీ డౌన్ లోడ్ చేసి పంపించాను ఆంటీ' అంటుంది. దీనికి లాస్య 'సరే పెళ్లి పనుల విషయం ఎంత వరకు వచ్చింది. నువ్వు పెళ్లికి వస్తున్నావు కదా' అని అడగ్గా.. 'నేను పెళ్లికి రావడం లేదు ఆంటి. నేనే కాదు.. మేము ఎవరం తులసి ఆంటీని వదిలేసి రాము' అని చేదువార్తను చెబుతుంది. దీంతో లాస్య ఒక్కసారిగా షాక్‌కు గురవుతుంది.

నందూ మనసు మార్చాలని ప్లాన్లు

నందూ మనసు మార్చాలని ప్లాన్లు

నందూ మనసు మార్చాలని ప్లాన్లు
ఏదో ఆలోచిస్తూ ఉన్న నందూ దగ్గరకు అనసూయ వస్తుంది. 'ఏంట్రా.. నువ్వు ముఖం మాడ్చుకొని ఉన్నావు ఏం జరిగింది? నీ ముఖంలో పెళ్లి కొడుకు కలే లేదు. నవ్వే లేదు. అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థం అవుతోందా? నీకు నిజంగా ఈ పెళ్లి ఇష్టమే అయితే ఏమాత్రం ఆలోచించకుండా లాస్య మెడలో తాళి కట్టు. లేదు నీ మనసులో కొంచెం అయినా ఆందోళన, అనుమానం ఉంది అంటే మాత్రం బాగా ఆలోచించు. నీకు ఇప్పటికీ మనసు మార్చుకోవడానికి అవకాశం ఉంది' అంటూ అతడి మనసు మార్చే ప్రయత్నాలు ప్రారంభిస్తుంది. దీంతో నందూ ఆలోచిస్తాడు.

లాస్యకు సహాయం చేసిన అద్వైత

లాస్యకు సహాయం చేసిన అద్వైత

ఇక, లాస్య, నందూ పెళ్లికి మండపం సిద్ధం అవుతుంది. దాని మీద కూర్చొని అద్వైత కృష్ణ ఫ్లూట్ వాయిస్తుంటాడు. అది విని అందరూ బయటికి వస్తారు. అప్పుడు లాస్యను చూస్తూ 'నీ పెళ్లి మండపం రెడీ' అంటాడు క్రిష్. దీనికి ఆమెతో పాటు తులసి కూడా సంతోషిస్తుంది. కానీ, అందరూ కోపంగా ఉంటారు. అప్పుడు లాస్యను ఎలా ఉందని పట్టి పట్టి అడుగుతాడు. దీనికి ఆమె చాలా బాగుందని చెబుతుంది. ఆ తర్వాత భాగ్యను చూసి ఆమె ఎవరని ప్రశ్నించగా.. తోడికోడలు అని బదులిస్తుంది. అప్పుడు భాగ్యతో ఈయన తులసి మీద ఎక్కువ కేర్ తీసుకుంటారు అంటుంది.

లాస్యకు భారీ షాక్ ఇచ్చిన ఫ్యామిలీ

లాస్యకు భారీ షాక్ ఇచ్చిన ఫ్యామిలీ

పెళ్లికి ఒకరోజు ముందే మండపం ఎందుకు రెడీ చేశారని భాగ్య ప్రశ్నిస్తుంది. దీనికి లాస్య 'మా జాతకాల్లో ఏదో దోషం ఉందట. అందుకే పెళ్లిమండపంలో ఈరోజు దీపం వెలిగించాలని పంతులు గారు చెప్పారు' అంటుంది. అనంతరం అనసూయను దీపం వెలిగించడానికి రమ్మని పిలుస్తుంది లాస్య. కానీ, ఆమె మాత్రం అస్సలు రాదు. దీంతో భాగ్య కూడా పిలవగా.. ఆమె మీద కోప్పడుతుంది. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో ఇంట్లో వాళ్లు కూడా ఇంట్లోకి వెళ్లిపోతారు. అప్పుడు లాస్య బాగా హర్ట్ అవుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X